Podharillu: మాహా పెళ్ళి అని తెలిసి చక్రి షాక్.. మాధవకి వచ్చిన సంబంధం క్యాన్సిల్!
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -10 లో.....మాధవని చూడడానికి వచ్చిన అమ్మయి వాళ్ళకి ఇల్లు, స్థలం చూపిస్తాడు. అంత బాగానే ఉంది నాకు నీ పద్ధతి నచ్చింది కానీ ఇంత మంది అబ్బాయిలున్న ఇంట్లోకి అమ్మయిని ఇవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉంది.. నువ్వు వేరొక ఇల్లు తీసుకొని ఉంటావా అని అమ్మయి తండ్రి అనగానే అలా అయితేనే మీ కూతురిని ఇస్తానంటే నాకు మీ కూతురు అవసరం లేదని మాధవ చెప్తాడు.