మహిళలలో ఎక్కువగా కనిపించే వ్యాధి ఇదే.. !
మహిళలలో ఎక్కువగా కనిపించే వ్యాధి ఇదే.. !
ప్రపంచంలో మహిళల పాత్ర అనిర్వచనీయం. ఇంటా, బయటా అన్ని రంగాలలో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. వీరి గురించి సాధారణ రోజుల కంటే మహిళా దినోత్సవం రోజు ఒకింత ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు లింగ సమానత్వం, మహిళల హక్కులు, మహిళలపై హింస, దుర్వినియోగం వంటి విషయాల గురించి సమాజానికి అవగాహన కల్పించి, మహిళల జీవితాలో వెలుగులు నింపాలనే ఉద్దేశ్యంతో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. వీటన్నింటితో పాటు మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. పురుషుల కంటే స్త్రీలు వివిధ రకాల వ్యాధులు, పోషకాహార లోపాలు, ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 57శాతం కు పైగా మహిళలను పట్టి పీడిస్తున్న ఒక సమస్య గురించితెలుసుకుంటే..
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 (NFHS-5) ప్రకారం, భారతదేశంలో 15-49 సంవత్సరాల వయస్సు గల 57% మంది మహిళలు రక్తహీనత ప్రమాదంలో ఉన్నారు . పురుషుల కంటే మహిళల్లో రక్తహీనత ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా చదువురాని మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఐరన్ లోపం, ఋతుస్రావం, గర్భధారణ సమయంలో తగినంత పోషకాహారం లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి సాధారణం కంటే తక్కువగా పడిపోయినప్పుడు రక్తహీనత ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో కనిపించే ప్రోటీన్. ఇది శరీరం అంతటా ఆక్సిజన్‌ను తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. మహిళల్లో రక్తహీనతకు అతి పెద్ద కారణం ఐరన్ లోపం.
రక్తహీనత ఎందుకంత ప్రమాదం..
కూడా రక్తహీనత ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు గర్భధారణ సమయంలో స్త్రీ శరీరానికి శిశువు అభివృద్ధికి ఎక్కువ పోషకాలు అవసరం. ఈ సమయంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 లను తీసుకోకపోతే, రక్తహీనత వస్తుంది. రక్తహీనత వల్ల సంతానోత్పత్తి తగ్గడం, గర్భధారణ సమయంలో అకాల ప్రసవం, నవజాత శిశువు బరువు తక్కువగా పుట్టడం, మానసిక, శారీరక అభివృద్ధిలో ఆటంకం ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.
రక్తహీనత రాకుండా ఉండాలంటే..
రక్తహీనతను నివారించడానికి చిన్నప్పటి నుండే ఆహారాన్ని మెరుగుపరచడం అవసరం. దీని కోసం, సమతుల్య ఆహారం తీసుకోవాలి.
ఆకుకూరలు (పాలకూర, మెంతికూర, తోటకూర, మునగకూర), బీట్‌రూట్, దానిమ్మ వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తప్పనిసరిగా తినేలా చూసుకోవాలి.
పప్పుధాన్యాలు, సోయా, పాలు, గుడ్లు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 కోసం ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పప్పులు, మాంసం, పాలు చేర్చుకోవచ్చు.
ఆహారంలో నిమ్మ, నారింజ, ఉసిరి వంటి విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. విటమిన్ సి ఐరన్ శోషణకు సహాయపడుతుంది. కాబట్టి విటమిన్-సి తీసుకుంటే ఐరన్ గ్రహించడంలో శరీరానికి ఇబ్బంది కలగదు.
*రూపశ్రీ.