సర్జరీ విషయంలో నివేదా 'నో' చెప్పడానికి సాయిపల్లవి కారణమా? అసలేం జరిగింది?
సినిమా హీరోయిన్లు తమ అందాన్ని మరింత పెంచుకోవడానికి కాస్మెటిక్ సర్జరీలు చేయించుకోవడం ఈ మధ్యకాలంలో సాధారణంగా మారిపోయింది. అయితే కొన్నిసార్లు తాము తీసుకున్న నిర్ణయాన్ని చివరి నిమిషంలో మార్చుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ నివేదా పేతురాజ్ ఒకరు. ఒకప్పుడు తన పెదవులకు సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్న ఆమె.. చివరికి ఆ ఆలోచనను విరమించుకున్నారట. ఇందుకు కారణం హీరోయిన్ సాయి పల్లవి అని నివేదా స్వయంగా వెల్లడించిన విషయం ఆసక్తికరంగా మారింది. నివేదా పేతురాజ్ది తమిళనాడులోని మదురై. 2016లో ‘ఒరు నాల్ కూత్తు’ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత తెలుగులో ‘మెంటల్ మదిలో’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ‘చిత్రలహరి’, ‘పాగల్’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ఒక దశలో తన పెదవుల ఆకారం గురించి ఆలోచించిన నివేదా.. లిప్ సర్జరీ చేయించుకోవాలని భావించారట. ఆ సమయంలో సాయి పల్లవి చెప్పిన కొన్ని విషయాలు ఆమె ఆలోచనను మార్చేశాయని తెలుస్తోంది. సాయి పల్లవి సహజ అందానికి, మేకప్, కాస్మెటిక్ మార్పులకు దూరంగా ఉండే తన ప్రత్యేకమైన ఇమేజ్‌కు పేరుగాంచారు. ఆమెను చూసిన తర్వాత తన రూపంలో మార్పులు చేయించుకోవాల్సిన అవసరం లేదనే ఆలోచన నివేదాలో వచ్చిందట. సహజంగానే ఉండటంలో ఉన్న అందాన్ని సాయి పల్లవి తనకు అర్థమయ్యేలా చేశారని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో అప్పటికే సర్జరీ చేయించుకోవాలనే నిర్ణయానికి వచ్చిన నివేదా.. చివరికి ఆ ఆలోచనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా సర్జరీ గురించి ఆలోచించినప్పటికీ చివరకు సహజ రూపాన్నే కొనసాగించాలని నిర్ణయించుకోవడం ద్వారా నివేదా పేతురాజ్ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తున్న నివేదా.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటున్నారు. సాయి పల్లవిని చూసి తన నిర్ణయాన్ని మార్చుకున్నానంటూ ఆమె చెప్పిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. [Nivetha Pethuraj, Nivetha Pethuraj Lip Surgery, Nivetha Pethuraj News, Sai Pallavi, Sai Pallavi Natural Beauty, Nivetha Pethuraj Movies, Telugu Actress Nivetha Pethuraj, Tollywood News, Nivetha Pethuraj Latest News]
Sep 27, 2026 10:28AMఆకాశం నుంచి దిగి వచ్చిన అందాల తార.. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది.!
సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనే కలతో ఎంతో మంది తమ ఉద్యోగాలను, కెరీర్‌ను సైతం వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్ రాశి సింగ్ కూడా ఒకరు. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన రాశి సింగ్‌కు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. 14 ఏళ్ల వయసులోనే మోడలింగ్, కమర్షియల్ యాడ్స్‌లో కనిపించిన ఆమె.. ఆ తర్వాత కొంతకాలం ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేశారు. అయితే సినిమాల్లో నటించాలన్న కోరిక మాత్రం ఆమెను వెంటాడుతూనే ఉండేది. ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు రాశి. ఇందుకోసం హైదరాబాద్‌కు మకాం మార్చారు. మోడలింగ్, యాడ్స్ ద్వారా కెమెరా ముందు అనుభవాన్ని సంపాదించుకున్న ఆమె.. పలువురు దర్శకులను కలుస్తూ ఆడిషన్స్‌కు హాజరయ్యారు. చివరికి 2021లో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘శశి’ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘ప్రేమ్ కుమార్’, ‘భూతద్దం భాస్కర్ నారాయణ’, ‘ప్రసన్న వదనం’ వంటి సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించారు. అయితే రాశి ప్రయాణం అంత సులభంగా సాగలేదు. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓవైపు ఉద్యోగం, మరోవైపు తన నటన కలను కొనసాగించారు. అధికారికంగా యాక్టింగ్ కోర్సు చేయలేకపోయినా మోడలింగ్, యాడ్ షూటింగ్స్‌నే నటనకు శిక్షణగా మలుచుకున్నారు. తెలుగు కూడా మొదట్లో ఆమెకు కొత్తే అయినప్పటికీ షూటింగ్స్‌లో దర్శకులు, చిత్రబృందం సహకారంతో నేర్చుకున్నారు. చిన్న పట్టణం నుంచి వచ్చిన తనకు సినిమాల్లోకి రావడం అంత సులభం కాదని, అయినా పట్టుదలతో ముందుకెళ్లానని గతంలో రాశి చెప్పుకొచ్చారు. ఇక రాశి సింగ్ ప్రస్తుతం సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టారు. 2026లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు రెస్టారెంట్, కేఫ్ బిజినెస్ కూడా ఉందని ఆమె వెల్లడించారు. సినిమాల్లో మరిన్ని విభిన్నమైన, ఛాలెంజింగ్ పాత్రలు చేయాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నారు. ఇలా ఎయిర్‌హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించి, తన చిన్ననాటి కలను నెరవేర్చుకునేందుకు సినీ రంగంలోకి వచ్చిన రాశి సింగ్ జర్నీ ఆసక్తికరంగా మారింది. [Rashi Singh, Rashi Singh Actress, Rashi Singh Air Hostess, Rashi Singh Cinema Journey, Rashi Singh Movies, Rashi Singh Biography, Telugu Actress Rashi Singh, Tollywood Actress, Rashi Singh Sashi, Rashi Singh Prasanna Vadanam]
Sep 27, 2026 8:50AMటాలీవుడ్లో విషాదం.. బ్రెయిన్ స్ట్రోక్‌తో డైరెక్టర్ భార్య కన్నుమూత.!
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు, రచయిత ప్రదీప్ అద్వైతం భార్య దీప్తి రెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆమె మృతి చెందినట్లు సమాచారం. దీంతో ప్రదీప్ అద్వైతం కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయం తెలియడంతో సినీ ప్రముఖులు, సన్నిహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. ప్రదీప్ అద్వైతం టాలీవుడ్లో రచయితగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌తో ఆయన పేరు ప్రేక్షకులకు మరింత చేరువైంది. మాహి వి. రాఘవ్‌తో కలిసి ఈ సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ప్రదీప్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక దీప్తి రెడ్డి కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తే. వివిధ రంగాల్లో పనిచేసిన ఆమెకు సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రదీప్ అద్వైతంతో కలిసి కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్న ఆమె.. తాజాగా అనారోగ్యానికి గురై తుదిశ్వాస విడవడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ముఖ్యంగా ఊహించని విధంగా బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆమె మృతి చెందడం సన్నిహితులను కలచివేసింది. దీప్తి రెడ్డి మృతితో ప్రదీప్ అద్వైతంకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె ఇలా హఠాత్తుగా దూరం కావడం బాధాకరమని సన్నిహితులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ విషాద వార్త టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. [Pradeep Advaitham Wife, Deepthi Reddy Death, Pradeep Advaitham, Deepthi Reddy Brain Stroke, Tollywood Director Pradeep Advaitham, Telugu Cinema News, Tollywood Latest News, Save The Tigers Director]
Sep 27, 2026 8:32AM
అక్కడే నా ఇగో దెబ్బతింది: శ్రీకాంత్ ఓదెలపై మోహన్ బాబు కామెంట్స్.!
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన మూవీ 'ది ప్యారడైజ్'. ఇందులో పవర్ ఫుల్ విలన్ పాత్రలో మోహన్ బాబు నటించారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ కి మరోసారి విజిల్స్ పడుతున్నాయి. ఇదిలా ఉంటే, తాజాగా 'ప్యారడైజ్' ప్రెస్ మీట్ లో మోహన్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మోహన్ బాబు ఎలాంటి విషయమైనా నిర్మొహమాటంగా మాట్లాడతారు. అలాంటి మోహన్ బాబు.. కొన్ని కొన్ని విషయాలు మాట్లాడాలని అనిపించినా, మాట్లాడలేకపోతున్నాని 'ప్యారడైజ్' ప్రెస్ మీట్ లో అన్నారు. ఏం మాట్లాడినా తమ విద్యాసంస్థల్లో చదువుతున్న వేలాది విద్యార్థులకు చెడ్డపేరు వస్తుందని, అందుకే సైలెంట్ గా ఉంటున్నట్లు మోహన్ బాబు చెప్పారు. ఇక 'ప్యారడైజ్' గురించి మాట్లాడుతూ.. నానిని మేము అప్పుడప్పుడు తలచుకుంటూ ఉంటామని, మా కుటుంబంలో నానిని ప్రేమించేవారు ఉన్నారని మోహన్ బాబు తెలిపారు. అలాగే శ్రీకాంత్ ఓదెల గురించి ఆయన చేసిన కామెంట్స్ నవ్వులు పూయించాయి. "దర్శకుడు శ్రీకాంత్ నన్ను కలిసి కథ చెప్పాడు. నువ్వు చెప్తున్నావు సరే, ఇందులో హీరో నాని కదా.. నువ్వు నానిని అడిగావా అన్నాను. మా అన్న పర్మిషన్ తీసుకునే వచ్చాను అన్నాడు. అక్కడ కొట్టింది నాకు ఇగో. నన్ను సినిమాలో పెట్టుకోవడానికి నాని రికమెండేషన్ తో వచ్చావా.. అని మనసులో అనుకున్నాను. ఏదేమైనా నాని పర్మిషన్ తో వచ్చాడు కాబట్టి.. థాంక్యూ నాని" అని మోహన్ బాబు అనడంతో అక్కడ నవ్వులు పూశాయి. అలాగే శ్రీకాంత్ ఓదెలపై ప్రశంసలు కూడా కురిపించారు మోహన్ బాబు. "దర్శకుడిగా శ్రీకాంత్ టాలెంట్ చూసి గర్వించాను. అతని టాలెంట్ గురించి ఎందరికో చెప్పాను." అన్నారు. ఇది కూడా చదవండి: నాని అన్నతో గొడవలు నిజమే.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.! [Mohan Babu About Srikanth Odela, Mohan Babu Speech, The Paradise Movie, Nani Paradise, Natural Star Nani, Srikanth Odela, Mohan Babu, Kayadu Lohar, Telugu Film News, Telugu News]
Sep 26, 2026 6:50PM
తెలుగు డైరెక్టర్ vs నివిన్ పౌలీ, సూరి: ఆ తెలుగు టైటిల్ ఎవరిది!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చి తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ, తమిళ కమెడియన్ సూరి, హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'ఏళు కడల్ ఏళు మలై'. ఈ క్రేజీ చిత్రాన్ని తెలుగులో 'సంచారి' అనే టైటిల్‌తో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తూ పోస్టర్లని విడుదల చేసింది. అయితే, ఈ పోస్టర్లు బయటకు రాగానే టాలీవుడ్ ప్రముఖ సీనియర్ దర్శకుడు 'ఆ నలుగురు' ఫే మ్ చంద్ర సిద్ధార్థ షాక్ కి గురయ్యాడు.ఎందుకంటే సంచారి' టైటిల్ ని తన ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై కొన్ని నెలల క్రితమే ఫిల్మ్ ఛాంబర్లో అధికారికంగా రిజిస్టర్ చేయించుకున్నారు.దీంతో తన తదుపరి డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం రిజిస్టర్ చేసుకున్న 'సంచారి' టైటిల్ ని, ఎలాంటి ముందస్తు సమాచారం లేదా అనుమతి లేకుండా ఒక తమిళ డబ్బింగ్ సినిమాకు వాడేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా టైటిల్ ప్రకటన రావడంపై చంద్ర సిద్ధార్థ తన టీమ్‌తో కలిసి ఫిల్మ్ ఛాంబర్ పెద్దలను ఆశ్రయించి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాడు సాధారణంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిబంధనల ప్రకారం ఇక్కడ ముందే రిజిస్టర్ అయిన టైటిళ్లను ఇతర డబ్బింగ్ సినిమాలకు కేటాయించరు. దీంతో నివిన్ పౌలీ డబ్బింగ్ చిత్రం ఖచ్చితంగా తమ తెలుగు టైటిల్ మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు, దర్శకుడు చంద్ర సిద్ధార్థ 'సంచారి' పేరుతో తెరకెక్కించాలనుకుంటున్న కథాంశం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కథ ప్రకారం, ఒక భారీ ఈ-కామర్స్ వ్యాపార సామ్రాజ్యంతో కోట్లు గడించిన ఒక కుబేరుడికి సడెన్‌గా హార్ట్ ఎటాక్ వస్తుంది. తాను బ్రతికేది కేవలం కొన్ని రోజుల వ్యవధి మాత్రమేనని వైద్యులు స్పష్టం చేయడంతో, ఆ కుబేరుడు తన వ్యాపారాన్ని, సిరిసంపదలను వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. అలా ఒక సాధారణ 'సంచారి'గా మారిన ఆ శ్రీమంతుడు రాయలసీమ ప్రాంతంలో అడుగుపెడతాడు. అక్కడ ప్రమాదంలో ఉన్న ఒక 5 గురు అపరిచితులకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే, ఆ 5 మంది అనుభవిస్తున్న కష్టాలు, కన్నీళ్లకు మూలకారణం తన సొంత కంపెనీ గతంలో తీసుకున్న కొన్ని కఠినమైన వ్యాపార నిర్ణయాలే అని తెలిసి ఆ కుబేరుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతాడు. ఇది కూడా చదవండి: నాతో అసలు పని లేదు.. అయినా సరే ఆ దర్శకుడు డబ్బులు తిరిగిచ్చేశారు! ఆ తప్పును దిద్దుకోవడానికి, ఆ రాయలసీమ గ్రామాన్ని రక్షించడానికి ఆ సంచారి ఏం చేశాడనేది ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ పాయింట్. ఒక మనిషి అసలైన విలువ అతడు సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తిపై కాకుండా, అతడి వల్ల ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి అనే భావోద్వేగమైన కాన్సెప్ట్‌తో ఈ స్టోరీ లైన్ అల్లుకున్నారు. ఇలాంటి బలమైన సందేశాత్మక కథకు 'సంచారి' అనే పేరు 100% నూటికి నూరు శాతం సరిపోతుందని, అందుకే ఈ టైటిల్ హక్కుల కోసం తాము ఛాంబర్ ముందుకు వెళ్తున్నామని ఫిల్మోత్సవ్ సంస్థ స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో, నివిన్ పౌలీ సినిమా టైటిల్ మారుతుందో లేదో అని టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. [Sanchari Movie Title Controversy In Tollywood, Sanchari Title Controversy, Filmofsav Banner , Yezhu Kadal Yezhu Malai, Nivin Pauly,chandra siddardha, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
Sep 26, 2026 6:34PM
నాని అన్నతో గొడవలు నిజమే: షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.!
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రూపొందిన 'ది ప్యారడైజ్' మూవీ సెప్టెంబర్ 24న విడుదలైంది. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇదిలా ఉంటే, విడుదలకు ముందు 'ప్యారడైజ్' గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. నాని, శ్రీకాంత్ ఓదెల మధ్య విభేదాలు వచ్చాయని.. నాని తిడితే శ్రీకాంత్ అలిగాడని.. ఇలా గాసిప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో ఈ గాసిప్స్ పై శ్రీకాంత్ స్పందించారు. "ఈ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ లో నేను కొన్ని చదివాను. నాని అన్నకి కోపం వచ్చింది, నాని అన్న తిట్టాడు, నాని అన్న కొట్టాడు, శ్రీకాంత్ అలిగాడు అని. నాని అన్నకి, నాకు గొడవలు అయ్యాయని కొన్ని చదివాను. అదంతా నిజమే అయ్యుండొచ్చు. కానీ, నాని అన్నతో నా బాండింగ్ దసరాకో, ప్యారడైజ్ కో పరిమితమైంది కాదు. మాది సినిమాని దాటిన ఎమోషన్. ఆయన నన్ను భరించాలి, నన్ను మోయాలి.. వేరే ఆప్షన్ లేదు. మేము తన్నుకుంటాం, తిట్టుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. కొన్ని ఎమోషన్స్ బతుకు దగ్గర ఆగొద్దు, చావుని దాటి చూడాలి. నాని అన్నతో నాది అలాంటి ఎమోషన్." అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ ఓదెల మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీకాంత్ స్టేజ్ మీద మాట్లాడుతున్న సమయంలో.. ఎదురుగా ఉన్న నాని సైతం ఆ మాటలను నవ్వుతూ ఎంజాయ్ చేయడం విశేషం. ఇది కూడా చదవండి: అంతకుమించి.. ‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.! https://x.com/Theteluguone/status/2103818692547235957 [Srikanth Odela About Clashes With Nani, Srikanth Odela Speech, The Paradise Movie, Nani Paradise, Natural Star Nani, Srikanth Odela, Mohan Babu, Kayadu Lohar, Telugu Film News, Telugu News]
Sep 26, 2026 6:13PM
నాతో అసలు పని లేదు.. అయినా సరే ఆ దర్శకుడు డబ్బులు తిరిగిచ్చేశారు!
విజయవాడ అమ్మాయి 'లయ' తెలుగు ప్రేక్షకులు ఎనీ టైం గుర్తుంచుకునేలా ప్రాముఖ్యత గల సినిమాలే చేసి మెప్పించింది. తన పెర్ఫార్మ్ చూస్తుంటే అప్పుడే విరబూసిన లేలేత గులాబీ పువ్వు మనతో ఏదో చెప్పాలనుకున్నంత అందంగా ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. లయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ఒక సినిమాకి సంబంధించి కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల, లేక ఇతర కారణాల వల్ల నాకు ఇవ్వాల్సిన పారితోషికం కొద్ది భాగం పెండింగ్‌లో ఉండిపోయింది. సాధారణంగా నాలుగేళ్లు గడిచిపోయాక, పెళ్లి చేసుకుని పరిశ్రమకు దూరమవుతున్న సమయంలో ఇక ఆ బాకీ తిరిగి వస్తుందని నేను ఊహించలేదు.2006లో నా వివాహ మహోత్సవం ఎంతో వేడుకగా జరిగింది.వేడుక ముగిసిన తర్వాత ఒక ప్రత్యేక పార్సిల్ నా ఇంటికి వచ్చింది. దాన్ని ఏదో సాధారణ వివాహ బహుమతి అనుకుని ఓపెన్ చేసి షాక్ అయ్యాను. ఆ కవరులో పెద్ద మొత్తంలో నగదుతో పాటు ఒక భావోద్వేగపూరితమైన లేఖ ఉంది. ఆ లేఖలో 'అమ్మా లయా, నేను నీకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ బాకీ ఇది. ఆ సమయంలో పరిస్థితుల వల్ల నీకు పూర్తి పారితోషికం ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నీ పెళ్లి సమయానికి నా దగ్గర డబ్బులు సరిపడా ఉన్నాయి. అందుకే ఈ బకాయిని నీకు అందజేస్తున్నాను. దీన్ని నా పెళ్లి కానుకగా, ఆశీర్వాదంగా భావించి స్వీకరించు" అని పేర్కొన్నారు. ఈ సంఘటనతో తనకు మాటలు రాలేదని లయ చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: అనుమాన పక్షి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్లు: మరి డిజాస్టర్ అన్నారుగా! "నేను ఆ డబ్బులను ఎప్పుడో వదిలేసుకున్నాను. 2004లో జరిగిన సినిమాకు 2006లో పెళ్లి చేసుకుని వేరే దేశం వెళ్లిపోతున్న నాకు ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇకపై నాతో ఆయనకు ఎటువంటి పని కూడా లేదు. అయినా సరే, నీతిగా తన బాధ్యతను గుర్తుపెట్టుకుని, ఒక తండ్రిలా భావించి ఆ పారితోషికాన్ని పెళ్లి కానుకగా పంపడం ఆయన గొప్పతనానికి నిదర్శనం" అంటూ చెప్పుకొచ్చింది. ఆ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ అనే పేరు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. 2004వ లో విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన 'స్వరాభిషేకం' అనే చిత్రంలో లయ హీరోయిన్. [Laya Recalls Remuneration Wedding Gift From Director, Actress Laya, Director K Viswanath,Swarabhishekam Movie, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
Sep 26, 2026 6:11PM
అనుమాన పక్షి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్లు: మరి డిజాస్టర్ అన్నారుగా!
డిజె టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సిసిల్, బ్రహ్మాజీ, రాశి, అజయ్ కీ రోల్స్ లో నిన్న సెల్యులాయిడ్ పైకి వచ్చిన చిత్రం అనుమాన పక్షి. అంతా కరెక్ట్ గా ఉంటేనే ప్రస్తుత సొసైటీ అనుమానాల పెను భూతాన్ని బెల్ట్ బాంబ్ లాగా నడుముకి చుట్టుకొని తిరుగుతున్నారు. అలాంటిది అనుమాన పక్షి అని టైటిల్ పెట్టి తప్పు చేసారనే మాట అభిప్రాయాన్ని సినీ ప్రేమికులు వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తు సినిమా కూడా బాగోలేదనే టాక్ ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది. బాక్సాఫీస్ లెక్కల వివరాల్లోకి వెళితే, 'అనుమాన పక్షి' మొదటి రోజు భారతదేశం వ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్ రూపంలో 11.43 లక్షలు వసూలు చేసింది. అందులో నికర వసూళ్లు (ఇండియా నెట్) దాదాపు 11 లక్షల వరకు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 83 నగరాల్లో మొత్తంగా 376 షోలలో ఈ సినిమా ప్రదర్శితమవ్వగా, మొదటి రోజు సగటు ఆక్యుపెన్సీ 9.1 శాతంగా నమోదైంది. ఒక్కో స్క్రీన్ నుంచి సగటున ₹6,926 వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొదటి రోజు అమ్ముడైన మొత్తం టిక్కెట్ల సంఖ్య 10,188 కాగా, ఉదయం షోల నుంచి రాత్రి షోల వరకు ఆక్యుపెన్సీలో పెద్దగా పెరుగుదల కనిపించలేదు. రీజియన్ వారీగా కలెక్షన్ల లెక్కలు పరిశీలిస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ భాగం వసూళ్లు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో 6.15 లక్షల గ్రాస్ రాగా, 144 షోలలో 10.9 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో ₹4.94 లక్షల గ్రాస్ నమోదవ్వగా, 212 షోలలో 7.8 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే వచ్చింది. ఇది కూడా చదవండి: రామాయణ ప్రమోషన్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ లెజండ్: ఆసక్తిగా మారిన ప్రమోషన్స్! ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ప్రకృతి చెప్పుకునే సినీ ఊసులుకి లోబడి సినిమాలు తెరకెక్కించాలని మరోసారి రుజువయ్యింది. [Anumana Pakshi First Day Collections, Anumana Pakshi Review, Rag Mayur, Vimal Krishna,Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
Sep 26, 2026 5:44PM
రాత్రంతా నిద్రపోలేదు: సూర్య సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.!
సినిమా చూసి ఎమోషనల్ అవ్వడం కామనే. కానీ ఓ సినిమా చూసి రాత్రంతా నిద్రపట్టలేదని, కన్నీళ్లు వచ్చాయని ఓ స్టార్ స్వయంగా చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సూర్య నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ చూసిన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటించిన ఈ ఫ్యామిలీ డ్రామాలో మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించారు. కుటుంబ బంధాలు, వయసు తేడా ప్రేమ కథ, జీవితంలో రెండో అవకాశం వంటి అంశాల చుట్టూ ఈ కథ సాగుతుంది. ఇటీవల ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమా చూసిన శివరాజ్‌కుమార్.. తన అనుభూతిని పంచుకున్నారు. సినిమా చూసిన తర్వాత దాదాపు గంటసేపు నిద్రపోలేకపోయానని చెప్పారు. మంచంపై పడుకుని సినిమా గురించి ఆలోచిస్తూ ఉండిపోయానని.. కన్నీళ్లు కూడా వచ్చాయని తెలిపారు. అంతేకాదు.. ఈ సినిమా తన తల్లిదండ్రులు డాక్టర్ రాజ్‌కుమార్, పార్వతమ్మ రాజ్‌కుమార్‌తో పాటు తన కుటుంబాన్ని గుర్తు చేసిందని శివరాజ్‌కుమార్ చెప్పారు. సినిమాలోని భావోద్వేగాలు తనలో ఎన్నో పాత జ్ఞాపకాలను మేల్కొలిపాయని ఆయన వెల్లడించారు. కొన్ని భావోద్వేగాలను మాటల్లో వర్ణించలేమని చెప్పిన శివరాజ్‌కుమార్.. ఇలాంటి లోతైన భావోద్వేగాలు ఉన్న సినిమాను తాను కూడా భవిష్యత్తులో చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఒక సినిమా సూపర్ స్టార్ ను ఇంతగా కదిలించిందంటే.. అందులోని ఎమోషన్ ఎంత బలంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చంటూ సూర్య అభిమానులు ఈ వ్యాఖ్యలను షేర్ చేస్తున్నారు. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమా.. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కూడా చదవండి: 'ప్యారడైజ్'లో సుబ్బు.. జాన్వీ కపూర్ చేసుంటే మామూలు రచ్చ కాదు.! https://x.com/SitharaEnts/status/2103748040091959658 [Shiva Rajkumar Emotional, Vishwanath And Sons OTT, Vishwanath & Sons, Shiva Rajkumar, Suriya, Venky Atluri, Mamitha Baiju, Suriya Latest Movie, Telugu Film News]
Sep 26, 2026 5:39PM
రామాయణ ప్రమోషన్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ లెజండ్: ఆసక్తిగా మారిన ప్రమోషన్స్!
భారతీయ సినీ ప్రేమికులతో పాటు రామభక్తులందరు 'దివాలి' రోజున రామాయణ థియేటర్స్ లో ఉండనున్నారు. దీంతో వరల్డ్ వైడ్ థియేటర్స్ అన్ని ఈ సారి రాముని సాక్షిగా దీపపు కాంతుల్లో వెలిగిపోనున్నాయి. ఈ పౌరాణిక అద్భుతాన్ని కేవలం మన దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ చేరవేయడానికి చిత్ర బృందం అపూర్వమైన వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే ప్రపంచంలోనే అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగిన యూట్యూబ్ దిగ్గజం 'మిస్టర్ బీస్ట్' (జిమ్మీ డోనాల్డ్సన్) ఈ ప్రతిష్టాత్మక చిత్ర ప్రమోషన్లలో భాగస్వామి కాబోతున్నారు. గ్లోబల్ డిజిటల్ మీడియా మరియు ఇండియన్ సినిమా చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక కలయికగా నిలవబోతోంది. ఈ విషయాన్నే స్పష్టం చేస్తూ ఇటీవల సోషల్ మీడియాలో ఒక స్పెషల్ ఇన్విటేషన్ పిక్ తీవ్రంగా వైరల్ అయ్యింది. ఈ ప్రత్యేక కార్యక్రమం లేదా చాట్ షోలో బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్, రాముడి పాత్రలో నటిస్తున్న రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా మెప్పించబోతున్న సహజ నటి సాయి పల్లవి, విజనరీ డైరెక్టర్ నితీష్ తివారీ, అలాగే ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రాలతో పాటు లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్న రవి దూబే కూడా పాల్గొనబోతున్నారు. ఇది కూడా చదవండి: కీర్తి సురేశ్ బోల్డ్ డ్రామా చేసేస్తారా :ఆ విషయంలో మొదటి చిత్రం ఇదే! యూట్యూబ్‌లో ఏకంగా 518 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు మరియు 140 బిలియన్లకు పైగా వ్యూస్ కలిగిన మిస్టర్ బీస్ట్ ఈ నటీనటులతో ముఖాముఖి సంభాషించనున్నారు. ఈ ప్రత్యేకమైన ఇంటరాక్షన్ 'రామాయణం' అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రపంచవ్యాప్తంగా లైవ్‌స్ట్రీమ్ కానుండటం విశేషం.దీంతో ఇప్పుడు రాముడు ప్రపంచ పటంపై తన 'ఆరా' సృష్టించనున్నాడు. [Ramayana Movie Mrbeast Promotions, MrBeast Ramayana Promotions, Ramayana, Ranbir kapoor, Sai Pallavi, Nitesh Tiwari, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
Sep 26, 2026 5:20PM
కీర్తి సురేశ్ బోల్డ్ డ్రామా చూసేస్తారా: ఆ...విషయంలో మొదటి చిత్రం ఇదే!
ఈ మధ్య కాలంలో హీరోలకి ధీటుగా సోలో బొమ్మతో దూసుకుపోతుంది కీర్తి సురేశ్. స్టిల్ అయితే 'యేష నాగుల గట్టు మీద' సాంగ్ తో సత్తా చాటుతూ ఉంది. నిన్న కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన సరికొత్త బోల్డ్ అండ్ ఎమోషనల్ క్రైమ్ డ్రామా చిత్రం 'డోరతీ' తో థియేటర్స్ లో సందడి చేస్తుంది. సందడి చేస్తుండటమే కాదు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ విభిన్నమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సమాయత్తమయ్యారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఒక వైవిధ్యభరితమైన కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. 'డోరతీ' చిత్రం అంతర్జాతీయ స్థాయిలోనూ అపూర్వమైన ప్రశంసలు అందుకోవడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF 2026)లో సెప్టెంబర్ 11న ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శించబడింది. ప్రదర్శన ముగిసిన అనంతరం అంతర్జాతీయ ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన స్టాండింగ్ ఓవేషన్ లభించింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైన మొదటి తమిళ చిత్రంగా 'డోరతీ' చారిత్రాత్మక రికార్డు నెలకొల్పడం విశేషం. మ్యూజిక్ మైస్ట్రో ఇళయరాజా అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. 146 నిమిషాల నిడివితో కూడిన ఈ థ్రిల్లర్ ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షక దేవుళ్లను కట్టిపడేస్తుందనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: తెలంగాణ సినిమా విజయం: మట్టి సువాసన నుంచి ప్రపంచ వేదికల వరకు! 1990ల కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో, పురుషాధిక్యత, పగ, కార్తీ మరియు సుబ్బు అనే ఇద్దరు బాల్య మిత్రుల మధ్య ఉండే గాఢమైన సంబంధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వినూత్నమైన కాన్సెప్ట్, బోల్డ్ కంటెంట్ మరియు ఎల్జీబీటీక్యూ అంశాలను కార్తీక్ సుబ్బరాజ్ అత్యంత ధైర్యంగా స్పృశించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. కీర్తి సురేశ్‌తో పాటు సనత్ మరియు రిషికాంత్ ప్రధాన పాత్రల్లో తమ నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి విశేష స్పందన లభిస్తుండగా, కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. చిత్రంలోని బోల్డ్ కంటెంట్ కారణం చూపిస్తూ మలేషియా వంటి దేశాల్లో ఈ సినిమా ప్రదర్శనపై నిషేధం విధించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే, కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ టేకింగ్, తిరు ఛాయాగ్రహణం, ఇళయరాజా సంగీతం కలగలిపి ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన విజువల్ కావ్యంగా మార్చాయని సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు. అక్టోబర్ 2న థియేటర్లలోకి వస్తున్న ఈ బోల్డ్ అండ్ ఎమోషనల్ రైడ్ తెలుగు ప్రేక్షకులు ఏ మేర ఆదరిస్తారో చూడాలి. [keerthy Suresh Dorothy Telugu Release Date, Keerthy Suresh Dorothy, Dorothy Telugu Release Date, Keerthy Suresh Bold Movie,Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
Sep 26, 2026 4:59PM
'ప్యారడైజ్'లో సుబ్బు: ఫస్ట్ ఛాయిస్ జాన్వీ కపూర్.. చేసుంటే మామూలు రచ్చ కాదు.!
న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన 'ది ప్యారడైజ్' మూవీ థియేటర్లలో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'సుబ్బు' అనే బోల్డ్ అండ్ వింటేజ్ గర్ల్ క్యారెక్టర్లో కయాదు లోహర్ నటించింది. అయితే, ఈ రోల్ వెనుక ఒక ఆసక్తికరమైన కాస్టింగ్ సీక్రెట్ ఉంది. సుబ్బు క్యారెక్టర్ కోసం కయాదు లోహర్ ఫస్ట్ ఛాయిస్ కాదట. అసలు దర్శకనిర్మాతలు ఈ పాత్ర కోసం ముందుగా అనుకున్నది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని. జాన్వీ అయితే పాన్-ఇండియా మార్కెట్‌కి బాగా ప్లస్ అవుతుందని మేకర్స్ భావించారట. 'దేవర' సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్, సౌత్‌లో వరుస ఆఫర్లు అందుకుంటోంది. శ్రీకాంత్ కూడా జాన్వీని కలిసి కథ వినిపించారట. కానీ, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చిందని సమాచారం. ఈ క్రమంలోనే 'మొగిల్‌పేట', 'డ్రాగన్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ కయాదు లోహర్‌ని చిత్రయూనిట్ ఎంపిక చేసింది. అయితే ఈ సినిమాలో సుబ్బు పాత్ర బోల్డ్ గానే ఉంటుంది. కుటుంబ పరిస్థితుల వల్ల బిగ్రేడ్ సినిమాల్లో నటిస్తుంది. అందుకే కయాదు లోహర్ పోషించిన ఈ పాత్రపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొరపాటున 'ప్యారడైజ్'లో సబ్బు క్యారెక్టర్ జాన్వీ చేసుంటే రచ్చ మామూలుగా ఉండేది కాదేమో. 'పెద్ది'లో గ్లామర్ డోస్ పెరిగినందుకే ట్రోల్స్ వచ్చాయి. అలాంటిది సుబ్బు రోల్ లో కనిపించి ఉంటే.. ఇంకే రేంజ్ లో ఉండేదో అనే చర్చ జరుగుతోంది. ఇది కూడా చదవండి: కీర్తి సురేష్ మూవీపై వివాదం.. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ సెగ.! [Janhvi Kapoor First Choice For Subbu Role, Janhvi Kapoor Missed Subbu Role, Janhvi Kapoor Missed Paradise, The Paradise Movie, Nani Paradise, Kayadu Lohar, Telugu Film News, Telugu News]
Sep 26, 2026 4:46PM
తెలంగాణ సినిమా విజయం: మట్టి సువాసన నుంచి ప్రపంచ వేదికల వరకు!
తెలంగాణ... కోటి రతనాల వీణ.. బండెనక బండి కట్టి పదహారు బళ్ళు కట్టి అంటూ నాలుగున్నర దశాబ్దాల క్రితమే తెలుగు సెల్యులాయిడ్ పై చిందేసి తెలంగాణ మట్టి వాసనని, కుసుమాన్ని ప్రేక్షకులందరికి పంచింది. కానీ ఆ తర్వాత తెలంగాణ సంస్కృతి.. భాషకి సంబంధించి పూర్తి తెలంగాణ చిత్రాలు పెద్దగా రాలేదు. నిజానికి ఒకప్పుడు తెలుగు సినిమాలో ప్రాంతీయ యాసలంటే కేవలం హాస్యానికో, లేదా విలనిజానికో మాత్రమే పరిమితమయ్యేవి. కానీ, కాలం మారింది. కథా బలమున్న మట్టి కథలు తెెరపైకి రావడం మొదలైనప్పటి నుంచి తెలంగాణ నేపథ్యం తెలుగు చిత్రసీమలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. ఈ రోజు తెలంగాణ సంస్కృతి, జీవన విధానం, ఇక్కడి ప్రజల భావోద్వేగాలు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటున్నాయి. స్థానిక కథలకే అంతర్జాతీయ స్థాయి ఆదరణ లభిస్తుందని మన సినిమాలు నిరూపిస్తున్నాయి. ఈ మార్పు ఒక్క రోజులో వచ్చింది కాదు. ఒకప్పుడు హైదరాబాద్ లేదా రూరల్ ఆంధ్ర నేపథ్యంతో మాత్రమే సినిమాలు వస్తుండేవి. కానీ, తెలంగాణ ప్రాంతానికి చెందిన దర్శకులు, రచయితలు తమ సొంత ఊరి కథలను, తాము చూసిన జీవితాలను నిజాయితీగా తెరపై ఆవిష్కరించడం ప్రారంభించారు. తెలంగాణ భాషలోని తీయదనం, యాసలో ఉన్న సహజత్వం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాయి. పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల మధ్య ఉండే సంబంధాలు, పండుగలు, ఆచారాలు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకోవడం మొదలైంది. అందుకు ప్రధాన బలం ఇచ్చిన మూవీ 'ఫిదా' అని చెప్పవచ్చు. ఆ తర్వాత 'పెళ్లి చూపులు', 'బలగం', 'దసరా' తో పాటు చాలా యూత్ ఫుల్ చిత్రాలు కూడా ఇప్పుడు తెలంగాణ నేపధ్యంతోనే వస్తున్నాయి. ప్రెజెంట్ థియేటర్స్ లో సందడి చేస్తున్న ప్యారడైజ్ కూడా తెలంగాణ నేపధ్యమే. బాక్సాఫీస్ వద్ద తెలంగాణ నేపధ్యానికి మున్ముందు మంచి రోజులు రాబోతున్నాయనే మార్పుకి ఇవే బలమైన సాక్ష్యాలు. ఇది కూడా చదవండి: 'ది ప్యారడైజ్' పై కవిత సంచలన కామెంట్స్! కేవలం కమర్షియల్ విజయాలు మాత్రమే కాకుండా, ఈ సినిమాలు తెలంగాణ భాష మరియు సంస్కృతిపై ఉన్న అపోహలను పూర్తిగా పటాపంచలు చేశాయి. తెలంగాణ యాసలో పలికే సంభాషణలు ఇప్పుడు థియేటర్లలో ఈలలు వేయిస్తున్నాయి. దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి విదేశాలలో సాధారణ విదేశీ ప్రేక్షకులు కూడా ఈ మట్టి కథలకు బ్రహ్మరథం పడుతున్నారు. యూట్యూబ్ మరియు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో తెలంగాణ నేపథ్య సినిమాలకు 70% కంటే ఎక్కువ డిజిటల్ వ్యూయర్ షిప్ నమోదవుతుండటం విశేషం. ఏది ఏమైనా తెలంగాణ నేపథ్యం ఇప్పుడు కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదు, తెలుగు సినిమాకు ఒక కొత్త గుర్తింపు మరియు ఆత్మగా మారింది. ముందు ముందు మరిన్ని వైవిధ్యమైన తెలంగాణ కథలు ప్రపంచ వేదికలపై మెరిసి, తెలుగు సినిమా రంగాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇప్పుడు తెలుగు సినిమా కళామ తల్లి కూడా అంటుంది నా 'తెలంగాణ కోటి రతనాల వీణ' అని. [Telangana Movies Global Success, Telangana movies, telugu cinema success, The Paradise movie, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
Sep 26, 2026 4:26PM
'ది ప్యారడైజ్' పై కవిత సంచలన కామెంట్స్!
తెలంగాణ ప్రాంత నేపథ్యంలో తెరకెక్కిన నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల ల 'ది ప్యారడైజ్ థియేటర్స్ లో రన్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రియదర్శి పోషించిన కేసీఆర్ ని పోలిన క్యారక్టర్ అయితే కెసిఆర్ అభిమానులకి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి మంచి కిక్ ని తెప్పిస్తుంది. రీసెంట్ గా కెసిఆర్ కుమార్తె కవిత మాట్లాడుతు తెలంగాణ బిడ్డే డైరెక్టర్ అయినా, ప్యారడైజ్ మూవీ బాగోలేదు. దీంతో సినిమా కూడా సరిగ్గా ఆడటం లేదు. తెలంగాణ తెచ్చిన కెసిఆర్ క్యారక్టర్ ని అయితే అవమానించారు. పాటలకి డాన్స్ చేస్తుంది బీఆర్ఎస్ పెయిడ్ టీం. డబ్బులు ఇచ్చి మరి డాన్స్ చేయిస్తున్నారు. నేను ప్యారడైజ్ మూవీ చూడనని కవిత చెప్పుకొచ్చింది. ఇది కూడా చదవండి: లబోదిబోమంటున్న మహిళా యూట్యూబర్: పక్కాగా ప్లాన్ చేసి దాన్నే దోచుకెళ్లారు! [Kavitha About The Paradise movie, TRS Kavitha Serious On Nani, The paradise, kayadu Lohar, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
Sep 26, 2026 3:59PM
కీర్తి సురేష్ మూవీపై వివాదం: సోషల్ మీడియాలో బాయ్‌కాట్ సెగ.!
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘డొరొతి’ ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ఒకవైపు ప్రశంసలు వస్తుంటే.. మరోవైపు కొన్ని సన్నివేశాలు, సినిమాలోని సున్నితమైన అంశాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేకాదు.. కొందరు నెటిజన్లు ఏకంగా సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ‘డొరొతి’ సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వచ్చింది. 1990ల ప్రారంభంలో గ్రామీణ తమిళనాడు నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. కుల విభజనలు, హింస, పురుషత్వంపై సమాజం విధించే అంచనాలు, స్నేహం, ప్రేమ వంటి అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. కీర్తి సురేష్‌తో పాటు రిషికాంత్, సనంత్ కీలక పాత్రల్లో నటించారు. అయితే సినిమా విడుదలైన తర్వాత అసలు చర్చ మొదలైంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని అంశాలు, LGBTQ నేపథ్యానికి సంబంధించిన ట్రీట్మెంట్పై కొందరు ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అయితే ఇలాంటి సినిమాలను ప్రోత్సహించకూడదంటూ బాయ్‌కాట్‌కు పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్, చివరి భాగంలోని కొన్ని డైలాగులు సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. సున్నితమైన అంశాన్ని దర్శకుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విధానం విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యతిరేకత అందరి ప్రేక్షకుల అభిప్రాయం కాదని కూడా చెప్పాలి. సినిమా కథనం, నటీనటుల పెర్ఫార్మెన్స్, రియలిస్టిక్ ట్రీట్మెంట్ను మెచ్చుకుంటున్నవాళ్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రదర్శన లభించింది. అక్కడ సినిమాకు మంచి స్పందన వచ్చినట్లు రిపోర్టులు వచ్చాయి. కానీ థియేట్రికల్ రిలీజ్ తర్వాత మాత్రం సోషల్ మీడియాలో మరో రకమైన చర్చ మొదలైంది. ఇలా ఒకవైపు ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రశంసలు.. మరోవైపు థియేటర్లలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వివాదం.. ఇంకోవైపు బాయ్‌కాట్ పిలుపులు.. ఇలా ‘డొరొతి’ చుట్టూ భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: KTR షాకింగ్ ట్వీట్.. ‘పారడైజ్’ కోసం రంగంలోకి మాజీ మంత్రి.! [Keerthy Suresh Dorothy Controversy, Dorothy Movie Controversy, Keerthy Suresh Dorothy Movie, Keerthy Suresh Latest Movie, Keerthy Suresh, Dorothy Movie, Karthik Subbaraj, Dorothy Boycott, LGBTQ Controversy, Telugu Film News]
Sep 26, 2026 3:15PM
లబోదిబోమంటున్న మహిళా యూట్యూబర్: పక్కాగా ప్లాన్ చేసి దాన్నే దోచుకెళ్లారు!
దేనోడు దానికే ఉంటాడనే సామెత పురాణాల నుంచే ప్రాచుర్యంలో ఉంది. ప్రాచుర్యంలో ఉండటమేంటి అది నిజం అనే సంఘటనలని మనం రోజు చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసంఘటన జరిగింది. తమిళనాడులోని నాగర్‌కోయిల్ సమీపంలోని తమ్మట్టుకోణం వీఐపీ గార్డెన్లో నివసించే ప్రముఖ దంపతులు వినోద్ కుమార్, మధుమిత యూట్యూబర్స్ గా రాణిస్తున్నారు. యూట్యూబ్ తో పాటు ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్స్ కోసం నిరంతరం వీడియోలు చేసే ఈ దంపతులు, ఇటీవల తమ ఇంట్లోని పూజా గదిలో ఉన్న అపారమైన సంపదని ప్రపంచానికి చూపిస్తూ ఒక షార్ట్ వీడియో చేశారు. ఆ వీడియోలో తులాల కొద్దీ బంగారు ఆభరణాలు, దొంతులుగా పేర్చిన నగదును స్పష్టంగా ప్రదర్శించారు. ఆ ఆర్భాటమే ఇప్పుడు వారిని రోడ్డున పడేలా చేసింది. ఆ వీడియో వైరల్ అయిన కొద్ది రోజులకే దొంగలు పక్కా ప్లాన్‌తో వారి ఇంటిపై విరుచుకుపడ్డారు. దొంగలు ఆ ఇంట ఉన్న సెక్యూరిటీని అత్యంత చాకచక్యంగా ఛేదించారు. పటిష్టమైన గేటెడ్ కమ్యూనిటీ, సీసీటీవీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ దొంగలు రాత్రికి రాత్రే ఇంటి వెనుక తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. వారు ఏమీ వెతకాల్సిన అవసరం లేకుండానే, వీడియోలో చూసిన పూజ గదిలోని సేఫ్‌పై దాడి చేసి నిమిషాల్లో పని పూర్తి చేసుకున్నారు. ఈ దొంగతనంలో ఏకంగా 118 సవర్ల (సవర్ అంటే 8 గ్రాములు) బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు, భారీగా ఉన్న నగదును దోచుకెళ్లారు. అంతర్జాతీయ, స్థానిక మార్కెట్ విలువల ప్రకారం చోరీకి గురైన మొత్తం సంపద విలువ 1 కోటి వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: డాన్సర్స్ అసోసియేషన్‌లో మంటలు: ఆ రోజునే ఎన్నికలు ఎందుకు! బాధితులు వెంటనే రాజాక్కమంగళం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లతో నిందితుల కోసం గాలిస్తున్నారు. అందుకే అంటారు అవసరానికి మించి 'షో' చేస్తే 'అటెన్షన్' గురించి ఆలోచించకుండా 'సరెండర్' అవుతాం. ఇది చరిత్ర చెప్పిన 'సత్యం'. [Youtuber Gold Stolen TamilNadu, Tamil Nadu YouTuber Burglary, Madhumitha, 118 Sovereigns Gold Stolen, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
Sep 26, 2026 3:13PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com











