ఆడపిల్లలకు మొదటిసారి బ్రా కొనేముందు ప్రతి తల్లి ఇవి గుర్తుంచుకోండి!

ఆడపిల్లలకు మొదటిసారి బ్రా కొనేముందు ప్రతి తల్లి ఇవి గుర్తుంచుకోండి! బ్రా అనేది మహిళల వస్త్రధారణలో ఒక భాగం.  ఒక వయసుకు వచ్చాక చిన్న పిల్లల నుండి పెద్దల వరకు బ్రా ధరించడం జరుగుతుంది. సాధారణంగా నేటికాలంలో ఆడపిల్లలు చిన్న వయసులోనే మెచ్యూర్ అవ్వడం,  శారీరకంగా వారు అభివృద్ది చెందడం జరుగుతోంది.  ఆడపిల్లలకు వక్షోజాలు పెరగడం మొదలయ్యాక వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని తల్లులు పిల్లలకు బ్రా వేసుకోమని సూచిస్తుంటారు. అందుకోసం బ్రా కొనుగోలు కూడా చేస్తుంటారు. అయితే పిల్లల కోసం బ్రా కొనుగోలు చేసేముందు చాలామంది తల్లులు తప్పులు చేస్తుంటారు. మరికొందరు అవగాహన లేకుండా కొంటూ ఉంటారు. మొదటి సారి బ్రా కొనుగోలు చేసేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలి?  ఆడపిల్లలు ఉన్న ప్రతి  తల్లి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. మొదటి తప్పు.. శరీరం ఎదుగుతున్నప్పుడు చాలామంది తల్లులు తమ పాపకు బ్రా వేస్తే మంచిదని అనుకుంటారు. అయితే మొదటి సారి ఎంచుకునే బ్రా చాలా వరకు తప్పుగా ఉన్నదే ఎంచుకోవడం జరుగుతుంది.  చాలా టైట్ గా ఉన్నదో లేదా చాలా లూజ్ గా ఉన్నదో.. ప్యాబ్రిక్ పరంగా చూస్తే సౌకర్యవంతంగా లేనిదో.. ఇలా చాలా రకాలుగా మిస్టేక్స్ జరుగుతాయి. సరైన వయసు.. చాలా వరకు చిన్న పిల్లలకు బ్రా వేసే వయసు 8 నుండి 12 సంవత్సరాల మద్య ప్రారంభం అవుతుంది. అయితే కొందరికి శారీరకంగా ఎదుగుదల ఉండి 8 ఏళ్లకే వక్షోజాలు పెరిగినట్టు కనిపిస్తుంది, మరికొందరికి 12 ఏళ్లు వచ్చినా ఎదుగుదల ఉండదు.  కానీ వయసు వచ్చింది కదా అని అవసరం లేకపోయినా బ్రా వేయడం తప్పు.. సరైన ఎంపిక లేకపోతే ఏం జరుగుతుంది? ఆడపిల్లలకు బ్రా వేయడం మంచిదే.. కానీ ఎంచుకునే బ్రా సరిగా లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. పిల్లలది ఎదిగే వయసు కావడంతో కాలంతో పాటు వక్షోజాల పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలలో చాలామంది మహిళలు పిల్లలు పెద్దగా అవుతారు కదా అని లూజ్ గా, పొడవుగా ఉన్న  దుస్తులు కొంటారు. కానీ బ్రా మాత్రం అలా లూజ్ గా ఉన్నవి కొనకూడదు.  లూజ్ గా ఉన్ బ్రా ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. బాగా టైట్ గా ఉన్న బ్రా ధరించడం వల్ల పిల్లలకు చాలా అసౌకర్యంగా ఉంటుంది.  పెరిగే వయసు కాబట్టి వక్షోజాల పెరుగుదలకు ఆటంకం కలగడం,  వక్షోజాల్లో నొప్పి వంటివి ఎదురవుతాయి. బ్రా రకం.. పిల్లల కోసం ఎంచుకునే బ్రా రకం కూడా చాలా ముఖ్యం.పెద్దవాళ్లు ఎంచుకున్నట్టు బ్రాను ఎంపిక చేయకూడదు.  బనియన్ టైప్ లో ఉన్న బ్రా లేదా స్పోర్ట్స్ బ్రా లాంటివి పిల్లలకు బాగుంటాయి. ప్యాబ్రిక్.. పిల్లల కోసం ఎంచుకునే బ్రా ఫ్యాబ్రిక్ కూడా చాలా ముఖ్యం.  క్లాత్ బాగా స్మూత్ గా ఉండాలి,  స్కూల్ యూనిఫార్మ్ లేదా డ్రస్ మీద అసలు కనిపించనట్టు ఉండాలి,  పెద్దవాళ్ల లాగా రఫ్ గా ఉన్నవి ఎంచుకోకూడదు.  మరీ ముఖ్యంగా పెద్దవాళ్లు వేసుకున్నట్టు కప్ బ్రా లు పిల్లల కోసం అస్సలు ఎంపిక చేయకూడదు. వక్షోజాల నిపుల్స్ కు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేలాగా బ్రా ఎంపిక ఉండాలి. బలవంతం వద్దు.. వయసు పెరుగుతోంది కాబట్టి బ్రా ఖచ్చితంగా వేసుకోవాలి అని పిల్లలను బలవంతం చేయకూడదు. దాని బదులుగా పిల్లలకు బ్రా వేుకోవడం ఎంత ముఖ్యం, అది ఎంత సౌకర్యంగా ఉంటుంది అనే విషయం అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లలు స్కూల్ కు వెళ్లడం రావడం మాత్రమే కాకుండా, ఆటలు ఆడేటప్పుడు, పరిగెత్తేటప్పుడు.. ఇలా వారికి బ్రా ఉండటం వల్ల ఎలాంటి సౌకర్యం ఉంటుందో అర్థమయ్యేలా చెప్పాలి. బ్రా వేసుకోవడానికి పిల్లలను మానసికంగా సిద్దం చేసిన తర్వాతే  బ్రా కొనుగోలు చేయడం,  పిల్లలకు వేయడం చేయాలి. ఇలా చేస్తే ఎంతో సున్నితమైన విషయాన్ని కూడా పిల్లలు చాలా బాగా అర్థం చేసుకుంటారు.                                     *రూపశ్రీ.

వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేయవచ్చా

వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేయవచ్చా! తీవ్రమైన ఎండ, దుమ్ము, చెమట కారణంగా వేసవి కాలంలో జుట్టు పొడిబారడం , జిగటగా మారడం జరుగుతుంది. వేసవిలో ఇది  సాధారణ సమస్య . ఈ సమస్య నుండి ఉపశమనం కోసం చాలామంది వేసవిలో రోజు తలస్నానం చేస్తుంటారు. తలకు షాంపూతో తలస్నానం చేయడం సహజమే.. గ్లని ప్రతిరోజూ వేసవిలో ప్రతిరోజూ షాంపూ చేయడం సరైనదేనా? అని చాలా మంది గందరగోళం పడుతుంటారు. ప్రతిరోజూ షాంపూ తో జుట్టు కడగడం వల్ల అది ఆరోగ్యంగా ఉంటుందా? జుట్టు ఆరోగ్యానికి ఏది సరైనది? ఏది మంచిది కాదు..  వివరంగా తెలుసుకుంటే.. ప్రతిరోజూ తలస్నానం మంచిదేనా? వేసవిలో అధికంగా చెమట పట్టడం వల్ల తలపై మురికి పేరుకుపోతుంది. ఈ మురికిని తొలగించడానికి తలస్నానం చేయడం చాలా అవసరం. అయితే ప్రతిరోజూ షాంపూ తో తలస్నానం చేయడం  జుట్టుకు మంచిది కాదు. మన తలలో జుట్టుకు తేమను అందించే సహజ నూనెలు ఉంటాయి.  ప్రతిరోజూ రసాయన ఆధారిత షాంపూలను ఉపయోగించినప్పుడు, ఈ సహజ నూనె పూర్తిగా తొలగిపోతుంది. దీనివల్ల జుట్టు పొడిగా, నిర్జీవంగా, బలహీనంగా,  సులభంగా విరిగిపోయేలా తయారవుతుంది. ప్రతిరోజూ షాంపూ చేస్తే కలిగే నష్టాలు.. ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేస్తే తల చర్మం చాలా పొడిబారిపోతుంది. ఈ పొడిదనాన్ని ఎదుర్కోవడానికి, తల చర్మం మరింత నూనెను ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల  జుట్టు జిడ్డుగా కనిపిస్తుంది. అంతేకాకుండా, ప్రతిరోజూ షాంపూ తో జుట్టు కడగడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి, జుట్టు రాలడానికి దారితీసే అవకాశం ఉంటుంది. వేసవిలో జుట్టును ఎలా శుభ్రం చేయాలంటే.. వేసవిలో జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం, కానీ ప్రతిరోజూ షాంపూ చేయాల్సిన అవసరం లేదు. వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే షాంపూ వాడటం మంచిది. కొన్ని రోజులు  జుట్టు మరీ జిడ్డుగా అనిపిస్తే తప్ప.. సాధారణంగా షాంపూ లేకుండా కేవలం శుభ్రమైన నీటితో కడుక్కోవచ్చు. అయితే ఎప్పుడు కూడా  తేలికపాటి లేదా సహజమైన పదార్థాలతో తయారు చేసిన షాంపూనే వాడటం మంచిది. జుట్టును ఆరోగ్యంగా ఉంచే చిట్కాలు.. షాంపూ చేసిన తర్వాత  జుట్టుకు తప్పకుండా కండిషనర్ రాయాలి. కండిషనర్ తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ఎండలోకి వెళ్ళేటప్పుడు, జుట్టును ఒక దూది గుడ్డతో లేదా స్కార్ఫ్‌తో కప్పుకోవాలి. అంతేకాకుండా తగినంత నీరు తాగుతూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.                             *రూపశ్రీ

ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర సరిగా రాదు ఎందుకని...నిద్ర బాగా పట్టాలంటే ఏం చెయ్యాలి!

  ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర సరిగా రాదు ఎందుకని...నిద్ర బాగా పట్టాలంటే ఏం చెయ్యాలి! మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరికీ తగినంత నిద్ర అవసరం. కానీ గర్భధారణ సమయంలో తగినంత నిద్రపోవడం మహిళలకు పెద్ద సవాలుగా మారుతుంది.  అయితే గర్భం దాల్చిన తొమ్మిది నెలల కాలం చాలా విలువైనది. నిద్రలేమి సమస్య ఈ 9నెలల కాలాన్ని చాలా క్లిష్టతరంగా మారుస్తుంది. సాధారణంగా అలసటగా ఉన్నప్పుడు చాలామంది హాయిగా నిద్రపోతారు. కానీ   అలసటగా అనిపించినా సరైన నిద్ర పట్టడం లేదని చాలామంది మహిళలు వాపోతుంటారు. మహిళలకు నిద్రలేమి  వెనుక హార్మోన్లలో మార్పులు, వెన్నునొప్పి, కడుపులో బిడ్డ   చురుకుగా మారడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేయడానికి లేవడం  వల్ల చాలాసార్లు నిద్రకు ఆటంకం కలుగుతుంది. దీని కారణంగా మరుసటి రోజు అలసటగా,  నీరసంగా అనిపిస్తుంది. గర్భిణీ స్త్రీ రాత్రిపూట 7-8 గంటలు నిద్రపోవాలని, పగటిపూట కనీసం రెండు గంటలు నిద్రపోవాలని,  ఇది తల్లి,  బిడ్డ ఇద్దరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని మహిళా వైద్యులు చెబుతున్నారు.  గర్భవతులు హాయిగా నిద్రపోవాలంటే ఏం చేయాలో తెలుసుకుంటే.. ప్రెగ్నెన్సీ సమయంలో రోజంతా యాక్టివ్ గా ఉండటం వల్ల రాత్రి బాగా నిద్ర పడుతుంది. చురుగ్గా ఉండటం అంటే భారీ పని కాదు. పగటిపూట లైట్ యోగా,  వ్యాయామం చేయడం వల్ల  రాత్రి బాగా నిద్ర పడుతుంది. డిజిటల్ గాడ్జెట్లు  మనస్సును  చురుకుగా ఉంచుతాయి. పదే పదే మొబైల్ చూడటం,  ఏదో  ఒకటి ఆపరేట్ చేయడం చేస్తుంటారు.  ఇవి  నిద్రపై అత్యధిక ప్రభావం చూపుతాయి. పడుకునే రెండు గంటల ముందు ఫోన్, టీవీ, కంప్యూటర్, ల్యాప్‌టాప్ స్విచ్ ఆఫ్ చేసి నిద్రపై దృష్టి పెట్టడం మంచిది. పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఇలా చేయడం వల్ల రోజంతా అలసట, టెన్షన్ తొలగిపోయి స్నానం చేసి పడుకోగానే గాఢ నిద్రలోకి జారుకుంటారు. రాత్రి పడుకునే ముందు వేడి లేదా చల్లని కాఫీ వంటి కెఫిన్ ఉన్న పానీయాలను తాగడం మానుకోవాలి. నిద్రవేళకు రెండు మూడు గంటల ముందు వీటిని తీసుకోవడం మానేస్తే,  ఆహ్లాదకరమైన నిద్రను సొంతం అవుతుంది. పడుకునే ముందు చాలా తక్కువ మొత్తంలో నీరు త్రాగాలి. దీనితో  తరచుగా మూత్ర విసర్జన చేయవలసిన అవసరం ఉండదు .  నిద్రకు కూడా ఆటంకం కలగదు. నిద్రవేళకు ముందు ఒకసారి మూత్ర విసర్జనకు వెళ్లి రావాలి. ఇలా చేయడం వల్ల గాఢ నిద్ర నుండి మళ్లీ మళ్లీ మేల్కొనే అవసరం ఉండదు. ప్రెగ్నెన్సీ సమయంలో ఎప్పుడూ వీపుపై నేరుగా పడుకోకూడదు.  కుడి లేదా ఎడమ వైపున నిద్రించడానికి ప్రయత్నించాలి.  మనకు వెన్నుపాము పైన రక్త నాళాలు ఉంటాయి.  దానిపై కడుపులో శిశువు నెమ్మదిగా  పెరుగుతుంటాడు. వెల్లికిలా పడుకోవడం వల్ల నాళాలపై ఒత్తిడి ఏర్పడుతుంది.  దీని కారణంగా శిశువుకు రక్త సరఫరా ఆగిపోతుంది. అంతేకాదు గర్భవతుల కాళ్లు  గుండెకు రక్త సరఫరా కూడా ఆగిపోతుంది. అదే ఒకవైపుకు తిరిగి పడుకోవడం ద్వారా పిల్లల మొత్తం బరువు రక్తనాళాలపై పడదు. దాని కారణంగా కడుపులో బిడ్డ పెరుగుదల బాగుంటుంది.                                             *రూపశ్రీ.

గ్యాస్ లైటింగ్..మహిళల జీవితాలను ఊబిలోకి తోసే ఈ సమస్య గురించి తెలుసా!

గ్యాస్ లైటింగ్..మహిళల జీవితాలను ఊబిలోకి తోసే ఈ సమస్య గురించి తెలుసా! ఈ ప్రపంచంలో ప్రతి మనిషి భిన్నంగా ఉంటాడు.  మరీ ముఖ్యంగా మహిళల స్వభావం, పురుషుల స్వభావం కూడా భిన్నంగా ఉంటుంది.  చాలా మంది మహిళలు తమ జీవితంలో వివాహం అయ్యాక.. భర్త  ప్రేమ దొరికితే చాలని, భర్తతో ప్రేమగా ఉంటే చాలని తాపత్రయ పడుతూ ఉంటారు. కేవలం భర్త జీవితంలో ఉంటే అదే తమ జీవితానికి తగిన గుర్తింపు అని కూడా అనుకుంటూ ఉంటారు. ఇలాంటి ఆలోచనలతో చాలామంది మహిళలు గ్యాస్ లైటింగ్ బారిన పడుతూ ఉంటారు. ఈ సమస్య కారణంగా చాలామంది మహిళలు తమకు ఈ జీవితం వద్దని అనిపిస్తూ ఉంటుంది.. కానీ దాన్నుండి బయటపడి వెళ్లలేని బలహీనత కూడా వారిలో  ఉంటుంది.  సంబంధాలలో చిక్కుకుపోయి ఊబిలోకి దిగబడిపోయి, ఊపిరాడని ఫీలింగ్ ను అనుభవిస్తూ ఉంటారు. ఇదంతా కూడా గ్యాస్ లైటింగ్ వల్లనే సంభవిస్తుంది.  అసలు గ్యాస్ లైటింగ్ అంటే ఏమిటి?  మహిళల మీద గ్యాస్ లైటింగ్ కు పాల్పడే మగవాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుంది? గ్యాస్ లైటింగ్ బారిన పడిన మహిళలు ఏ పరిస్థితులు ఎదుర్కుంటూ ఉంటారు? అన్ని విషయాలు వివరంగా తెలుసుకుంటే.. గ్యాస్ లైటింగ్.. మానసిక మోసం.. ఈ రోజుల్లో   భార్యాభర్తల బందాలలో ఎక్కువగా గ్యాస్‌లైటింగ్‌కు గురవుతున్నారు, కానీ ఇది ఎందుకు జరుగుతుందో లేదా దానిని ఎలా తగ్గించుకోవాలో వారికి అర్థం కావడం లేదు. ఇది ఒక రకమైన మానసిక మోసం, ఇది భాగస్వామిని తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేస్తుంది. కేవలం మహిళలు మాత్రమే కాకుండా కొన్ని చోట్ల మగవాళ్లు కూడా ఈ గ్యాస్ లైటింగ్ బారిన పడుతూ ఉంటారు. గ్యాస్ లైటింగ్ కు పాల్పడే వారి లక్షణాలు.. గ్యాస్ లైటింగ్ అనేది వైవాహిక బంధంలో భాగస్వామిని మానసికంగా బాధపెట్టే ప్రవర్తన. ఇందులో నేరుగా మనిషిని బాధించడం లేదా నియంత్రించడం అనేవి ఉండవు. కానీ కొన్ని సంఘటనలు, సందర్బాలను అవకాశంగా తీసుకుని భాగస్వామిని బాధపెట్టడం, వేధించడం, ఒత్తిడికి గురి చేయడం జరుగుతుంది. అలాంటి వారిలో కొన్ని లక్షణాలు ఉంటాయి.  ఆ లక్షణాలేంటంటే.. అతిగా స్పందించడం.. భాగస్వామి చిన్న విషయాలకే అతిగా స్పందించడం, అర్థం లేని మాటలు మాట్లాడటం చేస్తుంటే.. వారితో రిలేషన్ లో ఉన్న వారు  గ్యాస్ లైటింగ్‌ను ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఇది  వారితో రిలేషన్ లో ఉన్న వారి  ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. తప్పు అని నిరూపించడం.. మీ భాగస్వామి అందరి ముందు మీరు చెప్పేది తప్పు అని నిరూపించడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటే, మీరు గ్యాస్‌లైటింగ్‌కు గురవుతూ ఉండవచ్చు. కొంతమంది తమ భాగస్వాములపై పూర్తిగా ఆధారపడతారు, దీనిని వారు తమకు అనుకూలంగా వాడుకోవచ్చు. ఏం చేసినా తమను దాటి వెళ్లలేరు అనే కారణంతో వారిని అకారణంగా దోషులుగా, తప్పుచేసిన వారిగా నిలబెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అనుమానం.. మీ భాగస్వామి మిమ్మల్ని పదేపదే అనుమానిస్తూ ఉంటే లేదా మీకు చెప్పిన విషయాలను మర్చిపోవడం ప్రారంభిస్తే, మీరు 'గ్యాస్‌లైటింగ్'కు గురవుతున్నారని అర్థం. ఈ విషయాన్ని అర్థం చేసుకుని  కాలక్రమేణా ఈ సంబంధం నుండి బయట పడటం, అలాంటి వ్యక్తుల గురించి ఆలోచించడం మరిచిపోయి ముందుకు సాగడం చాలా ముఖ్యం.అలా చేయకపోతే వారి చేతిలోనే జీవితం నాశనమైపోతుంది. వారి స్వార్థం కోసం వారు ఎంత బాధపెట్టడానికి అయినా వెనుకాడరు. కరెక్ట్ గా ఉన్న క్షమాపణ డిమాండ్.. చాలామందిలో ఒక శాడిజం ఉంటుంది.  తమ భాగస్వామి పదే పదే క్షమాపణలు చెబుతూ ఉంటే తమని తాము గొప్పవాళ్లమని,  వైవాహిక బంధంలో తమదే ఆధిపత్యం అని భావించుకుంటూ సంతోషపడం చేస్తుంటారు. ఇలాంటి వారు తప్పు జరగడం అనే విషయం పక్కన పెడితే.. భాగస్వామి మాట్లాడేది,  చేసేది కరెక్ట్ గానే ఉన్నా సరే.. వారు క్షమాపణ చెప్పాలని కోరుకుంటారు.  ఇందుకోసం చాలా కఠినంగా ప్రవర్తిస్తారు కూడా.  చాలావరకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటారు. నిర్లక్ష్యం.. కొంతమంది మగవారికి ఇంటి పని,  అవసరమైనప్పుడు భార్య గుర్తుకువస్తుంది. ఇతర విషయాలు  ఏవైనా సరే.. వారికి భార్య గుర్తుకు ఉండదు.  అసలు భార్య గురించి ఆలోచించరు కూడా.  గ్యాస్ లైటింగ్ ద్వారా భార్యలను నియంత్రణ చేస్తూ తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంటారు.  ఒకవేళ భార్యలు భర్త ప్రవర్తనను అర్థం చేసుకుంటే.. ఇలాంటి మగవారు బార్యలను చాలా సులువుగా, ఎలాంటి కారణాలు లేకపోయినా సరే.. కావాలని గొడవలు సృష్టించి మరీ భార్యలను మోసం చేసి వదిలేస్తారు.                                   *రూపశ్రీ.

రోజూ 8 నుండి 9 గంటల పాటు హైహీల్స్ ధరించే మహిళలకు షాకింగ్ న్యూస్.. ఇదెంత డేంజరో తెలుసా?

రోజూ 8 నుండి 9 గంటల పాటు హైహీల్స్ ధరించే మహిళలకు షాకింగ్ న్యూస్.. ఇదెంత డేంజరో తెలుసా? ఈ రోజుల్లో హీల్స్ ధరించడం ఫ్యాషన్‌గా ఉండటమే కాకుండా ఒక స్టైల్ స్టేట్‌మెంట్‌గా కూడా మారింది. పార్టీల నుండి ఆఫీసు వరకు, మహిళలు స్టైలిష్‌గా కనిపించడానికి గంటల తరబడి హీల్స్ ధరిస్తారు. ముఖ్యంగా కార్పోరేట్ ఉద్యోగాలు చేసే మహిళలు హీల్స్ ధరించడం చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఎక్కువ సేపు హీల్స్ ధరించడం వల్ల ఆరోగ్యానికి హానికరమైన ప్రభావాలు కలుగుతాయి, ఇవి నేరుగా మోకాళ్లపై ప్రభావం చూపుతాయి. ఎక్కువ సేపు హైహీల్స్ ధరించడం వల్ల శరీరానికి కలిగే హాని గురించి వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు.  అసలు ఎక్కువ  సేపు హీల్స్ ధరిస్తే జరిగేదేంటి? వైద్యులు ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే.. మోకాళ్లపై ఒత్తిడి.. వైద్యుల ప్రకారం ప్రతిరోజూ ఎక్కువసేపు హీల్స్ ధరించడం వల్ల శరీర సమతుల్యత, నడక తీరు మారి, మోకాళ్లపై మరింత ఒత్తిడి పడుతుంది. మోకాళ్లపై ఈ పెరిగిన ఒత్తిడి స్నాయువులు, కండరాలపై భారాన్ని పెంచి, మోకాళ్ల నొప్పి, బిగుసుకుపోవడానికి దారితీస్తుంది. నొప్పి, బిగువు.. ఎక్కువ సేపు హీల్స్ ధరించడం వల్ల తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు. మొదట్లో అవి తేలికపాటి నొప్పిని,  బిగుతును కలిగించవచ్చు, కానీ క్రమంగా తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. నిరంతర ఒత్తిడి వల్ల కీళ్ల మృదులాస్థి అరిగిపోయి, ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కండరాల బలహీనం.. ఎక్కువసేపు హైహీల్స్ ధరించడం వల్ల కండరాలు బలహీనపడతాయి, దీని కారణంగా శరీర బరువు ఒత్తిడి మోకాళ్లపై పడుతుంది. ఇవి గుర్తుంచుకోవాలి.. హైహీల్స్ ధరించేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. 2 నుండి 3 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న హీల్స్ ధరించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. పలుచని హీల్స్ ధరించడం కూడా బాలెన్స్ కు  భంగం కలిగించవచ్చు. మొనదేలిన హీల్స్ పాదాల సహజ కదలికను పరిమితం చేసి, మోకాళ్లపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, తక్కువ ఎత్తు ఉన్న హీల్స్ ధరించాలి. మందపాటి మడమలు లేదా వెడ్జ్ మడమలు ధరించడం మంచిది. రెండు నుండి నాలుగు గంటల కంటే ఎక్కువసేపు హీల్స్ ధరించడం మానుకోవాలి. హీల్స్ తీసివేసిన తర్వాత  పాదాలను సాగదీయాలి.  ఇది పాదాలకు రిలాక్సేషన్ ఇస్తుంది.                           *రూపశ్రీ.

ప్రపంచంలో మొట్టమొదటి మహిళా డాక్టర్.. 205ఏళ్ల క్రితం ఈమె జీవితం అంతా పోరాటమే..!

ప్రపంచంలో మొట్టమొదటి మహిళా డాక్టర్.. 205ఏళ్ల క్రితం ఈమె జీవితం అంతా పోరాటమే..!   ఆడపిల్ల చదువు అంటే అవాక్కయ్యే కాలం అది.. దాదాపు 205 ఏళ్ల కిందట ఒక మహిళ డాక్టర్ విద్యను అభ్యసించి ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా డాక్టర్ అయ్యింది. అయితే మహిళలను అణిచివేసే ఆ కాలంలో ఆమె ప్రయాణం అంత సజావుగా అయితే సాగలేదు. కానీ ఆమె పోరాడింది.  తన జీవితం అంతా తన పోరాటాన్ని సాగించింది.  "కొత్త ఆలోచనను అంగీకరించాలంటే ఒంటరిగా నిలబడే ధైర్యం అవసరం."  అని ఆమె అంటుంది.  ఆ గొప్ప ప్రేరణే.. ఎలిజబెత్ బ్లాక్ వెల్.. ప్రపంచంలో మొట్టమొదటి మహిళా  డాక్టర్ ఆమె. ఈమె గురించి మరికాస్త  వివరంగా తెలుసుకుంటే.. ప్రపంచ వ్యాప్తంగా గమనిస్తే దాదాపు ఒక 30,  40 ఏళ్ల నుండి ఆడపిల్లల చదువుకు ప్రోత్సాహం లభిస్తోంది.  మరీ ముఖ్యంగా గత 20 ఏళ్ల కాలం నుండే ఇది మెరుగ్గా ఉంది. అంతకు ముందు ఆడపిల్లలకు చదువు ఎందుకు అని అనుకున్న తరం కాస్తా మారి ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అనే దశకు వచ్చింది. కానీ 19 వ శతాబ్దంలో ఆడవాళ్ళ విద్యకు ద్వారాలు పూర్తీగా మూసుకుపోయినప్పుడు ఎలిజబెత్ వైద్యశాస్త్రంలో పట్టా సాధించడమే కాకుండా భవిష్యత్తులో ఎంతో మంది  మహిళలు వైద్యరంగం వైపు వెళ్లడానికి ప్రేరణగా నిలించిది. స్నేహితురాలి కోరికే ఆమె ప్రయాణానికి నాంది.. ఎలిజబెత్ ఫిబ్రవరి 3, 1821న  జన్మించింది. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌లో జన్మించిన ఎలిజబెత్ మొదట్లో డాక్టర్ కావాలని అనుకోలేదు. బదులుగా ఆమె ఉపాధ్యాయురాలిగా వృత్తిని కొనసాగించింది. కానీ ఒక సంఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆమె సన్నిహితురాలు తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడింది. ఆమె చనిపోయే ముందు ఎలిజబెత్‌తో "ఒక మహిళా డాక్టర్ నాకు చికిత్స చేసి ఉంటే, నేను ఇంత బాధపడి ఉండేదాన్ని కాదు."  అని చెప్పింది. స్నేహితురాలి బాధ ఎలిజబెత్  హృదయాన్ని తాకింది.  ఆ క్షణంలోనే ఆమె డాక్టర్ కావాలని నిశ్చయించుకుంది. వైద్యకళాశాల ప్రవేశం.. ఎలిజబెత్ వైద్య కళాశాలలో ఎలా ప్రవేశం పొందిందనేది కూడా ఆసక్తికరమైన కథ. 1847లో ఆమె న్యూయార్క్‌లోని జెనీవా మెడికల్ కాలేజీ (ఇప్పుడు హోబర్ట్ విలియమ్స్)లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకుంది. ఆ సమయంలో మహిళలు వైద్య కళాశాలకు హాజరు కావడం అసాధ్యమని భావించారు.  కళాశాల మేనేజ్మెంట్ కు  ఖచ్చితంగా తెలియకపోవడంతో, వారు విద్యార్థులలో ఓటింగ్ నిర్వహించారు.  విద్యార్థులందరూ దాన్ని చాలా జోక్ గా తీసుకున్నారు.  ఒక మహిళ వైద్య విద్య కోసం రావడం అసంభవం అని అనుకున్నారు.  ఈ కారణంగా వాళ్లందరూ  మహిళ వైద్య విద్య అభ్యసించడానికి తమ సమ్మతి తెలుపుతూ ఓటు వేశారు. దీని తర్వాత మేనేజ్మెంట్ ఎలిజబెత్‌కు ప్రవేశం కల్పించింది. కానీ ఎలిజబెత్ వాస్తవానికి కళాశాలకు వచ్చినప్పుడు కళాశాలలో ఉన్న విద్యార్థులందరూ ఆశ్చర్యపోయారు. వ్యతిరేకత.. ఆ కళాశాలలో ఎలిజబెత్ ఏకైక మహిళ. అందుకే ఆమె ప్రతి అడుగులోనూ వ్యతిరేకతను ఎదుర్కొంది. కానీ ఆమె తన తెలివితేటలతో వారందరి నోళ్లు మూయించింది. 1849లో ఆమె తన తరగతిలో అగ్రస్థానంలో నిలిచి MD డిగ్రీని సంపాదించి, ఆధునిక కాలంలో మొట్టమొదటి మహిళా వైద్యురాలిగా నిలిచింది. కంటి చూపు దూరం.. వైద్య పట్టా పొందిన తర్వాత కూడా ఎలిజబెత్ కష్టాలు ఆగలేదు. వైద్య పట్టా పొందినప్పటికీ ఆమెకు అమెరికాలో ఉద్యోగం దొరకలేదు. ఈ కారణంగా ఆమె లండన్‌కు వెళ్లి మిడ్‌వైఫరీలో శిక్షణ ప్రారంభించింది. అయితే నవజాత శిశువుకు చికిత్స చేస్తున్నప్పుడు, ఆమె కంటిలో ఇన్ఫెక్షన్ ద్రవం వచ్చింది. చికిత్స ఆలస్యం కారణంగా, ఆమె ఒక కంటిలో శాశ్వతంగా దృష్టి కోల్పోయింది. కానీ ఈ అడ్డంకి ఆమె ఉత్సాహాన్ని తగ్గించలేదు. పేదలకు,  మహిళా విద్యకు మద్దతు.. ఒక కంటి చూపు పూర్తిగా కోల్పోయినప్పటికీ, ఎలిజబెత్ తన పట్టుదల వదులుకోలేదు.  ఆమె సోదరి ఎమిలీతో కలిసి 1853లో అమెరికాలో ఒక క్లినిక్‌ను ప్రారంభించింది. వారు దానికి "న్యూయార్క్ డిస్పెన్సరీ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్" అని పేరు పెట్టారు. పేద మహిళలు,  పిల్లలకు మహిళా వైద్యులు చికిత్స చేసే ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి ప్రదేశం. తరువాత 1867లో ఇతర మహిళలకు వివక్షత లేకుండా వైద్యవిద్య  అభ్యసించే అవకాశాన్ని కల్పించడానికి ఆమె మహిళా వైద్య కళాశాలను స్థాపించింది. ఇదీ ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా వైద్యురాలి జీవిత పోరాటం.                                      *రూపశ్రీ.

ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తి రజియా సుల్తానా!

ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తి రజియా సుల్తానా!   స్త్రీ....  అంటే ఓ చైతన్యం. అతివ.. ..అంటే ఓ అపూర్వం.  పడతి.... అంటే ఓ ప్రగతి.  అరచేతిని అడ్డుపెట్టి అరుణోదయాన్ని ఎలాగయితే ఆపలేమో. కట్టుబాట్ల అడ్డుగోడలు, కష్టాల కన్నీళ్ళు, స్త్రీమూర్తిని ఆపలేవు. సాధించాలన్న తపన ...లక్ష్యం చేరాలన్న ఆశయం ..ఆమెను ఆకాశమంత చేస్తాయి. ఆమె వేసే ఒక్కో అడుగు.. వేల మార్పులకు శ్రీకారం.  మహిళామణులు అందరికీ 'మహిళా దినోత్సవ' శుభాకాంక్షలు. 1908 సంవత్సరం మార్చి 8వ తేదీన అమెరికా దేశంలో మహిళలు తమకు ఉద్యోగాలలో సమాన అవకాశాలు, వేతనలు కావాలనీ డిమాండ్ చేస్తూ చేపట్టిన భారీ నిరసన ఉద్యమం చేపట్టారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని పురస్కరించు కొని ప్రతి సంవత్సరం యావత్ ప్రపంచం మార్చి 8 తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సమాన అవకాశాలు, స్వేఛ్చ అందించగలిగితే మహిళలు పురుషులకు మిన్నగా అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. అకాశంలో సగమైన మహిళ ఆత్మగౌరవం కోసం, అభ్యున్నతి కోసం ప్రతీ ఒక్కరు పని చేయడమే నిజమైన నాగరికతగా భావించాలి  గృహిణిగా, శ్రమజీవిగా, ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా, అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నా ఆమెకు తగిన గుర్తింపు రావడం లేదు. ఇప్పటికీ సమాన పనికి సమాన వేతనం దక్కడం లేదు. ప్రజాప్రతినిధులుగా స్థానం సంపాదించినా భర్తల చేతిలో కీలుబొమ్మలుగానే ఉన్నారు. మహిళల సమానత్వం ప్రచార ఆర్భాటాలకే తప్ప ఆచరణలో కానరావడం లేదు. నేటికీ మహిళగానూ, శ్రామిక మహిళగానూ, పౌరురాలిగానూ దోపిడీకి గురౌతూనే ఉంది. ఇన్ని సమస్యలున్నా కొందరు విజయం వైపు దూసుకెళ్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.  సృష్టికి మూలం ఆడది. అసలు ఆడదే లేకపోతే సృష్టే లేదు. అంతటి మహోన్నత ప్రశస్తి కలిగిన మహిళ నేటి ప్రస్తుత నవ సమాజంలో అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. సాటి సభ్య సమాజాన్ని చూసి ఆమె కన్నీరు పెడుతుంది..! ఆడపిల్ల పుట్టిందంటేనే భారంగా భావించే రోజులు దాపురించాయి. అసలు బయటి ప్రపంచాన్ని చూడకుండానే అసువులు బాసిన ఆడపిల్లలు కోకొల్లలు. ఏ దేశంలో లేని దుస్థితి మన దేశంలో ఎందుకు..? ఆడపిల్లని కనడం, చదివించడం, పెళ్లి చేయడం లాంటి తదితరాలన్నింటినీ భారంగా భావించే తల్లిదండ్రులు మన దేశంలో ఎందరో..! అసలు ఆడపిల్ల పుట్టిందంటేనే అదో పెద్ద శిక్షగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆడపిల్లల సంఖ్య రోజురోజుకూ క్షీణిస్తుంది.  భారత  రాజ్యాంగం భారతీయ మహిళలందరికీ సమానత్వం (ఆర్టికల్ 14), రాష్ట్రాలనిబట్టి ఎటువంటి వివక్షా చూపించకుండా ఉండడం (ఆర్టికల్ 15 (1) ), అవకాశంలో సమానత్వం (ఆర్టికల్ 16), సమాన పనికి సమాన జీతం (ఆర్టికల్ 39 (డి) ) మొదలైన హామీల నిస్తున్నది. రాష్ట్రాలు స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక సదుపాయాలను అందించే వీలు కలుగజేస్తుంది (ఆర్టికల్ 15 (3)). మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలను త్యజించాలని (ఆర్టికల్ 51 (ఎ) ) సూచిస్తోంది. అలాగే స్త్రీలకు ప్రసూతి సెలవలు ఇవ్వడానికి, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడాన్ని అనుమతిస్తుంది. (ఆర్టికల్ 42).   ఆదర్శాలకీ వాస్తవాలకూ మధ్య చాలా సందర్భాల్లో పొంత్యన కుదరదన్న విషయాన్నే దేశంలో ఎల్లెడలా పరుచుకుపోయిన అసమానతలు చాటుతున్నాయి. వివిధ రంగాల్లో స్త్రీ పురుషుల మధ్య సామానత్వ సాధనలో ఏఏ దేశాలు ఎంతెంత వెనకబడి ఉన్నాయో ఆ నివేదిక కళ్లకు కడుతుంది. 2017 చివర్లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం మొత్తం 145దేశాల పరిస్థితులను విశ్లేషిస్తే భారత్  108వ స్థానంలో ఉంది. ఆర్ధిక భాగస్వామ్యంలో 139, విద్యలో 125, వైద్యం, ఆరోగ్యంలో 143 వ స్థానాన్ని ఆక్రమించింది. సమానత్వ సూచీలో పేర్కొన్న గణాంకాల ప్రకారం 145 దేశాల్లో ఏ ఒక్కటీ స్త్రీ పురుష అంతరాలను తగ్గించడంలో వంద శాతం విజయం అందించలేదు.  ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ వంటి దేశాలు 80 శాతం వరకు అధిగమించి సమానత సాధన దిశలో ముందు వరసల్లో ఉన్నాయి. బలమైన ఆర్ధిక వ్యవస్థలున్న సమాజాలు సమానత్వ సాధనలో వెనకబడిపోవడానికి మహిళా శక్తిని గుర్తించలేకపోవడంతో పాటు పాతుకుపోయిన పురుషాధిక్య భావజాలమూ ప్రధాన కారణమే. భారత్‌లో మహిళలు పురుషులతో పోలిస్తే రోజూ అయిదు గంటల పాటు ఎలాంటి ప్రతిఫలం లభించని పని చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. పని విభజనలో తారతమ్యం ఏ దేశంలోనూ ఈ స్థాయిలో ఉండదు. ఆర్ధిక సాధికారతలో వెనకబాటుకు ప్రధాన కారణమదే. మహిళా యాజమాన్యంలోని సంస్థలు అతి తక్కువ శాతం ఉన్నదీ భారత్ లోనే.  ప్రపంచవ్యాప్తంగా గడిచిన పదేళ్లలో మహిళా కార్మిక శక్తి 150 కోట్ల నుంచి 175 కోట్లకు పెరిగింది. కానీ మహిళల వార్షిక వేతనం చూస్తే ప్రస్తుతం స్త్రీలు సంపాదిస్తున్న జీతం పదేళ్ల క్రితం పురుషుడు సంపాదించిన దానితో సమానం. ప్రగతి బాటలో స్త్రీ పురుషుల మధ్య అంతరం తగ్గుతూ పోయిన కొద్దీ జీడీపీ పెరుగుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ రంగంలో అంతరాలను అధిగమించిన దేశం సుసంపన్నం అవుతోంది.  భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్ లో "అనసూయా సారాభాయ్ -టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌" అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్‌, విమలారణదివే, కెప్టెన్‌ లక్ష్మిసెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖులు.. కొన్ని సహస్రాబ్దులు గా  భారత దేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది.  ఆధునిక భారతదేశంలోమహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించి దేశ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడింపచేసారు. పతంజలి, కాత్యాయనుడు వంటి ప్రాచీన భారత వ్యాకరణకర్తల రచనల ప్రకారం, వేదకాలపు ఆరంభంలో మహిళలు చదువుకోనేవారని తెలుస్తోంది. ఆ సమయంలో మహిళలు యుక్తవయస్సులో పెళ్ళి చేసుకోనేవారని, వారు భర్తను ఎన్నుకొనే హక్కుని కలిగి ఉండేవారని ఋగ్వేద శ్లోకాలు తెలుపు తున్నాయి. తరువాత (సుమారుగా 500 బి.సి.) నుండి మహిళల హోదా తగ్గడం మొదలయ్యింది  మధ్యయుగ సమాజంలో మహిళల స్థాయి ఇంకా దిగజారింది.   కొంత  మంది మహిళలు రాజకీయ, సాహిత్యం, విద్య, మత రంగాలలో రాణించారు. రజియా సుల్తానాఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తి.  గోండు రాణి దుర్గావతి పదిహేనేళ్ళు పరిపాలన సాగించింది. ఆమె మొఘల్ చక్రవర్తి అక్బర్ ను ఎదుర్కొంది. అక్బర్ ను  1590లో చాంద్ బీబీ ఎదుర్కొని అహ్మద్ నగర్‌ను రక్షించింది.  జహంగీర్ భార్య నూర్జహాన్  సార్వభౌమ అధికారాన్ని ప్రతిభావంతంగా చెలాయించి మొఘల్ మకుటం వెనుక ఉన్న నిజమైన శక్తిగా గుర్తింపు పొందింది.  మొఘల్ యువరాణులు జహనారా, జేబున్నీసాలు మంచి పేరున్న రచయిత్రులు.  శివాజీ తల్లి జిజియాబాయి యోధురాలిగాను, పాలకురాలి గానూ చాటుకున్న సమర్థత వలన సమర్ధురాలైన రాణిగా గణుతి కెక్కింది.  దక్షిణ భారతంలో చాలామంది మహిళలు గ్రామాలు, పట్టణాలు, మండలాలను పాలించారు. అనేక సామాజిక, మత సంస్థలకు ఆద్యులయ్యారు. భక్తి ఉద్యమం మహిళల హోదాని తిరిగి నిలపడానికి ప్రయత్నించి కొన్ని రకాల అణిచివేతలను అడ్డుకుంది. మీరాబాయి అనే ఒక మహిళా సాధు కవయిత్రి భక్తి ఉద్యమపు ముఖ్య వ్యక్తులలో ఒకరు. ఈ కాలపు ఇతర మహిళా సాధు-కవయిత్రులు అక్క మహాదేవి, రామి జనాభాయి, లాల్ దేడ్.   యూరోపియన్ పరిశోధకులు 19వ శతాబ్దపు భారత స్త్రీలు మిగతా స్త్రీలకంటే "సహజంగా శీలవంతులు", "ఎక్కువ ధర్మపరులు" అని గమనించారు.  బ్రిటిషు పాలన సమయంలో రామ్ మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, జ్యోతిరావు ఫులే మొదలైన సంఘసంస్కర్తలు మహిళా అభ్యున్నతికి పోరాడారు. పండిత రమాబాయి వంటి చాలామంది మహిళా సంస్కర్తలు కూడా మహిళా అభ్యున్నతికి కృషి చేసారు. కర్ణాటకలోని కిట్టుర్ రాజ్య రాణి కిట్టుర్ చెన్నమ్మ బ్రిటిషువారి కాలదోషం పట్టిన సిద్ధాంతాలకి ప్రతిస్పందనగా వారికీ వ్యతిరేకంగా సైన్యాన్ని నడిపించింది. తీరప్రాంత కర్ణాటక రాణి అబ్బక్క రాణి యురోపియన్ సైన్యాల ఆక్రమణలకి ముఖ్యంగా 16వ శతాబ్దంలో పోర్చుగీసు ఆక్రమణలకి ఎదురునిలిచింది. రాణి లక్ష్మీ బాయి ఝాన్సీ రాణి బ్రిటిషువారికి వ్యతిరేకంగా 1857 భారతీయ తిరుగుబాటుని నడిపించింది. ఆమె నేడు జాతీయ హీరోగా భావించబడుతున్నది.  అవద్ సహా-పాలకురాలు బేగం హజ్రత్ మహల్ 1857 తిరుగుబాటును నడిపించిన ఇంకో పాలకురాలు. ఈమె బ్రిటిషువారితో ఒప్పందాలని నిరాకరించి తరువాత నేపాల్ కి వెళ్ళిపోయింది. మహిళలు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యపాత్ర పోషించారు. కొంతమంది ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాళ్ళు భికాజి కామా, డా. అనీ బిసెంట్, ప్రీతిలత వడ్డేదార్, విజయలక్ష్మి పండిట్, రాజకుమారి అమ్రిత్ కౌర్, అరుణ అసఫ్ ఆలీ, సుచేత కృపలానీ, కస్తుర్బా గాంధీ. మరికొందరు ముఖ్యులు ముత్తులక్ష్మీ రెడ్డి, దుర్గాబాయి దేశ్ముఖ్మొదలైనవారు. సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ, లక్ష్మీ సెహగల్ని కెప్టన్‌గా, మొత్తం మహిళలతో కూడిన  ది రాణి అఫ్ ఝాన్సీ రెజిమెంట్ ను ఏర్పాటు చేసింది. కవయిత్రి, స్వాతంత్ర్య సమర యోధురాలూ అయిన సరోజినీ నాయుడు, భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ. భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నరయిన మొదటి మహిళ కూడా. నేటి భారతీయ మహిళ విద్య, రాజకీయాలు, మీడియా, కళలు, సంస్కృతీ, సేవా విభాగాలు, విజ్ఞాన, సాంకేతిక రంగాలు వంటి అన్ని రంగాలలో పాల్గొంటోంది. పదిహేనేళ్ళపాటు భారతదేశపు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ ప్రపంచంలో ప్రధానమంత్రిగా ఎక్కువకాలం పని చేసిన మహిళ. ఈదేశంలో  మనం కొందరు   మహిళలు గురించి తెలుసుకోవాలి.. జాన్ ఇలియట్ డ్రింక్ వాటర్ బెతూనే 1849లో బెతూనే స్కూల్ ప్రారంభించింది, ఇది 1879లో బెతూనే కళాశాలగా వృద్ధి చెంది భారతదేశంలో మొదటి మహిళా కళాశాల అయింది. 1883 లో చంద్రముఖి బసు,  కాదంబినీ గంగూలీ బ్రిటిషు సామ్రాజ్యపు మొదటి మహిళా పట్టభధ్రులయ్యారు. కాదంబినీ గంగూలీ, ఆనందీ గోపాల్ జోషి భారతదేశమునుండి పాశ్చాత్యవైద్యంలో శిక్షణ పొందిన మొదటి మహిళలు. 1905 లో సుజన్నే ఆర్ డి టాటా కారు నడిపిన మొదటి భారతీయ మహిళ. 1916 జూన్ 2న సంఘసంస్కర్త  దొండో కేశవ్ కార్వేగారిచేత కేవలం ఐదుమంది విద్యార్థులతో మొదటి మహిళా విశ్వవిద్యాలయం SNDT మహిళా విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1917 లో అన్నే బిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలయింది. 1919 లో ఆమె విలక్షణమైన సామజిక సేవకు గుర్తింపుగా పండిత రమాబాయి బ్రిటీష్ రాజ్ నుంచి కైజర్-ఇ-హింద్ పురస్కారం పొందిన మొదటి మహిళ. 1925 లో సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్కి భారతదేశంలో పుట్టిన మొదటి మహిళా అధ్యక్షురాలు. 1944 లో భారతీయ విశ్వవిద్యాలయంనుంచి సైన్స్ డాక్టరేట్ అందుకున్న మొదటి మహిళ అసిమా చటర్జీ. 1947 ఆగస్టు 15 స్వతంత్రం తరువాత సరోజినీనాయుడు యునైటెడ్ ప్రావిన్సులకి గవర్నర్ అయింది, ఈవిడ భారతదేశపు మొదటి మహిళ గవర్నరు. 1951లోడెక్కన్ ఎయిర్వేస్ కు చెందినా ప్రేమ మాథుర్ భార్తదేశపు మొదటి మహిళా వాణిజ్య పైలట్. 1953లో  విజయలక్ష్మి పండిట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా అధ్యక్షురాలు  (మొదటి భారతీయ)  1959లో  అన్నా చండీ హైకోర్టుకి మొదటి మహిళా జడ్జ్ (కేరళ హై కోర్టు)  1963లో  సుచేత కృపలానీ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయి, భారతదేశంలోని ఏ రాష్ట్రములోనైనా ఆస్థాయిని పొందిన మొదటి మహిళ అయ్యారు. 1966 లో  కేప్టన్ దుర్గ బెనర్జీ ఒక రాష్ట్ర ఎయిర్లైన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్ కి పైలట్ అయిన మొదటి భారతీయ మహిళ. 1966లో  కమలాదేవి చటోపాధ్యాయ  వర్గ నాయకత్వానికిగానూ రామన్ మెగాసస్సే పురస్కారం గెలుచుకున్నారు. 1966లో ఇందిరాగాంధీ భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి. 1970లో కమల్జిత్ సందు ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ. 1972లో  కిరణ్ బేడి ఇండియన్ పోలీస్ సర్వీస్ కి ఎన్నికయిన మొదటి మహిళా అభ్యర్థి. 1979లో  మదర్ థెరిస్సా నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా పౌరురాలు. 1984 మే 23న బచేంద్ర పాల్ మౌంట్ ఎవరెస్ట్ను  అధిరోహించిన మొదటి మహిళ అయ్యారు. 1989 లో జస్టిస్ ఎం.ఫాతిమా బీవీ సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాకి మొదటి మహిళా జడ్జ్ గా ఎన్నికయ్యారు. 1997లో కల్పనా చావ్లా గగనంలోకి వెళ్ళిన మొదటి భారత జన్మిత మహిళ. వీరందరి స్ఫూర్తితో మన సోదరీమణులు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...💐💐💐

మహిళలు మహారాణి లాంటి జీవితం పొందాలన్నా.. పేదరికంలో మగ్గిపోవాలన్నా ఈ 5 విషయాలే డిసైడ్ చేస్తాయ్..!

మహిళలు మహారాణి లాంటి జీవితం పొందాలన్నా.. పేదరికంలో మగ్గిపోవాలన్నా ఈ 5 విషయాలే డిసైడ్ చేస్తాయ్..! ప్రపంచంలో అందరు  వ్యక్తుల జీవితం ఒకేలా ఉండదు. ఇందులో మహిళల జీవితం మినహాయింపేమీ కాదు. కానీ సరిగా గమనిస్తే.. బాగా ఆలోచిస్తే.. ప్రారంభం ఎలా ఉన్నా.. కాలంతో పాటు ఎదిగి సాధారణ మహిళలు కూడా మహారాణుల్లా గొప్ప స్థానానికి ఎదిగిన వారు ఉన్నారు.  గొప్ప జీవితంతో తమ ప్రయాణం మొదలుపెట్టి పాతాళానికి పడిపోయి పేదరికంతో పోరాడుతున్న మహిళలు కూడా ఉన్నారు.  ఇదంతా ఎందుకు జరుగుతుంది? మహిళల జీవితాలను నిర్ణయించే విషయాలు ఏంటి? కేవలం 5 విషయాలు మహారాణుల్లా గొప్ప స్థానాలు ఇవ్వగలవు, పేదరికంలోనూ ముంచేయగలవు.. అవేంటి? తెలుసుకుంటే.. కష్టం, సోమరితనం.. కష్టపడి పనిచేసే స్త్రీకి ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా అధిగమించే సామర్థ్యం ఉంటుంది. మహిళలలోని అంకితభావం, కృషి,  పట్టుదల ఆమెకు గౌరవాన్ని,  విజయాన్ని,  శ్రేయస్సును తెస్తాయి. సోమరితనం  స్త్రీని వెనక్కి నెట్టివేస్తుంది.  పురోగతికి ప్రధాన అడ్డంకిగా మారుతుంది. సోమరితనం ఎదుగుదల, విశ్వాసం,  ఏదైనా నేర్చుకోవడం  లేదా సాధించడం అనే లక్ష్యాలకు   అతిపెద్ద శత్రువుగా మారుతుంది. పొదుపు, దుబారా.. ఒక కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నా, మంచి స్థాయిలో ఉండాలన్నా అందులో స్త్రీల పాత్ర చాలా కీలకం.    డబ్బు విలువను అర్థం చేసుకుని తెలివిగా పొదుపు చేసే స్త్రీలు తమ కుటుంబం ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకోగలుగుతారు.  కానీ ఆడవాళ్లకు   దుబారా అలవాట్లు ఉంటే ఆమె జీవితమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి స్త్రీలు  కుటుంబం పతనం కావడానికి, ఆర్థిక కష్టాలు అనుభవించడానికి కారణం అవుతారు. మోసం, నిజాయితీ.. నిజాయితీ అనేది ప్రతి సంబంధానికి బలమైన పునాది.   నిజాయితీపరులైన స్త్రీ సమాజంలో గౌరవాన్ని పొందుతుంది. దీనికి విరుద్ధంగా అబద్ధాలు చెబుతూ  ఉంటే వారి మోసం  సంబంధాలను బలహీనపరచడమే కాకుండా జీవితంలో బాధ, ఒత్తిడి,  అపనమ్మకాన్ని కూడా పెంచుతాయి. ఓర్పు, కోపం.. ఓర్పు,  సంయమనం స్త్రీకి ఉన్న గొప్ప బలాలుగా భావిస్తారు. ప్రశాంతమైన మనస్సుతో ఏ పరిస్థితినైనా నిర్వహించగల స్త్రీ ఎలాంటి పరిస్థితిలోనైనా విజయం సాధిస్తుంది,  బలమైన సంబంధాలను కొనసాగిస్తుంది. దీనికి విరుద్ధంగా, తొందరగా కోపం తెచ్చుకునే స్త్రీలు సంబంధాలలో విభేదాలు, గొడవలు రావడానికి కారణం అవుతుంది.  ఎక్కువ కోపం, తొందరగా కోపం వచ్చే స్త్రీల జీవితం ఒత్తిడి,  సమస్యలతో నిండిపోతుంది. నేర్చుకోవడం,  స్తబ్దత.. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇష్టపడుతూ,  కాలానికి అనుగుణంగా మారుతూ ఉండే స్త్రీలు జీవితంలో అన్ని విధాలా అభివృద్ది చెందుతూ ఉంటారు. నేర్చుకునే అలవాటు మహిళలను ప్రతి రంగంలోనూ బలంగా, విజయవంతం అయ్యేలా చేస్తుంది.  నేర్చుకోవడం పట్ల ఆసక్తి లేకుండా కేవలం తిని కూర్చుకొంటూ ఎంజాయ్ చేయాలనే మహిళలు వెనుకబడిపోతారు.                                              *రూపశ్రీ.

ఆడవాళ్లు ఇంటి నుండే డబ్బు సంపాదించడానికి భలే మార్గాలు..!

ఆడవాళ్లు ఇంటి నుండే డబ్బు సంపాదించడానికి భలే మార్గాలు..! నేటికాలంలో ఆడవారు ఆర్థిక స్వాతంత్ర్యం కలిగి ఉండాలని అనుకుంటారు. అది వారి సొంత ఖర్చుల కోసమైనా కావచ్చు, తమ కుటుంబాన్ని ఆర్థికంగా బలపరిచేందుకు అయినా కావచ్చు.  డబ్బు సంపాదించాలని కోరుకుంటారు.  అయితే కొందరు బయటకు వెళ్లి ఉద్యోగాలు చేస్తారు, మరికొందరు ఇంటి నుండే ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. కానీ బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయలేక, ఇంటి నుండి ఉద్యోగం చేసే అవకాశం లేని వారు చాలా మంది ఉంటున్నారు. పిల్లలను చూసుకోవడానికి లేదా సరైన అవకాశాలు లేక ఇంటిపట్టున ఉండే మహిళలు చాలా మంది ఉన్నారు. ఇంటిపట్టునే ఉంటూ ఏదో ఒక వర్క్ చేస్తూ డబ్బు సంపాదించాలనే ఆశ మాత్రం చాలామందిలో ఉంటుంది.  అలాంటి మహిళల కోసం ఇంటి నుండి వర్క్ చేసేందుకు అద్బుతమైన సంపాన మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. కంటెంట్ రైటింగ్.. చదవడం, రాయడం అనే హాబీ ఉన్న ప్రతి ఒక్కరు కంటెంట్ రైటర్ గా మారవచ్చు.  బ్లాగులు రాయడం, వెబ్‌సైట్లకు ఆర్టికల్స్ రాయడం, యూట్యూబ్ ఛానెల్స్ కు స్క్రిప్ట్ లు రాయడం వంటివి చేయవచ్చు. వీటి వల్ల ఆదాయం కూడా బాగుంటుంది. ఆన్ లైన్ ట్యూటరింగ్.. చాలా మంది ఆన్లైన్ ట్యూటరింగ్ ద్వారా తమకు బాగా వచ్చిన సబ్జెక్ట్ ను బోధిస్తుంటారు.  బ్యాచుల ప్రకారం క్లాసులు తీసుకుని బోధించడం వల్ల మంచి సంపాదన కూడా ఉంటుంది. కేవలం పిల్లలకు బోధించడమే కాదు.. ఆన్లైట్ లో డాన్స్,  కుకింగ్, మ్యూజిక్ వంటివి ఏవైనా బోధించవచ్చు. సోషల్ మీడియా మేనేజ్మెంట్.. సోషల్ మీడియా గురించి మంచి అవగాహన,  తాజా ట్రెండ్స్ గురించి తెలిస్తే పార్ట్ టైమ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ వర్క్ కూడా చేయవచ్చు. డేటా ఎంట్రీ.. డేటా ఎంట్రీ వర్క్ ను ఇంటి నుండే సులభంగా చేయవచ్చు. రోజులో కొన్ని గంటలు డేటా ఎంట్రీ వర్క్ కోసం కేటాయిస్తే సరిపోతుంది. దీని నుండి ఆదాయం కూడా బాగానే ఉంటుంది. గ్రాఫిక్ డిజైనింగ్.. ఈరోజుల్లో వెబ్లైట్లు,  యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మొదలైన వాటికి గ్రాఫిక్ డిజైనర్ల అవసరం చాలా ఉంటోంది. దీనిని కాన్వా లో లేదా ఇతర గ్రాఫిక్ డిజైనింగ్ సైట్లలో ప్రారంభించి ఫ్రీలాన్సింగ్ ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. యూట్యూబ్.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా డబ్బులు సంపాదించడం ఇప్పట్లో చాలా ఎక్కువ అయిపోయింది. వంట చేయడం,  పాటలు పాడటం,  డాన్స్,  బ్యూటీ టిప్స్, ఏదైనా ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పడం.. ఇలా యూట్యూబ్ లో సంపాదించడానికి ఒక ప్రత్యేకమైన విషయం అంటూ ఏదీ లేదు.  విభిన్నంగా ప్రెజెంట్ చేస్తూ వీక్షకులను ఆకర్షిస్తూ ఉంటే సంపాదన సులువే. టైలరింగ్.. టైలరింగ్ చేసే మహిళలు కేవలం లోకల్ గానే తమకు పని ఉంటుందని అనుకుంటారు. కానీ ఇన్స్టాగ్రామ్,  వాట్సాప్,  మీషో, ఫ్లిప్కార్ట్ లలో తాము సొంతంగా డిజైన్ చేసిన దుస్తులను, ఉత్పత్తులను అమ్మడం ద్వారా మెరుగైన సంపాదన సాధ్యమే. లంచ్ సర్వీస్.. ఇంటి బోజనం కావాలనుకునే చాలా మంది ఉద్యోగస్థులు ఉంటారు.  కొందరు ఇంటి బోజనం దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఇంటి నుండి సర్వీస్ ప్రారంభించవచ్చు.  ప్రతిరోజూ కొంతమందికి లంచ్ బాక్స్ పంపడం ద్వారా మంచి ఆదాయం వస్తుంది.                                   *రూపశ్రీ.

సీడ్ సైక్లింగ్.. మహిళలకు ఎంతో ఇంపార్టెంట్..!

సీడ్ సైక్లింగ్.. మహిళలకు ఎంతో ఇంపార్టెంట్..! ప్రతి మహిళ ఏదో ఒక సమయంలో పీరియడ్స్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంది. కొన్నిసార్లు  పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి, కొన్నిసార్లు అవి మిస్ అవుతాయి.  కొన్నిసార్లు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది, అది భరించలేని విదంగా ఉంటుంది.  ఈ సమస్య కేవలం కొంతమంది మహిళలకే పరిమితం కాదు. పెద్ద సంఖ్యలో మహిళలు  పీరియడ్స్‌ సక్రమంగా రాక చాలా  ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది మహిళలు హార్మోన్ల అసమతుల్యతను  ఎదుర్కొంటున్నారు. భారతీయ మహిళల్లో PCOS ఒక సాధారణ హార్మోన్ల సమస్యగా మారింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం భారతదేశంలో 5 మంది యువతులలో ఒకరు   PCOS బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పత్తి వయస్సు గల మహిళల్లో 6 నుండి 13 శాతం మంది PCOSతో బాధపడుతున్నారని WHO నివేదిక సూచిస్తుంది. ఈ మహిళల్లో దాదాపు 70 శాతం మందికి ఈ సమస్య నిర్ధారణ కాలేదు. ప్రపంచవ్యాప్తంగా, ఎనిమిది మంది మహిళల్లో ఒకరు PCOS బారిన పడుతున్నారని అంచనా.. ఇలాంటి మహిళలకు గొప్పగా  సహాయపడేది సీడ్ సైక్లింగ్.. అసలు సీడ్ సైక్లింగ్ అంటే ఏంటి? ఇది మహిళలకు ఎలా సహాయపడుతుంది? తెలుసుకుంటే.. సీడ్ సైక్లింగ్.. సీడ్ సైక్లింగ్ అనేది ఆహారం ఆధారిత వెల్నెస్ ట్రెండ్. ఇది ఋతు చక్రంలో ఉండే  వివిధ దశలను బట్టి  నాలుగు రకాల విత్తనాలను తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మందులు లేకుండా  హార్మోన్లు బాలెన్స్డ్ గా ఉంటూ నెలసరి సమస్యలు రాకుండా ఉండాలంటే  దీన్ని ఫాలో అవ్వడం చాలా మంచిది. ఋతు చక్రంలోని ప్రతి దశకు సరైన పోషకాలను,  అవసరమైన పోషకాలను శరీరానికి అందించడం దీని ప్రధాన ఉద్దేశం. సింపుల్ గా దీన్ని ప్రకృతి వైద్యంగా పరిగణించవచ్చు. సీడ్ సైక్లింగ్ ఎప్పుడు.. ఎలా.. ఋతు చక్రం రెండు భాగాలుగా విభజించబడింది. మొదటి భాగంలో శరీరానికి సరైన మొత్తంలో ఈస్ట్రోజెన్ అవసరం,  రెండవ భాగంలో ప్రొజెస్టెరాన్ అవసరం. ఈ అవసరాలను తీర్చడానికి సీడ్ సైక్లింగ్ ద్వారా విత్తనాలను ఆహారంలో తీసుకోవడం జరుగుతుంది.   నెలసరి వచ్చిన మొదటి రోజు నుండి 14వ రోజు వరకు, అండోత్సర్గము దగ్గర పడుతుంది.  అలాంటప్పుడు  ప్రతిరోజూ అవిసె గింజలు,  గుమ్మడికాయ గింజలను తినాలి. ఈ విత్తనాలలోని పోషకాలు శరీరంలో అదనపు ఈస్ట్రోజెన్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.  ఈస్ట్రోజెన్  తక్కువగా ఉన్నప్పుడు దానికి సపోర్ట్ ఇస్తూ అండోత్సర్గము జరగడానికి సహాయపడతాయి. నువ్వులు,  పొద్దుతిరుగుడు గింజలు 15వ రోజు నుండి తదుపరి నెలసరి వచ్చే వరకు తినాలి.  ఇవి ప్రొజెస్టెరాన్  హార్మోన్‌కు మద్దతు ఇస్తాయి. ఇది ఋతుస్రావాన్ని సకాలంలో తీసుకురావడానికి,  కడుపు నొప్పి, మానసిక స్థితిలో మార్పులు,  రొమ్ము నొప్పి వంటి ప్రీమెన్స్ట్రువల్ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. రెండు దశలలో హార్మోన్లు సమతుల్యంగా ఉన్నప్పుడు  శరీరం చక్రం షెడ్యూల్ ప్రకారం కొనసాగాలని సంకేతాన్ని అందుకుంటుంది. దీని వల్ల  ఋతుస్రావం విధానం మెరుగుపడటం ప్రారంభమవుతుంది. కాబట్టి సీడ్ సైక్లింగ్ ను ఫాలో అవ్వడం వల్ల మహిళలో నెలసరి సమస్యలు చాలా వరకు తగ్గిపోయి.. నెలసరి సజావుగా వస్తుంది.                         *రూపశ్రీ.

గులాబీ మొక్కకు పువ్వులు పూయడం లేదా.. ఈ టిప్స్ పాటిస్తే విరగబూస్తాయి!

గులాబీ మొక్కకు పువ్వులు పూయడం లేదా.. ఈ టిప్స్ పాటిస్తే విరగబూస్తాయి! పువ్వులలో చాలామంది గులాబీ అంటే ఎక్కువ ఇష్టపడతారు. గులాబీ ప్రేమకు సంకేతం.  ప్రతి ఇంట్లో కొన్ని గులాబీ మొక్కలు పెంచుకోవడం చాలామంది అలవాటు. అయితే ఇలా గులాబీ మొక్కలు పెంచేవారిలో చాలా మంది పువ్వులు పూయడం గురించి డిజప్పాయింట్ అవుతారు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా మొగ్గలు వేయడం లేదని కొందరు,  మొగ్గలు వేసినా పువ్వులు పూయడం లేదని మరికొందరు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా శీతాకాలంలో గులాబీలు బాగా పూస్తుంటాయి. కేవలం   కొన్ని టిప్స్ పాటిస్తే గులాబీ మొక్కకు పువ్వులు పూయడం లేదు అనే ప్రశ్నే ఎదురు కాదు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. అరటి తొక్కలే ఎరువు.. గులాబీ చెట్టుక పువ్వులు విరివిగా పూయాలంటే అరటితొక్కలు చక్కని ఎరువుగా పనిచేస్తాయి.  అరటి తొక్కలలో  పొటాషియం సమృద్దిగా ఉంటుంది.  ఇది   గొప్ప సహజ ఎరువుగా పనిచేస్తుంది. గులాబీ మొక్కలకు పువ్వులు పెరగడానికి పెద్ద మొత్తంలో పొటాషియం,  భాస్వరం అవసరం. అరటిపండ్లు తిన్న తర్వాత వాటిని పారవేయకుండా  నల్లగా,  గట్టిగా మారే వరకు 2-3 రోజులు మంచి ఎండలో ఆరబెట్టాలి.  ఆ తరువాత  వాటిని మిక్సర్‌లో  మెత్తగా పొడి చేయాలి. నెలకు ఒకసారి రెండు టీస్పూన్ల పొడిని కుండిలోని మట్టిలో కలపాలి. ఇది పువ్వుల పరిమాణాన్ని రెట్టింపు చేస్తుంది.  రంగు కూడా చాలా మెరుపుగా ఉండేందుకు సహాయపడుతుంది.కావాలంటే ఎండిన తొక్కలను నేరుగా నేలలో పాతిపెట్టవచ్చు. కత్తిరింపు.. శీతాకాలం మొదట్లోనే  గులాబీ మొక్కను తేలికగా కత్తిరించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చనిపోయిన కొమ్మలను,  పసుపు ఆకులను తొలగించాలి. ఎప్పుడూ 45-డిగ్రీల కోణంలో కోతలు చేయాలి. ఇది కొత్త కొమ్మలు వేగంగా పెరుగడానికి సహాయపడుతుంది.  కొత్త కొమ్మలు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా పువ్వులు ఉత్పత్తి చేయవచ్చు. ఫంగస్‌ను నివారించడానికి కోసిన తర్వాత కోసిన ప్రదేశంలో కొద్దిగా పసుపు పొడి ఫంగస్ పట్టకుండా వేపనూనె లేదా వేప కషాయం లాంటివి వేయాలి. సూర్య కాంతి.. గులాబీలు సూర్యరశ్మిని ఇష్టపడతాయి. శీతాకాలంలో సూర్యరశ్మి తగ్గుతుంది కాబట్టి మొక్కను రోజుకు కనీసం 5 నుండి 6 గంటలు ప్రత్యక్ష సూర్యకాంతి పడే చోట ఉంచాలి. మొక్కను నీడలో ఉంచితే అది పువ్వులను కాదు ఆకులను మాత్రమే పెంచుతుంది. తగినంత సూర్యరశ్మి కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇది మొక్కను బలపరుస్తుంది. నీరు.. శీతాకాలంలో నీరు ఎక్కువగా పోస్తారు. ఇది వేర్లు కుళ్ళిపోవడానికి దారితీస్తుంది. గులాబీ నేల ఎల్లప్పుడూ తేమగా ఉండాలి, తడిగా ఉండకూడదు. మట్టిని తాకి, పైభాగం పొడిగా అనిపిస్తేనే నీరు పెట్టాలి. ఉదయం నీరు పోయడం ఎల్లప్పుడూ మంచిది. సాయంత్రం నీరు పెట్టడం వల్ల ఆకులపై తేమ మిగిలిపోతుంది, ఇది బూజు తెగులుకు దారితీస్తుంది. కలుపు, నేల శుభ్రత.. గులాబీ వేర్లు గాలిని అందుకోవడం చాలా ముఖ్యం. వారానికి ఒకసారి కుండలోని మట్టిని 1-2 అంగుళాల లోతు వరకు వదులుగా చేయడానికి ఒక పారను ఉపయోగించాలి. ప్రధాన వేర్లు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి.  రాలిపడిన,చనిపోయిన ఆకులు లేదా పువ్వులను తొలగించాలి. నేలను శుభ్రంగా ఉంచడం వల్ల శీతాకాలపు తెగుళ్ళు,  ఫంగస్ ప్రమాదాన్ని తగ్గుతుంది. టీ ఆకులు,  ఆవాలు.. అరటి తొక్కలతో పాటు, గులాబీలు ఆమ్ల నేలను ఇష్టపడతాయి. ఉపయోగించిన టీ ఆకులను కడిగి ఎండబెట్టి మట్టిలో కలపడం వల్ల నత్రజని లభిస్తుంది. అలాగే ఆవాల నూనెను తీసిన తరువాత వచ్చే పిప్పిని మార్కెట్ లో విక్రయిస్తారు. దీన్ని నీటిలో నానబెట్టి ద్రవ ఎరువును తయారు చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి వేయాలి. ఈ ఎరువు మొక్కకు వెచ్చదనాన్ని అందిస్తుంది. ఎంత చలిలో అయినా పువ్వులు బాగా పూయడానికి సహాయపడుతుంది.                           *రూపశ్రీ.

ఈ అలవాట్లు ఆపకపోతే చిన్న వయసులోనే ముఖం ముసలి వాళ్లలా మారుతుంది..!

ఈ అలవాట్లు ఆపకపోతే చిన్న వయసులోనే ముఖం ముసలి వాళ్లలా మారుతుంది..! అందంగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా.. ఎక్కువకాలం బ్రతకాలని అందరి డ్రీమ్. కానీ నేటి కాలంలో చాలా రకాలుగా సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా చిన్న వయసులోనే వృద్దాప్యం కనిపించడం చాలా మందిని కలతకు గురి చేస్తుంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం, చర్మం ముడతలు పడటం చూస్తూ ఉంటాం.  ఇలాంటి వారు చాలా ఆత్మన్యూనతా భావం కు లోనవుతారు.  కానీ చిన్న వయసులోనే ముఖం మీద ముడతలు, గీతలతో ఇబ్బంది పడుతున్న వారు నేటి కాలంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు.  వీటిని తగ్గించుకోవడానికి చాలా రకాల మార్కెట్ ఉత్పత్తులను ఉపయోగిస్తారు.  కానీ ఫలితం అంతగా ఉండదు. ఇలా చిన్న వయసులోనే ముఖం మీద ముడతలు, గీతలు రావడం రూజువారి చేసే కొమమ్ తప్పుల వల్ల జరుగుతుందట.  ఇంతకీ ఆ  అలవాట్లు ఏంటి? వాటి వల్ల చర్మం ఎందుకు తొందరగా వృద్దాప్యానికి గురి అవుతుంది.  తెలుసుకుంటే..  చర్మం తొందరగా ఎందుకు వృద్దాప్యానికి గురవుతుంది? ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40% మంది యువకులు ఒత్తిడి,  నిద్ర సరిగా లేకపోవడం, సరైన ఆహారం లేకపోవడం వల్ల ముడతలు,  బలహీనత వంటి  ఏర్పడి తొందరగా ముసలి వాళ్లలా కనిపిస్తుంటారు. ఎక్కువ చక్కెర,  ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీర కణాలలో ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల చర్మం ముడుచుకుపోతుంది.  చిన్న వయసులోనే వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి . చిన్న వయసులోనే వృద్దాప్యం కనిపించడానికి కారణమయ్యే అలవాట్లు.. నిద్ర.. ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడుకోవడానికి నిద్ర చాలా అవసరం. కానీ నేటి వేగవంతమైన జీవితాల్లో మంచి నిద్ర కరువవుతోంది.  ప్రతి రాత్రి కనీసం 7 నుండి 9 గంటల గాఢ నిద్ర అవసరం. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఈ హార్మోన్ ఎక్కువగా  ఉండటం వల్ల చర్మ కణాలు దెబ్బతింటాయి, దీని వలన ముఖంపై ముడతలు త్వరగా కనిపిస్తాయి. ఆహారం.. ఆరోగ్యంగా,  యవ్వనంగా ఉండటానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. జంక్ ఫుడ్,  చక్కెర ఆహారాలు చాలా హానికరమైన ఆహారాల లిస్ట్ లో ఉన్నాయి.  ప్రాసెస్ చేసిన ఆహారాలు,  స్వీట్లను అధికంగా తీసుకోవడం వల్ల శరీర కణాలలో గ్లైకేషన్ అనే ప్రక్రియ పెరుగుతుంది. ఈ ప్రక్రియ చర్మం పొడిబారడానికి కారణమవుతుంది,  ముడతలు కనిపించడానికి దారితీస్తుంది. శ్రమ.. నేటి జీవనశైలిలో శారీరకంగా కష్టపడే పనులు ఏమీ లేవు.  కేవలం కూర్చుని చేసే ఉద్యోగాలే ఉన్నాయి.  వీటి వల్ల మానసికంగా ఒత్తిడి ఏర్పడుతుంది.  శారీరక శ్రమ లేకపోవడం వల్ల కండరాలు బలహీనం అయ్యి   అది చిన్న వయసులోనే ముసలితనానికి దారి తీస్తుంది. ఒత్తిడి..  ఒత్తిడి నేటి కాలంలో చాలామంది ఎదుర్కునే పరిస్థితి. అయితే ఎక్కువ  ఒత్తిడికి గురైతే  శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయి పెరుగుతంది.  ఇది చర్మాన్ని ముడతలు పడేలా చేయడం, చర్మం మీద గీతలు రావడం వంటి సమస్యలకు కారణమై చిన్న వయసులోనే ముసలి వాళ్లలా కనబడటానికి కారణం అవుతుంది. పైన చెప్పుకున్న అలవాట్లను మెల్లిగా మానేయడం వల్ల చిన్న వయసులోనే వృద్దాప్య సమస్యను అధిగమించవచ్చు.                              *రూపశ్రీ.  

దీపాలకాంతితో అమ్మాయిల అందం పోటీ పడాలంటే ఇలా చెయ్యాల్సిందే!

దీపాలకాంతితో అమ్మాయిల  అందం పోటీ పడాలంటే ఇలా చెయ్యాల్సిందే!  దీపావళి భారతదేశ ప్రజలందరూ పెద్ద ఎత్తున సంతోషంగా జరుపుకునే పండుగ. అందుకే ఎక్కడ చూసినా ఈ పండుగ వైభవం కనిపిస్తుంది. ఇది హిందూ మతానికి చాలా  ప్రత్యేకమైన పండుగ.   ప్రతి ఏడాది దీన్ని చాలా గొప్పగా  జరుపుకుంటారు. దీపావళి సందర్బంగా ఇళ్లను అలంకరించుకోవడం, ఇంటి ముంగిట రంగురంగుల ముగ్గులు వేయడం , ఇల్లంతా దీపాలు వెలిగించడం వంటివి చేస్తారు.  కొత్త బట్టలు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తారు. ముఖ్యంగా దీపావళి సందర్బంగా  అమ్మాయిలు తమ అందంలో  దీపాల కాంతితో పోటీ పడాలని ప్రయత్నిస్తారు. అయితే  ఈ దీపాల పండుగలో  డిఫరెంట్‌గా కనిపించాలన్నా గులాబీ లాంటి అందంతో మెరిసిపోవాలన్నా ఈ కింది టిప్స్ పాటించాలి.. దీపావళికి ఇంకా ఒకరోజే సమయం ఉంది. ఈ సందర్బంగా  ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌,  మాస్క్‌లను ఉపయోగించడం మంచిది.  కావాలంటే  చర్మానికి సరిపోయే ఫేషియల్ కూడా చేసుకోవచ్చు. దీని వల్ల చర్మానికి లోపల నుండి జీవం వస్తుంది,  ముఖానికి రక్త ప్రసరణ పెరుగుతుంది, ఇది దీపావళి నాటికి  ముఖం మెరిసేలా చేస్తుంది. చాలామంది అమ్మాయిలు  తమ ముఖాన్ని సాధారణ ఫేస్ వాష్‌తో కడగడం ద్వారా శుభ్రం చేసుకుంటారు, అయితే కొన్నిసార్లు హడావిడిలో   ముఖాన్ని శుభ్రం చేయడానికి తగినంత సమయం ఉండదు. ఏదైనా క్లెన్సింగ్ ఏజెంట్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.  ఇందుకోసం పచ్చి పాలలో కాటన్‌ను నానబెట్టి ముఖానికి మసాజ్ కూడా చేసుకోవచ్చు. మసాజ్ చేసిన తర్వాత 5 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖ చర్మం శుభ్రంగా,  మేకప్‌కు చేసుకోవడానికి అనువుగా  స్మూత్‌గా మారుతుంది. దీపావళి పండుగ  రోజున మేకప్ చేసేటప్పుడు ఎక్కువగా పొరల మేకప్  వేసుకోకపోవడం మంచిది. బేస్,  ఫౌండేషన్  వేరు వేరు  లేయర్‌లను వేసుకోవడం  వలన  మేకప్ క్రాక్స్ వచ్చి తక్కువ సమయంలో పగుళ్లు ఏర్పడతాయి. అందువల్ల మేకప్  ను ఒకే  సన్నని పొరగా వేసుకోవాలి. ఇది చాలా సేపు ఉంటుంది.  ముఖం ఎక్కువసేపు  ఆరోగ్యంగా కనిపిస్తుంది. ముఖానికి మేకప్ వేసేటప్పుడు చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే, పాత లేదా చౌక ఉత్పత్తులను ఉపయోగించడం.  వీటితో  ఎన్ని విధాలుగా మేకప్ అప్లై చేసినా  అవి ఎక్కువ కాలం ఉండవు.   చెమటతో కారిపోవడం, లేదా రంగు వెలసిపోవడం జరుగుతుంది. అందువల్ల ఎల్లప్పుడూ మంచి కంపెనీ నుండి ఉత్పత్తులను ఎంచుకోవాలి. ఇకపోతే మేకప్ వేసేటప్పుడు జరిగే రెండవ తప్పు.. సరైన క్రమంలో మేకప్ వేయకపోవడం.  క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్, ప్రైమర్, ఫౌండేషన్, కన్సీలర్, ఫేస్ పౌడర్, బ్లషర్, ఐ మేకప్ అన్నీ వేటి  ప్రాముఖ్యతను అవి కలిగి ఉంటాయి. వాటిలో దేని తరువాత దేన్ని అప్లై చేయడం మంచిదో తెలుసుండటం ముఖ్యం. ఏ ఒక్కటైనా అటుది ఇటు, ఇటుది అటు వేస్తే మేకప్ మొత్తం పాడైపోతుంది. కాబట్టి మేకప్ వల్ల అందంగా కనబడాలంటే  ఈ తప్పులు చేయకూడదు.  మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే వాటర్ ప్రూఫ్ మేకప్ ఉత్పత్తులను ఉపయోగించాలి. ప్రస్తుతం మార్కెట్లో చాలా కంపెనీలు వాటర్‌ప్రూఫ్ మేకప్‌ను విడుదల చేస్తున్నాయి. ఇవి సులభంగా అందుబాటులో ఉంటాయి.   ఇవి ముఖంలో గ్లోను  ఎక్కువసేపు ఉంచడంలో కూడా సహాయపడతాయి.                                                             *నిశ్శబ్ద

మొదటి సారి చీర కట్టేటప్పుడు ఇవి తప్పక గుర్తుంచుకోవాలి..!

మొదటి సారి చీర కట్టేటప్పుడు ఇవి తప్పక గుర్తుంచుకోవాలి..!   చీర మహిళల భారతీయ సంప్రదాయ వస్త్రధారణ. అయితే నేటి కాలంలో చీరను రోజు కట్టుకోవడం కుదరడం లేదు. చాలా వరకు వివిధ రకాల ఫ్యాషన్ దుస్తులలోనే రోజులు గడుపుతుంటారు.  చీర అంటే చాలా అరుదుగా ఏదైనా ట్రెడిషనల్ కార్యక్రమంలో మాత్రమే కడుతుంటారు.  అయితే చీర మొదటిసారిగా కట్టేవారు చాలా అయోమయానికి గురవుతుంటారు. చాలా వరకు ఇతరుల సహాయం తీసుకుంటూ ఉంటారు.  అసలు చీర ఫర్పెక్ట్ గా కనిపించడానికి ఏం చేయాలి? ఏ టిప్స్ ఫాలో కావాలి? తెలుసుకుంటే.. సరైన పెట్టీకోట్, బ్లౌజ్.. చీర కట్టుకునేందుకు లోపల ధరించే లంగాను నేటికాలంలో పెట్టీకోట్ అంటున్నారు.  ఈ పెట్టీ కోట్,  చీరలోకి ధరించే బ్లౌజ్ సరిగ్గా సరిపోయేలా ఉండాలి.  పెట్టీకోట్ ఎంత బాగా సెట్ అయితే చీర కట్టుకున్నాక అంత బాగా కనిపిస్తుంది. పెట్టీకోట్,  బ్లౌజ్ చాలా బిగుతుగా లేదా చాలా లూజ్ గా ఉండకూడదు. చీరను గమనించాలి.. చాలామందికి చీర కట్టుకొనేటప్పుడు ఎదురయ్యే కన్ఫ్యూషన్..  చీర కింద అంచు ఏది? పైన అంచు ఏది అని.. అలాగే చాలా చీరలు ముందు, వెనుక కూడా అట్రాక్షన్ గా ఉంటాయి.  ఇవి కూడా గమనించాలి.  ఇవి గమనించకుండా హడావిడిగా చీర కట్టుకుంటే అది బెడిసికొట్టే అవకాశం ఉంటుంది. హీల్స్ వద్దు.. ప్లాట్స్ ముద్దు.. చాలామందికి హీల్స్ ధరించడం అలవాటు. కానీ చీర కట్టుకున్న తరువాత హీల్స్ ధరించడం చాలా ఛాలెంజ్ గా ఉంటుంది. చీర పూర్తీగా అలవాటు కానప్పుడు చీర కట్టుకున్నప్పుడు హీల్స్ ధరించి ఏదైనా సమస్యను ఎదుర్కునే బదులు చీర ధరించినప్పుడు ప్లాట్స్ ధరించడం మంచిది. కుచ్చిళ్ల స్థానం.. చీరకు చాలా అందాన్ని తెచ్చిపెట్టేది కుచ్చిల్లు.  ఈ కుచ్చిళ్లను చాలా జాగ్రత్తగా మడత పెట్టడమే కాదు.. కుచ్చిళ్ళను సరిగ్గా  పెట్టికోట్ లో ఉంచడం కూడా ముఖ్యమే.. ఖచ్చితంగా నాభికి కొద్దిగా కుడివైపున కుచ్చిళ్లను టక్ చేసుకోవాలి. మడత పెట్టడం.. చీర కట్టుకున్నప్పుడు చీర కొంగు అయినా,  కుచ్చిళ్లు అయినా సరిగ్గా  ఒక్క లెవల్ లో మడత పెట్టాలి.  ఇలా ఒక్క లెవల్ లో మడత పెట్టడం వల్ల చీర కట్టుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. సేఫ్టీ పిన్ ల వాడకం.. చీర కొంగును, చీర కుచ్చిళ్ళను  పెట్టేటప్పుడు సేఫ్టీ పిన్ లను  చాలా జాగ్రత్తగా వాడాలి.  పిన్ లను పెట్టేటప్పుడు చీర ఫ్యాబ్రిక్ పోగులు ఒక్కొక్క సారి దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరికొన్నిసార్లు పిన్స్ శరీరానికి గుచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది.  అందుకే సేఫ్టీ పిన్స్ దగ్గర జాగ్రత్త. నడవడం.. డ్రస్సులు వేసుకున్నప్పుడు నడిచినంత వేగంగా, వయ్యారంగా.. మొదటి సారి చీర కట్టుకున్నప్పుడు నడవడం కుదరదు.  అందుకే మొదటిసారి చీర కట్టుకున్నప్పుడు లేదా చీర అలవాటు తక్కువగా ఉన్నప్పుడు నెమ్మదిగా నడవాలి. కాన్పిడెంట్ కీలకం.. చాలామంది చీర కట్టుకున్నప్పుడు భయపడుతూ ఉంటారు. ఎక్కడ పడతామో.. నవ్వుల పాలవుతామో అని. అయితే కాన్పిడెంట్ గా ఉండటం చాలా ముఖ్యం.                     *రూపశ్రీ.

మొటిమల గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుసా..

మొటిమల గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుసా.. ప్రపంచంలో అత్యంత సాధారణ చర్మ వ్యాధులలో ఒకటి  మొటిమలు. ఇవి చాలా సాధారణమైనవే అయినా..  ఇప్పటికీ వీటి గురించి  అపోహలు,  తప్పుడు సమాచారం ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇది టీనేజర్ల నుండి 30 ఏళ్లు,  అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దల వరకు అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది.  అయితే మొటిమల గురించి చాలా మందికి చాలా రకాల అపోహలు ఉంటాయి.  వాటిని నిజం అని నమ్మేవాళ్లు చాలా మంది ఉంటారు.  ముఖ్యంగా మొటిమల బాధితులు ఎక్కువ మహిళలే.. మొటిమల గురించి ఉన్న అపోహలు తెలుసుకుని వాటిని పరిష్కారం చేసుకుంటే చాలా ఆందోళనలు తగ్గుతాయి. మొటిమలు టీనేజ్ లో మాత్రమే వస్తాయా? చాలా మంది మొటిమలు కౌమారదశలో మాత్రమే కనిపిస్తాయని అనుకుంటారు. కానీ ఈ కాలంలో పెద్దలకు కూడా మొటిమలు రావడం సర్వసాధారణం.  ఒత్తిడి, హార్మోన్ల మార్పులు,  జీవనశైలి ఇవన్నీ మొటిమలకు కారణాలు అవుతాయి.  యుక్తవయస్సులో క్లియర్ స్కిన్   ఉండటం వల్ల పెద్దయ్యాక మొటిమలు రావని హామీ ఏమీ లేదు. జిడ్డు చర్మం ఉన్నవారికే మొటిమలు వస్తాయా? జిడ్డుగల చర్మం ఉన్నవారిలో మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ,  పొడి చర్మం ఉన్నవారిలో,  జిడ్డుగల చర్మం ఉన్నవారిలో,  పెద్దవారిలో మొటిమలు రావడం సహజం. చర్మ రకంతో సంబంధం లేకుండా చికాకు,  మూసుకుపోయిన చర్మ రంధ్రాల కారణంగా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రకాల చర్మాలకు మొటిమల సమస్య ఉంటుంది. జంక్ ఫుడ్ తిన్నవారికే మొటిమలు వస్తాయా? చర్మ ఆరోగ్యంపై ఆహారం ప్రభావం చూపినప్పటికీ, మొటిమలు ప్రధానంగా జంక్ ఫుడ్ కారణంగానే వస్తాయి  అనుకోవడం తప్పు. చక్కెర,  పాల ఉత్పత్తులు అధికంగా ఉండే ఆహారాలు మొటిమలను మరింత తీవ్రతరం చేస్తాయి. కానీ అవే ప్రధాన కారణం కాదు.   చర్మ అవరోధం పనితీరు, హార్మోన్లు,  జన్యుశాస్త్రం చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. కొంతమందికి సమతుల్య ఆహారం మంటలను తగ్గించడంలో సహాయపడుతుంది. మేకప్ వల్ల మొటిమలు వస్తాయా? మొటిమలు తరచుగా మేకప్ కారణంగా వస్తాయని అనుకుంటారు.  అయితే, మొటిమలు  కామెడోజెనిక్ కాని ఉత్పత్తుల వల్ల సంభవించవు. మేకప్ సరిగ్గా తొలగించనప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. దీనివల్ల రంధ్రాలు మూసుకుపోతాయి.  చర్మం మీద మేకప్ ను చాలా శుభ్రంగా తొలగించుకోవడం చాలా ముఖ్యం. డబుల్ క్లెన్సింగ్ లేదా  స్కిన్ ఫ్రెండ్లీ ఉత్పత్తులతో ఇది సాధ్యమవుతుంది. టీనేజ్ మొటిమలకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదా.. యుక్తవయస్సులో మొటిమలు సర్వసాధారణమైనప్పటికీ  ఇది హానిచేయదు అనే గ్యారెంటీ లేదు.. మొటిమల వల్ల శాశ్వతంగా  మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనికి ట్రీ ట్మెంట్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.                                 *రూపశ్రీ

30 ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టడం ఎందుకు కష్టం అవుతోంది..!

30 ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టడం ఎందుకు కష్టం అవుతోంది..! ఈ రోజుల్లో చాలా మంది మహిళలు కెరీర్‌ గురించి ఆలోచించడం,  గోల్స్ అచీవ్ చేయడం వంటివి దృష్టిలో ఉంచుకోవడం లేదా ఇతర కారణాల వల్ల 30 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకునే వారు అధికం అయ్యారు.  కాస్త తొందరగా పెళ్లి చేసుకున్నా  గర్భధారణను మాత్రం 30 ఏళ్ల తర్వాత   ప్లాన్ చేస్తున్నారు. కానీ సరిగ్గా గమనిస్తే నేటికాలంలో పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న అధిక శాతం మంది 30 ఏళ్ల తర్వాత వయసు ఉన్నవారే.. మహిళ యొక్క సంతానోత్పత్తి ప్రయాణం పుట్టుక నుండే ప్రారంభమవుతుంది. ఒక అమ్మాయి తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు,  ఆ సమయంలో ఆమె అండాశయాలలో అండాల సంఖ్య లక్షల్లో ఉంటుందని గైనకాలజిస్టులు చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. అంతేకాదు.. ఈ సంఖ్య జననం సమయంలో దాదాపు 1–2 మిలియన్లకు పడిపోతుంది.  యుక్తవయస్సు వచ్చే సమయానికి 50–60 వేల అండాలు మాత్రమే మిగిలి ఉంటాయి. దీని అర్థం స్త్రీ వయస్సు పెరిగే కొద్దీ ఆమె సంతానోత్పత్తి క్రమంగా తగ్గుతుంది. 30 ఏళ్ల తర్వాత ఈ సంఖ్య మరింత తగ్గడం వల్లే గర్భధారణలో ఇబ్బందులు తలెత్తుతాయి. స్త్రీకి PCOD లేదా PCOS వంటి హార్మోన్ల సమస్యలు, పీరియడ్స్ సమయంలో అధిక నొప్పి లేదా అసాధారణ రక్తస్రావం (చాలా తక్కువ లేదా ఎక్కువ),  ఎండోమెట్రియోసిస్ వంటి వ్యాధి ఉంటే, అది మరింత సమస్యగా  మారుతుంది. ఇక టెక్నాలజీ ఉపయోగించి గర్భధారణ అనేది నేటికాలంలో చాలా జరుగుతోంది.  వాస్తవానికి, IVF ఒకసారి విఫలమైన తర్వాత మళ్ళీ దానికి డబ్బు కట్టి ప్రయత్నించాలా  అనేది చాలా మంది సందేహం.  ప్రతి స్త్రీ శరీరం,  హార్మోన్ల ప్రతిస్పందన ఒకేలా ఉండదు. కొంతమంది మహిళల శరీరాలు ఎక్కువ అండాలు ఉత్పత్తి చేస్తాయి, దీనిని హైపర్ స్టిమ్యులేషన్ అంటారు, మరికొన్ని ఆశించిన సంఖ్యలో అండాలు మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. IVF టెక్నాలజీకి కూడా హామీ లేదా.. IVF ద్వారా గర్భధారణకు ప్రయత్నించినా  అది  ఇంజెక్షన్,  ట్రీట్మెంట్  మోతాదును వేర్వేరు సైకిల్స్ లో  మార్చాలి. IVFలో మూడు లేదా నాలుగు సైకిల్స్ లో  ఎవరైనా గర్భవతి అవుతారని హామీ ఇవ్వడం సాధ్యం కాదని నిపుణులు  స్పష్టంగా చెబుతున్నారు. ఒకవేళ ఇలాంటి హామీ ఎవరైనా ఇస్తున్నారంటే కేవలం ఒక స్కామ్ మాత్రమే అంటున్నారు.                                *రూపశ్రీ.

ఆశల్ని అలాగే మిగలనివ్వకండి...

  ఆశల్ని అలాగే మిగలనివ్వకండి...   మనసుకు నచ్చిన పని చేసినప్పుడు లభించే తృప్తి అంతా ఇంతా కాదు. ఆ తృప్తి, ఆ ఆనందం ముందు ఏవీ సరిరావు. కానీ ఎక్కువసార్లు మన మనసుకి నచ్చిన పని చేయటానికి మనకు అవకాశం దొరకదు. మనుషులో, పరిస్థితులో, కాలమో ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంటాయి. ఒకటి రెండుసార్లు పట్టుదలగా ప్రయత్నిస్తాం. కుదరటం లేదంటూ ముడోసారికి ఆ ప్రయత్నం విరమించుకుంటాం. అందులోనూ ఆడవారి విషయంలో ఆ ఆటంకాలకి కొదవే వుండదు, పెళ్ళి, పిల్లల నుంచి మరెన్నో బాధ్యతలు కాళ్ళకి బంధం వేసి ముందుకు అడుగు వేయనివ్వవు. దాంతో ఏదో చేయాలన్న తపన కాస్తా మరుగున పడిపోతుంది. అసంతృప్తి తోడుగా మనతో ముందుకు అడుగేస్తుంది. అలా కాదు నేను నా మనసుకు నచ్చిన పని చేసి తీరాలంటూ వయసుతో సంబంధం లేకుండా కాలేజీకి వెళ్ళిన ఒకామె గురించి ఈ మధ్య చదివాను. ఇల్లు, పిల్లలు, బాధ్యతలు అంటూ కొన్ని సంవత్సరాల పాటు తమని తాము మర్చిపోతారు ఆడవారు. బాధ్యతలు అన్నీ తీరి కాస్త సమయం దొరికింది అన్నప్పుడు క్షణాలు గంటల్లా మారిపోతాయి. కాలం కదలదు. ఏమీ చేయటానికి ఉండదు. ఇక నిరుత్సాహం, నిర్లిప్తత మేమున్నామంటూ హాయ్ చెబుతాయి. అలా తన బాధ్యతలన్నీ తీరిపోయక... హమ్మయ్య కావల్సినంత సమయం దొరికిందంటూ సంతోషించింది. అంతేనా... ఎప్పట్నుంచో తన మనసులో వున్న కోరిక తీర్చుకునే దిశగా అడుగులు వేసింది ఆమె. బాగా చదువుకోవాలన్నది ఆమె కోరికట. కానీ చదువు మధ్యలోనే పెళ్ళయిపోవటం ఆ తర్వాత బాధ్యతల మధ్య చదువు ముందుకు సాగలేదు. 60 సంవత్సరాల దగ్గరగా వచ్చేసింది వయసు. పిల్లలందరూ దూరంగా వున్నారు. కావలసినంత సమయం. అంతే చక్కగా కాలేజీలో చేరిపోయింది. డిగ్రీ మొదటి సంవత్సరం క్లాసులోకి ఈమె అడుగు పెడుతుంటే లెక్చరరు అనుకుని స్టూడెంట్స్ అంతా విష్ చేశారుట మొదటి రోజు. ఆ తర్వాత ఈమె కూడా చదువుకోవటానికి వచ్చిందని తెలుసుకుని నవ్వుకున్నారట. కాలేజీ జీవితంమంటే సరదా, సంతోషాల కలయిక. వయసు, ఉత్సాహం ఉరకలు వేస్తుంటాయి. అలా ఉరకలు వేసే కాలేజీ స్టూడెంట్స్ కి క్లాసులో ఈ పెద్దావిడని చూస్తే మొదట్లో చిరాకుగా అనిపించేదిట. ఆవిడ అందరితో సరదాగా మాట్లాడుతూ, వాళ్ళతో పాటు క్యాంటిన్‌కి, సినిమాకి వెంట వస్తుంటే విసుగ్గా ఉండేదిట. కానీ బయటికి ఏమీ అనలేక ఆమెని తప్పించుకు తిరిగేవారు స్టూడెంట్స్. ఇలా కొంత కాలం గడిచింది. ఈ మధ్య కాలంలో తెలియకుండానే ఆమెతో మంచి అనుబంధం ఏర్పడిపోయింది. ఒక్కరోజు ఆమె రాకపోయినా తోచేదికాదు స్టూడెంట్స్‌కి. కేవలం ఆటపాటలు, సరదా, సంతోషాలలోనే కాదు చదువులోనూ టీనేజర్స్‌తో నేను పోటీపడగలనంటూ ముందుండేవారుట ఆమె. దాంతో కాలేజీలో ఆమె అందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తిగా మారిపోయింరు.  సంవత్సరం ఆఖరి పరీక్షలలో మంచి మార్కులతో పాసయిన ఆమెని చూచి అందరూ ఆనందపడతారు. అలా మూడు సంవత్సరాలు గడచిపోతాయి. మూడేళ్ళు మూడు క్షణాలుగా గడచిపోతాయి ఆమెకి. కావల్సినన్ని జ్ఞాపకాలు స్వంతమయ్యాయి. ఫేర్‌వెల్ రోజున ఆడిపాడి ఆఖరుగా తమ తమ మనసులో మాటలు చెబుతారు ఒకొక్కరు. ఆమె వంతు వస్తుంది. అప్పుడు తనసలు కాలేజీలో ఎందుకు చేరిందో, చదువంటే తనకెంత ఇష్టమో, ఇన్ని సంవత్సరాల జీవితం తనకెన్ని ఆటుపోట్లని ఇచ్చిందో అన్ని వివరిస్తుంది. ఆఖరుగా ఈ మూడేళ్ళు నా ఇన్నేళ్ళ జీవితంలో ప్రతేకమైనవి అని చెబుతూ అందుకు అందరికీ థాంక్స్ కూడా చెబుతుంది. అందరూ భారమైన మనసులతో విడిపోతారు. రిజల్ట్స్ వస్తాయి ఆమె యూనివర్సిటీ ఫస్ట్ వస్తుంది. అందరూ ఎంతో సంతోషిస్తారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుని సర్ ప్రైజ్‌గా ఆమె ఇంటికి వెళతారు. స్టూడెంట్స్, లెక్చరర్లు ఒకసారిగా ఆమె ఇంటికి వస్తారు. లోపలికి వెళ్ళి పూలమాలతో అభినందించాలనుకున్న వాళ్ళకి మంచంపై రిజల్టుపేపరుని గుండెలపై పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె కనిపిస్తుంది. కదిపి చూస్తే చలనం ఉండదు. అందరూ నిర్ఘాంతపోతారు. ఆమె కేన్సర్ ఆఖరి రోజులని తెలిసీ తన చిరకాల కోరిక తీర్చుకునేందుకు కాలేజీకి వచ్చింది. చదువుకుంది. ఆ తృప్తితో ప్రాణాలు విడిచింది. ఈ నిజం తెలుసుకున్న అక్కడి వారంతా బాధతో ఆమెకి వీడ్కోలు చెబుతారు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. తీరని ఆశ మనిషిని, మనసుని బాధిస్తుంది. ఆలోచించండి. - రమ ఇరగవరపు

పట్టుచీరలు  ఐరన్ చేసేటప్పుడు ఈ టిప్స్ తప్పక పాటించండి!

పట్టుచీరలు  ఐరన్ చేసేటప్పుడు ఈ టిప్స్ తప్పక పాటించండి!   భారతీయ సాంప్రదాయానికి మెరుగులు దిద్దేవి పట్టుచీరలు. పట్టుచీరలలో అమ్మాయిలు ముస్తాబైతే వారిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. నిజానికి భారతీయత అంతా పట్టుచీరలలోనే తిష్ట వేసుకుందేమో అనిపిస్తుంది. ఇకపోతే ప్రతి మహిళ దగ్గరా పట్టుచీరలు ఉండటం కామన్. పండుగ, శుభకార్యాల సమయాలలో సందర్బానుసారంగా పట్టుచీరలు కట్టి పండుగకు మరింత అందం తెస్తారు. అయితే పట్టుచీరలను ఐరన్ చేసేటప్పుడు కొన్ని టిప్స్  పాటిస్తే మాత్రం లుక్ రెట్టింపు అవుతుంది. దుస్తులు కూడా సురక్షితంగా ఉంటాయి. ఇంతకీ పట్టుచీరలను ఐరన్ చేసేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. ముందు జాగ్రత్త.. పట్టుచీరలను జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే దానికి చెయ్యాల్సిన మొదటి పని కొనుగోలు చేసేటప్పుడే ఆ చీరలను ఐరన్ చెయ్యచ్చా లేదా అనే విషయం తెలుసుకోవడం. ఒకవేళ పెద్ద షాప్స్ లో కొంటూ ఉంటే ఆ పట్టు రకం, దాని ఖరీదు మొదలైనవాటితో పాటూ సదరు చీరను ఐరన్ చెయ్యచ్చా లేదా అనే విషయం కూడా అందులో పొందుపరిచి ఉంటారు.  అవి చూసుకోవాలి. కవరింగ్.. పట్టుచీరలను ఎప్పుడూ నేరుగా ఐరన్ చెయ్యకూడదు. పట్టుచీర మీద ఐరన్ బాక్స్ నేరుగా పెట్టకూడదు. దానిబదులు మొదట చీరను జాగ్రత్తగా ఒక పెద్ద టేబుల్ మీద ఉంచి, చీర మీద కాటన్ క్లాత్ లేదా కాటన్ టవల్ వంటివి ఉంచాలి.పైన క్లాత్ ఐరన్ చేస్తుంటే కింద చీర ఐరన్ అయిపోతుంది. ఇలా ఐరన్ చేస్తే చీర దారప్పోగులు, రంగు దెబ్బతినవు. సెట్ చేయాలి.. ఐరన్ బాక్స్ తో ఐరన్ చేసేటప్పుడు ప్రతి ఫ్యాబ్రిక్ కు తగినట్టు  టెంపరేచర్ సెట్ చేసే సౌకర్యం ఉంటుంది. దాన్ని అనుసరించి పట్టుచీరల కోసం సిల్క్ సెట్టింగ్ చేయాలి. ఇలా చేస్తే పట్టుబట్టలకు తగినంత మాత్రమే ఉష్ణోగ్రత ప్రసారం అవుతుంది. మొదలు ఇక్కడే.. పట్టుచీరలను మొదట అంచు నుండి ఐరన్ మొదలుపెట్టాలి. తరువాత చీరల మధ్యలో ఐరన్ చెయ్యాలి. ఇలా చేస్తే ముడతలు ఉండవు. కానీ చీరలు పాడవకుండా ఉండాలన్నా, ఏమాత్రం నష్టం జరగకూడదు అన్నా ఐరన్ బాక్స్ ను చీరమీద ఒకేచోట ఎక్కువ సేపు ఉంచకూడదు. ఫైనల్ స్టెప్ మిస్టేక్.. చీరలు ఐరన్ చేశాక జాగ్రత్తగా మడతేసి బీరువాలో పెట్టడం మగువలకు అలవాటు. అలా కాకుండా ఐరన్ చేసిన చీరలను హ్యాంగర్ కు పెట్టి దాన్ని వార్డ్ రోబ్ లో వేలాడదీయాలి. కవర్లలో పెట్టడం ఇరుకైన డ్రాయర్లలో పెట్టడం చెయ్యకూడదు.                                       *నిశ్శబ్ద.

మహిళలు ధరించే బ్రా ల గురించి షాకింగ్ నిజాలు..!

మహిళలు ధరించే బ్రా ల గురించి షాకింగ్ నిజాలు..! మనకు ఆహారం, నివాసంతో పాటు, బట్టలు కూడా చాలా ముఖ్యమైనవి.  పొడవాటి చీర అయినా లేదా చిన్న బ్రా అయినా.. వాటి ఎంపిక విషయంలో  మహిళలు బాగా ఆలోచిస్తారు. ఎలాంటి దుస్తులు ధరించినా మహిళలు బ్రా వేసుకోవడం తప్పనిసరి. అయితే మహిళలు బ్రా లు తప్పనిసరిగా ధరించినా వాటి గురించి మాట్లాడటానికి వెనుకాడతారు.  ఈ కారణంగా బ్రా గురించి చాలామందికి చాలా విషయాలు ప్రశ్నలుగానే ఉన్నాయి.  చాలామందికి తెలియని బ్రా గురించి నిజాలు తెలుసుకుంటే.. బ్రా ఎలా ఉనికిలోకి వచ్చింది? గతంలో కార్సెట్ దుస్తులు మాత్రమే ఉండేవి. ఇది క్రమంగా మారిపోయి 20వ శతాబ్దంలో బ్రాను ప్రవేశపెట్టారు. హెర్మియోన్ కాడోల్ అనే వ్యక్తి కార్సెట్ తయారు చేస్తున్నాడు. దానిని తయారు చేస్తున్నప్పుడు అది బిగుతుగా మారింది.   అతను కార్సెట్‌ను 2 ముక్కలుగా చేశాడు.  తరువాత కార్సెట్ బ్రా రూపాన్ని తీసుకుంది. చాలా మంది చరిత్రకారులు బ్రాను 1910లో మేరీ ఫెల్ప్స్ జాకబ్ 19 సంవత్సరాల వయసులో కనుగొన్నారని నమ్ముతారు. అసలు పదం.. బ్రా  పూర్తి రూపం బ్రజియర్. ఇది ఫ్రెంచ్ పదం. దీని అర్థం మహిళల వక్షోజాలను కప్పి ఉంచడానికి,  మద్దతు ఇవ్వడానికి రూపొందించిన లోదుస్తులు. కానీ 1930 నాటికి, ప్రజలు బ్రజియర్‌ను బ్రా అని పిలవడం ప్రారంభించారు. బ్రజియర్ అనే పదం 1911లో ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో చేర్చబడింది. బ్రా లకు ఎక్స్‌పైరీ డేట్.. బ్రాను వారానికి 3 నుండి 4 సార్లు ధరిస్తే.. అది 8 నెలల వరకు ఉంటుంది. బ్రాను 12 నెలల వరకు కూడా ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ ధరించకపోతే బ్రాను ఇంకా ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు.  ఇది బ్రా నాణ్యత,  దానిని ఎలా నిర్వహిస్తున్నారనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. సరైన బ్రా లు ధరిస్తున్నారా? నివేదికల ప్రకారం 80% మంది మహిళలు తప్పు సైజు బ్రా ధరిస్తున్నారట. బ్రా సైజును కొలవడానికి అనేక స్కేళ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ సంకోచం,  సిగ్గు వంటి అనేక కారణాల వల్ల, మహిళలు సైజును కొలవకుండా బ్రాలను కొనుగోలు చేస్తారు.  మహిళలు కూడా తాము తప్పు సైజు బ్రా ధరిస్తున్నారనే విషయం గురించి ఎప్పుడూ ఆలోచించి ఉండకపోవచ్చట. అత్యంత ఖరీదైన బ్రా ధర.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రెస్ గురించి  వినే ఉంటారు . ఈ విషయంలో బ్రా కూడా తన రికార్డ్ తనకు క్రియేట్ చేసుకుంది. 'రెడ్ హాట్ ఫాంటసీ బ్రా' ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాగా పరిగణించబడుతుంది. దీనిని విక్టోరియా సీక్రెట్ రూపొందించింది. 2000లో దీనిని సూపర్ స్టైలిష్ గిసెల్ బుండ్చెన్ ధరించింది . ఈ బ్రా ధర రూ. 125 కోట్లుగా చెబుతారు. 1,300 క్యారెట్ల వజ్రాలు  థాయ్ కెంపులు దానిపై పొందుపరచబడ్డాయి. అందుకే 'రెడ్ హాట్ ఫాంటసీ బ్రా' మెరిసేలా కనిపిస్తుంది.                                 *రూపశ్రీ.