ఈ స్టైలిష్ నెయిల్ ఆర్ట్ డిజైన్‌లు మీరూ ట్రై చేయండి

Publish Date:Sep 11, 2023

ఈ స్టైలిష్ నెయిల్ ఆర్ట్ డిజైన్‌లు మీరూ ట్రై చేయండి చాలా మంది మహిళలు తమ గోళ్లను అందంగా మార్చుకోవడానికి సెలూన్‌కి వెళ్లి మెనిక్యూర్ చేయించుకోవడానికి ఇష్టపడతారు. అయితే మీరు బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండానే ఇంట్లోనే  మీరు నెయిల్ ఆర్ట్‌తో మీ గోళ్లకు అందమైన డిజైన్‌ను కూడా ఇవ్వవచ్చు. నెయిల్ ఆర్ట్ క్లిష్టంగా కనిపించవచ్చు కానీ మీరు ఇంట్లోనే మీ గోళ్లకు సులభంగా అందమైన రూపాన్ని ఇవ్వవచ్చు. ఈ రోజుల్లో మహిళలు సరళమైన, హుందాగా ఉండే రంగు డిజైన్లలో ఫ్యాన్సీ నెయిల్ ఆర్ట్‌ను చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ నెయిల్ ఆర్ట్ చేయడానికి పదే పదే నెయిల్ ఆర్ట్ స్టూడియోకి వెళ్లడం వల్ల మీ నెయిల్స్ బలహీనంగా మారుతాయని మీకు తెలుసా?.. ఎలాంటి ప్రొఫెషనల్ సహాయం లేకుండానే మీరు చేయగలిగిన నెయిల్ ఆర్ట్‌లోని కొన్ని సరళమైన,  హుందాగా ఉండే డిజైన్‌లను చూద్దాం. ఇంట్లో మీరే చేయోచ్చు. 1. జిగ్‌జాగ్ డిజైన్: ఈ నెయిల్ ఆర్ట్ తయారు చేయడం చాలా సులభం. 2. హాఫ్ మూన్ స్టైల్: ఈ నెయిల్ ఆర్ట్ చాలా సింపుల్ గాచ చేయోచ్చు. 3. స్టోన్ వర్క్ నెయిల్ ఆర్ట్ డిజైన్: ఈ రకమైన నెయిల్ ఆర్ట్ చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది. 4. షిమ్మర్ డిజైన్ నెయిల్ ఆర్ట్:   సరళంగా, హుందాగా ఉంటుంది. 5. మోనోక్రోమ్ గ్రాఫిక్ నెయిల్ ఆర్ట్: ఇది సరికొత్త డిజైన్, చాలా మంది మహిళలకు ఈ నెయిల్ ఆర్ట్ గురించి తెలియదు. 6. స్ట్రిప్ డిజైన్ నెయిల్ ఆర్ట్ డిజైన్‌లో మీరు ఏ నిపుణుల సహాయం తీసుకోవలసిన అవసరం లేదు.   7. పోల్కా డాట్ నెయిల్ ఆర్ట్ అనేది బట్టలు లేదా పాదరక్షల ట్రెండ్‌లో మాత్రమే కాకుండా, నెయిల్ ఆర్ట్‌లో పోల్కా డాట్ లుక్‌ని కూడా అమ్మాయిలు ఇష్టపడుతున్నారు.
[

Beauty

]

ఏళ్లు గడిచినా అందం చెక్కుచెదరకూడదంటే వీటిని తినాల్సిందే..

Publish Date:Sep 20, 2023

ఏళ్లు గడిచినా అందం చెక్కుచెదరకూడదంటే వీటిని తినాల్సిందే..    అందం వ్యక్తుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంచారు. ఇందులో మహిళలదే పైచేయి. అందంగా కనిపించడం కోసం మహిళలు ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్ట్ వాడుతుంటారు.  కెమికల్స్‌తో నిండిన బ్యూటీ ప్రొడక్ట్స్   తాత్కాలిక అందాన్ని ఇస్తాయే కానీ దీర్ఘకాల అందాన్ని,  యవ్వనాన్ని ఎప్పటికీ అందించవు. పైపెచ్చు ఎక్కువ కాలం వాటిని వాడటం వల్ల చర్మం దెబ్బ తింటుంది. నిజానికి, బ్యూటీ ప్రొడక్ట్స్ చర్మం అందంగా కనిపించేలా చేస్తాయి  కానీ  చర్మాన్ని దీర్ఘకాలం యవ్వనంగా,  అందంగా ఉంచవు. కొల్లాజెన్ ఈ పని చేస్తుంది. కొల్లాజెన్ ఒక ప్రొటీన్. శరీరం  30 శాతం ప్రోటీన్ కొల్లాజెన్‌తో రూపొందించబడింది, ఇది  చర్మం, కండరాలు, ఎముకలకు సపోర్ట్ ను, బలాన్ని అందిస్తుంది. వయస్సు పెరిగేకొద్దీ  శరీరంలోని కొల్లాజెన్ విచ్ఛిన్నమవుతుంది.  కొత్త కొల్లాజెన్‌ను తయారు చేసే ప్రక్రియ కూడా క్రమంగా తగ్గుతుంది. అందువల్ల  తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి,  చర్మం వృద్ధాప్యాన్ని నిరోధించడానికి కొన్ని శక్తివంతమైన ఆహారాలు ఉన్నాయి. ఇవి ఔషదాలుగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుంటే..  అశ్వగంధ.. తీసుకునే  ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవాలి. ఇది ఆయుర్వేద మూలిక, దీన్ని  ఉపయోగించడం వల్ల  వృద్ధాప్య లక్షణాలను క్రమంగా తగ్గించవచ్చు. ఉసిరి.. ఉసిరిలో  విటమిన్ సి చాలా ఉంటుంది. ఉసిరి శరీరంలోని కొల్లాజెన్ స్థాయిని సహజంగా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది వృద్ధాప్య సంకేతాలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు దెబ్బతిన్న చర్మాన్ని కూడా రిపేర్ చేస్తుంది.   తులసి.. తులసి గొప్ప ఔషద మూలిక. ఇందులో ఉండే  ఉర్సోలిక్ యాసిడ్, రోస్మరినిక్ యాసిడ్,  యూజినాల్  చాలా శక్తివంతమైనవి. ఇవి  గొప్ప యాంటీఆక్సిడెంట్లు.  ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి తులసిలో చాలా  ఉంది. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే   చర్మంలో కొల్లాజెన్ పెరుగుతుంది. నెయ్యి.. నెయ్యిలో విటమిన్ ఎ, డి,  ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మానికి ఎంతో అవసరం. విటమిన్ ఎ కొలెస్ట్రాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా,  అందంగా మార్చే  ప్రోటీన్. నెయ్యిలో విటమిన్లు కూజా చాలా  ఉంటాయి.  ఇది వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది,  అకాల వృద్ధాప్యాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. బ్రహ్మి.. బ్రాహ్మిని సరస్వతి అని కూడా అంటారు. ఇది  ఆయుర్వేద మూలిక. ఇది గొప్ప యాంటీఆక్సిడెంట్,  యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కణాలను మెరుగుపరుస్తుంది,  కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది ఫార్మాస్యూటికల్,  ఆయుర్వేద సూత్రీకరణలలో ప్రెగ్నెన్సీ తర్వాత స్కిన్ పిగ్మెంటేషన్,  స్ట్రెచ్ మార్కులను తేలికగా చేయడానికి ఉపయోగిస్తారు.                                            *నిశ్శబ్ద.
[

Health

]

మహిళలలో పిసిఒయస్ సమస్యకు కారణాలు.. పరిష్కార మార్గాలు..

Publish Date:Sep 21, 2023

 మహిళలలో పిసిఒయస్ సమస్యకు కారణాలు.. పరిష్కార మార్గాలు.. ఒక వయసు వచ్చాక అమ్మాయిలలో ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి.  అవి మెల్లగా పెరుగుతూ మహిళలను చాలా రకాలుగా ఇబ్బందికి గురిచేస్తాయి. మహిళలలో సాధారణంగా కనిపించే సమస్యలలో పిసిఒఎస్ ఒకటి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ గా పిలువబడే ఈ సమస్య  మహిళలలో చాలా తీవ్రమైన పరిస్థితులకు కారణం అవుతుంది. ఇది ప్రధానంగా హార్మోన్ సమస్యగా పరిగణింపబడుతుంది.  పునరుత్పత్తి వయస్సు మహిళలలో వస్తుంది. ఈ సమస్య ఉన్న మహిళలలో నెలసరి రావడం నుండి, ఆ సమయంలో జరిగే ఋతుస్రావం వరకు చాలా విషయాలు ప్రభావితం అవుతాయి. ఇది పూర్తిగా మహిళల మానసిక  స్థితిని దెబ్బతీసే సమస్య.  పిసిఒఎస్ సమస్య గురించి మహిళలలో సరైన అవగాహన కలిగించడానికి,  ఈ సమస్యను అధిగమించే విషయంలో మహిళలను ప్రోత్సహించడానికి సెప్టెంబర్ నెలను పిసిఒయస్ అవగాహనా నెలగా కేటాయించారు.  మహిళలలో ఎక్కువగా కనిపించే ఈ సమస్య గురించి వివరంగా తెలుసుకుని, దీనికి పరిష్కార మార్గాలేమిటో విశ్లేషించడం ఎంతో ముఖ్యం. పిసిఒఎస్.. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్యకు ఖచ్చితమైన కారణం అంటూ ఏదీ  ఇప్పటి వరకు తెలియదు. ఆరోగ్య నిపుణులు మహిళలలో కనిపించే  కొన్ని మార్పుల కారణంగా  సమస్యకు మూలాన్ని అంచనా వేసి దానికి తగిన పరిష్కాలు సూచిస్తుంటారు. మహిళలలో  నెలసరి సమస్యలు రావడం, దీర్ఘకాలం రక్తస్రావం జరగడం, లేదా నెలసరిలో తగినంత రక్తస్రావం జరగకపోవడం వంటి సమస్యలు పిసిఒఎస్ సమస్యలున్న మహిళలలో కనిపిస్తుంటాయి.  ఇది చాలా కాలం  కొనసాగడం వల్ల మహిళలలో పిల్లలు పుట్టడంలో అవాంతరాలు ఏర్పడతాయి.  ఈ సమస్యకు అధికబరువు, హార్మోన్ అసమతుల్యత  ముఖ్యకారణాలు కావచ్చునని వైద్యులు చెబుతున్నారు.   నివారణ ఎలాగంటే.. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అధిక బరువు ఉన్న మహిళలలో పిసిఒఎస్ సమస్య వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారు బరువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బరువు తగ్గడానికి ఎంత ప్రయత్నం చేస్తే ఈ సమస్య కూడా అంత తగ్గే అవకాశం ఉంటుంది.  బరువు నియంత్రణలోకి వచ్చే కొద్ది శరీరంలో హార్మోన్లు కూడా మెల్లిగా చక్కబడతాయి.  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, పోషకాల సహాయంతో బరువు తగ్గడం వల్ల పిసిఒఎస్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఆహారం.. పిసిఒయస్ సమస్యను నియంత్రించడానికి సరైన పోషకాహారం ముఖ్యం.  కార్భోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం తగ్గించాలి. ఇది ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు.  పిసిఒయస్ సమస్యను అరికట్టడానికి సింపుల్ గా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని తగ్గించి వాటి స్థానంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవడం వల్ల చాలావరకు సమస్యను అదుపులో ఉంచవచ్చు. చురుగ్గా ఉండాలి..  ఒకేచోట కూర్చుని పనిచేయడం అధికబరువుకు ప్రధాన కారణం అవుతుంది. నేటికాలంలో బిజీ పేరుతో శారీరక వ్యాయామం చేయకపోడం కూడా అధికబరువుకు కారణమే. ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీ జీవితం గడుపుతున్నా రోజులో కొద్దసేపు వ్యాయామం, యోగ, ధ్యానం మొదలైనవాటికి కేటాయించడం చాలా ముఖ్యం. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది.  బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అధికబరువు ఉన్నా పిసిఒయస్ సమస్య ఉండకూడదు అంటే క్రమం  తప్పకుండా వాకింగ్, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. వీటిని పాటిస్తే శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఫలితంగా పిసిఒయస్ సమస్య తగ్గిపోతుంది.                                                                 *నిశ్శబ్ద.  

ఈ సమయంలో పండ్లు తింటే సులభంగా బరువు తగ్గుతారు..!!

Publish Date:Sep 14, 2023

ఈ సమయంలో పండ్లు తింటే సులభంగా బరువు తగ్గుతారు..!!     మన ఆహారం, జీవనశైలిలో పండ్ల వినియోగం చాలా అవసరం. కానీ పండ్లు సరైన మోతాదులో, సరైన సమయంలో తీసుకోవాలి. కానీ క్యాలరీలు, ఫైబర్, గ్లూకోజ్ అధికంగా ఉండే పండ్లు, తప్పుడు సమయంలో తప్పుడు కాంబినేషన్‌లో తీసుకోవడం వల్ల బరువు పెరగడానికి బదులుగా మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రయోజనం ఉండదు.  కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. అయితే పండ్లు ఈ సమయంలో తింటే బరువు సులభంగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పండ్లను ఎంచుకోండి: పోషకాహార నిపుణులు బెర్రీలు, చెర్రీస్, యాపిల్స్, బేరి వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను ఎంచుకోవాలని సూచించారు. ఈ పండ్లు చక్కెరను రక్తప్రవాహంలోకి నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు పెరగడానికి దారితీసే స్పైక్‌లను నివారిస్తుంది. పండ్లను ప్రోటీన్‌తో జత చేయండి: మీ పండ్ల తీసుకోవడం మరింత సమతుల్యంగా, సంతృప్తికరంగా చేయడానికి, వాటిని ప్రోటీన్ తో తీసుకోండి. గ్రీక్ పెరుగు, కాటేజ్ చీజ్ లేదా కొన్ని డ్రై ఫ్రూట్స్ వంటి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని పండ్లతో పాటు తినడం వల్ల ఆకలిని అరికట్టవచ్చు. మిమ్మల్ని ఎక్కువసేపు ఆకలి లేకుండా కడుపు నిండుగా ఉంచుతుంది. ఖాళీ కడుపుతో పండ్లు తినకూడదు: పండ్లు పుష్టికరమైనవి అయినప్పటికీ, వాటిని ఖాళీ కడుపుతో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. దీనిని నివారించడానికి, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, తృణధాన్యాలు కలిగి ఉన్న సమతుల్య భోజనం లేదా చిరుతిండిలో భాగంగా పండ్లను తినమని పోషకాహార నిపుణుల సూచిస్తున్నారు. సమతుల్య ఆహారంలో పండ్లను చేర్చండి:  కేవలం చిరుతిండిగా పండ్లపై ఆధారపడకుండా, అదనపు పోషకాలు, ఫైబర్ కోసం వాటిని మీ భోజనంలో చేర్చుకోండి. సలాడ్‌లకు పండ్లను జోడించండి, వాటిని స్మూతీస్‌లో కలపండి లేదా తృణధాన్యాలు లేదా వోట్మీల్ కోసం వాటిని టాపింగ్స్‌గా ఉపయోగించండి. జ్యూస్‌లు తాగడం కంటే పండ్లను తినండి: పండ్ల రసాలు తాగేందుకు సౌకర్యవంతగా ఉన్నప్పటికీ..., అవి తరచుగా మొత్తం పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్‌ను కలిగి ఉండవు. చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉండవచ్చు. ఫైబర్ నుండి ప్రయోజనం పొందడానికి మొత్తం పండ్లను తినడం ఉత్తమం. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి, మార్కెట్‌లోని అన్ని కాలానుగుణ పండ్లలో అత్యంత పోషక ప్రయోజనాలను పొందండి.
[

Yoga

]

వర్షాకాలంలో ఫిట్నెస్ విషయంలో బెంగా.. అయితే ఈ ఆసనాలు వేసేయండి..

Publish Date:Sep 22, 2023

 వర్షాకాలంలో ఫిట్నెస్ విషయంలో బెంగా.. అయితే ఈ ఆసనాలు వేసేయండి..   ఫిట్ గా ఉండటం కోసం మహిళలు చాలా కష్టపడతారు. కానీ వారి కష్టానికి వాతావరణం శత్రువుగా మారే సందర్బం ఇది. ఈ వర్షాకాలంలో మహిళలు  ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకోవడం కాస్త కష్టం.  తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల మధ్య  వ్యాయామాలు,  ఇతర వర్కౌట్లు చేయడం కాస్త కష్టం.  అయితే దీనికి కూడా చక్కని పరిష్కారముంది.  తేమతో కూడిన వాతావరణంలో నీటిని సరిపడినంతగా తీసుకుంటూ కాసింత గాలి వెలుతురు ఉన్న ప్రదేశంలోనే యోగా చేయడం వల్ల మహిళల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అందుకోసం ఏం చేయాలంటే..  సూర్య నమస్కారాలు.. సూర్యనమస్తారంలో  వేసే  భంగిమలు  క్రమంగా  శరీరాన్ని వేడెక్కేలా చేస్తుంది, శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీలంలో పట్టుత్వాన్ని  పెంచుతుంది.  సూర్యనమస్కార  భంగిమలను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడ  శరీరంలో వివిధ  అవయవాలు సుష్టంగా మారతాయి, ఇది  అంతర్గత ముఖ్యమైన అవయవాలు మెరుగ్గా పని చేయడంలో సహాయపడుతుంది. రిథమిక్ శ్వాస ,  కదలికలు ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణంలో ఉత్తేజాన్నిస్తాయి. సాధారణ అభ్యాసంతో..  శరీరం, శ్వాస, శరీరంలో చైతన్యం  మధ్య లోతైన సంబంధాన్ని ఏర్పరుచుకునే అవగాహనను పెంచుతుంది. త్రికోణాసనం.. త్రికోణాసనం శరీరంలో ముఖ్యంగా ఛాతీ భాగాన్ని యాక్టీవ్ చేస్తుంది.  నిలబడుకుని ఉన్నప్పుడు ఇది భుజాలను సాగదీయడానికి సహాయపడుతుంది. శరీరం సమతుల్యంగా ఉండేలా చేస్తుంది. శలభాసనం.. దీనినే మిడత భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం శరీరం వెనుక భాగంలో ఉండే కండరాలను యాక్టీవ్ చేస్తుంది. వీపు దిగువ భాగాన్ని బలపరుస్తుంది. భుజంగాసనం.. భుజంగాసనం లోతైన శ్వాసను ప్రోత్సహిస్తుంది. తద్వారా ఇది ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది.  ఊపిరితిత్తులు, ఛాతీ ఆరోగ్యం దృఢంగా మారడంలో ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది. బాలాసనం.. బాలాసనం శరీరానికి మంచి ఓదార్పును ఇచ్చే భంగిమ. ఈ భంగిమలో వెనుక తుంటి భాగంను సాగదీసేటప్పుడు  శరీరం విశ్రాంతి దశలోకి వెలుతుంది.  ఈ కారణంగా ఇది శరీరానికి మంచి విశ్రాంతి అనుభూతి ఇస్తుంది. శవాసనం.. సాధారణంగా వెల్లికిలా శరీరాన్ని చాలా వదులుగా ఉంచి పడుకోవడమే శవాసనం. ఈ ఆసనంలో శరీరం చాలా విశ్రాంతి  దశలో ఉంటుంది. దీని కారణంగా శరీరంలో ఉష్ట్రోగ్రతను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది.                                                *నిశ్శబ్ద.

పిల్లలలో అరుదైన వ్యాధి.. ఒక్క ఇంజెక్షన్ 17కోట్లు..

Publish Date:Sep 15, 2023

పిల్లలలో అరుదైన వ్యాధి.. ఒక్క ఇంజెక్షన్ 17కోట్లు.. ఇంతకూ ఇదేంటంటే.. పిల్లలకు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటిలో కొన్నింటికి వైద్యం చేయించాలంటే లక్షలాది రూపాయలు ఖర్చవుతుంది. కానీ పిల్లలలో వచ్చే ఒక అరుదైన వ్యాధికి  వేసే ఇంజక్షన్ ధర ఏకంగా 17కోట్లని మీకు తెలుసా? ఈ మధ్యనే ఢిల్లీకి చెందిన ఒక పిల్లాడికి ఈ వ్యాధి రావడంతో ఈ వ్యాధి గురించి చర్చ నడుస్తోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ పిల్లాడి వైద్యం కోసం ఫండ్స్ సేకరించి మరీ వైద్యానికి సహకారం అందించారు.  సగటు  పౌరుడి ఊహకు కూడా అందని ఇంత మొత్తం డబ్బును ఖర్చు చేయించే  ఈ వ్యాధి ఏంటి? దీనికి అంత డబ్బు ఎందుకు ఖర్చవుతుంది? వీటి గురించి  పూర్తీగా తెలుసుకుంటే.. ఢిల్లీకి చెందిన కనవ్ జాంగ్రా అనే 18నెలల పిల్లాడికి చాలా అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(SMA) టైప్ -1 అనే వ్యాధి వచ్చింది. ఇది జన్యుపరమైన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి వచ్చిన వారి శరీరంలో కండరాలు చాలా బలహీనంగా మారిపోతాయి.  శరీరంలో మెదడు, వెన్నెముక, నాడీ కణాలలో లోపాల కారణంగా ఇది వస్తుంది. దీని కారణంగా వికలాంగులు కావడం లేదా చనిపోవడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు దీనికి భారతదేశంలో చికిత్సలేదు. ఈ వ్యాధికి మందు అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. అది  కూడా ఒక ఇంజెక్షన్ రూపంలో దీనికి మందు లభ్యమవుతుంది. కానీ ఈ ఇంజక్షన్ ఖరీదు ఏకంగా 17కోట్లు. ఈ ఇంజెక్షన్  పేరు బోల్జెన్స్మా.   ఈ జబ్బు సాధారణంగా పెద్ద పిల్లలోనూ, చిన్నపిల్లలలో కూడా వస్తుంది. కానీ ఎక్కువ శాతం చిన్నపిల్లలకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీకి చెందిన 18నెలల పిల్లాడికి ఈ వ్యాధి సోకిందని తెలియడంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్  క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు సేకరించారు. అయితే ఆయన అంత ప్రయత్నం చేసినా 10కోట్లా  50లక్షలు మాత్రమే పోగయ్యాయి.  కానీ ఈ వ్యాధికి మందు తయారుచేసి అందించే అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ పెద్ద మనసు చాటుకుంది. 17కోట్ల విలువైన మందును కేవలం 10.5కోట్లకే పిల్లాడికి ఇచ్చింది. ఈ వ్యాధి కారణంగా 18నెలల ఈ పిల్లాడు కూర్చోలేడు, నడవలేడు, ఏ పనీ చేయలేడు. పాపం తెలిసీ తెలియని వయసులో తనకేమయ్యిందో అర్థం కాక నరకయాతన అనుభవించాడు. ఆ దేవుడు ఈ పిల్లాడి యాతన చూసి చలించాడో ఏమో కానీ పిల్లాడికి వైద్యం అందేలా చేశాడు. ఇంజెక్షన్ వేసిన తరువాత ఈ పిల్లాడు సాధారణ పిల్లల్లా కూర్చోవడం, నడవడం చేస్తున్నాడు. అన్ని రోజులు పిల్లాడి గురించి తల్లడిల్లిపోయిన ఆ తల్లిదండ్రులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. తమకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి తన కృతజ్ఞత తెలుపుకున్నారు. పిల్లలలో ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని, చిన్నతనంలో ఎదురయ్యే కొన్ని సమస్యలను ఆ వయసులోనే పరిష్కరించడం వల్ల పిల్లలకు ప్రమాదం తప్పినట్టు అవుతుందని వైద్యులు కూడా చెబుతున్నారు.                                                            *నిశ్శబ్ద.  

ఈ నాలుగు టిప్స్ ఫాలో అయితే చాలు.. అచ్చం బేకరీ టేస్ట్ కేక్ కుక్కర్లో తయారుచేయవచ్చు!!

Publish Date:Sep 23, 2023

కేక్ అంటే పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ ఇష్టమే..  మారుతున్న కాలంతో పాటు, కేక్ మన జీవితంలోని ప్రతి ఆనందంలో  భాగంగా మారింది. ఇంట్లో ఎవరి పుట్టినరోజు అయినా లేదా ప్రత్యేక సందర్భం అయినా  ఖచ్చితంగా కేక్ కట్ చేస్తారు. దీని క్రేజ్ ఎంతగా ఉందంటే ప్రతి ఒక్కరూ తమ వంటగదిలో బేకరీ లాంటి కేక్‌ను తయారు చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ చాలా మంది మంచి ఫలితాన్ని పొందలేరు. చివరికి   కేక్ కోసం బేకరీపై ఆధారపడటం తప్ప ఇంకేమీ చెయ్యలేరు. కానీ ఇకమీదట అలాంటి ఫెయిల్యూర్ మీకెప్పుడూ ఎదురుకాదు. ఎందుకంటే ఇంంట్లోనే కుక్కర్లోనే మెత్తగా స్పాంజ్ కేక్  తయారుచేయడానికి కొన్ని టిప్స్ ఇక్కడున్నాయి. ఈ టిప్స్ ఫాలో అయితే అచ్చం బేకరీలో కొన్న కేక్ లా నోరూరిస్తూ అందరినీ అలరినీ అలరించే కేక్ తయారవ్వడం ఖాయం. దీనికోసం నాలుగు టిప్స్ ఫాలో కావాలి. అవేంటో తెలుసుకుంటే.. సరైన కుక్కర్‌ని ఉపయోగించాలి.. కేక్ తయారు చేయడానికి కుక్కర్ సెలక్షన్ చాలా ముఖ్యమైనది.  ఎప్పుడూ బరువైన అడుగు మందంగా,  గట్టి మూత ఉన్న కుక్కర్‌ని ఉపయోగించాలి . అలాగే కుక్కర్ మూత పెట్టేటప్పుడు  రబ్బరు తీసి మూత పెట్టాలి. ఇది కాకుండా, కేక్ చేయడానికి ముందు, కుక్కర్‌ను 5 నిమిషాలు సరిగ్గా వేడి చేయాలి. స్టాండ్ ఉపయోగించాలి..  కేక్ పిండి ఉన్న పాత్రను నేరుగా కుక్కర్‌లో ఉంచకూడదు. ఇది కేక్‌ను పాడుచేస్తుంది, అంతే కాదు  దానిని మాడిపోయేలా చేస్తుంది. అందువల్ల  ఎప్పుడూ ముందుగా కుక్కర్‌లో స్టీల్ స్టాండ్‌ను ఉంచి, ఆపై పిండి ఉన్న పాత్రను దానిపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల కేక్ బాగా బేక్ అవుతుంది. కేక్ పిండిలో వెనిగర్ కలపాలి..  బేకరీలో లాగా ఇంట్లో మెత్తగా  స్పాంజి లాంటి  కేక్ తయారు చేయాలనుకుంటే, పిండిలో అర టీస్పూన్ కంటే కొంచెం తక్కువ వెనిగర్ జోడించాలి.   ఉష్ణోగ్రత ముఖ్యం..   కుక్కర్‌లో కేక్‌లను తయారు చేస్తుంటే, గ్యాస్ స్టవ్ మీద తయారుచేయడం మంచిది.  కేక్ ఉడికే మొత్తం సమయం మధ్యస్థంగా ఉంచాలి. ఓవెన్‌లో కంటే గ్యాస్‌పై కేక్ తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని గుర్తుంచుకోవాలి.  కాబట్టి అస్సలు తొందరపడకూడదు. కేక్ ఉడికిందా లేదా తెలుసుకోవడానికి  టూత్‌పిక్‌తో ఒకటి లేదా రెండుసార్లు కేక్ లోపలికి గుచ్చి చెక్ చేయాలి.  అయితే కుక్కర్‌ని పదే పదే  తెరవడం తెరవకూడదు.  సమయాన్ని సెట్ చేసుకుని ఆ తరువాత మాత్రమే చెక్ చేయాలి.                                                                    *నిశ్శబ్ద.

Happy Pongal Muggulu With Dots

Publish Date:Jan 13, 2023

Happy Pongal Muggulu With Dots Muggulu symbolizes happiness and prosperity.It is believed that they create humbleness on welcoming the visitors.

Pongal Muggulu

Publish Date:Jan 13, 2015