స్పీడ్ న్యూస్- 2
posted on Jul 4, 2023 @ 12:10PM
11.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.
12. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ కోర్టు సోమవారం వినూత్న శిక్ష విధించింది. కోర్టు పనివేళలు ముగిసే వరకు కోర్టు ప్రాంగణం దాటకూడదని ఆదేశించింది.
13.బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు కోర్టు 3.3 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా రియో డి జెనీరో శివారులోని తన ఇంటి నివాసం వద్ద సరస్సు నిర్మించినందుకు గాను ఈ భారీ ఫైన్ విధించింది.
14.విదేశీ మారకపు నిబంధనల ఉల్లంఘన కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ భార్య, బాలీవుడ్ సీనియర్ నటి టీనా అంబానీ ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఫారెన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ చట్టంలోని పలు సెక్షన్ల కింద నమోదైన కేసులో నిన్న అనిల్ అంబానీ వాంగ్మూలం ఇచ్చారు.
15.అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగింది. సాయంత్రం జరిగే కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
16.దేశ రాజకీయాల్లో కురు వృద్ధుడుగా పేరుగాంచిన ఎన్సీపీ అధినేతకు ఆయన అన్న కొడుకు అజిత్ పవార్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఎన్సీపీని నిట్ట నిలువునా చీల్చిన అజిత్ తన వర్గంతో కలసి షిండే ప్రభుత్వంలో చేరిపోయారు.
17.చైనాలో పర్యటించాలనుకునే అమెరికన్లు పునరాలోచించుకోవాలని బైడెన్ సర్కారు కోరింది. డ్రాగన్ కంట్రీలో ఉన్నపుడు తప్పుడు ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.
18.టమాటా ధరలు దేశవ్యాప్తంగా ఆకాశానికి ఎగబాకాయి. వాటిని కొనడం కాదు.. ఆ పేరు వింటేనే సామాన్యులు భయపడుతున్నారు. ఏ కూరలోనైనా ఇట్టే కలిసిపోయే టమాటా ధరలు కొండెక్కడంతో కూరల నుంచి అవి దూరమయ్యాయి.
19. ప్రయాణికుల మధ్య వివాదాలకు కేరాఫ్‌గా ఢిల్లీ మెట్రో మారిపోయింది. దాదాపు రోజు మెట్రో ప్రయాణికులు తగవు పడుతున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.
20.త్రిదిప్ కే మండల్ అనే వ్యక్తి నోయిడాలోని ఓ మల్టీప్లెక్స్ లో చీజ్ పాప్‌కార్న్, పెప్సీ కొన్నాడు. ట్యాక్సులతో కలిపి 55 గ్రాముల చీజ్ పాప్‌కార్న్ కు రూ. 460 బిల్లు వేయగా, 600 ఎంఎల్ కూల్ డ్రింక్‌కు ఏకంగా రూ. 360 చార్జ్ చేశారు. ఇలా రెండింటికే రూ. 820 బిల్లు చూసి ఆ వ్యక్తి అవాక్కయ్యారు.