
అంతకుమించి: ‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.!
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లవ్ అండ్ వార్’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేక చిత్రంగా నిలిచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసిన చిత్రబృందం.. తాజాగా విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్లో విక్కీ కౌశల్ సిగరెట్, లైటర్‌తో కనిపిస్తూ ఎంతో ఇంటెన్స్‌గా చూస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు చూడని విభిన్నమైన లుక్‌లో విక్కీ కనిపించడం విశేషం. ఆయన లుక్‌లో స్టైల్, చార్మ్‌తో పాటు పాత్రలోని తీవ్రత కూడా స్పష్టంగా కనిపిస్తోంది. భన్సాలీ సినిమాల్లో హీరోల పాత్రలకు ప్రత్యేకమైన రూపాన్ని, స్టైల్‌ను అందిస్తుంటారు. అదే తరహాలో విక్కీ కౌశల్ లుక్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. రణ్‌బీర్, అలియా తర్వాత ఇప్పుడు విక్కీ ఫస్ట్ లుక్ కూడా ‘లవ్ అండ్ వార్’ పై అంచనాలను మరింత పెంచింది. ముగ్గురు నటుల ఫస్ట్ లుక్ పోస్టర్లు మూడు విభిన్నమైన పాత్రలను, మూడు ప్రత్యేకమైన ప్రపంచాలను పరిచయం చేస్తున్నాయి. విక్కీ పోస్టర్ మాత్రం సినిమాకు మరింత ఇంటెన్స్ టచ్‌ను తీసుకొచ్చింది. ‘లవ్ అండ్ వార్’ చిత్రం 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఇది కూడా చదవండి: రాత్రంతా నిద్రపోలేదు.. సూర్య సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.! [Love And War Movie, Vicky Kaushal First Look, Sanjay Leela Bhansal, Ranbir Kapoor, Alia Bhatt, Vicky Kaushal, Telugu Film News, Telugu News]
Sep 26, 2026 5:50PM
ఓర్రీ పెళ్లి: వైరల్‌గా మారిన వెడ్డింగ్ ఇన్విటేషన్.. పెళ్లికూతురు ఎవరు.?
బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి కనిపిస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఓర్రీ.. ఇప్పుడు ఏకంగా తన పెళ్లి వార్తలతో హాట్ టాపిక్‌గా మారాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఓర్రీ అసలు పేరు ఓర్హాన్ అవత్రామణి. సెలబ్రిటీ పార్టీల్లో, ఈవెంట్లలో తరచూ కనిపించే ఆయనకు సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న పోస్టులు మాత్రం ఆయన పెళ్లి గురించే కావడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఓర్రీ పెళ్లి ఇన్విటేషన్గా చెబుతున్న కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు.. ఓర్రీ కూడా ఇన్విటేషన్‌కు సంబంధించిన కొన్ని వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పెట్టడంతో ఈ ప్రచారానికి మరింత ఊపొచ్చింది. వైరల్ అవుతున్న ఆహ్వాన పత్రిక ప్రకారం.. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో ‘Wedding Weekend’ పేరుతో వరుసగా వేడుకలు జరగనున్నట్లు ఉంది. సెప్టెంబర్ 26న రాత్రి 8 గంటల నుంచి ‘మెహ్ఫిల్-ఎ-సూఫియానా’ పేరుతో మ్యూజిక్, లైవ్ పెర్ఫార్మెన్స్‌లతో కార్యక్రమం ఉండనుందట. ఇక సెప్టెంబర్ 27న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ‘రంగ్-ఎ-ఇష్క్’, రాత్రి 8 గంటల నుంచి ‘షాదీ ముబారక్’ జరగనున్నట్లు ఇన్విటేషన్లో ఉంది. ఇది కూడా చదవండి: ‘జైలర్ 2’ రైట్స్ 90 కోట్లా.. నాగవంశీ రిస్క్ వెనుక ఉన్న అసలు నిజమిదే.! అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ వేడుకలు ఓర్రీ పెళ్లికి సంబంధించినవేనా అన్నది మాత్రం ఇప్పటివరకు అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. ఇది ఏదైనా బ్రాండ్ క్యాంపెయిన్, యాడ్ లేదా మరో ప్రాజెక్ట్‌లో భాగమై ఉండొచ్చనే అనుమానాలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఓర్రీ గతంలో కూడా తన సోషల్ మీడియా పోస్టులు, సెలబ్రిటీలతో సరదా సంభాషణల కారణంగా పెళ్లి వార్తల్లో నిలిచాడు. 2025లో ఊర్వశి రౌతేలా చేసిన ఓ సరదా కామెంట్‌కు ఓర్రీ ఇచ్చిన రిప్లై కూడా అప్పట్లో పెళ్లి వార్తలకు దారితీసింది. అయితే అది కేవలం సరదా సంభాషణగానే నిలిచిపోయింది. ఇప్పుడు మాత్రం ‘Wedding Weekend’, ‘Shaadi Mubarak’ అంటూ ఏకంగా ఇన్విటేషన్ బయటకు రావడంతో ఈసారి విషయం ఏంటనేది మరింత ఆసక్తిగా మారింది. మరి ఓర్రీ నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా? లేక అందరినీ మరోసారి సర్ప్రైజ్ చేయడానికి ఇదంతా ఓ ప్లాన్‌నా? సెప్టెంబర్ 27న అసలు విషయం బయటపడే వరకు సస్పెన్స్ కొనసాగాల్సిందే. [Orry Wedding, Orry Marriage, Orry Wedding Invitation, Orry Real Name, Orry Biography, Bollywood News, Telugu Film News, Telugu News]
Sep 26, 2026 12:13PMఅజయ్ దేవ్‌గణ్‌కు BMC నోటీసులు.. జుహు బంగ్లాలో ఏం చేస్తున్నారు.?
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్‌కు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నుంచి నోటీసులు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఆయన బంగ్లాలో నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో బీఎంసీ అధికారులు స్టాప్-వర్క్ నోటీసులు జారీ చేశారు. ఈ బంగ్లాను వాణిజ్య అవసరాలకు ఉపయోగించేందుకు జరుగుతున్న మార్పులే దీనికి కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. జుహులోని కపోల్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అజయ్ దేవ్‌గణ్‌కు ఓ బంగ్లా ఉంది. సుమారు 7,802 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాపర్టీలో అత్యాధునిక సెలూన్, స్పా ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నట్లు సమాచారం. అయితే నివాస ప్రాంతంలో ఇలాంటి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడంపై హౌసింగ్ సొసైటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బంగ్లాలో సెలూన్, స్పా ప్రారంభమైతే బయట నుంచి వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని, దాంతో పార్కింగ్, భద్రత, ట్రాఫిక్, శబ్దం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సొసైటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అక్కడి అంతర్గత రోడ్లు ఇరుకుగా ఉండటంతో అదనపు వాహనాల రాకపోకల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చని పేర్కొంటూ బీఎంసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదుపై బీఎంసీ కె-వెస్ట్ వార్డు అధికారులు స్పందించారు. అజయ్ దేవ్‌గణ్ బంగ్లాను తనిఖీ చేసిన అధికారులు అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించిన అనుమతులు, పత్రాలను సమర్పించాలని ఆదేశించారు. అయితే వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన అవసరమైన అనుమతులు అందుబాటులో లేకపోవడంతో పనులను నిలిపివేయాలని బీఎంసీ స్టాప్-వర్క్ నోటీసు జారీ చేసింది. అయితే ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు అజయ్ దేవ్‌గణ్ కుటుంబం నాలుగు వారాల సమయం కోరినట్లు సమాచారం. మరోవైపు స్థానిక కార్పొరేటర్ సుధా సింగ్ కూడా ఈ విషయంపై స్పందించారు. బీఎంసీ బిల్డింగ్ అండ్ ఫ్యాక్టరీ విభాగం నిర్వహించిన ప్రాథమిక తనిఖీల్లో ఆ ప్రాంగణానికి వాణిజ్య వినియోగానికి సంబంధించిన అనుమతులు లేవని అధికారులు గుర్తించినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం బీఎంసీ ఆదేశాలతో బంగ్లాలో జరుగుతున్న పనులు నిలిచిపోయాయి. అజయ్ దేవ్‌గణ్ కుటుంబం సమర్పించే వివరణ, పత్రాలను పరిశీలించిన తర్వాత అధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో జుహులోని ఈ బంగ్లాలో ప్రతిపాదించిన సెలూన్, స్పా ప్రాజెక్ట్ విషయంలో చివరకు ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఆసక్తికరంగా మారింది. [Ajay Devgn, Ajay Devgn Juhu Bungalow, Ajay Devgn BMC Notice, Ajay Devgn Bungalow, BMC Stop Work Notice, Ajay Devgn Salon Spa, Ajay Devgn Latest News, Juhu Bungalow, Bollywood News, Mumbai BMC, Ajay Devgn Property, Ajay Devgn Mumbai Bungalow]
Sep 25, 2026 4:28PM
లవ్ & వార్: హీటేక్కిస్తున్న అలియాభట్ లుక్.!
రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన తర్వాత సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘లవ్ & వార్’ చిత్రంలో అలియా భట్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్లో అలియా ఇంతకుముందెన్నడూ కనిపించని గ్లామరస్ లుక్‌లో మెరిసింది. 2027లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘లవ్ & వార్’ ఒకటి. ఈ సినిమాలో సంజయ్ లీలా భన్సాలీ తన గత చిత్రాలకు భిన్నమైన ఆధునిక ప్రపంచాన్ని చూపించబోతున్నారు. మేకర్స్ సోషల్ మీడియాలో అలియా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విడుదలైన ఈ పోస్టర్లో అలియా స్లిట్ స్కర్ట్, ప్రత్యేకమైన హెడ్‌పీస్‌తో కుర్చీలో కూర్చుని కనిపించింది. ఆమె లుక్, స్టైలింగ్, హావభావాలు రెట్రో ఫీల్‌ను అందిస్తున్నాయి. ఈ పాత్రలో అలియా పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించనుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ & వార్’లో రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2027 జనవరి 21న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. డ్రాగన్ మూవీ బిగ్ అప్డేట్.! [Love & War Movie, Alia Bhatt First Look, Love and War Movie, Sanjay Leela Bhansali, Ranbir Kapoor, Alia Bhatt, Vicky Kaushal, Telugu Film News, Telugu News]
Sep 25, 2026 2:40PMఈ హాట్ మూవీని థియేటర్లలో మిస్ అయ్యారా.. అయితే ఓటీటీలో చూసేయండి.!
ఒకప్పుడు బాలీవుడ్లో తనదైన ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోల్లో ఎమ్రాన్ హష్మీ ఒకరు. ముఖ్యంగా 2000ల్లో ఆయన సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ఈ క్రమంలో 2007లో వచ్చిన ‘అవారాపన్’ సినిమా కూడా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అదే సినిమాకు సీక్వెల్‌గా ‘అవారాపన్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎమ్రాన్ హష్మీ మరోసారి శివమ్ పండిట్ పాత్రలో కనిపించడంతో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ‘అవారాపన్ 2’లో ఎమ్రాన్ హష్మీతో పాటు దిశా పటానీ, షబానా ఆజ్మీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో యాక్షన్‌తో పాటు ఎమోషనల్ అంశాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ఇదిలా ఉంటే.. థియేటర్లలో సినిమా చూసేందుకు వీలు పడని వారి కోసం తాజాగా డిజిటల్ రిలీజ్ వచ్చేసింది. ‘అవారాపన్ 2’ ప్రస్తుతం Amazon Prime Video Rentలో అందుబాటులో ఉంది. అంటే సాధారణ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో ఉచితంగా స్ట్రీమ్ చేయడం కాకుండా, సినిమాను ప్రత్యేకంగా రెంట్ చేసుకుని చూడాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తాజా ఓటీటీ విడుదలల జాబితాలు కూడా ధృవీకరిస్తున్నాయి. సినిమా కథ విషయానికి వస్తే.. శివమ్ పండిట్ గత జీవితానికి దూరంగా సాధారణ జీవితం గడుపుతుంటాడు. అయితే అతడి జీవితంలో చోటుచేసుకున్న ఓ కీలక సంఘటన అతడిని మరోసారి క్రైమ్ ప్రపంచంలోకి అడుగుపెట్టేలా చేస్తుంది. తనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కాపాడేందుకు అతడు ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో యాక్షన్‌తో పాటు భావోద్వేగాలు, సంబంధాలు కూడా కథలో కీలకంగా మారతాయి. మరోవైపు.. ‘అవారాపన్’కు మొదట్లో ఆశించిన స్థాయిలో ఆదరణ రాకపోయినా, కాలక్రమంలో ఆ సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో సీక్వెల్లో మళ్లీ శివమ్ పండిట్‌గా ఎమ్రాన్ హష్మీ కనిపించడం అభిమానుల్లో నాస్టాల్జియాను తీసుకొచ్చింది. మొత్తంగా.. థియేటర్లలో ‘అవారాపన్ 2’ను మిస్ అయిన ఎమ్రాన్ హష్మీ అభిమానులు ఇప్పుడు ఇంటి నుంచే ఈ సీక్వెల్‌ను చూసే అవకాశం వచ్చింది. అయితే ప్రస్తుతం ఇది సాధారణ స్ట్రీమింగ్ కాకుండా రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉండటం గమనార్హం. [Awarapan 2 OTT, Awarapan 2 OTT Release, Awarapan 2 Prime Video, Awarapan 2 Prime Video Rent, Emraan Hashmi Awarapan 2, Disha Patani Awarapan 2, Awarapan 2 Streaming, Awarapan 2 Movie, Bollywood OTT Releases, Amazon Prime Video Rent]
Sep 25, 2026 2:23PM
2,490 కోట్ల ఆస్తిని నష్టపోయిన షారుక్ ఖాన్: ఇది వాళ్ళ పనేనా!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కి ఉన్న సుదీర్ఘ సినీ హిస్టరీ గురించి ప్రతి భారతీయ సినీ ప్రేమికుడికి తెలిసిందే. ప్రస్తుతం 'కింగ్' మూవీతో బిజీగా ఉన్నాడు.ఇటీవల విడుదలైన 'హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026' నివేదిక ప్రకారం, ఆయన నెట్ వర్త్ ఒకే ఏడాదిలో గణనీయంగా తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే షారుఖ్ ఖాన్ ఏకంగా 2,490 కోట్ల ఆస్తిని కోల్పోయారని ఈ తాజా డేటా వెల్లడించింది. 2025 నాటి హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో ఆయన నికర ఆస్తి విలువ 12,490 కోట్లుగా నమోదవ్వగా, ఇప్పుడు అది సుమారు 20 శాతం తగ్గి ప్రస్తుతం 10,000 కోట్లకి చేరుకుంది. అయితే, .2,490 కోట్ల మేర సంపద క్షీణించినప్పటికీ, భారతీయ సినిమా రంగంలో అత్యంత సంపన్నుడైన నటుడిగా ఆయన తన అగ్రస్థానాన్ని ఏమాత్రం కోల్పోలేదు. షారుఖ్ ఖాన్ ఆస్తి కేవలం ఆయన సినిమాల రెమ్యూనరేషన్ లేదా బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా మాత్రమే కాకుండా, ఇతర వ్యాపారాల ద్వారా కూడా విస్తరించి ఉంది. ఇది కూడా చదవండి: ఆ సిటీలో చరణ్: RC 17 కోసం కసరత్తుల కోసమేనా! ఐపీఎల్లో విజయవంతమైన ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ 'రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్' ఆస్తులు కూడా ఈ మొత్తం నెట్ మార్కెట్ లోకి వస్తాయి. లాభాల శాతంలో వచ్చిన తీవ్రమైన హెచ్చుతగ్గులు మరియు వ్యాపార పెట్టుబడుల విలువల్లో మార్పుల వల్లే ఈ భారీ తగ్గుదల నమోదైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో అత్యధిక ఆస్తి కలిగిన నటుల జాబితాలో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇతర దిగ్గజ నటులు ఆయన తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బాలీవుడ్ షెహన్షా అమితాబ్ బచ్చన్ .4,000 కోట్ల నికర ఆస్తితో రెండవ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ 3,000 కోట్ల ఆస్తితో మూడవ స్థానాన్ని కైవసం చేసుకోగా, బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ తన ఆస్తిని మరింత పెంచుకుని 2,500 కోట్లతో నాల్గవ స్థానంలో నిలిచారు. ఈ క్రమంలో ఇతర నటులు తమ ఆస్తులని పెంచుకున్నప్పటికీ, షారుఖ్ ఖాన్‌కి మిగిలిన హీరోల కంటే ఉన్న భారీ వెసులుబాటు వల్ల ఆయన నంబర్ 1 స్థానానికి ఎలాంటి ముప్పు రాలేదు. [Shah Rukh Khan , Shah Rukh Khan Net Worth Drop 2026, Hurun India Rich List 2026, Telugu One Cinema News, TeluguOne Cinema News, TeluguOne, Bollywood]
Sep 24, 2026 6:13PM
‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్: రెట్రో స్టైల్లో యానిమల్ లుక్ అదిరింది.!
బాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన ‘లవ్ అండ్ వార్’ నుంచి ఎట్టకేలకు ఫస్ట్ లుక్ వచ్చేసింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో రణ్‌బీర్ కపూర్ పూర్తిగా డిఫరెంట్ అవతార్‌లో కనిపిస్తున్నారు. రెట్రో స్టైల్లో ఉన్న ఈ లుక్‌లో రణ్‌బీర్ వింటేజ్ కారులో కూర్చుని కనిపించారు. అయితే ఈ పోస్టర్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న మరో అంశం ఉంది. రణ్‌బీర్ ఎడమ చేయి గాయాలతో, రక్తంతో కనిపిస్తోంది. దీంతో సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది? అసలు ఈ గాయాల వెనుక కథేంటి? అనే ఆసక్తి మొదలైంది. ఇక ఈ సినిమా సంజయ్ లీలా భన్సాలీ, రణ్‌బీర్ కపూర్ కాంబినేషన్లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వస్తున్న మూవీ కావడం మరో ప్రత్యేకత. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ‘సావరియా’ వచ్చిన విషయం తెలిసిందే. ఆలియా భట్‌తో భన్సాలీకి ఇది రెండో సినిమా. ఇది కూడా చదవండి: ప్యారడైజ్ చుట్టూ రాజకీయం.. ఒక్క పూటలోనే సీన్ రివర్స్.! ఇక ‘లవ్ అండ్ వార్’ను 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ లుక్‌తోనే సినిమాపై ఆసక్తిని పెంచిన భన్సాలీ.. ఇక టీజర్, ట్రైలర్‌తో ఎలాంటి విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారో చూడాలి. మీకు నచ్చవచ్చు: ప్యారడైజ్‌కు పోస్ట్ ప్రొడక్షన్ దెబ్బ.. సినిమాకు అది ఎంత కీలకమో గుర్తించరా.? 55 ఏళ్ళ క్రితం కృష్ణ సాహసం.. సూపర్ స్టార్ బాటలో పయనించిన స్టార్స్ వీళ్ళే.! [Love And War First Look, Ranbir Kapoor First Look, Love & War First Look, Sanjay Leela Bhansali, Ranbir Kapoor, Alia Bhatt, Vicky Kaushal, Telugu Film News, Telugu News]
Sep 24, 2026 2:45PMక్యాన్సర్‌ను జయించి హీరోయిన్గా ఎంట్రీ.. కూతురి విజయంతో వివేక్ ఒబెరాయ్ ఎమోషనల్.!
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌కు తన దత్తపుత్రిక సహారా షా ఇచ్చిన సర్ప్రైజ్ ఎంతో భావోద్వేగానికి గురిచేసింది. చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న సహారా.. ఇప్పుడు ఆ మహమ్మారిని పూర్తిగా జయించి జీవితంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు.. పైలట్‌గా శిక్షణ పూర్తి చేసుకున్న ఆమె ఇప్పుడు హీరోయిన్గా కూడా వెండితెరపై అడుగుపెట్టబోతోంది. తన కూతురి ఈ విజయాన్ని చూసిన వివేక్ ఒబెరాయ్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. సహారా షా కేవలం రెండున్నరేళ్ల వయసులో ఉన్నప్పుడే క్యాన్సర్ బారిన పడింది. ఆ సమయంలో ఆమెను క్యాన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్ (CPAA)కు తీసుకెళ్లిన వివేక్ ఒబెరాయ్.. ఆ చిన్నారి పరిస్థితిని చూసి ఆమెకు అండగా నిలిచారు. ఆ తర్వాత ఆమెను దత్తత తీసుకుని చికిత్సతో పాటు చదువు, శిక్షణ వంటి విషయాల్లోనూ సహాయం చేస్తూ వచ్చారు. చిన్న వయసులోనే కీమోథెరపీ వంటి కఠినమైన చికిత్సను ఎదుర్కొన్న సహారా.. చివరకు క్యాన్సర్‌ను జయించింది. ప్రస్తుతం ఆమెకు 22 ఏళ్లు. క్యాన్సర్‌ను జయించడమే కాదు.. సహారా ఏవియేషన్‌లోనూ శిక్షణ పూర్తి చేసుకుంది. త్వరలో కమర్షియల్ పైలట్‌గా మారేందుకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో తనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన మరో రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది. నటుడిగా వివేక్ ఒబెరాయ్‌ను చూస్తూ పెరిగిన సహారా.. తాను కూడా సినిమాల్లో నటించాలని అనుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వివేక్‌కు చెప్పడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముంబైలో జరిగిన క్యాన్సర్ రోజ్ డే కార్యక్రమంలో సహారా తన సినిమా ఎంట్రీ గురించి ప్రకటించింది. తాను ఓ నేపాలీ సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నట్లు చెప్పింది. అంతేకాదు.. వేదికపైనే ఆ సినిమా ఒప్పందంపై సంతకం చేసి, పోస్టర్‌ను కూడా ఆవిష్కరించింది. ఈ విషయం ముందుగా తెలియకపోవడంతో వివేక్ ఒబెరాయ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తన కళ్ల ముందే చిన్నారి నుంచి యువతిగా ఎదిగిన సహారా.. ఇప్పుడు హీరోయిన్గా తొలి అడుగు వేయడంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా సహారా తనను ‘దాదా’ అని పిలుస్తూ.. చిన్నప్పటి నుంచి తనకు వివేక్ అందించిన అండను గుర్తుచేసుకుంది. తన తండ్రి లేని లోటును ఆయన తీర్చారని, తన కలలను సాకారం చేసుకోవడానికి ఎంతో ప్రోత్సహించారని చెప్పింది. నటన, డ్యాన్స్ వంటి విషయాల్లోనూ తనను ఎప్పుడూ ప్రోత్సహించారని తెలిపింది. ఈ సినిమా తనకు వివేక్ 50వ పుట్టినరోజు సందర్భంగా ఇస్తున్న చిన్న బహుమతి అని చెప్పింది. కూతురి మాటలు విన్న వివేక్ ఒబెరాయ్ ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. ఇది తన జీవితంలో ఎంతో గర్వకారణమైన క్షణమని చెప్పారు. చిన్నతనంలో క్యాన్సర్‌తో పోరాడుతున్న సహారాను చూసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. రెండున్నరేళ్ల వయసులో ఎర్రబడిన కళ్లతో, బలహీనంగా కనిపిస్తూ కీమోథెరపీ తీసుకుంటున్న ఆ చిన్నారి తన వేలు పట్టుకున్నప్పుడు.. ఆమె తప్పకుండా ఈ పోరాటంలో గెలుస్తుందని అప్పుడే అనిపించిందని చెప్పారు. ప్రతిరోజూ ఆమె కోసం ప్రార్థించానని, ఇప్పుడు క్యాన్సర్‌ను జయించి తన ముందే నిలబడటం ఎంతో సంతోషంగా ఉందని భావోద్వేగానికి గురయ్యారు. ఇక సహారా జీవితంలో మరో విశేషం ఏంటంటే.. క్యాన్సర్‌ను జయించిన తర్వాత కూడా తన కలలను ఆపకుండా ముందుకు సాగుతోంది. ఒకవైపు ఏవియేషన్‌లో శిక్షణ పూర్తి చేసి పైలట్‌గా మారేందుకు సిద్ధమవుతూనే.. మరోవైపు సినిమాల్లో హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. తన కూతురు భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకున్న వివేక్.. తాను సాధించిన విజయాన్ని మర్చిపోకుండా, భవిష్యత్తులో తనలాంటి వారికి అండగా నిలవాలని కూడా సూచించారు. వివేక్ ఒబెరాయ్‌కు తన భార్య ప్రియాంక అల్వాతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు క్యాన్సర్‌తో బాధపడుతున్న పలువురు చిన్నారులకు ఆయన చాలాకాలంగా అండగా నిలుస్తున్నారు. ఇటీవల తన 50వ పుట్టినరోజు సందర్భంగా మరో 50 మంది క్యాన్సర్ బాధిత పిల్లల చికిత్స బాధ్యతను తీసుకున్నారు. ఇప్పుడు తన దత్తపుత్రిక క్యాన్సర్‌ను జయించి హీరోయిన్గా తొలి అడుగు వేయడం ఆయనకు మరింత ప్రత్యేకమైన సందర్భంగా మారింది. [Vivek Oberoi, Sahara Shah, Vivek Oberoi Adopted Daughter, Sahara Shah Cancer Survivor, Vivek Oberoi Daughter, Sahara Shah Film Debut, Nepali Film, Vivek Oberoi Emotional, Cancer Survivor Heroine, Bollywood News, Vivek Oberoi Latest News, Sahara Shah Actress, Cancer Rose Day 2026]
Sep 23, 2026 9:18PMస్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ ఇంట విషాదం.. బాలీవుడ్ ప్రముఖుల సంతాపం.!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి కృష్ణ ముఖర్జీ కన్నుమూశారు. 75 ఏళ్ల వయసున్న కృష్ణ ముఖర్జీ సెప్టెంబర్ 22న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. ఈ విషాద వార్తతో రాణి ముఖర్జీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణ ముఖర్జీ మృతిని రాణి ముఖర్జీ కుటుంబం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అభిమానులు, సన్నిహితులు అందిస్తున్న ప్రేమ, ప్రార్థనలు, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తమ కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్నందున గోప్యతను గౌరవించాలని కోరారు. అయితే కృష్ణ ముఖర్జీ మరణానికి గల కారణాన్ని మాత్రం కుటుంబం వెల్లడించలేదు. ఇది కూడా చదవండి: నారా రోహిత్ తనయుడి పేరు ఇదే.. తాతయ్య గుర్తుగా ా పేరును చేర్చిన హీరో రాణి ముఖర్జీకి ఆమె తల్లితో ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉంది. సినీ కెరీర్ విషయంలో కూడా కృష్ణ ముఖర్జీ తన కుమార్తెకు ఎంతో ప్రోత్సాహం అందించారు. రాణి నటిగా కెరీర్ ప్రారంభించే విషయంలో ఆమె తల్లి కీలక పాత్ర పోషించారు. నటన వైపు వెళ్లాలని రాణిని ప్రోత్సహించడమే కాకుండా, ఆమె తొలి సినిమా ‘రాజా కీ ఆయేగీ బరాత్’ సమయంలో కూడా కృష్ణ ముఖర్జీ ఆసక్తికరంగా స్పందించినట్లు గతంలో రాణి వెల్లడించారు. కృష్ణ ముఖర్జీకి కూడా సినీ రంగంతో అనుబంధం ఉంది. బెంగాలీ, హిందీ చిత్ర పరిశ్రమల్లో ఆమె ప్లేబ్యాక్ సింగర్‌గా పనిచేశారు. 1982లో వచ్చిన ‘తీస్రీ ఆంఖ్’ చిత్రంలోని ‘ఇద్ కే దిన్ గలే మిల్ లే రాజా’ పాటకు ఆమె గాత్రం అందించారు. ఇదిలా ఉంటే.. రాణి ముఖర్జీ ప్రస్తుతం బాలీవుడ్లో అగ్ర కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ‘గులామ్’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘సాథియా’, ‘హమ్ తుమ్’, ‘బ్లాక్’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించారు. ఇటీవల ‘మర్దానీ 3’లోనూ కనిపించారు. తల్లి మరణంతో రాణి ముఖర్జీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కృష్ణ ముఖర్జీ మృతికి బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మీకు నచ్చుతుంది: స్టార్ హీరోల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న నిధి అగర్వాల్ ఏందయ్య సామీ.. రణబాలి ఫుల్ సాంగ్‌లో విజయ్, రష్మిక కెమిస్ట్రీ హైలైట్ [Rani Mukerji, Rani Mukerji Mother, Krishna Mukerji, Krishna Mukerji Death, Rani Mukerji Mother Dies, Rani Mukerji Family, Bollywood News, Rani Mukerji Latest News, Rani Mukerji Mother Death, Krishna Mukerji Age, Hindi Cinema News]
Sep 22, 2026 4:55PM6 గంటల తర్వాత ఆమె అబ్బాయిగా మారుతుందట.. ‘రామ్ అండ్ లీలా’ ఎలా ఉందంటే?
కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు తెరకెక్కించేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్న సమయంలో వచ్చిన చిత్రం ‘రామ్ అండ్ లీలా’. రియో రాజ్, వర్తిక జైన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కామెడీ, సైన్స్ ఫిక్షన్ అంశాలను కలిపి రూపొందింది. ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అందుబాటులో ఉంది. ఇక కథ విషయానికి వస్తే.. రఘురామ్ (రియో రాజ్) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. అతని వయసు 30 దాటినా పెళ్లి కావడం లేదు. పెళ్లి సంబంధాలు చూసిన ప్రతిసారీ ఏదో ఒక కారణంతో అవి కుదరకపోవడంతో రఘురామ్ ఆందోళన చెందుతుంటాడు. ఎలాగైనా తనకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అమ్మాయిలను ఎక్కువగా కలిసే అవకాశం ఉంటుందని లోకల్ ట్రైన్లో ప్రయాణాలు చేయడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో లీలా (వర్తిక జైన్) పరిచయమవుతుంది. ఆమె అందానికి ఆకర్షితుడైన రఘురామ్.. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే లీలా అతనికి ఓ షరతు పెడుతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత తనను కలవకూడదని చెబుతుంది. రఘురామ్ కూడా అందుకు అంగీకరించి ఆమెను తన కుటుంబానికి పరిచయం చేస్తాడు. అయితే లీలా ఎందుకు సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు రాదనే విషయం తెలుసుకోవడానికి రఘురామ్ ప్రయత్నిస్తాడు. చివరకు అసలు కారణం బయటపడుతుంది. తాను ఏలియన్ కుటుంబానికి చెందినదానినని, సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత తాను అబ్బాయిగా మారిపోతానని లీలా చెప్పడంతో కథ ఒక్కసారిగా మరో మలుపు తిరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో రఘురామ్ ఏం చేశాడు? లీలను పెళ్లి చేసుకోవడానికి అతను అంగీకరించాడా? అనేదే మిగతా కథ. సినిమా ఫస్టాఫ్ విషయానికి వస్తే.. పెళ్లి కోసం హీరో పడే తిప్పలు, అమ్మాయిల వెంట తిరిగే సన్నివేశాలు సరదాగా సాగుతాయి. లీల పరిచయం తర్వాత ఆమె సాయంత్రం 6 గంటల తర్వాత ఎందుకు కనిపించదనే ఆసక్తిని దర్శకుడు కొనసాగిస్తాడు. దీంతో అసలు కారణం ఏమిటనే కుతూహలం ప్రేక్షకుల్లో ఏర్పడుతుంది. అయితే ఆ ట్విస్ట్ బయటపడిన తర్వాత సినిమా ఆసక్తి కొంత తగ్గుతుంది. లీలా ఏలియన్ కుటుంబానికి చెందినదనే అంశంతో పాటు, 6 గంటల తర్వాత అబ్బాయిగా మారుతుందనే పాయింట్‌ను దర్శకుడు కామెడీ కోసం ఉపయోగించే ప్రయత్నం చేసినా అది పూర్తిస్థాయిలో వర్కౌట్ కాలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో సెకండాఫ్‌లో కథ కొంత గందరగోళంగా మారుతుంది. నటీనటుల విషయానికి వస్తే.. రియో రాజ్, వర్తిక జైన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇతర నటీనటులు కూడా తమ పరిధిలో బాగానే నటించారు. మల్లికార్జున్ సినిమాటోగ్రఫీ, అంకిత్ మీనన్ సంగీతం, శివ ఎడిటింగ్ ఫర్వాలేదనిపిస్తాయి. మొత్తంగా ‘రామ్ అండ్ లీలా’లో కొత్త కాన్సెప్ట్‌ను ఎంచుకున్నప్పటికీ, దాన్ని తెరపైకి తీసుకురావడంలో సెకండాఫ్‌లో తడబాటు కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లోని కామెడీ, ప్రేమ సన్నివేశాలు కొంతవరకు ఆకట్టుకున్నా.. తర్వాత వచ్చే ట్విస్టులు అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. ఏపి7ఏఎం రివ్యూ ప్రకారం ఈ సినిమాకు 5కి 2 రేటింగ్ ఇచ్చారు. [Ram and Leela Movie Review, Ram and Leela OTT Review, Ram and Leela Amazon Prime, Rio Raj Ram and Leela, Vartika Jain, Ram and Leela Telugu Review, Ram and Leela Story, Ram and Leela Review Rating, Ramachandrran Kannan, Ankit Menon, Tamil Sci Fi Comedy, Amazon Prime New Movies, Ram and Leela Movie 2026]
Sep 22, 2026 3:27PMపృథ్వీరాజ్, కరీనా కపూర్ లేటెస్ట్ మూవీ.. డిజాస్టర్ అవ్వడానికి రీజన్ ఇదే.?
బాలీవుడ్లో సరికొత్త కథాంశంతో తెరకెక్కిన సస్పెన్స్ డ్రామా చిత్రం 'దాయ్రా' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది. కరీనా కపూర్ ఖాన్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి విలక్షణ నటులు ప్రధాన పాత్రల్లో నటించినప్పటికీ, ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో తీవ్రంగా విఫలమైంది. ప్రసిద్ధ దర్శకురాలు మేఘనా గుల్జార్ ఈ చిత్రాన్ని అత్యంతోత్కంఠభరితంగా తెరకెక్కించినప్పటికీ, తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద మందకొడి వసూళ్లతో నిరాశపరిచింది. నార్త్ ఇండియాతో పాటు సౌత్‌లోనూ ఈ సినిమాకు ఊహించని రీతిలో లో-ఆక్యుపెన్సీ నమోదవ్వడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది కూడా చదవండి: సేల్స్ గర్ల్ నుండి సిల్వర్ స్క్రీన్ వరకు.. ది ప్యారడైజ్ హీరోయిన్ ఇన్స్పైరింగ్ జర్నీ దర్శకుడిగా, నటుడిగా వరుస విజయాలతో దూసుకుపోతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ నటించినప్పటికీ, ఆయన సొంత రాష్ట్రమైన కేరళలో ఈ సినిమాకు కేవలం 7 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ లభించడం గమనార్హం. అలాగే హిందీ బెల్ట్‌లో తొలి రోజు కేవలం 11.65 శాతానికే పరిమితమైంది. స్టార్ కాస్టింగ్ ఉన్నప్పటికీ జనాలు థియేటర్ల వైపు మొగ్గు చూపకపోవడం కలకలం రేపుతోంది. ఈ సినిమా పరాజయానికి బాక్సాఫీస్ వద్ద రన్ అవుతున్న భక్తిరస చిత్రం 'హనుమాన్ అంశ్' ప్రభంజనం కూడా ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటేసిన ఆ చిత్రం ముందు 'దాయ్రా' నిలదొక్కుకోలేకపోయింది. అంతేకాకుండా, గతంలో వచ్చిన 'తల్వార్' తరహాలో మేఘనా గుల్జార్ ఈ కథను గ్రిప్పింగ్‌గా మలచలేకపోయారనే టాక్ కూడా ఉంది. దిశా ఘటన ఆధారంగా తెరకెక్కినప్పటికీ, ఆ ఉదంతం జరిగి ఏళ్ళు గడిచిపోవడం మరియు ఇప్పటికే ఇవే అంశాలపై పలు చిత్రాలు రావడం కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపకపోవడానికి కారణంగా కనిపిస్తోంది. కరీనా, పృథ్వీరాజ్‌ల క్రేజ్ వల్ల హిందీ, సౌత్ భాషల్లో ఈ చిత్రం బాగుంటుందని ఆశించిన నిర్మాతలు ప్రస్తుతం కలెక్షన్లను చూసి నిరాశలో మునిగిపోయారు. మీకు నచ్చుతుంది: మెగా కాంబో: బుచ్చిబాబుతో చిరంజీవి సినిమా.. అసలు ట్విస్ట్ ఇదే.! [Daayra Box Office, Kareena Kapoor, Prithviraj Sukumaran, Meghna Gulzar, Bollywood Box Office Collection]
Sep 21, 2026 5:37PMసల్మాన్ ఖాన్‌కు గుండె నొప్పి.. బిగ్ బాస్ ప్రోమో కట్‌పై సారీ చెప్పిన భాయ్‌జాన్.!
బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ తన ఆరోగ్యం గురించి వస్తున్న రకరకాల వార్తలకు స్వయంగా స్వస్తి పలికారు. ఇటీవల బిగ్ బాస్ వేదికపై ఆయనకు గుండెనొప్పి వచ్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో కోట్లాది మంది అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన సల్మాన్, తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని స్పష్టం చేస్తూనే, ఆ ప్రోమో కట్ వల్ల జరిగిన వివాదానికి సారీ చెప్పారు. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల విడుదలైన బిగ్ బాస్ ‘వీకెండ్ కా వార్’ ప్రోమోలో సల్మాన్ ఖాన్ అకస్మాత్తుగా ఛాతి పట్టుకుని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు చూపించారు. దాంతో సెట్ లో ఉన్న కంటెస్టెంట్లు, షో చూస్తున్న ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే అది నిజమైన అనారోగ్యం కాదని, హౌస్‌లోని ఓ కంటెస్టెంట్ ప్రవర్తనను ఎండగట్టడానికి తాను చేసిన ప్రాంక్ అని సల్మాన్ వెల్లడించారు. ఇంట్లోని కంటెస్టెంట్ ఖాజీ తౌఖీర్ గత కొన్ని రోజులుగా తప్పుడు అనారోగ్య కారణాలు చెబుతూ తోటి సభ్యులను, ప్రేక్షకులను మోసం చేస్తున్నాడని సల్మాన్ తెలిపారు. హెల్త్ ప్రాబ్లమ్స్‌ను ఎంటర్టైన్మెంట్ కోసం వాడటం ఎంత తప్పో నిరూపించేందుకే తాను అలా నటించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అయితే షో ప్రమోషన్ కోసం ఆ సన్నివేశాన్ని తప్పుగా ప్రోమోలో కట్ చేయడం వల్ల అసలు ఉద్దేశం పక్కదారి పట్టిందని సల్మాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్య నెపంతో ప్రేక్షకుల సెంటిమెంట్‌తో ఆడుకోవడం సరికాదన్న సందేశాన్ని ఇవ్వబోయి, చివరికి ఆ ప్రోమో వల్ల తానే తప్పు చేసినట్లుగా చిత్రీకరణ జరిగిందని భాయ్‌జాన్ పేర్కొన్నారు. షో నిర్వాహకులు ఎడిటింగ్ లో చేసిన ఈ పొరపాటు వల్ల అభిమానులు ఆందోళన చెందారని, అందుకే ప్రోమో టీమ్ తరఫున తాను క్షమాపణలు కోరుతున్నానని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. నటుడిగా దశాబ్దాలుగా వెండితెరపై అలరిస్తున్న సల్మాన్ ఖాన్, గత కొన్నేళ్లుగా బిగ్ బాస్ రియాలిటీ షోకు తిరుగులేని హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ రేటింగ్స్‌లో ఆయన మార్క్ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది. ఒకవైపు బుల్లితెరపై సందడి చేస్తూనే, మరోవైపు భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. సల్మాన్ ఖాన్ స్వయంగా సోషల్ మీడియాలో క్లారిటీ ఇవ్వడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఎంతైనా హెల్త్ విషయాన్ని ప్రాంక్ లేదా ప్రోమో హైప్ కోసం వాడకూడదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. షో నిర్వాహకుల పొరపాటు ఉన్నప్పటికీ, బాధ్యతగా ముందుకొచ్చి సారీ చెప్పిన సల్మాన్ నైజానికి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వరుస భారీ యాక్షన్ ప్రాజెక్ట్‌ల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ ప్రోమో కలకలానికి తెరపడటంతో, అభిమానులందరూ ఆయన రాబోయే బిగ్ స్క్రీన్ మూవీ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Sep 21, 2026 12:54PM'బిగ్ బాస్'కే కండీషన్ పెట్టిన నోరా ఫతేహి.. అది కూడా కెరీర్ ప్రారంభంలోనే.!
బాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్, ఇంటర్నేషనల్ పాప్ ఐకాన్ నోరా ఫతేహి కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాలు, సవాళ్ల గురించి ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. బాలీవుడ్లో గ్లామరస్ క్వీన్‌గా, అద్భుతమైన డ్యాన్సర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నోరా, ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ సమయంలోనే బిగ్ బాస్ రియాలిటీ షో నిర్వాహకులకు ఒక పెద్ద కండీషన్ పెట్టి మరీ హౌస్‌లోకి అడుగుపెట్టానని చెప్పారు. కెరీర్ ప్రారంభంలో అనేక హిట్స్ అండ్ డ్యాన్స్ నంబర్స్ చేసినప్పటికీ, తనకు రావాల్సిన డబ్బులు సకాలంలో అందలేదని నోరా గుర్తుచేసుకున్నారు. నిర్మాతలు ఏజెన్సీలకు పేమెంట్స్ ఇచ్చినా, తన వరకు ఆ డబ్బు రాక తీవ్రమైన ఆర్థిక సమస్యలను అనుభవించానని పేర్కొన్నారు. ఆ సమయంలోనే బిగ్ బాస్ 9 నిర్వాహకుల నుంచి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఆఫర్ వచ్చిందని, అయితే తనకు మొదట రియాలిటీ షోస్ చేయడం అస్సలు ఇష్టం లేక ఆఫర్‌ను తిరస్కరించానని వెల్లడించారు. అయితే ఛానెల్ మేకర్స్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో పాటు, ఆ షో ద్వారా ఇంట్లోని ప్రతి ఒక్కరికీ త్వరితగతిన చేరువ కావచ్చు అని నోరా ఆలోచించారట. కానీ అదే సమయంలో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టడానికి ఒక షరతు విధించారు. అదే ఛానెల్లో ప్రసారమయ్యే ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'జలక్ దిఖ్లా జా'లో పాల్గొనడమే తన అసలు లక్ష్యమని, ఆ షోలో అవకాశం ఇస్తేనే బిగ్ బాస్ 9కి ఓకే చెప్తానని తెగేసి చెప్పారు. నిర్వాహకులు ఆ కండీషన్‌కు అంగీకరించడంతోనే 2015 డిసెంబర్లో వైల్డ్‌కార్డ్‌గా అడుగుపెట్టానని తెలిపారు. బిగ్ బాస్ హౌస్‌లో కేవలం మూడు వారాలు మాత్రమే ఉన్నప్పటికీ, నోరా తన డ్యాన్స్ ప్రతిభతో, క్యూట్ పర్సనాలిటీతో ఆడియన్స్‌ను అమితంగా ఆకట్టుకున్నారు. ఆ సీజన్ విజేత ప్రిన్స్ నరులాతో ఆమె ఏర్పరచుకున్న స్నేహం, బాండింగ్ కూడా అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఆ తర్వాత అనుకున్నట్లే జలక్ దిఖ్లా జా షోలో పాల్గొని తన డ్యాన్స్ స్కిల్స్‌తో మరింత ప్రాచుర్యం పొందారు. ఒకప్పుడు పేమెంట్స్ కోసం పోరాడి బిగ్ బాస్‌కు కండీషన్ పెట్టిన నోరా ఫతేహి, ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో రచ్చ చేస్తున్నారు. ఫీఫా వరల్డ్ కప్ ఈవెంట్లో పర్ఫార్మ్ చేయడమే కాకుండా, అంతర్జాతీయ పాప్ ప్రాజెక్టులతో వరుసగా బిజీ అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ భారీ ప్రాజెక్టుల్లో తన మార్క్ డ్యాన్స్ నంబర్లతో కుర్రకారును అలరిస్తున్నారు. తన కెరీర్ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులను నోరా ఓపెన్‌గా బయటపెట్టడంతో, ఆమె ఫ్యాన్స్ మరియు నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఎంతటి కష్టాలు వచ్చినా పట్టుదలతో శ్రమించి ఈ స్థాయికి చేరుకున్న నోరా డెడికేషన్‌ను కాంప్లిమెంట్స్‌తో ముంచెత్తుతున్నారు. [Nora Fatehi, Bigg Boss 9, Nora Fatehi Bigg Boss Condition, Jhalak Dikhhla Jaa, Nora Fatehi Latest News]
Sep 20, 2026 5:45PM'రామాయణ' నిడివిని భారీగా తగ్గిస్తున్న నితిష్ తివారి.. ఎంతో తెలుసా?
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైథాలాజికల్ విజువల్ వండర్ 'రామాయణ'. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ సారథ్యంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇండియన్ సినిమా హిస్టరీలోనే ముందెన్నడూ లేనంత బిగ్ హైప్ నెలకొంది. తాజాగా ఈ మూవీ పార్ట్-1కి సంబంధించి ఒక ఆసక్తికరమైన సమాచారం ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. పాన్-ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో తొలి భాగానికి సంబంధించి రన్‌టైమ్ ఎడిటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే కథనంలో వేగం, ప్రేక్షకుల్లో ఉత్కంఠ తగ్గకుండా ఉండేందుకు ఎడిటింగ్ టేబుల్ వద్ద దర్శకుడు నితీష్ తివారీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుతున్న వార్తల ప్రకారం తొలి భాగం నిడివిని దాదాపు 30 నిమిషాల వరకు తగ్గించనున్నారట. సాధారణంగా పౌరాణిక చిత్రాల్లో సన్నివేశాల విస్తృతి ఎక్కువగా ఉంటుంది. కానీ ఆధునిక ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా, ప్రతి సన్నివేశం గ్రిప్పింగ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కథలో అనవసర సాగదీతలకు చోటు లేకుండా నేరుగా మూల కథలోకి తీసుకెళ్లేలా సీన్లను ట్రిమ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ రన్‌టైమ్ కుదింపు వల్ల సినిమా మరింత ఎంగేజింగ్‌గా మారుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ బిగ్ స్క్రీన్ విజువల్ వండర్‌లో శ్రీరాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా, సీతాదేవిగా సాయి పల్లవి కనిపించనున్నారు. ఇక రావణాసురుడిగా యష్ నటిస్తుండడమే కాకుండా, ఈ చిత్రానికి సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంతటి భారీ తారాగణంతో, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అవుతోంది. ఈ నిడివి తగ్గింపు వార్తపై కూడా నెటిజన్లు, ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. సాగదీత లేకుండా షార్ప్ అండ్ క్రిస్పీగా ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. వరల్డ్ క్లాస్ VFX సాంకేతికతతో తెరకెక్కుతున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ తొలి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అలాగే రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేస్తారు.
Sep 20, 2026 5:29PMనాలుగేళ్ల నిరీక్షణ తర్వాత నేరుగా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ మూవీ.!
టాలీవుడ్లో 'సీతారామం' చిత్రంతో సీతగా మారి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన అందాల భామ మృణాల్ ఠాకూర్. వరుస సక్సెస్ లతో దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఈ భామ నటించిన ఒక బాలీవుడ్ చిత్రం సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మృణాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'పూజా మేరీ జాన్' చిత్రం థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలకు సిద్ధమవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో మృణాల్ ఠాకూర్‌తో పాటు వర్సటైల్ యాక్ట్రెస్ హుమా ఖురేషి కీలక పాత్రలో నటించారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటన వచ్చినప్పటి నుంచే మూవీ లవర్స్‌లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం, మేకర్స్ ఈ చిత్రాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కథ విషయానికొస్తే, 'పూజా మేరీ జాన్' ఒక క్రైమ్ అండ్ ఈవ్‌టీజింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ థ్రిల్లర్ డ్రామా. నిత్యం బెదిరింపులకు గురయ్యే ఓ యువతి, ఆ వేధింపుల నుంచి బయటపడటానికి ఎలాంటి పోరాటం చేసింది? అసలు ఆమెను టార్గెట్ చేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరు? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమాను రూపొందించారు. నవజ్యోత్ గులాటీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ దినేష్ విజన్ మెడాక్ ఫిల్మ్స్ నిర్మించింది. మృణాల్ ఠాకూర్ కెరీర్ విషయానికి వస్తే, 'సీతారామం' తర్వాత 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇక హుమా ఖురేషి కూడా ఓటీటీ స్పేస్‌లో 'మహారాణి' సిరీస్‌తో ఇప్పటికే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ అనగానే ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు ఈ థ్రిల్లర్ మూవీ బయటకు వస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఓటీటీలో ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. థ్రిల్లర్ జోనర్ కావడం, మంచి స్టార్ కాస్ట్ ఉండటంతో ఓటీటీ ప్రేక్షకులను ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంటుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ వేదిక ద్వారా ఈ చిత్రం త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. మేకర్స్ అతి త్వరలోనే అధికారిక రిలీజ్ డేట్‌ను వెల్లడించే అవకాశం ఉంది. [Mrunal Thakur, Pooja Meri Jaan, OTT Release, Huma Qureshi, Bollywood Movies]
Sep 20, 2026 5:13PM
రెండో బిడ్డకు జన్మనిచ్చిన దీపిక: 'దువా'కు చెల్లెలు వచ్చింది.!
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకోణె, రణ్వీర్ సింగ్ (Ranveer Singh) మరోసారి తల్లిదండ్రులయ్యారు. శనివారం (సెప్టెంబర్ 19) దీపికా రెండోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను ఈ జంట సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అందులో ‘వెల్కమ్ బేబీ గర్ల్ (19-09-2026). ఇట్లు.. దువా, దీపిక, రణ్వీర్’ అని రాసుకొచ్చారు. దీపిక, రణ్వీర్ దంపతులకు 2018లో ఇటలీలోని లేక్ కోమోలో వివాహం జరగ్గా, తొలి సంతానంగా 2024లో 'దువా' జన్మించింది. ఇప్పుడు దువాకు ఒక క్యూట్ చెల్లెలు తోడవ్వడం, వీరి కుటుంబంలో రెట్టింపు సంతోషాన్ని మోసుకొచ్చింది. ఈ శుభవార్త తెలియగానే సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇది కూడా చదవండి: అందాల ఆడబొమ్మ.. బాలయ్య ఆల్ టైం క్లాసిక్ సాంగ్.! https://www.instagram.com/p/DdeF9lOsviM/ [Deepika Ranveer Second Baby Girl, Deepika Padukone Second Child, Deepika Padukone Baby Girl, Ranveer Singh Second Child, Deepika Padukone, Ranveer Singh, Telugu Film News, Telugu News]
Sep 19, 2026 8:39PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com








