భారత స్వాతంత్య్ర చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం అల్లూరి

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయుధం పట్టి తిరుగుబాటు చేసిన ధైర్యశాలి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. భారత స్వాతంత్ర్య చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం అల్లూరి. చిన్నవయసులోనే మహోజ్వల శక్తిగా మారి దాస్యశృంఖలాల నుంచి విముక్తి కోసం పోరాడిన యోధుడు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి  ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు. పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీ కొన్న అల్లూరి సీతారామరాజు ఆయుధ బలం కంటే ఆత్మబలం గొప్పదని నిరూపించాడు. తాను మరణించినా వేలాది అల్లూరి సీతారామరాజులు ఉద్భవిస్తారన్న నమ్మికతో ప్రాణాలు అర్పించి చరిత్రలో అమరుడిగా మిగిలాడు. ఆయన జయంతి  సందర్భంగా మరో సారి అల్లూరి పరాక్రమాలను గుర్తు చేసుకుంటూ అక్షర నివాళులు.. తూర్పు గోదావరి జిల్లాలోపాండ్రంగి (పద్మనాభం) గ్రామంలో అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4 న జన్మించారు. తల్లిదండ్రులు సూర్యనారాయణమ్మ, వెంకట రామరాజు. ఆరవ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం సీతారామరాజు జీవితంలో పెనుమార్పులే తీసుకువచ్చింది. రాజు చదువుపై కూడా ప్రభావం చూపింది. రాజు కుటుంబం 1918 వరకు తునిలోనే ఉంది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవీ పేట మొదలైన ప్రాంతాల్లో తిరుగుతూ జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. సాహిత్యం బాగా చదివేవాడు. చిన్నప్పటినుండి సీతారామరాజులో ఉన్న నాయకత్వ లక్షణాలు, సామాజిక అంశాలపై అవగాహన అనేక ప్రాంతాలు తిరిగేలా చేసింది. 1916 ఏప్రిల్ 26 న ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు. బెంగాలులో సురేంద్రనాథ బెనర్జీ వద్ద కొంత కాలం ఉన్నాడు.  లక్నోలో జరిగిన కాంగ్రెసు మహాసభకు హాజరయ్యాడు. కాశీలో కొంతకాలం ఉండి బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, హరిద్వార్ మొదలైన ప్రదేశాలు చూసి తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. దేశంలో మారుతున్న పరిస్థితులు ఆయనను స్థిరంగా ఉండనియ్యలేదు. 1918లో మళ్ళీ యాత్రకు బయలుదేరి బస్తర్, నాసిక్, బొంబాయి, మైసూరు మొదలైన ప్రదేశాలు తిరిగి ఇంటికి చేరాడు. ఆరోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారు చేసాడు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర. పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో విప్లవం ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి నిశ్చయించుకొన్నారు. ఆగష్టు 22న మన్యం విప్లవం ఆరంభమైంది. ఆయుధ సంపత్తి పెంచుకోవడం కోసం అనేక పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. క్రమంగా సీతారామరాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం తీవ్ర రూపం దాల్చింది. సెప్టెంబరు 22న విప్లవకారులు పాడేరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. 20వ తేదీన రాజు నాయకత్వంలో ఎర్రజెర్లలో ఉన్నపుడు పోలీసులు అటకాయించి కాల్పులు జరిపారు. ఒక గ్రామ మునసబు ఆ పోలీసు దళాలను తప్పుదారి పట్టించడంవల్ల వారు తప్పించుకోగలిగారు. మన్యానికి కలెక్టరు (స్పెషల్ కమిషనర్)గా రూథర్‌ ఫర్డ్ వచ్చాడు. వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని ప్రకటించాడు. రాజు ఆచూకీ కోసం మన్యం ప్రజలను నానా హింసలకు గురి చేశాడు. ప్రజలు పడుతున్న బాధలను చూసి చలించిపోయిన సీతారామరాజు లొంగిపోవాలని నిశ్చయించుకుని తన ప్రాణాలను 1924 మే 7న భారతమాత విముక్తి కోసం అర్పించాడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు. సీతారామరాజు మరణం దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. ఆ తర్వాత స్వాతంత్య్ర పోరాటం తీవ్ర రూపం దాల్చి తెల్లవారిని తరిమికొట్టింది. స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న స్వతంత్య్ర భారతావని చరిత్ర పుటల్లో  ఆయన పేరు చిరస్థాయిగా మిగిలిపోయింది. కృష్ణదేవిపేట(కే.డి పేట)లో ఆయన సమాధి యువతలో ధైర్యానికి నాంది పలుకుతోంది.

స్పీడ్ న్యూస్- 2

11.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. 12. ఆమ్ ఆద్మీ పార్టీ  ఎమ్మెల్యేలకు ఢిల్లీ కోర్టు సోమవారం వినూత్న శిక్ష విధించింది. కోర్టు పనివేళలు ముగిసే వరకు కోర్టు ప్రాంగణం దాటకూడదని ఆదేశించింది.  13.బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు కోర్టు 3.3 మిలియన్ డాలర్ల  జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా రియో డి జెనీరో శివారులోని తన ఇంటి నివాసం వద్ద సరస్సు నిర్మించినందుకు గాను ఈ భారీ ఫైన్ విధించింది.  14.విదేశీ మారకపు నిబంధనల ఉల్లంఘన కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ భార్య, బాలీవుడ్ సీనియర్ నటి టీనా అంబానీ ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఫారెన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ చట్టంలోని పలు సెక్షన్ల కింద నమోదైన కేసులో నిన్న అనిల్ అంబానీ వాంగ్మూలం ఇచ్చారు. 15.అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగింది. సాయంత్రం జరిగే కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 16.దేశ రాజకీయాల్లో కురు వృద్ధుడుగా పేరుగాంచిన ఎన్సీపీ అధినేతకు ఆయన అన్న కొడుకు అజిత్ పవార్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఎన్సీపీని నిట్ట నిలువునా చీల్చిన అజిత్ తన వర్గంతో కలసి షిండే ప్రభుత్వంలో చేరిపోయారు. 17.చైనాలో పర్యటించాలనుకునే అమెరికన్లు పునరాలోచించుకోవాలని బైడెన్ సర్కారు కోరింది. డ్రాగన్ కంట్రీలో ఉన్నపుడు తప్పుడు ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. 18.టమాటా ధరలు దేశవ్యాప్తంగా ఆకాశానికి ఎగబాకాయి. వాటిని కొనడం కాదు.. ఆ పేరు వింటేనే సామాన్యులు భయపడుతున్నారు. ఏ కూరలోనైనా ఇట్టే కలిసిపోయే టమాటా ధరలు కొండెక్కడంతో కూరల నుంచి అవి దూరమయ్యాయి.  19. ప్రయాణికుల మధ్య వివాదాలకు కేరాఫ్‌గా ఢిల్లీ మెట్రో మారిపోయింది. దాదాపు రోజు మెట్రో ప్రయాణికులు తగవు పడుతున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.  20.త్రిదిప్ కే మండ‌ల్ అనే వ్యక్తి నోయిడాలోని ఓ మల్టీప్లెక్స్ లో చీజ్ పాప్‌కార్న్‌, పెప్సీ కొన్నాడు. ట్యాక్సులతో కలిపి 55 గ్రాముల చీజ్ పాప్‌కార్న్‌ కు రూ. 460 బిల్లు వేయ‌గా,  600 ఎంఎల్ కూల్ డ్రింక్‌కు ఏకంగా రూ. 360 చార్జ్ చేశారు. ఇలా రెండింటికే రూ. 820 బిల్లు చూసి ఆ వ్యక్తి అవాక్కయ్యారు.

స్పీడ్ న్యూస్- 1

1. ల్యాండ్స్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో  బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్, మాజీ ముఖ్యమంత్రులు లాలు ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు  అయ్యింది. ఈ నేపథ్యంలో  తేజస్వీని వెంటనే డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలని బీజేపీ సీనియర్ నేత సుశీల్ యాదవ్ డిమాండ్ చేశారు.   2.ఏపీ సీఎం జగన్    ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.  ప్రధాని మోదీతో  బుధవారం భేటీ కానున్నారు.  ఈ భేటీలో రాష్ట్ర సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధానితో చర్చిస్తారు. అలాగే రాజకీయ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. 3. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయంపై   దాడి జరిగింది.  ఖలిస్థాన్ మద్దతుదారులు కార్యాలయానికి నిప్పు పెట్టారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయంపై దాడి జరగడం ఐదు నెలల్లో ఇది రెండోసారి. మార్చిలో ఒకసారి ఖలిస్థాన్ మద్దతుదారులు రాయబార కార్యాలయాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. 4. నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.   5. ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ బోగస్ ఓట్లపై తెలుగుదేశం అప్రమత్తమైంది.  అలాగే అర్హులైన వారి ఓట్లు తొలగిస్తున్నారన్న ఆరోపణలపైనా దృష్టి సారించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎనిమిది మందితో ఓటర్ జాబితాల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. 6.రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో మంగళవారం  మార్నింగ్ వాక్‌కు వెళ్లిన  మహిళలపై‌కి వేగంగా వచ్చిన హోండా స్పోర్ట్స్ కారు  దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ఒక చిన్నారి మరణించింది. మరో ఏడుగురికి గాయాలయ్యాయి.  ప్రమాదానికి అతివేగమే కారణమంటున్నారు.   7. కరీంనగర్ జిల్లాలో నిన్న అర్థరాత్రి వేళ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. తిమ్మాపూర్ మండలం  రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై   బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. 8. ఉత్తరప్రదేశ్  నిన్న రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు సజీవ దహనం అయ్యారు. యూపీలో ఝాన్సీ జిల్లాలో మూడు అంతస్తుల భవనంలోని ఎలక్ట్రానిక్, స్పోర్ట్సు స్టోరులో  ఈ ఘోరం జరిగింది.  అగ్నిప్రమాదానికి కారణాలపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. 9.తమిళనాడు సీఎం స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఆయన  చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. స్టాలిన్ జీర్ణకోశ సంబంధిత సమస్యతో  స్టాలిన్ ఇబ్బంది పడుతున్నారు. 10.  రాష్ట్రప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకునేందుకు యత్నిస్తున్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని కేంద్రప్రభుత్వం కట్టడి చేయకుంటే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌  హెచ్చరించారు. డీఎంకే  సర్కార్ పట్ల ప్రజాభిమానం సహించలేకే గవర్నర్ అలా చేస్తున్నారన్నారు.

జగన్ పాలనపై జనసేన గరంగరం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనపై జనసేన పార్టీ మరోసారి నిప్పులు చెరిగింది. ఈ జగన్ పాలనలో ఏ వర్గం సురక్షితంగా ఉందో చెప్పాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ నాదెండ్ల మనోహర్ సవాల్ విసిరారు. సోమవారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న.. స్పందన కార్యక్రమానికి స్పందనే లేదని వ్యంగ్యంగా అన్నారు. అలాగే జగనన్నకు చెబుదామనే కార్యక్రమాన్ని చేపట్టారని.. చెబితే వినేవారు లేరని.. ఇప్పుడు తాజాగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారని.. పాలకుల్లో స్పందించే గుణం లేనప్పుడు ఏ కార్యక్రమం అయితే ఏముందని ఆయన జగన్ అండ్ కోని సూటిగా ప్రశ్నించారు. అలాగే అర్హత ఉన్న లబ్దిదారులకు సైతం పథకాలు అందడం లేదని ఈ జగన్ ప్రభుత్వమే స్పష్టం చేస్తుందని.. ఇది దేనికి సంకేతమని ఆయన ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించారు. వైయస్ జగన్   ఈ నాలుగేళ్ల పాలన అద్బుతమని అంటారని.. అలాంటప్పుడు ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ఎందుకు పెట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జగనన్న సురక్ష కార్యక్రమంలో చోటు చేసుకొంటున్న వ్యవహారాలపై ఈ సందర్భంగా ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు ప్రవేశ పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఎక్కడ ఉంది? ఏం చేస్తుందంటూ జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చెప్పుకొంటున్నట్లు.. మీ పాలన అద్బుతంగా ఉంటే.. వారాహి యాత్ర చేపట్టిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో సమస్యలు చెప్పుకొనేందుకు అంత మంది ఎందుకు వచ్చారని నిలదీశారు.  అమ్మఓడి బటన్ నొక్కినా.. నేటికి కొంత మంది ఖాతాల్లో ఆ పథకం తాలుకు నగదు జమ కాలేదని.. దీనికి సమాధానం ఏం చెబుతారంటూ.. జగన్ పార్టీ నేతలను ఆయన నిలదీశారు. అలాగే మీరు హాజరయ్యే సభలకు కోట్లాది రూపాయిల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తారని.. హెలికాప్టర్లు వినియోగిస్తారని.. అంతేకానీ... క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలను మాత్రం పట్టించుకోకుండా గాలికొదిలేశారంటూ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో రహదారుల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆ క్రమంలో మలికిపురంలో పవన్ కల్యాణ్ హెచ్చరికతోనే రాజోలులోని రహదారి పనులు ప్రాంభించారని ఆయన వివరించారు. 151 మంది ఎమ్మెల్యేలు, ఇంత మంది యంత్రాగాన్ని పెట్టుకొని.. ఎందుకు సరైన పాలన అందించ లేకపోతున్నారని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ని సూటిగా  ప్రశ్నించారు.  జనసేన చేపట్టిన జనవాణి కార్యక్రమంలో ఫించన్లు, రహదారుల సమస్యలపైన ఫిర్యాదులు అధికంగా వచ్చాయని చెప్పారు. అలాగే మీ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దివ్యాంగుడికి 75 రూపాయిల ఫెన్షన్ వచ్చేదని.. ప్రస్తుతం అతడు విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటాయని పెన్షన్ నిలుపు చేశారని పేర్కొన్నారు. ఇలా పదుల సంఖ్యలో దివ్యాంగులు పవన్ వద్ద తమ సమస్యలు చెప్పుకొన్నారన్నారు.. తహశీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా ఉన్నతాధికారుల కార్యాలయాల వరకు స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారని.. మరి స్పందించే గుణం లేనప్పుడు స్పందన కార్యక్రమం ఎందుకు అని ప్రశ్నించారు. అయినా ఇప్పటి వరకు ఎన్ని సమస్యలపై స్పందించారంటూ జగన్ ప్రభుత్వానికి నాదేండ్ల మనోహర్ సూటిగా ప్రశ్నించారు.  వైసీపీ మ్యానిపెస్టోలో 99 శాతం పూర్తి చేశామని చెబుతున్నారని.. మరి స్పందన సరిపోదని జగనన్నకు చెబుదామని వ్యంగ్యంగా అన్నారు. ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని.. జగనన్న వినడు, ఎమ్మెల్యేలు వినరు... అధికారులు అంతకంటే వినరన్నారు. మరి ప్రజలు.. తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలంటూ సందేహం వ్యక్తం చేశారు. గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో   ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. పించన్ల ఇచ్చే క్రమంలోనే కాదు.. రైతుల వద్ద సైతం లంచాలు తీసుకొంటున్నారని విమర్శించారు. ఈ ముఖ్యమంత్రి పాలనలో ఎవరూ సురక్షితంగా లేరని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.   పవన్ కల్యాణ్.. ఇటీవల చేపట్టిన వారాహీ యాత్ర అద్భుతంగా సాగిందన్నారు. 10 కిలోమీటర్ల మేర.. ఇంత పెద్ద బహిరంగ సభలు ఇంత వరకు ఎవరు పెట్టలేదన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆశీర్వదిస్తుంటే.. తట్టుకోలేక ఆయనపై విమర్శలకు దిగుతున్నారని.. వ్యవస్థలోని లోపాలపై పవన్ కల్యణ్ విమర్శలు చేస్తే.. ఆయనపై వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ విమర్శించే అంశాలపై ఆయా శాఖల మంత్రులు వివరణ ఇవ్వరని.. ముగ్గురు, నలుగురు మంత్రుల చేత పవన్‌ని తిట్టిస్తారని ఆయన చెప్పారు.  రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్... అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి... ప్రతి ఒక్కరికీ భరోసా కల్పిస్తారని స్పష్టం చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ బాధ్యతను ఆయన ప్రజలకు గుర్తు చేస్తారన్నారు. ఈ జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిందని.. జనసేన తిరిగి వెలుగులు నింపుతోందన్నారు.  వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం .. అందరూ కలిసి కట్టుగా ముందుకు వచ్చి నిలబడాలని ప్రజలకు నాదెండ్ల మనోహర్ పిలుపు నిచ్చారు.

తిరుమలలో ఏం జరుగుతోంది? భద్రత కరవు, పవిత్రతకు పంగనామాలు!

జగన్మోహన్ రెడ్డి పాలనలో పనిగట్టుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు, ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయో, చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో, అన్యమత ప్రచారం మొదలు, ఇంకెన్ని అకృత్యాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. వింటూనే ఉన్నాం. వైఖానస ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి టీటీడీ ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు భక్తులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఏడుకొందలపై  ఆగమ శాస్త్ర విరుద్ధంగా డ్రోన్లు సంచరించడం మొదలు, ఇటీవల టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ  తీసుకుంటున్నతప్పుడు నిర్ణయాల వరకు   అపచారాలకు లెక్కేలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన టీటీడీ ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారిందని, భక్తులు హిందూ ధర్మ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఆగ్రహిస్తున్నాయి.  అంతేకాదు, తిరుమలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం, టీటీడీ ఒక వ్యాపార కేంద్రంగా మార్చి వేసిందనే ఆవేదన భక్తులు  వ్యక్తపరుస్తున్నారు.   ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకు, ‘దొరికినంత దోచుకో’, పద్దతిలో టీటీడీ దోపిడీకి పాల్పడుతోందని, భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్జిత సేవల విషయం అయితే చెప్పనే అక్కర లేదు.అదే సమయంలో భక్తులకు సమకూరుస్తున్న సదుపాయాలు, నిర్వహణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో గంటలు తరబడి నిరీక్షించే భక్తుల ఆకలి, దప్పికలు తీర్చేందుకు, గతంలో సమయానుకూలంగా ప్రసాద వితరణ జరిగేది .. ఇప్పడు అది లేదు. కనీసం జల ప్రసాదం కూడా  అందుబాటులో ఉండడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. అలాగే, క్యూ కాంప్లెక్స్ లో పారిశుధ్యం  లేకుండా పోయింది, దుర్వాసనలు భరిస్తూ స్వామి స్వామి దర్శనానికి నిరీక్షించ వలసి వస్తోందని భక్తులు అంటున్నారు. సరే తిరుమల భద్రత, హిందూ ధార్మికతకు టీటీడీ తిలోదకాలిచ్చేసింది. ఇప్పుడు పవిత్రతకు కూడా పంగనామాలు పెట్టేస్తున్నారనడానికి నిలువెత్తు నిదర్శనం.. స్వామి వారి దర్శనం కోసం కర్నాటక నుంచి వచ్చిన భక్తులు కూడా పెంపుడు కుక్కను కూడా తీసుకువస్తే అలిపిరి చెక్ పాయింట్ వద్ద విజిలెన్స్ పట్టించుకోకుండా  వదిలేసిన సంఘటన సంచలనం సృష్టించింది. కర్నాటక నుంచి సొంత వాహనంలో అలిపిరి చెక్ పోస్టు మీదుగా తిరుమల చేరుకున్నారు. చెక్ పాయింట్ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వారి వాహనంలో ఉన్న పెంపుడు కుక్కను పట్టించుకోకుండా తిరుమలపైకి అనుమతించేశారు. దీంతో వారు తమ పెంపుడు కుక్కతో  తిరుమలకు వచ్చేశారు. తిరుమలపైకి పెంపుడు జంతువులకు అనుమతి లేకపోయినా విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తిరుమలపై పెంపుడు కుక్కతో తిరుగుతున్న భక్తుల బృందాన్ని గమనించిన మీడియా ఫొటోలు తీసి అధికారులకు సమాచారం అందజేయడంతో  వారు హడావుడిగా రంగ ప్రవేశం చేసి పెంపుడు కుక్కతో తిరుమల చేరుకున్న భక్త బృందాన్ని వారి వాహనం, శునకంతో  సహా కొండ కిందకు పంపేశారు.   

అమెరికాలో ఆర్ఆర్ఆర్ రచ్చబండ.. రెస్పాన్స్ అదరహో

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ వైఫల్యాలను, అరాచకాలను, అక్రమార్కులను రచ్చబండ కార్యక్రమం ద్వారా రోజూ ఉతికి ఆరేసే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ కూడా ఆయన రచ్చబండ నిర్వహించి ఏపీలో జగన్ అరాచకపాలనను కళ్లకు కడుతున్నారు. రఘురామకృష్ణం రాజు  తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరు. మీడియా,సోషల్‌మీడియాలో  నిత్యం వినిపించే పేరు రఘురామకృష్ణం రాజు.    జగనన్న సర్కారు తీసుకునే నిర్ణయాల వెనుక చీకటి కోణాన్ని అన్వేషించి, దానిపై నిరంతరం కేంద్రానికి ఫిర్యాదు చేయడం ఆయన నిత్యకృత్యం. ఇందు కోసం ఇక తనపై జగన్ సర్కార్ బనాయించిన కేసులపై   ఢిల్లీ నుంచే న్యాయపోరాట చేస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులను పదేపదే కలుస్తున్నారు. జగన్  అరాచకత్వంపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే   జగనన్న సర్కారును నిత్యం ఉతికి పారేస్తున్నారు.  సొంత పార్టీ అధినేతపైనా, ప్రభుత్వంపైనా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు రఘురామకృష్ణం రాజు. పేరుకే ఆర్ఆర్ఆర్ ది ఒంటరి పోరు. ఆయన పోరటానికి అభిమానులుగా మారిన వారు మాత్రం లక్షల్లోనే ఉంటారు.  యూట్యూబ్‌లో.. ఆర్ఆర్ఆర్ కు వచ్చే లైక్స్, షేర్లు కామెంట్లు ఏ తెలుగు నాయకుడికీ ఉండవంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కు  అమెరికా పర్యటనలో  రెడ్ కార్పెట్ వెల్కమ్ లభిస్తోంది.  ప్రవాసాంధ్రులు నిర్వహించే కార్యక్రమాలకు, తెలుగు సంఘాలు-గోదావరి జిల్లా ఎన్నారైలు రఘురామరాజును ఆహానిస్తున్నారు. అక్కడ కూడా ఆయన రచ్చబండ ద్వారా జగన్ సర్కార్ ను ఉతికి ఆరేస్తున్నారు. జగన్ పై ఆయన విమర్శలు, వ్యంగ్యాస్త్రాలకు ఎన్ఆర్ఐల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. 

కాంగ్రెస్ + బీఆర్ఎస్.. బీఆర్ఎస్ + బీజేపీ.. ఏంటీ ఈక్వేషన్స్?!

కాంగ్రెస్ + బీఆర్ఎస్.. బీఆర్ఎస్ + బీజేపీ. ఈ ఈక్వేషన్స్ ఏంటి.. అసలు ఈ లెక్కలేంటి అనుకుంటున్నారా?. ఈ లెక్కలన్నీ ఆ పార్టీ నేతలు చెబుతున్నవే. ఎలా అంటే అసలు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నడిపిస్తున్నది.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇచ్చేది కూడా సీఎం కేసీఆర్ అని తెలంగాణ బీజేపీ నేతలు లెక్కలు చెప్తుంటే.. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని.. ఇక్కడ గల్లీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఢిల్లీలో భాయీ భాయీ అంటూ తిరుగుతారని, అసలు బీఆర్ఎస్ పార్టీనే బీజేపీకి బీ టీమ్ అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతల నుండి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వరకూ విమర్శలకు దిగుతున్నారు. దీంతో అసలు ఏ పార్టీ ఎవరికి మిత్రుడు, ఎవరికి శత్రువు.. అసలు ఎవరు ఎవరి వెనక ఉన్నారు.. ఎవరు ఎవరిని శత్రువుగా చూస్తున్నారన్నది అర్ధం కాక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో 30 సీట్లను నిర్ణయించేది కేసీఆరేనంటూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆ మధ్య సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు కేసీఆర్ టికెట్లు ఖరారు చేసే ఆ ముప్పై మందిలో  ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది కూడా గులాబీ బాసే డిసైడ్ చేస్తారన్నారు. ఈ ముప్పై మంది కాంగ్రెస్ నుంచి గెలిచినా.. మళ్లీ బీఆర్ఎస్‌లో చేరుతారంటూ బండి సంజయ్ కలకలం రేపారు. కరీంనగర్ మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ‘టిఫిన్ బైఠక్’లో ఈ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పుడు తీవ్ర దుమారం రేపాయి. ఇది బీజేపీ మైండ్ గేమ్ గా కాంగ్రెస్ నేతలు మీడియా ముందుకొచ్చి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసారు. బీజేపీ బీఆర్ఎస్ మైత్రి ఢిల్లీ వీధుల్లో కనిపిస్తుందని రిటర్న్ విమర్శలు కూడా కాంగ్రెస్ నుండి వినిపించాయి. కాగా, తాజాగా తెలంగాణ పర్యటనకి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్ గా మారిందని.. సీఎం కేసీఆర్  రిమోట్ ఇప్పుడు ప్రధాని మోడీ చేతిలో ఉందని, ఆయన ఏం చెబితే కేసీఆర్ అది చేస్తారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, వాళ్లు చెప్పే మాటలను నమ్మొద్దని రాహుల్ తెలంగాణ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా రాహుల్ బీఆర్ఎస్ పార్టీకి కొత్త నిర్వచనం ఇచ్చారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ సమితి అని రాహుల్ అన్నారు. దీనికి బీఆర్ఎస్ నుండి కూడా ఘాటు కౌంటర్లు వచ్చాయి. ‘మాది బీజేపీకి బీ టీమ్ కాదు. కాంగ్రెస్ కు సీ టీమ్ అంతకన్నా కాదు. ఆ రెండు పార్టీలను ఒంటిచేత్తో ఢీ కొట్టే ఢీ టీమ్ అంటూ బీఆర్ఎస్ నేతలు రిటర్న్ కౌంటర్లు విసిరారు. అయితే, ఈ మూడు పార్టీల మధ్య ఈ ఈక్వేషన్స్ చూస్తే కాస్త ఆసక్తి కలగక మానదు. రానున్న ఎన్నికలలో ఈ మూడు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. దీంతో ఎవరికి వారు మైండ్ గేమ్ మొదలు పెట్టినట్లుగా కనిపిస్తుంది. ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపుకు తిప్పుకొనేందుకు బీజేపీ ఈ మైండ్ గేమ్ మొదలు పెట్టగా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే గేమ్   ఆడడం మొదలు పెట్టింది. దీనికి ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు కాబోతుందని భారీ ప్రచారం జరిగినా అది జరగకపోవడం.. ఈ మధ్యనే మంత్రి కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలవడం వంటివి  చూపిస్తూ కాంగ్రెస్ బీజేపీ విమర్శలను రివర్స్ లో ఆ పార్టీపైకే వదులుతోంది.  అయితే, ఎవరికి వారు ఇలా పక్కవారిపై బురదజల్లేలో పనిలో ఉండగా పాపం ప్రజలు మాత్రం.. ఈ ఈక్వేషన్స్ అర్ధం చేసుకోలేక అయోమయంలో పడిపోతున్నారు.

డల్లాస్ లో వైసీపీ ఎన్నారైల కుమ్ములాట అమెరికా వెళ్లినా తీరు మారలే!

ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఎన్నికల నిర్వహణకు ఇంకా పది నెలల సమయం ఉన్నా రాజకీయ పార్టీల పరంగా ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఒకవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రజల మధ్యకు వెళ్లడంతో రాజకీయాలలో ఎన్నికల వేడి మొదలైంది. దీంతో అధికార వైసీపీ మరోసారి ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో రకరకాల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో సోషల్ మీడియా విభాగాన్ని మరింతగా బలీయం చేసుకుంటోంది. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియా విభాగాన్ని సిద్ధం చేస్తున్నది. వైసీపీ సోషల్ మీడియా విభాగం సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ పర్యవేక్షణలో కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, భార్గవ్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా అమెరికాలో పర్యటిస్తున్నారు.  వైసీపీ అమెరికా విభాగం ఆధ్వరంలో పార్టీ సోషల్ మీడియా సారధి సజ్జల భార్గవ్ జులై 1న డల్లాస్లో  నాటా కన్వెన్షన్ సెంటర్ వద్ద  సోషల్ మీడియా కార్యక్రమం నిర్వహించారు. జులై 8న కూడా వర్జీనియాలో మీట్ అండ్ గ్రీట్ వైఎస్సార్సీపీ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీంతో పాటు వైఎస్సార్ జయంతి వేడుకలు కూడా నిర్వహించనున్నారు. అమెరికా వైసీపీ విభాగాన్ని నేరుగా కలవడంతో పాటు సోషల్ మీడియాను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అయితే, ఈ కార్యక్రమం కాస్త రసాబాసగా మారింది. డల్లాస్ లో సోషల్ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎన్నారై సభ్యుల మధ్య గొడవ ముదిరి పిడిగుద్దులు వరకు వెళ్ళింది. ఒకరిపై మరొకరు దాడులకు తెగబడి చితగ్గొట్టుకున్నారు. దీంతో ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలోతెగ వైరల్ అవుతున్నాయి.  వైసీపీ ఎన్నారైలలో ఎప్పటి నుండో వివాదాలు నడుస్తున్నాయి. ఇప్పటికే రెండు ముక్కలుగా విడిపోయిన ఈ ఎన్నారై విభాగం ప్రతి కార్యక్రమంలో ఈ వివాదాలను రచ్చకీడుస్తున్నాయి. అయితే, ఈసారి అది ఇంకాస్త శృతి మించి కొట్లాటకు దారి తీసింది. జులై 1న డల్లాస్ నాటా కన్వెన్షన్ సెంటర్ వద్ద నిర్వహించిన వైసీపీ సోషల్ మీడియా కార్యక్రమం అనంతరం సభ్యుల మధ్య గొడవ మొదలైంది. వైసీపీ ఎన్నారై రెండు వర్గాలలోని ఒక వర్గం కార్యక్రమం నిర్వహించిన సజ్జల భార్గవ్ పేరు కాకుండా మరో యువనాయకుడి పేరుతో స్లొగన్స్ ఇచ్చారు. దీంతో సజ్జల వర్గం ఆ వర్గం సభ్యులతో వివాదానికి దిగింది. మరో నాయకుడి స్లొగన్స్ ఇచ్చిన ఆ సభ్యులపై సజ్జల వర్గం సభ్యులు దాడి చేశారు. మొత్తంగా ఒకరిపై మరోకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు. కాస్త ఆలస్యంగా ఈ వివాదం వెలుగులోకి రాగా.. తెలుగు ఎన్నారై సోషల్ మీడియా ఖాతాలలో ఇప్పుడు ఈ వివాదాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.  వైసీపీ ఎన్నారైల మధ్య ఈ కొట్లాటతో అమెరికాలో  తెలుగు వారి పరువు బజారున పడింది. అమెరికా వెళ్లినా రౌడీయిజం మానుకొని వైసీపీ సభ్యులు నాటా లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ కన్వెన్షన్ సెంటర్ ముందే పిడిగుద్దులు గుద్దుకుంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ రోడ్ల మీద దొర్లుతూ కొట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఖండాలు దాటినా వైసీపీ మాత్రం తన సంస్కృతిని వీడలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా  ఇలాగే రౌడీయిజంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న వైసీపీ నేతలు.. అమెరికా వంటి విదేశాలలో  కూడా తమ సంస్కృతి ఇదే అంటూ చాటి చెబుతున్నట్లు ఉందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఉన్నత చదువులు చదివినా ఆ పార్టీ వారసత్వం అలాంటిది కనుకే యువనేతలు సైతం ఆ కల్చర్ కంటిన్యూ చేస్తున్నట్లుగా ఉందని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.

రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సోమవారం న్యూఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వాలని.. ఆ క్రమంలో పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి కానీ, ప్లోర్ లీడర్ కానీ, జాతీయ అధికార ప్రతినిధి పదవి కానీ ఇవ్వలని కమలం పార్టీ అధిష్టాన్ని కోరారు. పార్టీ కోసం 10 ఏళ్ల నుంచి పని చేస్తున్నానని.. తానేందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాదని ఆయన ప్రశ్నించారు. అయితే కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపం కావచ్చునని అభిప్రాయపడ్డారు.  అయితే రెండోసారి కూడా దుబ్బాక నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వచ్చి ప్రచారం చేయలేదని.. అలాగే తనకు ఎవరు సాయం చేయలేదని ఆయన పేర్కొన్నారు.   అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో 100 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినా.. బీజేపీ గెలవలేదని.. సొంతంగానే తాను దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా రఘునందన్ రావు గుర్తు చేశారు. అదే 100 కోట్ల రూపాయిలు తనకు ఇస్తే.. తెలంగాణ దున్నేసేవాడినన్నారు. దుబ్బాకలో తనను చూసి గెలిపించారని.. అంతేకాని బీజేపీ చూసి కాదన్నారు. తాను బీజేపీ అభ్యర్థిగా ఈ నియోజకర్గం నుంచి గెలవక ముందు.. జరిగిన ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తే కేవలం 3,500 ఓట్లు మాత్రమే వచ్చాయని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ది స్వయంకృతాపరాధమని, పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ  చేసిన సంజయ్‌కు వందకోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని రఘునందన్ రావు  ప్రశ్నించారు. పార్టీ డబ్బులో తనకు వాటా ఉందని రఘునందన్ రావు స్పష్టం చేశారు. బండి సంజయ్ మార్పుపై మీడియా ప్రశ్నించగా.. మీడియాలో వస్తున్నవన్నీ నిజాలేనన్నారు. పది ఏళ్లలో పార్టీ కోసం తనకంటే ఎవరు ఎక్కువ కష్టపడలేదని ఆయన పేర్కొన్నారు.  అయితే పేపర్ ప్రకటనల్లో తరుణ్ చూగ్, సునీల్ బాన్సల్‌ బొమ్మలు కాదు.. రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ బొమ్మలుంటే ఓట్లు వేస్తారని ఆయన క్లారిటీ ఇచ్చారు. పార్టీకి శాసనసభపక్ష నేత లేడనే విషయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సైతం తెలియదని.. ఆ విషయమై ఆయన్ని ప్రశ్నిస్తే అదేంటి అంటూ నడ్డా తనని అడిగారన్నారు. తాను గెలిచినందుకే ఈటెల బీజేపీలోకి వచ్చారన్నారు.

నాలుగు రోజుల్లో మలి విడత వారాహియాత్ర షెడ్యూల్

 ఏపీ  రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా   మూడు పార్టీల మ‌ధ్య హోరా హోరీ పోరు జ‌రుగుతోంది. వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీగా టీడీపీ ఉండ‌గా జ‌న‌సేన కూడా  ప్ర‌తిప‌క్ష పాత్ర‌ని పోషిస్తుంది. వారాహియాత్ర‌లో భాగంగా ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న   జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్   స‌భల‌కు    జ‌నం అంచ‌నాల‌కి మించి రావడం  వైసీపీకి మింగుడుప‌డ‌టం లేదు. దీంతో వైసీపీ టిడీపీని ప‌క్క‌న‌పెట్టి జ‌న‌సేన‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తోంది. జ‌గ‌న్ వ్య‌క్తిగ‌తంగా చేస్తోన్న విమ‌ర్శ‌ల‌కి ధీటుగా జ‌న‌సేన స్పందిస్తోంది. రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎవ‌రికీ సుర‌క్షితం కాదంటు జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ‌వ్య‌వ‌హారాల చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ తాజాగా విడుద‌ల చేసిన మూడు పేజీల బ‌హిరంగ‌లేఖ‌లో నిప్పులు చెరిగారు. స‌మ‌స్య‌ల‌ని జ‌గ‌న్న‌న‌కి చెబుదామ‌నుకున్నా వినేవారు క‌నిపించ‌డం లేద‌ని పాల‌కుల్లో స్పందించే గుణం లేన‌ప్పుడు ఏ కార్య‌క్ర‌మం ప్ర‌వేశ‌పెట్టినా ఫ‌లితం ఉండ‌బోద‌ని నాదెండ్ల ఈ సంద‌ర్భంగా ఆరోపించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఏ వ‌ర్గం సుర‌క్షితంగా లేద‌ని అర్హ‌త ఉన్న ల‌బ్దిదారుల‌కి ప‌ధకాలు అంద‌క‌పోవ‌డం దాన్ని ప్ర‌భుత్వ‌మే అంగీక‌రించ‌డం సిగ్గుచేట‌ని మ‌నోహ‌ర్ దుయ్య‌బ‌ట్టారు. వారాహి యాత్ర‌కి ప్ర‌జ‌ల ఆశీర్వాదం దొరుకుతుంటే వైసీపీ నేత‌లు త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని తిరిగి జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కి దిగుతున్నార‌ని మ‌నోహ‌ర్ ఈ లేఖ‌లో ఆరోపించారు.  ప‌వ‌న్ క‌ల్యాణ్ లేవ‌నెత్తిన అంశాల గురించి ఆయా శాఖ‌ల మంత్రులు వివ‌ర‌ణ ఇవ్వలేక‌పోవ‌డం ప్ర‌భుత్వ ప‌నితీరుకు అద్దంప‌డుతుంద‌ని లేఖ‌లో ఆరోపించారు. కాగా  నాలుగు రోజుల్లో మ‌లివిడ‌త వారాహి యాత్ర షెడ్యూల్ ని ప్ర‌క‌టిస్తామ‌న్న మ‌నోహ‌ర్ వారాహి విజ‌య యాత్ర మొద‌టి ద‌శ అద్భుతంగా నిర్వ‌హించామ‌న్నారు.   మ‌త్య్స‌కారుల స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అధ్య‌య‌నం చేశార‌ని జ‌న‌వాణి కార్య‌క్ర‌మంలో ఎక్కువ‌గా  ఫించ‌న్లు.. ర‌హ‌దారుల స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని  రాబోయే రోజుల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్ని జిల్లాల్లో విస్తృతంగా ప‌ర్య‌టించి ప్ర‌తి ఒక్క‌రికీ భ‌రోసా ఇస్తార‌ని   నాదెండ్ల మ‌నోహ‌ర్ చెబుతున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం   అంధ‌కారంలోకి నెట్టేసిన రాష్ట్రాన్ని ..  రాష్ట్రంలో జ‌న‌సేన‌  తిరిగి వెలుగులు నింపి  రాష్ట్రానికి పెట్టుబ‌డులు వ‌చ్చే విధంగా కృషి చేయ‌నుంద‌ని  మ‌నోహర్ ఈ లేఖ‌లో ప్ర‌క‌టించారు.   వారాహి విజ‌య యాత్ర రెండో విడ‌త ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోనే ప్రారంభించ‌నున్న‌ట్లు స్థానిక నాయ‌ కుల‌తో సంప్ర‌దించి నాలుగైదు రోజుల‌లోపే త‌దుప‌రి షెడ్యూల్ ప్ర‌క‌టిస్తామ‌ని జ‌న‌సేన ఈ లేఖ‌లో పేర్కొంది. వైసీపీ విముక్త ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోసం ప్ర‌జ‌లంతా క‌లిసి   ముందుకు చ‌క్క‌టి వేదిక ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏ అడుగు వేసినా రాష్ట్ర భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకునే వేస్తార‌ని మ‌నోహ‌ర్ ఈ లేఖ‌లో వివ‌రించారు.

బీజేపీకి బొమ్మా బొరుసూ ఈటల, రఘునందనరావేనా?

బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు తెలంగాణ లో బీజేపీ గాలి తీసేశారు. రాష్ట్రంలో బీజేపీ అంటే తానూ ఈటలేననీ, కమలం గుర్తు చివరన వస్తుందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు తరుణ్ భుజ్ ను చూసి కాదనీ, తమను చూసి పడతాయనీ అన్నారు. తెలంగాణ పార్టీ వ్యవహారాలు అధిష్ఠానానికి ఏమీ తెలియదని కుండ బద్దలు కొట్టారు. హస్తినలో ఒక మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై హై కమాండ్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. తెలంగాణ బీజేపీ శాసనసభా పక్షానికి నాయకుడు లేడన్న విషయం కూడా తెలియని స్థితిలో మా పార్టీ జాతీయాధ్యక్షుడు ఉన్నారని రఘునందనరావు అన్నారు.  తెలంగాణ బీజేపీలో వర్గ పోరు తారస్థాయికి చేరుకుందనీ, ఇది రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఆందోళనలో ఉన్న బీజేపీ హై కమాండ్ కు దెబ్బ మీద దెబ్బగా రఘునందనరావు వ్యాఖ్యలు ఉన్నాయి. బండి సంజయ్ ను రాష్ట్ర బీజేపీ చీఫ్ గా మార్చేస్తారన్న ప్రచారం వాస్తవమేనని ఆయన బాహాటంగా చెప్పేశారు. అంతే కాకుండా బండి సంజయ పై తీవ్ర ఆరోపణలు చేశారు. భార్య పుస్తెలమ్మి ఎన్నికలలో పోటీ చేసిన బండి సంజయ్ కు కోట్ల రూపాయల ప్రకటనలు జారీ చేసే సొమ్ము ఎక్కడిదన్న రఘునందనరావు.. ఒక వేళ అది పార్టీ సొమ్మయితే అందులో తనకూ వాటా ఉందని అన్నారు.   మొత్తం మీద తెలంగాణ బీజేపీకి  తానూ, ఈటల బొమ్మాబొరుసు వంటి వారమని చెప్పిన రఘునందనరావు.. ఇన్నేళ్లలో పార్టీ కోసం తన కంటే ఎక్కువగా కష్టపడిన వారెవరూ లేరని చెప్పుకొచ్చారు. మొత్తం మీద తెలంగాణ బీజేపీలో వర్గ విభేదాలను ఆయన హస్తిన వేదికగా బహిర్గతం చేసేశారు. బండి మార్పుపై వస్తున్నవి ఊహాగానాలు కాదని కుండ బద్దలు కొట్టేశారు. కేంద్ర కేబినెట్ జరుగుతున్న వేళ రఘునందనరావు చేసిన సంచలన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో బీజేపీలో ప్రకంపనలు రేపుతాయనడంలో సందేహం లేదు. అదే సమయంలో తెలంగాణ బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయన్న ప్రచారానికీ బలం చేకూర్చాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి తన కంటే అర్హుడెవరున్నారని ఆయన అన్యాపదేశంగానైనా గట్టిగా చెప్పారు. తన పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని బలగా చాటారు. ఇంత కాలం ఇతర పార్టీల నుంచి నేతలను తెచ్చుకుని వాపునే బలంగా చెప్పుకున్న బీజేపీకి తెలంగాణలో ఉన్న వాస్తవ బలం ఏమిటన్నది ఇప్పుడు బహిర్గతమైపోయింది. అధికారం ఖాయమంటూ ఇంత కాలం చేసుకున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు గడ్కరీయే అవాస్తవమంటూ ఒక్క ముక్కలో కొట్టి పారేశారు. తెలంగాణలో తమ స్థాయి విపక్షానికే పరిమితమని విస్ఫష్టంగా తేల్చేశారు. అయితే గత కొద్ది రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా దూరంగానే ఉంటుందన్నది తేటతెల్లమైపోయినట్లేనని రఘునందనరావు వ్యాఖ్యలతో అర్ధమైపోయింది. 

ఉపాధి కూలీలకు భారీ మొత్తంలో బకాయిలు..! ఎందుకలా ?

 జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) పనులకు హాజరయ్యే కూలీలు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. వారికి ఇచ్చే వేసవి భత్యం తొలగించడంతోపాటు పని ప్రదేశాల్లో కూలీలకు ఇచ్చే మజ్జిగ, తాగునీటి సరఫరాను పక్కన పెట్టారు. తీవ్రమైన ఎండ ల్లోనూ రెండు నెలలుగా పనులు చేయించారు. హాజరవ్వకపోతే జాబ్ కార్డులు రద్దవుతాయని బెది రించి మరీ పనులు చేయించుకున్నారు. తీవ్రమైన వడగాలులు వీచేటప్పుడూ పనిచేసిన కూలీలకు అయిదు వారాలుగా వేతనాలు చెల్లించకుండా బకాయి పెట్టారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.250 కోట్లకు పైగా చెల్లిం చాల్సి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి నరే గాలో రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన 15 కోట్ల పనిదినాలను ఏప్రిల్ నుంచి జూన్ మధ్య మూడు నెలల్లోనే వినియోగించారు. కూలీలు చేసిన పనుల వివరాలను వారానికోసారి నరేగా ఎన్ఎస్ఐసీ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఒక వారం తర్వాత వాటికి చెల్లింపులు చేయాలి. ప్రస్తుతం రెండు వారాలైనా కూలీల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాలేదు. నిరుపేదలకు ఉపాధి పనులే జీవనా ధారం. ఇలాంటి వారంతా వేతనాలు జాప్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఏపీలోని గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. వేతనాల చెల్లిం పుల్లో కేంద్రప్రభుత్వ పరంగా జాప్యమైనప్పుడు కూలీల అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేసి కూలీలకు అందించేది. ఇప్పుడు అలాంటి ఊసే లేదు. తీవ్రమైన ఎండల్లో పనిచేసిన తమకు మజ్జిగ, తాగునీరు కూడా ఇవ్వని దారుణమైన పరిస్థితిని కూలీలు ఎదుర్కొన్నారు. అయితే.. ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాలకు త్వరలోనే పెండింగ్ వేతనాలు జమ అవుతాయని  గ్రామీణా భివృద్ధి శాఖ అంటుంది.

రాను రానంటూనే షర్మిల..?

షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయంలో చాలా క్లియర్ గా ఉన్నారు.  నాలుగేళ్ల పాటు వైఎస్సార్ సీపీ కోసం, అన్న జగన్ వదిలిన బాణంగా ఏపీలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఒక విధంగా అప్పట్లో జగన్ అరెస్టయిన సమయంలో పార్టీ పతనం కాకుండా షర్మిల నిలబెట్టారనే చెప్పాలి. అయితే ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత షర్మిలను ఆయన కూరలో కరివేపాకులా తీసేశారు. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వకుండా దూరం పెట్టారు. దీంతో షర్మిల ఏపీని వదిలి..  తెలంగాణలో తండ్రిపేరిట వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి రాజకీయంగా బిజీ అవ్వడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆమె సుదీర్ఘ పాదయాత్ర చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ పై, కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక విధంగా చెప్పాలంటే.. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ను ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ ల కంటే తీవ్రంగా దుమ్మెత్తి పోశారు.  అయితే ఆమె తెలంగాణలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ ఎదురౌతున్న ప్రశ్న ఏపీని వదిలి తెలంగాణ రాజకీయాలలోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? అన్నదే.  జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో విభేదించి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన సమయంలో షర్మిల అన్నకు అండగా ఉన్నారు. అక్రమాస్తుల కేసులో  జగన్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పుడు... ఆమె ‘నేను జగనన్న వదిలిన బాణం’ అంటూ మూడు వేల కిలోమీటర్ల పాద యాత్ర చేశారు. వైసీపీని బతికించారు. అయితే, ఏపీలో  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న వదిలిన బాణాన్ని జగనన్న వదిలేశారో .. ఆమే జగనన్నను వదిలేశారో తెలియదు, కానీ, పుట్టింటిని వదిలి మెట్టి నింటికి చేరుకున్నారు. తెలంగాణలో వైఎస్సార్ జెండా ఎగరేశారు.అప్పటి నుంచి ఆమె తెలంగాణ రాజకీయాల్లో,ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసేఆర్ కుటుంబ పాలనకు వ్యతిరకంగా ప్రత్యేక పంథాలో పోరాటం సాగిస్తున్నారు.పాదయాత్రలు చేస్తున్నారు.  అయితే, ఇప్పుడు షర్మిల త్వరలోనే, వైఎస్సారు టీపీని  కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తారనే  ప్రచారం జోరుగా సాగుతోంది.   ఆమె ఖండించినా ఆ ప్రచారం ఆగడం లేదు.  అసలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న ప్రచారం కర్నాటకలో కాంగ్రెస్ ఘన విజయం తరువాత నుంచే ప్రారంభమైంది. అందుకు ఆమె ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను స్వల్ప వ్యవధిలో మూడు సార్లు కలవడంతో ఆమె రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ వైపు అన్న ప్రచారం జోరందుకుంది.  కాంగ్రెస్ కు కూడా వైఎస్సార్ బ్రాండ్ రూపంలో షర్మిలను చేర్చుకునేందుకు, ఆమెకు పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే పార్టీకి ఆమె సేవలు తెలంగాణలో అవసరం లేదన్న విషయంలో కాంగ్రెస్ స్పష్టంగా  ఉంది. ఇక్కడే షర్మిల పార్టీ విలీనం విషయంలో జాప్యం జరుగుతోంది. ఆమె ఏ కారణం చేత ఏపీ వదిలి వచ్చేసినా.. ఇప్పటికీ ఆమె ఏపీలో అన్న జగన్ కు ఎదురు వెళ్లేందుకు సుముఖంగా లేరు. అందుకే తాను కాంగ్రెస్ గూటికి చేరతాను కానీ, తన కార్యక్షేత్రం మాత్రం తెలంగాణే కావాలని అంటున్నారు. ఈ విషయంలో ఆమె ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లైన జానా రెడ్డి వంటి వారిని కలిసి చర్చించారు. అయితే టీపీసీసీ చీఫ్ మాత్రం ఆమె తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో వేలు పెట్టడానికి కూడా అంగీకరించేది లేదంటున్నారు. అదే సమయంలో బట్టి విక్రమార్క వంటి నేతలు మాత్రం బయటి పార్టీలలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోసిన వారు ఇప్పుడు పార్టీలో ఉండగా లేనిది షర్మిల వస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. కాగా  కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం వైఎస్ బ్రాండ్ తెలంగాణలో పార్టీకి పెద్దగా ప్రయోజనకరం కాదనీ, షర్మిల సేవలు ఏపీలో అయితే అక్కడ పార్టీ బలోపేతమయ్యే అవకాశాలున్నాయని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ ఆత్మగా అందరూ పేర్కొనే  కేవీపీ రామచంద్రరావు షర్మిల కాంగ్రెస్ లో చేరికపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ గూటికి చేరితే షర్మిలకు కర్నాటక నుంచి రాజ్యసభ సభ్యత్వం ఖాయమని చెబుతున్నారు. అంతా సరే కానీ షర్మిల ఏపీలో కాంగ్రెస్ ప్రచార సారథిగా కీలక బాధ్యతలు చేపట్టాలన్న కాంగ్రెస్ కండీషన్ కు ఆమె అంగీకరిస్తారా? తెలంగాణను వీడనంటూ షర్మిల కండీషన్ ను కాంగ్రెస్ హై కమాండ్ అంగీకరిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. 

స్పీడ్ న్యూస్- 3

21.ఒకానొకప్పుడు ప్రపంచ క్రికెట్ ను శాసించిన వెస్టిండీస్... ఈ సారి వన్డే వరల్డ్ కప్ కు అర్హత కూడా సాధించలేకపోవడం క్రికెట్ ప్రేమికులకు మింగుడుపడటం లేదు. ప్రపంచ మేటి జట్లలో ఒకటైన విండీస్ లేకపోతే వరల్డ్ కప్ లో మజా ఏముంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.  22.ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. అధిష్ఠానం పిలుపుతో ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న రఘునందన్ రావు.. పలువురు కీలక నేతలను కలుసుకుంటున్నారు.  23. గౌతమి గోదావరి నదిలో యానాం దగ్గర భారీ పండుగప్ప చేప ఒకటి మత్స్యకారుల వలకు చిక్కింది. సుమారు 15 కేజీల బరువున్న ఈ పండుగప్ప చేపను స్థానిక మార్కెట్ లో వేలం వేయగా రూ.9 వేల ధర పలకింది. 24.ఓ జాతీయ నాయకుడిగా పరిణతితో మాట్లాడాలని, మాటలు జారొద్దని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. కాంగ్రెస్ నేతపై తమకు గౌరవం ఉందని చెప్పారు. అయితే, ఆ పార్టీ రాష్ట్ర నేతలు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం కాకుండా నిజాలు మాట్లాడాలని రాహుల్ గాంధీకి సూచించారు.  25. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రానికి మరో వందేభారత్ రైలు వస్తోంది. విజయవాడ-చెన్నై నగరాల మధ్య ఈ నెల 7 నుంచి వందేభారత్ రైలు రాకపోకలు మొదలు కానున్నాయి. దేశ వ్యాప్తంగా ఐదు వందే భారత్ రైళ్లను మోదీ ప్రారంభించనున్నారు. 26.భారత్ లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ లో పాల్గొనేందుకు పాకిస్థాన్ అంగీకరించింది. వేదికల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన పాక్ చివరికి మనసు మార్చుకుంది. టోర్నీలో ఆడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 27. యాషెస్ రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో రనౌట్ పెద్ద దుమారమే రేపుతోంది. తొలి టెస్టులోనూ ఓ క్యాచ్ వివాదాస్పదమైంది. 28.కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. 29. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను బాధితునిగా గుర్తించాలంటూ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ రోజు విచారణ సందర్భంగా కృష్ణారెడ్డి తరపు న్యాయవాదిపై జస్టిస్ కృష్ణ మురారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 30.అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది.  ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లు, కుటుంబ కలహాల కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ గాడిన పడదా? కుమ్ములాటలకు ఎండ్ లేదా?

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని సాకారం చేసిన పార్టీ అందులో ఇసుమంతైనా సందేహం లేదు. తెలంగాణ ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) ఉద్యమ సారథిగా కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ క్రెడిట్ ను తమ ఖాతాలో  వేసుకున్నారు. సోనియా గాంధీ రాజకీయ సంకల్పం వల్లే తెలంగాణ సాకారమైందని చెప్పుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఫలితం రాష్ట్రం ఇచ్చి కూడా తొమ్మిదేళ్ల పాటు అధికారానికి దూరమైంది. దూరం కావడమే కాదు.. రాష్ట్రంలో పార్టీ ఉనికి కూడా నామమాత్రమైంది.  కాంగ్రెస్ టికెట్ పై అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలలో పలువురు కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పుణ్యమా అని గులాబి కండువా కప్పుకున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్ఠానం  తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి చేరిన రేవంత్ రెడ్డికి పార్టీ  తెలంగాణ పగ్గాలు అప్పగించింది. ఎవరు ఔనన్నా కాదన్నా.. రేవంత్ టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాతే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంది. పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. జనబాహుల్యంలో కూడా కాంగ్రెస్ పట్ల ఆదరణ పెరిగింది. కానీ పార్టీ బలోపేతం కావడం కంటే.. తమ సీనియారిటీని కాదని బయట నుంచి వచ్చి చేరిన రేవంత్ కు పగ్గాలు అప్పగించడాన్ని పార్టీలోని కొందరు పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. వారిలో కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, వీహెచ్ వంటి నేతలు ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే.. రేవంత్ కు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ను వీడి కమలం గూటికి చేరారు. సరే అదంతా పక్కన పెడితే అధిష్టానం జోక్యం వల్లనైతేనేమి, కర్నాటక ఫలితాల ప్రభావంతోనైతేనేమి? తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలకు ఫుల్ స్టాప్ కాకపోయినా కామా పడిందన్న భావన సర్వత్రా వ్యక్తమైంది. ముఖ్యంగా ఖమ్మంలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ జన గర్జన సభ సక్సెస్ కోసం విభేదాలు విస్మరించి నాయకులంతా సమష్టిగా కృషి చేశారు. కేసీఆర్ సర్కార్ ఖమ్మంలో రాహుల్ సభను అడ్డుకోవడానికి, ఆ సభకు జనం రాకుండా అవరోధాలు కల్పించడానికీ చేయగలిగినంతా చేసింది.  ఎంత చేసినా సభ విజయవంతమైంది. జనం తండోపతండాలుగా రాహుల్ సభకు హాజరయ్యారు. ఇసుక వేస్తే రాలదన్నంతగా రాహుల్ సభకు జనం పోటెత్తారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే ఇక తరువాయి అన్నంతగా పార్టీ శ్రేణుల్లో ధీమా వ్యక్తమైంది. అయితే రాహుల్ సభ సక్సెస్ అయ్యిందన్న ఉత్సాహం  24 గంటలు కూడా గడవకుండానే పార్టీ శ్రేణుల ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లుగా భట్టి విక్రమార్క మాట్లాడారు. రేవంత్ కు సీఎం చాన్స్ లేదు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. నేరుగా రేవంత్ పేరు ప్రస్తావించకపోయినా.. ఆయన కాంగ్రెస్ లోనే పుట్టిన వ్యక్తికి తప్ప మరొకరికి సీఎం పదవి దక్కే చాన్స్ లేదన్నారు. అక్కడితో ఆగకుండా టీపీసీసీ చీఫ్ హోదాలో షర్మిల తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో వేలుపెట్టడానికి అంగీకరించను అని రేవంత్ చెప్పిన మాటలను కూడా  ఖండించారు. కాంగ్రెస్ పార్టీని తిట్టిన వారు కాంగ్రెైస్ లో ఉన్నారనీ, షర్మిల వస్తే తప్పేముందని పరోక్షంగా రాహుల్ మాటలను ఖండించారు. దీంతో కాంగ్రెస్ లో ఐక్యత కనిపిస్తోందనీ, నేతలంతో ఏకతాటిపైకి వచ్చారనీ సంబరపడుతున్న క్యాడర్ ఉత్సాహంపై భట్టి నీళ్లు చల్లేశారు. కష్టపడి గెలిపించుకున్నా అంతర్గత కుమ్ములాటల కారణంగా ‘చే’ జేతులా అధికారాన్ని వదులుకోవడానికి రాష్ట్ర నాయకత్వం పోటీ పడుతుందని పార్టీ శ్రేణులే బాహాటంగా అంటున్నాయి. నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేయకుండా అధిష్ఠానం నిరోధించగలిగితేనే.. పార్టికి రాష్ట్రంలో ఏర్పడిన సానుకూల వాతావరణం ఎన్నికల వరకూ ఉంటుందనీ, లేకుంటే ఎగిసిపడిన కెరటంలా మళ్లీ  పార్టీలో నిస్తేజం అలుముకుంటుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడుగా సత్య కుమార్ ?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఏపీ  బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును తప్పించి ఆస్థానంలో మరో వ్యక్తిని నియమించాలని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది.  ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే సోము వీర్రాజు మాత్రం తానే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుకుంటున్నారు. ఆయనకు ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ ధియోధర్ అండదండలు ఉండడంతో, వీర్రాజు అధ్యక్ష కుర్చిని వీడకుండా ఉండేందుకు   గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఏపీ బీజేపీలో వీర్రాజును వ్యతిరేకించే నాయకులు  రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో  అధిష్టానం ఆయన్ను మార్చాలనే ఆలోచనలో ఉంది.  ఆయనపై వైసీపీ ముద్ర పడడం, వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీ రాష్ట్ర  బీజేపీలో గ్రూపులు పెరిగిపోవడం వంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం ఆయనను మార్చాలని దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన వెంటనే ఏపీ బీజేపీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా బిజెపి జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ ను నియమించాలని బిజెపి అధిష్టానం పెద్దలు నిర్ణయించుకున్నట్లు విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సత్య కుమార్ కు హై కమాండ్ పెద్దల వద్ద పలుకుబడి ఉండడం, ఆయన కూడా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని స్వీకరించాలనే ఆలోచనతో ఉండడం, ఆయనకు వీర్రాజు వ్యతిరేక వర్గం మద్దతు ఉండడం ఇవన్నీ కలిసివచ్చే అంశాలు. సోము వీర్రాజు వైసీపీ అనుకూల వ్యక్తి అనే ముద్ర పడటంతో పాటు, బీజేపీ లోని చాలామంది నాయకులతో విభేదాలు ఉండడం, అలాగే బీజేపీ  మిత్రపక్షం గా ఉన్న జనసేన ను కలుపుకు వెళ్లే విషయంలో వీర్రాజు చురుగ్గా వ్యవహరించకపోవడం, ఈ విషయంలో జనసేన వర్గాలలోనూ తీవ్రమైన అసంతృప్తి ఉండడం, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని వీర్రాజు స్థానంలో సత్యకుమార్ ను నియమించాలని అధిష్టానం పెద్దలు దాదాపుగా డిసైడ్ అయిపోయారట. ఇక సత్యకుమార్ విషయానికి వస్తే, ఏపీ బీజేపీ వ్యవహారాలలో చురుగ్గా పాల్గొనేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పాటు ఏపీలో వైసిపి ప్రభుత్వంపై సందర్భం వచ్చినప్పుడల్లా సత్య కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. దీంతో ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఏపీ బీజేపీలో గ్రూపుల గోల తగ్గుతుందనే నిర్ణయానికి బిజెపి అధిష్టానం పెద్దలు రావడంతోనే, సత్య కుమార్ వైపు వారు మొగ్గు చూపిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వైసీపీని విమర్శలతో ముప్పు తిప్పలు పెట్టడంలో సోము వీర్రాజు దారుణంగా విఫలమైయ్యారు. జనసేనతో దూరంగా ఉండటం కూడా ఆయనకు మైనస్ పాయింట్ అయింది. ఇటీవల.. పార్టీ ని వీడి.. టీడీపీలోని మారిన  బీజేపీ మాజీ  అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ.. వీర్రాజు పై విమర్శల బాణాలు వదిలారు. వీర్రాజు వల్లే తాను బీజేపీ ని వీడానని ఆయన అనడం.. వీర్రాజుపై బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉండటానికి మరో కారణమైంది. అందువల్లే ఏపీ బీజేపీ అధ్యక్ష మార్పు ఆలోచన అనివార్యమైందని పరిశీలకులు భావిస్తున్నారు.

స్పీడ్ న్యూస్- 2

11. మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసవత్తంగా మారాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పై ఆయన అన్న కొడుకు అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు.  12. ఖమ్మంలో సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా హరీశ్ స్పందిస్తూ దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది అని మండిపడ్డారు.  13.దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద డ్రోన్ కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఓ డ్రోన్ అనుమానాస్పదంగా ఎగరడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. డ్రోన్ ను ట్రాక్ చేసేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 14.బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ పై నేరుగా విమర్శలు చేస్తూ.. ఎప్పుడూ హుషారుగా మాట్లాడే  బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కాస్త డీలా పడ్డారు. పార్టీ అధ్యక్షుడిగా తనను తప్పిస్తారన్న వార్తలు, ఊహాగానాల నేపథ్యంలో నిన్న వరంగల్‌ జిల్లా హన్మకొండలో పర్యటించిన సంజయ్ ముభావంగా కనిపించారు.  15. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సింహాచలంలో నిన్న సాయంత్రం ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఈ ఉదయం సింహాద్రి గిరులు కిక్కిరిసిపోయాయి. 16.నిన్నటి ఖమ్మం బహిరంగ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ పై మంత్రి కేటీఆర్ ఘాటుగా ప్రతిస్పందిస్తూ ధరణిని ఎత్తేస్తామన్న రాహుల్ ను తెలంగాణ సమాజం క్షమించదని వ్యాఖ్యానించారు.  17.నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ  లో తిరుగుబాటు నేపథ్యంలో పార్టీ చీఫ్ శరద్ పవార్ తో కాంగ్రెస్ చైర్ పర్సన్ సోనియా గాంధీ మాట్లాడారు. ఈమేరకు ఆదివారం పవార్ కు ఫోన్ చేసిన సోనియా.. తాజా పరిస్థితులపై చర్చించారు. 18.వుమెన్స్ ప్రీమియర్ లీగ్ తర్వాత భారత మహిళా క్రికెటర్లు తొలి అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ ఆడనున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత్.. ఈ నెల 9వ తేదీ బంగ్లాదేశ్ లో పర్యటించనుంది.  19.ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించారు. కొన్నిరోజులుగా ఆరోగ్యశ్రీ పథకంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీపై చర్చకు రావలంటూ టీడీపీకి ఆమె సవాల్ విసిరారు. 20.ఖమ్మం గడ్డపై జనగర్జన సభకు విచ్చేసిన భారీ జనసందోహాన్ని చూసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్సాహంగా ప్రసంగించారు. రాహుల్ హిందీలో ప్రసంగిస్తుండగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగులోకి అనువదించారు. 17.నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ  లో తిరుగుబాటు నేపథ్యంలో పార్టీ చీఫ్ శరద్ పవార్ తో కాంగ్రెస్ చైర్ పర్సన్ సోనియా గాంధీ మాట్లాడారు. ఈమేరకు ఆదివారం పవార్ కు ఫోన్ చేసిన సోనియా.. తాజా పరిస్థితులపై చర్చించారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ  లో తిరుగుబాటు నేపథ్యంలో పార్టీ చీఫ్ శరద్ పవార్ తో కాంగ్రెస్ చైర్ పర్సన్ సోనియా గాంధీ మాట్లాడారు. ఈమేరకు ఆదివారం పవార్ కు ఫోన్ చేసిన సోనియా.. తాజా పరిస్థితులపై చర్చించారు. 18.వుమెన్స్ ప్రీమియర్ లీగ్ తర్వాత భారత మహిళా క్రికెటర్లు తొలి అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ ఆడనున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత్.. ఈ నెల 9వ తేదీ బంగ్లాదేశ్ లో పర్యటించనుంది.  19.ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించారు. కొన్నిరోజులుగా ఆరోగ్యశ్రీ పథకంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీపై చర్చకు రావలంటూ టీడీపీకి ఆమె సవాల్ విసిరారు. 20.ఖమ్మం గడ్డపై జనగర్జన సభకు విచ్చేసిన భారీ జనసందోహాన్ని చూసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్సాహంగా ప్రసంగించారు. రాహుల్ హిందీలో ప్రసంగిస్తుండగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగులోకి అనువదించారు. 17. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ  లో తిరుగుబాటు నేపథ్యంలో పార్టీ చీఫ్ శరద్ పవార్ తో కాంగ్రెస్ చైర్ పర్సన్ సోనియా గాంధీ మాట్లాడారు. ఈమేరకు ఆదివారం పవార్ కు ఫోన్ చేసిన సోనియా.. తాజా పరిస్థితులపై చర్చించారు. 18.వుమెన్స్ ప్రీమియర్ లీగ్ తర్వాత భారత మహిళా క్రికెటర్లు తొలి అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ ఆడనున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత్.. ఈ నెల 9వ తేదీ బంగ్లాదేశ్ లో పర్యటించనుంది.  19.ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించారు. కొన్నిరోజులుగా ఆరోగ్యశ్రీ పథకంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీపై చర్చకు రావలంటూ టీడీపీకి ఆమె సవాల్ విసిరారు. 20.ఖమ్మం గడ్డపై జనగర్జన సభకు విచ్చేసిన భారీ జనసందోహాన్ని చూసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్సాహంగా ప్రసంగించారు. రాహుల్ హిందీలో ప్రసంగిస్తుండగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగులోకి అనువదించారు.

టైమ్స్ నౌ తాజా సర్వే.. ముందస్తు సార్వత్రిక ఎన్నికలపై చర్చ

తాజగా టైమ్స్ నౌ సర్వే ఒకటి వచ్చింది. ఈ సర్వే ప్రకారం ఇప్పటికిపుడు ఎన్నికలు పెడితే దేశంలో మళ్ళీ మోడీ ప్రభుత్వం కచ్చితంగా వస్తుంది అని చెప్పుకొచ్చింది. అంటే దేశంలో రాజకీయ ముఖ చిత్రం మారకుండా ఉంటే మోడీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని   ఆ సర్వే చెబుతోంది. అయితే ఈ డిసెంబర్ లో దేశంలో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. అక్కడ ఏమైనా ఫలితాలు తేడా కొడితే, కర్నాటక తరహా ఫలితాలు వస్తే మోడీ ఇమేజ్ కూడా ఇబ్బందులో పడుతుంది. మూడో సారి అధికారం అన్న ధీమా ఉండదని కూడా ఆ సర్వే అంతర్లీనంగా చెప్పినట్లైంది. వాస్తవానికి టైమ్స్ నౌ మోడీ భజన పత్రికగా గుర్తింపు పొందింది. అటువంటి పత్రిక సర్వేలోనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేనే.. మోడీ హ్యాట్రిక్ ఖాయం అంటూ తేలడంతో ఇప్పుడు బీజేపీలో అంతర్మథనం మొదలైంది.న అంటే ఆయా రాష్ట్రాలఅసెంబ్లీల ఎన్నికల ఫలితాలు కచ్చితంగా సార్వత్రిక ఎన్నికల మీద ప్రభావం చూపిస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే వాటితో పాటే లోక్ సభ ఎన్నికలు కూడా జరిపిస్తే.. అంటే మధ్యంతర ఎన్నికలకు మోడీ మొగ్గు చూపితే  బాగుంటుందన్న సూచన ప్రాయమైన సలహా కూడా ఆ సర్వే ఇచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వం ఆ దిశగా ఆలోచిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎందుకంటే టైమ్స్ నౌ సర్వే కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేనే మోడీకి మళ్లీ అధికారం అన్నది నొక్కి చెప్పిందన్నది పరిశీలకుల  విశ్లేషణ. ఆ సర్వేను బీజేపీ సీరియస్ గా తీసుకుందని కూడా అంటున్నారు.   దీంతో ముందస్తు సార్వత్రిక ఎన్నికల చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించేసింది.  ఇప్పుడు ముందస్తు సార్వత్రిక  ఎన్నికలంటే సాధ్యమేనా అన్న అనుమానానికి విశ్లేషకులు మోడీ తలచుకుంటే జరగనిదేముంటుందని అంటున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తో పాటే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు  జరిగే రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ముందస్తు ఎన్నికలకు సమాయత్తం చేసి సెట్ చేసేస్తారనీ, ఆ విధంగా ఆయన జమిలి ఎన్నికల లక్ష్యాన్ని ఈ సారే పాక్షికంగా అమలు చేసేసినట్లౌతుందనీ అంటున్నారు.   కేంద్రం, మోడీ అందుకు సుముఖంగా ఉంటూ సై అనడానికి ఏపీలోని జగన్ సర్కార్ రెడీగా ఉందని గుర్తు చేస్తున్నారు. టైమ్స్ నౌ సర్వే ప్రకారం ఏపీలో జగన్ సర్కార్ కు కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగితేనే మేలైన ఫలితాలు వస్తాయి. సరే ఆ సర్వేపై వస్తున్న విమర్శలు, కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలను పక్కన పెడితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ కూడా అధికార పార్టీకే ఒకింత సానుకూలత వ్యక్తమౌతోంది. ఈ కారణంగానే ఇటు ఏపీలోనూ, అటు కేంద్రంలోనూ కూడా ముందస్తు చర్చ గట్టిగా వినిపిస్తోంది.   ఈ నేపథ్యంలోనే  షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకే కాకుండా ఏపీ వంటి రాష్ట్రాలతో పాటు సార్వత్రిక ఎన్నికలు కూడా   జరిగే  అవకాశాలను కొట్టిపారేయ లేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగన్ ఈ నెల 5,6 తేదీలలో తలపెట్టిన హస్తిన యాత్రకు ముందస్తు చర్చతో ముడిపెడుతున్నారు.