ఉపాధి కూలీలకు భారీ మొత్తంలో బకాయిలు..! ఎందుకలా ?
posted on Jul 3, 2023 @ 4:45PM
జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) పనులకు హాజరయ్యే కూలీలు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. వారికి ఇచ్చే వేసవి భత్యం తొలగించడంతోపాటు పని ప్రదేశాల్లో కూలీలకు ఇచ్చే మజ్జిగ, తాగునీటి సరఫరాను పక్కన పెట్టారు. తీవ్రమైన ఎండ ల్లోనూ రెండు నెలలుగా పనులు చేయించారు. హాజరవ్వకపోతే జాబ్ కార్డులు రద్దవుతాయని బెది రించి మరీ పనులు చేయించుకున్నారు. తీవ్రమైన వడగాలులు వీచేటప్పుడూ పనిచేసిన కూలీలకు అయిదు వారాలుగా వేతనాలు చెల్లించకుండా బకాయి పెట్టారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.250 కోట్లకు పైగా చెల్లిం చాల్సి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి నరే గాలో రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన 15 కోట్ల పనిదినాలను ఏప్రిల్ నుంచి జూన్ మధ్య మూడు నెలల్లోనే వినియోగించారు. కూలీలు చేసిన పనుల వివరాలను వారానికోసారి నరేగా ఎన్ఎస్ఐసీ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఒక వారం తర్వాత వాటికి చెల్లింపులు చేయాలి. ప్రస్తుతం రెండు వారాలైనా కూలీల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాలేదు. నిరుపేదలకు ఉపాధి పనులే జీవనా ధారం. ఇలాంటి వారంతా వేతనాలు జాప్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఏపీలోని గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. వేతనాల చెల్లిం పుల్లో కేంద్రప్రభుత్వ పరంగా జాప్యమైనప్పుడు కూలీల అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేసి కూలీలకు అందించేది. ఇప్పుడు అలాంటి ఊసే లేదు. తీవ్రమైన ఎండల్లో పనిచేసిన తమకు మజ్జిగ, తాగునీరు కూడా ఇవ్వని దారుణమైన పరిస్థితిని కూలీలు ఎదుర్కొన్నారు. అయితే.. ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాలకు త్వరలోనే పెండింగ్ వేతనాలు జమ అవుతాయని
గ్రామీణా భివృద్ధి శాఖ అంటుంది.