
ఆల్ టైం రికార్డ్: 'AA23'కి అనిరుధ్ షాకింగ్ రెమ్యునరేషన్.. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఫస్ట్ టైం!
సౌత్ ఇండియన్ సినిమాలో ఒక హీరోనో లేక డైరెక్టరో పదుల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంటే మనం పెద్దగా ఆశ్చర్యపోం. కానీ.. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏకంగా 23 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటే నిజంగా ఆశ్చర్యకర విషయమే. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సంగీత దర్శకుడు తీసుకోబోతున్న బిగ్గెస్ట్ పే-చెక్స్ లో ఇది ఒకటిగా నిలవబోతోంది. ఈ రికార్డు క్రియేట్ చేసిన ఆ మ్యూజిక్ సెన్సేషన్ ఎవరో కాదు.. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్. ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత డిమాండ్ ఉన్న ఈ మ్యూజిక్ డైరెక్టర్.. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 23 కోట్లు పారితోషికంగా అందుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అసలు ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కి ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ అంత పెద్ద అమౌంట్ ఇవ్వడానికి ఎందుకు వెనుకాడలేదు? దీనికి ఒకటే కారణం.. అనిరుధ్ ఇచ్చే ఆ బీజీఎమ్స్ అండ్ చార్ట్‌బస్టర్ సాంగ్స్. ఈరోజుల్లో ఒక సినిమా బాక్సాఫీస్ విజయంలో మ్యూజిక్ ఎంత కీలక పాత్ర పోషిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. బిజీఎమ్తోనే థియేటర్లలో పూనకాలు తెప్పించే సత్తా అనిరుధ్‌కి ఉంది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ సినిమాల్లో అనిరుధ్ మ్యూజిక్ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్లా మారిపోతుంది. 'విక్రమ్', 'లియో' సినిమాల్లో వారి కాంబో తెచ్చిన మాస్ సునామీని మనం చూశాం. అటు అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ప్రతి సినిమాలోనూ తన డ్యాన్స్ అండ్ స్టైల్‌తో పాటలకు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చే కెపాసిటీ ఆయన సొంతం. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకే నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్-ఇండియా వండర్ కోసం ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అనిరుధ్ అడిగిన భారీ అమౌంట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కి ఈ స్థాయిలో పారితోషికం లభించడం నిజంగానే ఒక హిస్టారికల్ బెంచ్‌మార్క్. [AA23 Movie, Anirudh Ravichander, 23 Crore Remuneration, Allu Arjun, Lokesh Kanagaraj, Telugu Cinema News, Tollywood, Telugu News]
Aug 31, 2026 3:47PM
భయం భయం: రూట్ మార్చిన మేర్లపాక గాంధీ.. తాప్సీతో కలిసి రచ్చ రచ్చ.!
మొదట్లో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' లాంటి కామెడీ సినిమాలతో అలరించిన దర్శకుడు మేర్లపాక గాంధీ, ఇటీవల 'కొరియన్ కనకరాజు' అనే హారర్ కామెడీ ఫిల్మ్ తో ఆకట్టుకున్నారు. అయితే తన నెక్స్ట్ మూవీ కోసం కంప్లీట్ రూట్ మార్చబోతున్నారు. కామెడీ పక్కన పెట్టి, ప్రేక్షకులను థియేటర్లలో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే ఒక మైండ్ బ్లోయింగ్ సీరియస్ హారర్ కథను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రముఖ హీరోయిన్ తాప్సీ పన్ను లీడ్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాప్సీ గతంలో 'ఆనందో బ్రహ్మ' లాంటి హార్రర్ కామెడీతో నవ్వించి భయపెట్టారు. కానీ ఈసారి కాన్సెప్ట్ పూర్తిగా వేరు. ఇది కామెడీ కాంబినేషన్ అసలే కాదు.. పక్కా డార్క్, సీరియస్ అండ్ ఇంటెన్స్ హారర్ ఫిల్మ్ అని సమాచారం. దర్శకుడు మేర్లపాక గాంధీ రాసుకున్న ఈ స్క్రిప్ట్‌లో ఉండే సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ తాప్సీని బాగా ఆకట్టుకున్నాయట. కథ వినగానే తాప్సీ ఎంతో ఎక్సైట్ అయి వెంటనే ప్రాజెక్ట్‌కి ఒకే చెప్పేశారనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వైపు కంటెంట్ బేస్డ్ రోల్స్ ఎంచుకునే తాప్సీ, మరోవైపు డిఫరెంట్ టేకింగ్ ఉన్న గాంధీ జతకడితే బాక్సాఫీస్ వద్ద విజిల్స్ పడాల్సిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. [Merlapaka Gandhi, Taapsee Pannu, Horror Film, Korean Kanakaraju, Telugu Horror Movie, Telugu Cinema, Tollywood, Telugu News]
Aug 29, 2026 6:43PM
సూర్య తెలుగు జపం: 'ఇరుముడి' డైరెక్టర్‌తో అదిరిపోయే స్కెచ్.!
మాస్ మహారాజా రవితేజతో దర్శకుడు శివ నిర్వాణ తీసిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఎమోషనల్ థ్రిల్లర్‌గా వచ్చి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడమే కాకుండా, శివ నిర్వాణ మేకింగ్ సత్తాను మరోసారి చాటిచెప్పింది ఈ చిత్రం. 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి సినిమాల తర్వాత 'ఇరుముడి' అందించిన భారీ విజయంతో ఇప్పుడు శివ నిర్వాణ పేరు సౌత్ ఇండియాలోనే హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ సినిమా చూసిన తర్వాత ఒక సౌత్ స్టార్ ప్రత్యేకంగా స్పందించడమే కాదు.. డైరెక్ట్ తెలుగు సినిమా కోసం ఏకంగా చర్చలు కూడా మొదలుపెట్టేశారు. ఆ హీరో మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ సూర్య. 'కరుప్పు', 'విశ్వనాథ్ & సన్స్' సినిమాలతో రెండు వరుస విజయాలను అందుకొని జోష్ లో ఉన్న సూర్య.. శివ నిర్వాణ టాలెంటెడ్ కి ఫిదా అయిపోయారట. 'ఇరుముడి'లో ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ శివ నిర్వాణ ఎంత బ్యాలెన్స్ చేశారో చూసి సూర్య ఆయన్ని ప్రత్యేకంగా అభినందించారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు, "నా బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే ఒక సాలిడ్ స్ట్రెయిట్ తెలుగు స్క్రిప్ట్ సిద్ధం చెయ్.. కలిసి పనిచేద్దాం" అని సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. Also Read: కింగ్ 100: ఐడెంటిటీ కోసమే ఇదంతా.. బాలకృష్ణకు పోటీగా నాగార్జున.! సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు ఆ మార్కెట్ ను మరింత పెంచుకునే పనిలో ఉన్నారు. రీసెంట్ గా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో 'విశ్వనాథ్ & సన్స్' చేసినప్పటికీ, అది తమిళ్ లోనే తెరకెక్కింది. అయితే ఈసారి మాత్రం స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ క్రమంలోనే శివ నిర్వాణతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సూర్య లాంటి ఇంటెన్స్ యాక్టర్.. శివ నిర్వాణ లాంటి ఎమోషనల్ డైరెక్టర్ తో జతకడితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని చెప్పొచ్చు. [Ravi Teja, Irumudi Movie, Shiva Nirvana, Suriya, Telugu Movie, Vishwanath and Sons, Telugu Cinema News, Tollywood, Telugu News]
Aug 29, 2026 12:40PM
వైరల్ గా మారిన న్యూస్
మరికొన్ని గంటల్లో యష్ తన వన్ మాన్ షో 'టాక్సిక్' తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో ల్యాండ్ కాబోతున్నాడు. కేజిఎఫ్ సిరీస్ వచ్చిన నాలుగేళ్ళ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ , ప్రేక్షకులు టాక్సిక్ ని వీక్షించడం కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా సోషల్ మీడియాలో యష్ ఫ్యూచర్ లో రాజకీయరంగ ప్రవేశం చేస్తాడనే రూమర్ హల్ చల్ చేస్తుంది. ఈ రూమర్ వినిపించడానికి కూడా కారణం ఉంది. ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో యశ్ తమిళ స్టార్ హీరో ముఖ్యమంత్రి ‘దళపతి’ విజయ్ గురించి మాట్లాడుతు 'విజయ్ ప్రయాణం నిజంగా నాకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయనలోని క్రమశిక్షణ, ప్రజల పట్ల ఉన్న కట్టుబాటు, విపరీతమైన ప్యాషన్ చూసి ఎంతో నేర్చుకున్నాను. నటుడిగా ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమాభిమానాలని తిరిగి సమాజానికి సేవ రూపంలో అందించే బాధ్యతాయుతమైన ఘట్టానికి విజయ్ చేరుకున్నారు. ప్రజలు ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టారంటే దానికి ఆయన పడిన కష్టమే కారణం. కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ఆయన పయనం మునుముందుకు విజయవంతంగా సాగాలని యశ్ ఆకాంక్షించారు. దీంతో విజయ్ దారిలోనే యష్ రాజకీయాల్లోకి వస్తాడనే రూమర్ చిరు మందహాసంతో షికారు చేస్తుంది. ఏది ఏమైనా యష్ రాజకీయాల్లో రావడం తన సినీ హక్కు. Also Read: శ్రియ ఇనిస్టాగ్రమ్ పిక్ వైరల్.. ఆ స్టార్ హీరోతో హ్యాపీ డే Yash, Vijay, Toxic, Geetu Mohandas
Aug 25, 2026 1:03PM
మెగాస్టార్ లీక్ వల్లనే టైటిల్ మారిపోయిందా?
మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ఇయర్ పొంగల్ కి 'కాకా'తో జనవరి 13 న రాబోతున్న విషయం తెలిసిందే. అయితే మొదట ఈ మూవీకి 'కదిరి' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారని, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రాబోయే కథ కాబట్టి ఆ ఏరియాలోనే ఉన్న కదిరి సరైన పేరు అని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వార్తలు వినిపించాయి. కానీ టైటిల్ 'కాకా'గా మారిపోయింది. దీంతో 'కదిరి' నుంచి 'కాకా'గా పేరు మారిందా! దీని వెనుక మెగాస్టార్ చిరంజీవి చేసిన లీక్ కారణమా అనే గాసిప్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన ఒక సినీ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ 'బాబీ'తో చేస్తున్న మూవీ 'కదిరి' అనే పేరును బయటకు చెప్పేశారు . సాధారణంగా పెద్ద హీరోలు ఏదైనా వేదికపై ఒక సినిమా టైటిల్‌ను ముందే ప్రస్తావిస్తే, దానికి ఉండే సస్పెన్స్ లేదా హైప్ కొంతవరకు తగ్గిపోతుందని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ స్వయంగా ఈ పేరును రివీల్ చేయడంతో, సోషల్ మీడియాలో 24 గంటల్లోనే ఆ పేరుతో వేలాది మీమ్స్, ట్రెండ్స్ వచ్చేసాయి. దాంతో సర్ ప్రైజ్ ఎలిమెంట్ మిస్ అయిందని భావించిన దర్శకుడు మరియు నిర్మాతలు, చివరి నిమిషంలో తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని టాక్. దాదాపు 100 శాతం డిఫరెంట్ అప్పీల్ ఉండాలనే ఉద్దేశంతోనే 'కదిరి' స్థానంలో మాస్ అండ్ రా లుక్ ఉన్న 'కాకా' అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు ఫిలిం వర్గాల టాక్. Also Read: 2027 సంక్రాంతి సమరం షురు.. గెలిచేది ఆ సినిమానే అంటున్న ఫ్యాన్స్ అయితే మరికొందరు విశ్లేషకులు మాత్రం ఈ ప్రచారాన్ని కేవలం ఒక రూమర్ లేదా గాసిప్‌గానే కొట్టిపారేస్తున్నారు. దర్శకుడు కథను మరింత పదును పెట్టే క్రమంలో క్యారెక్టరైజేషన్‌కు 'కాకా' అనే పదమే సరైన న్యాయం చేస్తుందని భావించి ఉండవచ్చని అంటున్నారు. సినిమాలో హీరో పాత్ర యొక్క మాస్ ఆటిట్యూడ్, నటన మరియు డైలాగ్ డెలివరీ ఆధారంగా మార్పులు చేసి, చివరకు 'కాకా' వైపే మొగ్గు చూపారని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, చిరంజీవి లీక్ వల్లనే టైటిల్ మారిందా లేదా కథా అవసరాల రీత్యా మార్చారా అనే విషయం పక్కన పెడితే, కాకా మెగాస్టార్ ఇమేజ్ కి నూటికి నూరు శాతం కరెక్ట్ టైటిల్. Chiranjeevi, Kaaka, Kadiri, Tollywood
Aug 22, 2026 11:50AM
విజయసాయి రెడ్డి కొత్త పార్టీలో చేరబోతున్న నటులు వీళ్ళే!
తెలుగు నాట మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోవడానికి సిద్దమయ్యింది. మాజీ ఎం పి, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ విజయసాయిరెడ్డి ఆ కొత్త రాజకీయ పార్టీ సారధి. దీంతో సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ విజయసాయి రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీలో సినీ రంగానికి చెందిన పలువురు నటులు చేరబోతున్నారనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సినీ రంగానికి చెందిన కొందరు ప్రముఖులు ఇప్పటికే ఆయనతో టచ్‌లో ఉన్నారని, పార్టీ ఆవిర్భావ వేదికపై వారందరూ కనిపిస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు దర్శనమిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందనే అంశాన్ని పరిశీలిస్తే, ఇవన్నీ కేవలం నెట్టింట చక్కర్లు కొడుతున్న రూమర్లు మాత్రమేనని స్పష్టమవుతోంది. విజయసాయి రెడ్డి వైపు నుంచి కానీ, లేదా ఆయా సినీ నటుల వైపు నుంచి కానీ ఎలాంటి అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు. గతంలో వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు కూడా సినీ రంగానికి చెందిన పలువురితో ఆయనకు మంచి సంబంధాలు ఉండటం, పైగా టాలీవుడ్ ప్రముఖులతో ఆయనకున్న పాత పరిచయాల కారణంగానే ఈ తరహా ప్రచారాలు పుట్టుకొచ్చాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే రాజకీయం, సినిమా అనేవి ఒకే తల్లి కడుకున పుట్టిన ట్విన్స్. Also Read: రామ్ పోతినేనికి విలన్‌గా మారిన ఆ స్టార్ హీరో!. Telugu Cinema, Tollywood
Aug 19, 2026 12:41PM
ప్రొడ్యూసర్ గా ఎన్టీఆర్: 'NTRTAIN' వెనుక అసలు రహస్యం.!
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మరో కీలక అడుగు వేయబోతున్నారు. హీరోగా పాన్ ఇండియా స్థాయిలో అలరిస్తున్న తారక్.. ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా మారి సొంతంగా ఒక నయా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే తారక్ మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో ఎంతలా వైరల్ అయిందో మనందరం చూశాం. అయితే ఇప్పుడు అంతకు మించిన ఒక సెన్సేషనల్ న్యూస్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఒక బ్రాండ్ న్యూ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నారట. ఎన్టీఆర్ (NTR) అనే పేరులోని పవర్, ఎంటర్టైన్ (ENTERTAIN) అనే పదంలోని మ్యాజిక్‌ను కలుపుతూ.. 'ఎన్టీఆర్ టైన్' NTRTAIN అనే బ్యానర్ నేమ్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తారక్ నటిస్తున్న ప్రాజెక్ట్స్ అన్నింటికీ తన అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్‌కి చెందిన ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. మరి అలాంటప్పుడు తారక్ సొంతంగా ఈ కొత్త బ్యానర్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నట్లు? ఈ 'NTRTAIN' బ్యానర్ కళ్యాణ్ రామ్ 'ఎన్టీఆర్ ఆర్ట్స్' ను రీప్లేస్ చేయబోతుందా? లేక తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చే యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించడానికి ఎన్టీఆర్ ఈ ప్రత్యేకమైన అడుగు వేస్తున్నారా? అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. మరి ఎన్టీఆర్ నిజంగానే నిర్మాతగా మారబోతున్నారా? ఒకవేళ నిజమైతే 'NTRTAIN' బ్యానర్ నుంచి వచ్చే మొదటి సినిమా ఏంటి? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. Jr NTR, New Banner, NTRTAIN
Aug 19, 2026 12:10PM
కియారా అద్వానీకి షాక్: రామ్ చరణ్ సరసన 'ధురంధర్' బ్యూటీ.!
'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబో తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ #RC17 తో మరోసారి బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా హీరోయిన్ ఎంపికకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా మొదట బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పేరు వినిపించింది. 'వినయ విధేయ రామ', 'గేమ్ ఛేంజర్' చిత్రాల తర్వాత చరణ్-కియారా కాంబో మరోసారి రిపీట్ అవ్వబోతోందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. హీరోయిన్ విషయంలో ఊహించని బిగ్ చేంజ్ జరిగిందని తెలుస్తోంది. సుకుమార్ అండ్ టీమ్ ఈ ప్రాజెక్ట్ కోసం కియారా అద్వానీని పక్కన పెట్టి, ఒక సరికొత్త ఫ్రెష్ పెయిరింగ్ కోసం అన్వేషిస్తున్నారట. ఇందులో భాగంగానే 'ధురంధర్' సినిమాలో 'యలీనా' పాత్రలో తన నటనతో, క్యూట్‌నెస్‌తో మిలియన్ల మంది హృదయాలను కొల్లగొట్టి, అందరి దృష్టినీ ఆకర్షించిన సారా అర్జున్ పేరును సుకుమార్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టర్లు కేవలం గ్లామర్‌కే పరిమితం కావు.. కథను నడిపించేంత పవర్ఫుల్ ఎమోషన్ వాళ్ల పాత్రల్లో ఉంటుంది. అందుకే ఒక యంగ్ అండ్ ప్రామిసింగ్ ఫేస్‌తో రామ్ చరణ్‌ని స్క్రీన్ పై పెయిర్ చేస్తే, ఆ ఫ్రెష్‌నెస్ సినిమాకే పెద్ద ప్లస్ అవుతుందని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. RC17 Movie, Ram Charan, Sara Arjun, Sukumar, Kiara Advani
Aug 18, 2026 6:55PM
బెదురులంక డైరెక్టర్‌కి షాక్: నాగ చైతన్య 25వ సినిమా ఆ స్టార్ డైరెక్టర్‌తోనే.?
అక్కినేని అభిమానులకు ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్. యువసామ్రాట్ నాగ చైతన్య కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 25వ సినిమా గురించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఊహించని వార్త చక్కర్లు కొడుతోంది. చైతన్య 25వ సినిమా గురించి ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. 'బెదురులంక 2012' ఫేమ్ క్లాక్స్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని న్యూస్ వినిపించింది. అయితే ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం హ్యాట్రిక్ హిట్ల దర్శకుడు వెంకీ అట్లూరి రంగంలోకి దిగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెంకీ అట్లూరి ప్రెజెంట్ టాలీవుడ్లో ఒక సాలిడ్ హిట్ ట్రాక్‌లో ఉన్నారు. 'సార్', 'లక్కీ భాస్కర్' వంటి వైవిధ్యమైన సినిమాలతో వరుసగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించారు. రీసెంట్ గా వచ్చిన 'విశ్వనాథ్ & సన్స్'తో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేస్తున్నారు. అయితే గత కొన్నాళ్లుగా ఆయన ఇతర భాషల హీరోలతో వరసగా సినిమాలు చేశారు. అందుకే ఇప్పుడు మళ్ళీ ఒక ప్రాపర్ తెలుగు హీరోతో, అందునా ఒక మైల్స్టోన్ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇక మరోవైపు సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ కూడా నాగ చైతన్యతో ఒక బిగ్ ప్రాజెక్ట్ చేయాలని చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల అక్కినేని అఖిల్ 'లెనిన్' సినిమా ప్రమోషన్స్ విషయంలో నాగవంశీ చూపించిన శ్రద్ధ అక్కినేని కాంపౌండ్‌కు చాలా బాగా నచ్చింది. పైగా వెంకీ అట్లూరి హోమ్ బ్యానర్ లాంటిది సితార ఎంటర్టైన్మెంట్స్. అందుకే ఈ ముగ్గురి కాంబినేషన్లో NC25 సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి నాగ చైతన్య మైల్స్టోన్ సినిమా కోసం వెంకీ అట్లూరి ఎలాంటి కథ అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అన్నీ అనుకున్నట్టు కుదిరి.. నాగ చైతన్య 25వ సినిమా వెంకీ అట్లూరి డైరెక్షన్లో వస్తే.. ఆ తర్వాత ప్రాజెక్ట్ క్లాక్స్ దర్శకత్వంలో వచ్చే ఛాన్స్ ఉంది. NC25 Movie, Naga Chaitanya, Venky Atluri
Aug 17, 2026 4:18PM
అఖిల్, భాగ్యశ్రీ బోర్సే కాంబో రిపీట్: వివరాలు ఇవే!
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే తమ ఎంటైర్ సినీ కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా లెనిన్ ని మాత్రం మర్చిపోవడం అసాధ్యం. ఎందుకంటే తమ కెరీర్ లో మొదటి సూపర్ హిట్. పైగా విజయం ఇచ్చిన బోనస్ ఏంటంటే ఆ ఇద్దరు అత్యుత్తమైన పెర్ఫార్మ్ ప్రదర్శించారు. వీరిద్దరి హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోందనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో 60 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఒక యాక్షన్ అండ్ లవ్ డ్రామాలో ఈ జోడీ మళ్లీ జతకట్టబోతున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఒక నూతన దర్శకుడు చెప్పిన వైవిధ్యమైన లైన్ అఖిల్‌తో పాటు భాగ్యశ్రీకి కూడా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌కి ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ వార్త తెలిసినప్పటి నుండి అక్కినేని అభిమానులు సందడి చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ న్యూస్ రూమర్ హోదాలోనే తన మనుగడ కొనసాగిస్తోంది. కానీ ఈ న్యూస్ నిజమైతే మొట్టమొదట ఆనందించేది రూమర్ నే. also read: Toxic: టాక్సిక్ హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా? AKhil, Bhagyashri Borse
Aug 12, 2026 6:02PM
హీరోగా కేటీఆర్ కుమారుడు: సినీ ఎంట్రీ ఇస్తున్న కల్వకుంట్ల హిమాన్షు.!
మనం సాధారణంగా పొలిటిషియన్స్ పిల్లలను చూస్తే.. తండ్రి బాటలోనే రాజకీయం చేస్తారని లేదా సొంతంగా ఏవైనా బిజినెస్ లు చూసుకుంటారని అనుకుంటాం. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ, టాలీవుడ్ సర్కిల్స్ లోనూ ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు, మాజీ సీఎం కేసీఆర్ మనవడు అయిన కల్వకుంట్ల హిమాన్షు.. త్వరలోనే వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారట. కల్వకుంట్ల కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా హిమాన్షు ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ, అనూహ్యంగా ఆయన రాజకీయాల్లోకి కాకుండా.. వెండితెరపై మెరవడానికి రెడీ అవుతున్నారనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హిమాన్షు డెబ్యూ చాలా గ్రాండ్ గా ఉండబోతోందట. దీని కోసం టాలీవుడ్ లోని ఒక ప్రముఖ నిర్మాత, పవర్ ఫుల్ డైరెక్టర్ తో ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల హిమాన్షు అద్భుతమైన మేకోవర్ తో ఫిట్ గా, పక్కా "హీరో మెటీరియల్"లా కనిపిస్తున్నారు. తన లుక్స్ పై, ఫిజిక్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం చూస్తుంటే.. ఈ సినీ ఎంట్రీ వార్తలు కేవలం పుకార్లు మాత్రమే కావు, దీని వెనుక పెద్ద ప్లానింగే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. KCR Grandson, KTR Son, Kalvakuntla Himanshu, Hero Entry, Telangana
Aug 12, 2026 11:24AM
సంచలన వార్త: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. వద్దంటున్న టాప్ డైరెక్టర్!
హీరో, దర్శకుడు. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ ఇద్దరి దర్మం మాత్రం అభిమానులని, ప్రేక్షకులని అలరించి ఆ ఇద్దర్ని నమ్ముకున్న నిర్మాత ముఖంలో, సినీ కళామతల్లి మొహాల్లో నవ్వులు పూయించడం. కానీ ఇప్పుడు ఆ ఇద్దరకీ సంబంధించిన గాసిప్ ఒకటి తెలుగు ఫిల్మ్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా టాలీవుడ్లో ఒక మోస్ట్ క్రేజీ కాంబినేషన్ సెట్ అయిందంటే చాలు, అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. అలాంటిది ఏకంగా ఇండియన్ సినీ పరిశ్రమలోనే అత్యంత క్రేజీ కాంబినేషన్లలో ఒకటిగా ముద్రపడిన ఒక స్టార్ హీరో, మరో అగ్ర దర్శకుడి మధ్య ఇప్పుడు సీక్వెల్ విషమై తీవ్రమైన అంతర్గత విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ మరియు భారీ అంచనాల నడుమ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్ నుంచి బయటకు వచ్చిన ఒక తాజా వార్త సినిమా వర్గాలతో పాటు అభిమానులను సైతం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.అసలు విషయం ఏమిటంటే, ఈ భారీ చిత్రంలో నటిస్తున్న సదరు స్టార్ హీరో ఈ కథకు భారీ స్కోప్ ఉందని భావించి, దీనిని కేవలం ఒక్క భాగంతో ముగించకుండా "పార్ట్-2" కూడా నిర్మిస్తే బాగుంటుందని గట్టిగా పట్టుబడుతున్నారట. ఒకవేళ సీక్వెల్ చేస్తే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయవచ్చని హీరో భావిస్తున్నట్లు సమాచారం. కానీ సదరు స్టార్ డైరెక్టర్ మాత్రం హీరో ప్రతిపాదనకు ఏమాత్రం సుముఖంగా లేరని తెలుస్తోంది. కథను రెండు భాగాలుగా విస్తరిస్తే దాని ఆత్మ దెబ్బతింటుందని, సినిమా ల్యాగ్ అయి ప్రేక్షకులకు విసుగు తెప్పించే అవకాశం ఉందని దర్శకుడు అభిప్రాయపడుతున్నారట. సింగిల్ పార్ట్‌లోనే కథలోని అసలైన భావోద్వేగాలు, ఉత్కంఠని పకడ్బందీగా అందించవచ్చని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. Also read: వైరల్: పూరి జగన్నాధ్ కూతురు కలలోకి వచ్చిన ఆ దేవుడు.. పూర్తిగా లీనమైపోదంట ఈ అభిప్రాయ భేదాల వల్ల ప్రస్తుతం హీరో మరియు దర్శకుడి మధ్య తీవ్రమైన కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం సీక్వెల్ నిర్ణయానికే పరిమితం కాకుండా, సెట్స్‌లో సీన్స్ తీసే విధానంలో కూడా విభేదాలు బయటపడుతున్నాయట. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ సమయంలో హీరో సూచించే మార్పులు, చేర్పులకు డైరెక్టర్ విముఖత చూపుతున్నారని సమాచారం. దీంతో వీరిద్దరి మధ్య ఈగో వార్ నడుస్తోందని, చిత్రీకరణ వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారుతోందని టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో టాలీవుడ్లోనే కాకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా సీక్వెల్స్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి పెద్ద సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించి వందల కోట్ల బిజినెస్ చేయడం కామన్ ట్రెండ్‌గా మారింది. ఈ నేపథ్యంలో సదరు స్టార్ హీరో కూడా తన ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా చేయాలని కోరడంలో పెద్దగా వింతేమీ లేదని కొందరు వాదిస్తున్నారు. కానీ, డైరెక్టర్ మాత్రం కంటెంట్ నాణ్యతకే ప్రాధాన్యత ఇస్తూ పార్ట్-2 ప్రతిపాదనని తిరస్కరిస్తుండటం విశేషం. మరి చివరకి ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఎవరకి వాళ్ళు నియంతగా భావించుకుంటారు. కానీ అన్నిటికంటే పెద్ద నియంత కాలమే.. కాబట్టి వెయిట్ చేద్దాం. Hero, Director, Tollywood
Aug 11, 2026 4:42PM
బిగ్గెస్ట్ మల్టీస్టారర్: ఆ భారీ పాన్ ఇండియా మూవీలో వెంకటేష్.!
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తన 64వ చిత్రం 'డేర్‌డెవిల్'ను రీసెంట్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో అజిత్‌కు సాలిడ్ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈసారి కేవలం తమిళ మార్కెట్ మాత్రమే కాకుండా, పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేశారు. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఒక సంచలన మల్టీస్టారర్ కాంబినేషన్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ విక్టరీ వెంకటేష్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు స్టార్స్ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే.. థియేటర్లు షేక్ అవ్వడం గ్యారెంటీ. త్వరలోనే ఈ మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్ గురించి క్లారిటీ రానుంది. అజిత్ కుమార్ సతీమణి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ షాలిని తన కొత్త బ్యానర్ 'బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్'పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. Ajith Kumar, Dare Devil, Venkatesh, Mohanlal
Aug 11, 2026 11:15AMచిరు 158వ చిత్రంలో యంగ్ హీరోయిన్ ఎంట్రీ.. సెకండాఫ్‌లో మైండ్ బ్లాకింగ్ కేమియో?
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్లో రూపొందుతున్న 'మెగా 158'పై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కి సంబంధించి తాజాగా ఫిలింనగర్లో ఒక ఆసక్తికరమైన ప్రచారం ఊపందుకుంది. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ చిత్రంలో ఆమె పూర్తిస్థాయి హీరోయిన్గా కాకుండా, కథను మలుపు తిప్పే ఒక విశిష్టమైన అతిథి పాత్రలో కనిపించనుందని సమాచారం. ముఖ్యంగా సినిమా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల్లో మీనాక్షి పాత్ర ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. చిరంజీవితో కలిసి ఆమె చేసే సీన్స్ అభిమానులకు మంచి థ్రిల్ ఇస్తాయని టాక్. ప్రస్తుతం ఈ పాత్ర విషయమై చిత్రబృందం ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి, బాబీ కలయికలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో వీరిద్దరి కాంబోలో రూపుదిద్దుకుంటున్న ఈ రెండో సినిమాపై ట్రేడ్ వర్గాల్లోను, మెగా అభిమానుల్లోను విపరీతమైన క్రేజ్ నెలకొంది. మునుపటి చిత్రాల విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త ప్రాజెక్ట్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుండటంతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మీనాక్షి కేమియో గురించిన వార్త బయటకు రావడంతో అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్ని పనులు శరవేగంగా పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్లో 'మెగా 158'ని థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అతిత్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని బిగ్ అప్డేట్స్ వెలువడే అవకాశం ఉంది. Chiranjeevi, Bobby Kolli, Mega 158, Meenakshi Chaudhary, KVN Productions
Aug 10, 2026 11:40AM
హనుమంతుడిగా రామ్ చరణ్: 'వారణాసి'తో రాజమౌళి బిగ్గెస్ట్ గ్లోబల్ ప్లాన్.!
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ 'వారణాసి' గురించి ఒక మైండ్ బ్లాకింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ అడ్వెంచరస్ ఎపిక్‌లోకి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఎంతో పవర్ఫుల్ అండ్ డివైన్ రోల్ అయిన 'హనుమంతుడి' పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నారనే న్యూస్.. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. గతంలో హనుమంతుడి పాత్ర కోసం వర్సటైల్ యాక్టర్ మాధవన్ పేరు ప్రముఖంగా వినిపించింది. రాజమౌళి విజన్‌కి తగ్గట్టు మాధవన్ లుక్ అండ్ పెర్ఫార్మన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా రామ్ చరణ్ పేరు తెరపైకి రావడంతో.. ఒక్కసారిగా అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. 'వారణాసి' మూవీలో వచ్చే త్రేతాయుగం ఎపిసోడ్ లో మహేష్ బాబు కాసేపు శ్రీరాముడిగా కనువిందు చేయనున్నారు. ఆ ఎపిసోడ్ లో హనుమంతుడిగా రామ్ చరణ్ నటిస్తే.. ఆ మేనియా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో రామ్ చరణ్‌ను ఆల్రెడీ గ్లోబల్ వైడ్‌గా ప్రొజెక్ట్ చేశారు రాజమౌళి. చరణ్ లోని ఆ ఇంటెన్స్ అండ్ డివైన్ షేడ్స్‌ను.. 'అల్లూరి సీతారామరాజు' పాత్రలో క్లైమాక్స్ వద్ద ఎంతో అద్భుతంగా చూపించారు. అందుకే ఈ హనుమంతుడి క్యారెక్టర్‌కి రామ్ చరణ్ అయితేనే పర్ఫెక్ట్ న్యాయం జరుగుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి ఇది నిజంగానే రాజమౌళి వేసిన బిగ్గెస్ట్ ప్లానా? లేక కేవలం సోషల్ మీడియాలో షికారు చేస్తున్న రూమరా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ మహేష్ బాబు, రామ్ చరణ్ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించి.. అది కూడా రాజమౌళి మార్క్ మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌తో ఉంటే... బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ ఖాయం. Ram Charan, Hanuman, Varanasi, Mahesh Babu, SS Rajamouli
Aug 8, 2026 2:43PM
అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మూవీలో మరో స్టార్ హీరో.!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోతున్న #AA23 సినిమా గురించి ఒక బిగ్ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర కోసం ఓ స్టార్ హీరో రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ క్రేజీ కాంబో కావడంతో 'AA23'పై అనౌన్స్ మెంట్ తోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తన గత చిత్రం 'కూలీ'తో అంచనాలను అందుకోలేకపోయిన లోకేష్.. ఈసారి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసి, తన పవరేంటో చూపించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకే 'AA23' విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. 'AA23'లో కథకు కీలకమైన ఓ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ పేరును పరిశీలిస్తున్నారట. లోకేష్ కనగరాజ్ తన సినిమాల్లో ప్రతి పాత్రను ఎంత పవర్ఫుల్ గా డిజైన్ చేస్తారో తెలిసిందే. దీంతో ఇప్పుడు షాహిద్ కపూర్ పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'రాకా' సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది చివరి కల్లా ఆ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. ఆ తర్వాత లోకేష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. Allu Arjun, Lokesh Kanagaraj, AA23, Shahid Kapoor
Aug 6, 2026 3:12PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com






