English | Telugu

'ఘరానా మొగుడు' సందడి మొదలైంది!

Publish Date:Aug 19, 2022

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు(ఆగస్టు 9) సందర్భంగా వేసిన 'పోకిరి' స్పెషల్ షోలకు ఎంతటి ఆదరణ లభించిందో తెలిసిందే. ఇప్పుడు 'ఘరానా మొగుడు' స్పెషల్ షోల సందడి షురూ అయింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా ప్రత్యేకంగా ప్రదర్శించనున్న 'ఘరానా మొగుడు' షోల బుకింగ్ ఓపెన్ అయ్యాయి.   చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఘరానా మొగుడు'(1992) ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా రూ.10 కోట్ల షేర్ రాబట్టిన మొదటి తెలుగు చిత్రంగా నిలిచి, ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా.. చిరంజీవిని ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోని చేసింది. 30 ఏళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమాకి మెగా అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది. అందుకునేమో మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఈ మూవీ స్పెషల్ షోలను ప్లాన్ చేశారు.     ఆగస్టు 21, 22 తేదీలలో హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో 'ఘరానా మొగుడు' స్పెషల్ షోలు వేయనున్నాను. 21 న రెండు, 22 న ఐదు షోలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఏడు షోలకు సంబంధించి బుక్ మై షోలో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ స్పెషల్ షోల బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 30 శాతం దాకా సీట్లు బుక్ అవ్వడం విశేషం.

Boycott Bollywood is Frightening Anthem for Stars

Publish Date:Aug 19, 2022

We are now seeing how Bollywood movies are struggling to find a good success. Unexpectedly, Bollywood films are failing miserably. With lot of confusion in the makers figuring out which movie will the audinece love. As the big stars' films fail to perform well, the situation among their fans has deteriorated.     Meanwhile, there are strong indications that major audiences are ready to boycott more Bollywood films in the coming days, which is scaring fans of many heroes. The audience is working to fight the new trend of boycotting every movie.     As a result, the future of these new films is called into question. Films starring Shah Rukh Khan and Hrithik Roshan have now become the target. As a result, their fans took to social media to defend them. And let's see how the condition of those films turns out.

న‌టుడిగా ఆఫ‌ర్లు లేక‌పోవ‌డంతో ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా మారిన ఆదిత్య ఓం!

Publish Date:Aug 19, 2022

  హీరోగా, ప్ర‌ధాన పాత్ర‌ధారుల్లో ఒక‌డిగా కొన్ని సినిమాల్లో న‌టించాక ఆదిత్య ఓం ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా మారార‌ని మీకు తెలుసా? ఈ నిజం చాలా మందికి తెలీదు. అవును. వైవీఎస్ చౌద‌రి 'లాహిరి లాహిరి లాహిరిలో' మూవీతో యంగ్ హీరోగా టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన ఉత్త‌రాది యువ‌కుడు ఆదిత్య ఓం. ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన అత‌ను తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోగా న‌టించాడు. అయితే క్ర‌మంగా అత‌నికి అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. దాంతో ఒకానొక టైమ్‌లో ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయాడు. త‌ను కెరీర్ ప్రారంభించిన ముంబైకి వెళ్లిపోయి, బాలీవుడ్‌లో ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా ప‌నిచేశాడు. ఈ విష‌యాన్ని తెలుగువ‌న్‌కు వ‌చ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు ఆదిత్య ఓం. "తెలుగులో మంచి ఆఫ‌ర్లు త‌గ్గిపోవ‌డం, అప్ప‌ట్లో వెబ్ సిరీస్‌ల లాంటివి కూడా లేక‌పోవ‌డంతో, కొత్త‌గా ఏదైనా ప్లాన్ చెయ్యాల‌ని ముంబైకి వెళ్లాను. కెరియ‌ర్ మొద‌ట్లో నేను ముంబైలో డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేశాను. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశాను. అందుక‌ని మ‌ళ్లీ డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లాల‌నుకున్నాను. అయితే ముంబైకి వెళ్లి నా ఎక్స్‌పీరియెన్స్ ప్ర‌కారంగా 2007-08 మ‌ధ్య‌లో ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా స్టార్ట్ చేశాను." అని అత‌ను తెలిపాడు. "నా ఫ్రెండ్స్ సినిమాల‌ను ప్రొడ్యూస్ చెయ్యాల‌నుకున్న‌ప్పుడు, వాళ్ల‌కు గైడ్ చెయ్యాలనీ, డ‌బ్బు కోస‌మ‌నీ ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా మారాను" అని ఆదిత్య ఓం వెల్ల‌డించాడు. "ఆ సినిమాల‌కు స్టార్టింగ్ నుంచి రిలీజ్ వ‌ర‌కు చూశాను. అలా నాలుగు సినిమాల‌కు ప‌నిచేశాను. దాంతో ఇండ‌స్ట్రీ ఎలా ఫంక్ష‌న్ అవుతుంద‌నే విష‌యం మ‌రింత‌గా తెలిసింది. నేను ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా ప‌నిచేసిన వాటిలో బెస్ట్ ఫిల్మ్ 'శూద్ర‌'. క్యాస్ట్ సిస్ట‌మ్ మీద అదొక క‌ల్ట్ ఫిల్మ్‌. దానికిప్పుడు సీక్వెల్ కూడా వ‌స్తోంది. అందులో నేను యాంటీ హీరోగా యాక్ట్ కూడా చేశాను." అని అత‌ను చెప్పుకొచ్చాడు.

ఆక‌స్మికంగా విష‌మించిన సీనియ‌ర్ క‌మెడియ‌న్ ఆరోగ్య స్థితి

Publish Date:Aug 18, 2022

  వెంటిలేట‌ర్‌పై ఉన్న‌ బాలీవుడ్ క‌మెడియ‌న్ రాజు శ్రీ‌వాస్త‌వ ఆరోగ్య స్థితి గ‌త రాత్రి (ఆగ‌స్ట్ 17) ఆక‌స్మాత్తుగా క్షీణించింది. ప్ర‌స్తుతం ఆయ‌న ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. రాజు శ్రీ‌వాస్త‌వ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించడంతో ఆయ‌న కుటుంబ స‌భ్యులు, స్నేహితులు షాక్‌కు గుర‌య్యారు. మెద‌డులో వాపు క‌ల‌గ‌డ‌మే గ‌త రాత్రి ఆయ‌న ఆరోగ్యం ఆక‌స్మికంగా క్షీణించడానికి కార‌ణ‌మ‌ని ఆయ‌న స్నేహితులు తెలిపారు. డాక్ట‌ర్లు ఆయ‌న‌కు ఇంజెక్ష‌న్లు ఇచ్చాక‌, మెద‌డు వాచింద‌ని స‌మాచారం. వాపు త‌గ్గాక రాజు ప‌రిస్థితి మెరుగ‌వుతుంద‌నీ, ఆయ‌న మెద‌డు మ‌ళ్లీ స‌రిగా ప‌నిచేస్తుంద‌నీ డాక్ట‌ర్లు తెలిపారు. ఆగ‌స్ట్ 10న రాజు శ్రీ‌వాస్త‌వ గుండెపోటుకు గుర‌య్యారు. వ‌ర్క‌వుట్స్‌లో భాగంగా ట్రెడ్‌మిల్‌పై ఉన్న‌ప్పుడు ఛాతీ నొప్పితో ఆయ‌న కుప్ప‌కూలారు. వెంట‌నే ఆయ‌న ట్రైన‌ర్ ఆయ‌న‌ను ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఆయ‌న గుండె స‌రిగా ప‌నిచేయ‌డం కోసం రెండు సార్లు వైద్యులు ఆయ‌న‌కు సీపీఆర్ ఇచ్చారు. గుండెపోటు త‌ర్వాత ఆయ‌న మ‌ళ్లీ స్పృహ‌లోకి రాలేదు. హార్ట్ ఎటాక్ స‌మ‌యంలోనే ఆయ‌న మెద‌డు కూడా దెబ్బ‌తింది. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో వైద్యులు వెంటిలేట‌ర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అప్ప‌ట్నుంచీ ఆయ‌న స్థితి మెరుగుప‌డ‌లేదు, అలాగని మ‌రింత క్షీణించ‌లేదు. 'మైనే ప్యార్ కియా', 'తేజాబ్‌', 'బాజీగ‌ర్' లాంటి సూప‌ర్ హిట్ సినిమాల్లో త‌న కామెడీతో అల‌రించిన రాజు శ్రీ‌వాస్త‌వ ప‌లు కామెడీ షోల‌తో వీక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. వాటిలో ద గ్రేట్ ఇండియ‌న్ లాఫ్ట‌ర్ ఛాలెంజ్‌, కామెడీ స‌ర్క‌స్‌, ద క‌పిల్ శ‌ర్మా షో, శ‌క్తిమాన్ ముఖ్య‌మైన‌వి.

Kiara Advani reacts about her Marraige

Publish Date:May 23, 2022

Kiara Advani's films and beauty enchant everyone. She is currently the favourite of everyone in every industry.   Jugg Jugg Jeeyo is Kiara Advani's most recent Bollywood film. On Sunday, the film's trailer was released. She co-stars with Varun Dhawan in the film. This family drama will also feature Anil Kapoor and Neetu Kapoor. During the trailer's launch event, the cast of the film answered lots of questions. Kiara reacts to the rumours about her wedding.   She has a long history of dating Bollywood's young hero Siddharth Malhotra. Many of them have already announced their engagement. During the release of the latest movie trailer, the media inquired about Kiara's wedding. She reacted angrily when asked about her plans to marry and settle down.   "Isn't it possible for me to settle down without getting married? I am already at comfort. I'm working and making a good living." Everyone, from industry insiders to fans, was taken aback by this news.

నా రూటే సెపరేటు అంటున్న శ్రావణ భార్గవి

Publish Date:Aug 19, 2022

శ్రావణ భార్గవి ఈ పేరు అందరికీ పరిచయమే అక్కర్లేదు. బాలకృష్ణ నటించిన సింహ మూవీలో "సింహమంటి చిన్నోడే" సాంగ్ పాడి తన కెరీర్ ని స్టార్ట్ చేసింది భార్గవి. తర్వాత మహేష్ బాబు "ఖలేజా", అల్లు అర్జున్ "బద్రీనాథ్", రామ్ "కందిరీగ" నాగార్జున "రాజన్న", జూనియర్ ఎన్టీఆర్ "దమ్ము", లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎంసీఏ, రెబల్ ఈ మూవీస్ లో హిట్ సాంగ్స్ పాడి తనని తానూ ప్రూవ్ చేసేసుకుంది. 2018 లో వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో ఓ పాట పాడింది శ్రావణ భార్గవి. ఇక  ఆ తర్వాత ఆమె మూవీస్ లో సాంగ్స్ ఏమీ పాడలేదు. డబ్బింగ్ విషయానికి వస్తే  ‘గబ్బర్ సింగ్’ లో శృతిహాసన్ కు, ‘ఈగ’ లో సమంతకి వాయిస్ ఇచ్చింది.  ఇక ఇటీవలి కాలంలో  శ్రావణ భార్గవి ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది.  తన భర్తతో విడాకులు విషయం అంటూ కొద్ది రోజులు, తర్వాత అన్నమ్మయ్య రచించిన ‘ఒకపరికొకపరి వయ్యారమై…’ కీర్తనను శృంగారభరితంగా మార్చి వీడియో చేసిందంటూ ఎన్నో అపవాదులు ఆమె చుట్టూ తిరిగాయి. అన్నమయ్య కుటుంబ సభ్యులు రంగంలోకి దిగి ఆమెని  తిరుపతిలో అడుగుపెట్టనివ్వం అంటూ హెచ్చరించారు కూడా. ఈ విషయం మీద శ్రావణభార్గవి కూడా తన వెర్షన్ లో జవాబు ఇచ్చేసింది.  ఈ వార్తలతో ఇటీవలి కాలంలో శ్రావణ భార్గవి క్రేజ్ చాలా పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక మూవీ సాంగ్ తో దుమ్ము రేపడానికి నాలుగేళ్ల తర్వాత బయటికొచ్చింది శ్రావణ భార్గవి. విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ మూవీలో ‘ఆఫత్’ అనే అద్భుతమైన సాంగ్ పాడి అందరినీ కట్టిపడేసింది తన గాత్రంతో. ఇక ఈ సాంగ్యూ ట్యూబ్ లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

'ఎన్టీఆర్ 30'లో మృణాల్ ఠాకూర్!

Publish Date:Aug 19, 2022

'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఇంతవరకు క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు తాజాగా మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది.   'ఎన్టీఆర్ 30'లో హీరోయిన్ గా మొదట బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ పేరు వినిపించింది. కానీ పెళ్లి కారణంగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక అప్పటి నుంచి హీరోయిన్ గా ఎన్నో పేర్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్స్ కియారా అద్వానీ, జాన్వీ కపూర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఆ తర్వాత సాయి పల్లవి, కృతి శెట్టి, శ్రీలీల ఇలా ఎందరో యంగ్ హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు మూవీ టీమ్ మృణాల్ ఠాకూర్ పేరు పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.   ఇటీవల విడుదలైన 'సీతా రామం' చిత్రంలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ మెప్పించింది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆమెకి ఇప్పటికే నార్త్ లో మంచి గుర్తింపు ఉంది. 'ఎన్టీఆర్ 30' పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో పాటు, అందులో హీరోయిన్ పాత్ర నటనకు ప్రాధాన్యం ఉన్నది కావడంతో మృణాల్ అయితేనే కరెక్ట్ అని మూవీ టీమ్ భావిస్తోందట. మరి 'ఎన్టీఆర్ 30'లో తారక్ కి జోడీగా నటించేది  మృణాలో కాదో త్వరలోనే తేలిపోనుంది.

Sudha Kongara & Hombale project is going to be Biggest Multistarrer

Publish Date:Jul 12, 2022

Even though it came before 'KGF,' Hombale Films became well-known with that film. The films are being announced, completed, and ready for release as a result of the momentum created by that film. Production is currently working on 'Salaar' in Telugu and 'Tyson' in Malayalam. Other pan-India films have also just been announced.   However, a film directed by Sudha Kongara was recently announced. Except for the fact that they stated that it will be a big film, they did not mention the casting. There are some new rumours floating around about this. If those rumours are true, this combination will be spectacular. According to sources, Sudha Kongara project is going to be multi starrer.  Furthermore, the names of those heroes are currently being spread.   According to the latest rumours, this film would star Suriya and Dulquer Salman, who have established as star heroes in the South with a string of superhits. According to industry reports, Surya, who has become acquainted of Sudha Kongara's direction in 'Akaasham Nee Haddura,' responded OK without even hearing the story. It is stated that discussions about this film are ongoing, and that full details will be released soon. Pre-production work will begin soon.   Hombale is synonymous with big-budget films. This film is expected to be in the same budget range as the previous one. Suriya's film is also popular in Telugu. Dulquer films have a cult following in the South. This combination is surely going to be crazy.

Ranbir and Alia in love

Publish Date:May 10, 2018

సీతారామం

Publish Date:Aug 5, 2022

KGF Chapter 2

Publish Date:Apr 14, 2022

RRR

Publish Date:Mar 25, 2022

Radhe Shyam

Publish Date:Mar 11, 2022

Clap

Publish Date:Mar 11, 2022

Aadavallu Meeku Joharlu

Publish Date:Mar 4, 2022