స్పీడ్ న్యూస్- 3
posted on Jul 3, 2023 @ 2:53PM
21.ఒకానొకప్పుడు ప్రపంచ క్రికెట్ ను శాసించిన వెస్టిండీస్... ఈ సారి వన్డే వరల్డ్ కప్ కు అర్హత కూడా సాధించలేకపోవడం క్రికెట్ ప్రేమికులకు మింగుడుపడటం లేదు. ప్రపంచ మేటి జట్లలో ఒకటైన విండీస్ లేకపోతే వరల్డ్ కప్ లో మజా ఏముంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
22.ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. అధిష్ఠానం పిలుపుతో ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న రఘునందన్ రావు.. పలువురు కీలక నేతలను కలుసుకుంటున్నారు.
23. గౌతమి గోదావరి నదిలో యానాం దగ్గర భారీ పండుగప్ప చేప ఒకటి మత్స్యకారుల వలకు చిక్కింది. సుమారు 15 కేజీల బరువున్న ఈ పండుగప్ప చేపను స్థానిక మార్కెట్ లో వేలం వేయగా రూ.9 వేల ధర పలకింది.
24.ఓ జాతీయ నాయకుడిగా పరిణతితో మాట్లాడాలని, మాటలు జారొద్దని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. కాంగ్రెస్ నేతపై తమకు గౌరవం ఉందని చెప్పారు. అయితే, ఆ పార్టీ రాష్ట్ర నేతలు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం కాకుండా నిజాలు మాట్లాడాలని రాహుల్ గాంధీకి సూచించారు.
25. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రానికి మరో వందేభారత్ రైలు వస్తోంది. విజయవాడ-చెన్నై నగరాల మధ్య ఈ నెల 7 నుంచి వందేభారత్ రైలు రాకపోకలు మొదలు కానున్నాయి. దేశ వ్యాప్తంగా ఐదు వందే భారత్ రైళ్లను మోదీ ప్రారంభించనున్నారు.
26.భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు పాకిస్థాన్ అంగీకరించింది. వేదికల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన పాక్ చివరికి మనసు మార్చుకుంది. టోర్నీలో ఆడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
27. యాషెస్ రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో రనౌట్ పెద్ద దుమారమే రేపుతోంది. తొలి టెస్టులోనూ ఓ క్యాచ్ వివాదాస్పదమైంది.
28.కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు.
29. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను బాధితునిగా గుర్తించాలంటూ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ రోజు విచారణ సందర్భంగా కృష్ణారెడ్డి తరపు న్యాయవాదిపై జస్టిస్ కృష్ణ మురారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
30.అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లు, కుటుంబ కలహాల కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.