మహిళల మానసిక ఆరోగ్యం మీద ఫ్యాషన్ ప్రభావం ఉంటుందా!

  మహిళల మానసిక ఆరోగ్యం మీద ఫ్యాషన్ ప్రభావం ఉంటుందా!   ఫ్యాషన్ ఒక వ్యక్తిని ప్రత్యేకంగా నిలబెట్టేది,  ఒక వ్యక్తి రూపాన్ని మార్చేసేది,  ఒక వ్యక్తిని అందంగా చూపెట్టేది.  ముఖ్యంగా అందంగా కనబడాలనే తపనతోనూ,  అందరిలో తాము సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలని అనుకుంటారు.  అయితే ఫ్యాషన్ కు మానసిక ఆరోగ్యానికి మధ్య చాలా సంబంధం ఉందని అంటున్నారు మానసిక  నిపుణులు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. మానసిక ఆరోగ్యంపై ఫ్యాషన్ ప్రభావం.. మంచి బట్టలు.. మంచి బట్టలు వేసుకోవడం ఫ్యాషన్ లో భాగమే.. ఒక మనిషిని హుందాగా,  పది మందిలో గౌరవంగా నిలబెట్టడంలో వస్త్రధారణ కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల అందరిలో  చాలా సౌకర్యవంతంగా ఉండగలుగుతారు. దీన్ని బట్టి చూస్తే ఫ్యాషన్ అనేది మనిషి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.  మనిషి మానసిక ఆరగ్యం పైన సానుకూల ప్రభావం చూపిస్తుంది.  ఒంటరితనం.. ఫ్యాషన్ అనేది  ఏ ఒక్కరో ఫాలో అయ్యే విషయం కాదు. ఫ్యాషన్ ను కొందరు ఉమ్మడిగా ఫాలో అవుతారు. ముఖ్యంగా ఫ్యాషన్ లో భాగంగా ఫ్యాషన్ షోలు,  ట్రెడిషన్,  వెస్ట్రన్,  ఫారిన్ అంటూ వివిధ రకాల కల్చర్ కు సంబంధించిన దుస్తులను అందరూ ఉమ్మడిగా ధరిస్తూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు.  ఇది వ్యక్తిని ఒంటరితనం నుండి బయటకు తీసుకు వస్తుంది.  అంటే ఫ్యాషన్ అనేది మనిషిని సమాజంలో భాగం చేస్తుంది. ప్రతికూలత కూడా.. ఫ్యాషన్ అనేది కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ.. కొందరిని మానసిక ఒత్తిడిలోకి కూడా నెట్టుతుంది. ముఖ్యంగా ఫ్యాషన్ లో భాగంగా మానసిక ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. ఇతరులతో పోల్చుకోవడం,  ఇతరుల కంటే తాము ఫ్యాషన్ గా లేమని అనుకోవడం,  తమను తాము తక్కువ చేసుకోవడం.  ఇలాంటివన్నీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఫ్యాషన్ అనేది వ్యక్తిని ప్రత్యేకంగా ఉంచినా అది వ్యక్తి ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది.  ఖరీదైన దుస్తులు,  ఖరీదైన ఆభరణాలు,  ఖరీదైన హ్యాండ్ బ్యాగులు,  వాచ్ లు, చెప్పులు.. ముఖ్యంగా మ్యాచింగ్ వేర్ అనేది ఫ్యాషన్ లో భాగం కాబట్టి చాలా ఖర్చు అవుతుంది.  ఇది ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తుంది.  ఇది క్రమంగా ఒత్తిడి,  ఆందోళనకు దారితీస్తుంది. ఫ్యాషన్ ఇప్పట్లో చాలా వేగంగా మారిపోతుండటం వల్ల ఇది ఎక్కువగా ఉంది. ఫ్యాషన్ అనేది వ్యక్తిని ప్రత్యేకంగా నిలబెట్టేదే.. కానీ ఈ ఫ్యాషన్ ఫాలో అయ్యే పది మందిలో ఏ ఒక్కరో తగినంత ఫ్యాషన్ గా లేకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా మిగిలిన వ్యక్తుల నుండి వివక్ష ఎదుర్కునే అవకాశం ఉంటుంది. ఫ్యాషన్ గా లేకపోవడాన్ని నేటి కాలంలో అనాగరికంగా భావించడం కూడా దీనికి కారణం. ఫ్యాషన్ లో పోకడలు ఏవైనా  సమాజ ఆమోద యోగ్యంగా ఉన్నంతవరకు ఎలాంటి నష్టం ఉండదు. కానీ సమాజానికి వ్యతిరేకంగా ఉన్నా,  సమాజ కట్టుబాట్లకు భిన్నంగా ఉన్నా ఆ వ్యక్తిని దూరం ఉంచినట్టు,  ఆ వ్యక్తిని ఒంటరిగా ఉంచినట్టు చేస్తారు. పై కారణాలు అన్నీ గమనిస్తే.. ఫ్యాషన్ అనేది మనిషిని ఉన్నతంగానూ నిలబెట్టగలదు.. అదే విధంగా సమాజం నుండి వేరు చేసి దోషిగానూ నిలబెట్టగలదు.  మానసికంగా ఆత్మవిశ్వాసంగా ఉంచగలదు,  కృంగదీయగలదు కూడా.  వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఫ్యాషన్ ను ఫాలో అవ్వడం మంచిది.                                        *రూపశ్రీ.

ఈకలతో ఈకాలం ఫ్యాషన్

  ఈకలతో ఈకాలం ఫ్యాషన్ అమ్మాయిల అందం పెంచడంలో చెవి రింగులకు ప్రాధాన్యత చాలా ఉంటుంది. అలాంటి చెవి రింగులు రోజూ ఒకటే తరహావి పెట్టుకుంటే ఏం బావుటుంది. అప్పుడప్పుడు కొత్తవి కూడా ట్రై చేస్తూ ఉండాలి. ప్రస్తుతం ఉన్న ఫ్యాషన్ కు తగ్గట్టు మన చెవి రింగులు ఎంపికచేసుకోవాలి. అలాంటి మోడల్స్ లో ఒకటే ఈ ఫెదర్ ఇయర్ రింగ్స్. మోడ్రన్ గా కనిపించడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. పక్షి ఈకలతో తయారుచేసే ఈ ఫెదర్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు మార్కెట్లో చాలా రకాలు దొరుకుతున్నాయి. ఇవి మోడ్రన్ దుస్తుల మీదకి అయితే బాగా నప్పుతాయి. మామూలు చుడీదార్స్ మీదకి కూడా బావుంటాయి. కానీ... చుడీదార్స్ మీదకి ఈ రింగులు కొంచం జాగ్రత్తగా ఎంపికచేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మోడ్రన్ గా కనిపించండి...

ఆడవారి వార్డ్ రోబ్ అధిరిపోవాలంటే ఈ ఐదు చిట్కాలు చాలా ముఖ్యం..

ఆడవారి వార్డ్ రోబ్ అధిరిపోవాలంటే ఈ ఐదు చిట్కాలు చాలా ముఖ్యం..    బీరువా లేదా వార్డ్ రోబ్ నిండా మంచి మంచి దుస్తులు ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఎంత మంచి దుస్తులు కొన్నా ఏదో వెలితి మహిళలను వెంటాడుతుంటుంది. వార్డ్ రోబ్ తీయగానే ఎందుకో అంతగా ఆకర్షించని దుస్తులు చాలావరకు వెక్కిరిస్తున్నట్టు ఉంటాయి. కొనేటప్పుడు ఉన్నంత హుషారు ఆ తరువాత చాలావరకు ఉండదు. కానీ తీసేద్దామని అనుకునేటప్పుడు మాత్రం ఆ దుస్తులకోసం పెట్టిన ఖర్చు గుర్తుకొస్తుంది. ఈ కారణంగా మహిళల వార్డ్ రోబ్ లలో ధరించని దుస్తులు ఎక్కువ ఉంటాయి. కేవలం ఐదే ఐదు చిట్కాలు పాటించడం వల్ల దుస్తుల విషయంలో చాలా జాగ్రత్త పడవచ్చు. కేవలం మంచి దుస్తులు మాత్రమే వార్డ్ రోబ్ లో ఉంచేలా చేయడమే కాదు, డబ్బు కూడా ఆదా చేయవచ్చు. ఆ సింపుల్ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. బాగా సరిపోయే దుస్తులను ఎంపిక చేసుకోవడం ఎప్పుడూ ముఖ్యం.  శరీర సౌష్టవానికి తగిన షేప్,  శరీరానికి నప్పే రంగుల కోసం ప్రతి ఒక్కరూ మొగ్గు చూపుతారు. కానీ తీరా కొన్నాక బాలేదని అనిపిస్తుంది.ఒకటి రెండు అలాంటివి ఉన్నా పర్లేదు కానీ ఎక్కవ మొత్తం వార్డ్ రోబ్ లో ఉంటే మాత్రం కష్టమే.. ఇలాంటివి అరికట్టడానికే ఈ సింపుల్ టిప్స్.. రెగులర్స్ పై సేవింగ్స్.. కొన్ని దుస్తులకు  అధిక ఖర్చు అవసరం లేదు. రోజువారి ధరించే టీ షర్డ్ లు, టాప్ లు, షార్ట్ లు, ప్యాంట్ లు తక్కువ దగ్గరకు దగ్గరలో ఉన్న దుకాణాలలో లభిస్తాయి. ఇలాంటి దుస్తులకు బ్రాండెడ్ అనే ట్యాగ్ కోసం వెంపర్లాడకండి. ఇవి రోజూ ధరిస్తుంటారు కాబట్టి తక్కువ ధరవే బెస్ట్.  పైపెచ్చు తక్కువ ధరకు లభించే వీటిని ఎక్కువ మొత్తం ఒకేసారి తీసుకుంటే దుకాణాదారులు  కాస్త డిస్కౌంట్ కూడా ఇస్తారు. దీనివల్ల మీకు డబ్బు ఆదా అవుతుంది, ఇంకోవైపు  సౌకర్యవంతంగా ఉన్నవి కొన్నట్టు ఉంటుంది.  వార్డ్ రోబ్  శుభ్రం చేయాలి..  ఇది దాదాపు అందరు మహిళలకు ఏదో ఒక సమయంలో ప్రయోజనం చేకూర్చే  చిట్కా.  ఎప్పుడూ ధరించని దుస్తులను బయటకు తీసేయాలి.  ధరించకూడదని పదే పదే అవాయిడ్ చేస్తున్న దుస్తులు, పాతగైపోయిన వస్త్రాలు తొలగించడం వల్ల వార్డ్ రోబ్ ఇష్టమైన వాటితో వెలిగిపోతుంజి. నచ్చని దుస్తులను   స్వచ్ఛంద సంస్థలకు  విరాళంగా ఇవ్వచ్చు. దీనివల్ల ఒకింత సంతృప్తి కూడా లభిస్తుంది. క్లాసిక్‌ దుస్తులు ఉండాలి.. ఎక్కువ కాలం  వార్డ్‌రోబ్‌లో తళుక్కున మెరవాలంటే అవి ఖచ్చితంగా క్లాసిక్ దుస్తులు అయి ఉండాలి. ఎందుకంటే క్లాసిక్ దుస్తులకంటే  విలువైనవి ఏవీ లేవు. వాటిలో కొద్దిగా నలుపు రంగు దుస్తులు ,  తెల్లటి చొక్కా, బ్లేజర్, ఒక జత  జీన్స్, నలుపు ప్యాంటు, స్మార్ట్ ఉన్ని కోటు, న్యూట్రల్ కార్డిగాన్,  ర్యాప్ డ్రెస్ మొదలైనవి ఉంచవచ్చు. ఇవి  సౌకర్యవంతంగా కొంచెం ఎక్కువ ఖర్చు చేయగల దుస్తులు. మరో మాటలో చెప్పాలంటే, కొంచెం ఖరీదైన శీతాకాలపు కోటు మీకు అందంగా సరిపోతుంటే దానిని కొనడం ఆపుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇవి   చాలా సంవత్సరాలు ధరించే అవకాశం ఉంది. ట్రెండింగ్..  ప్రతి సీజన్ దానితో పాటు ట్రెండింగ్ దుస్తులను తీసుకువస్తుంది. ఇటీవలి సీజన్‌లలో శిల్పకళతో కూడిన భుజాలు,  గ్లాడియేటర్ హీల్స్ ఉన్న టాప్‌ల నుండి సీక్విన్స్,  స్టడ్‌ల వరకు ప్రతిదీ ఉంటోంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే చందాన పాత తరం ఫ్యాషన్ మళ్లీ కొత్త సొబగులతో వచ్చి అలరిస్తుంది.  కాబట్టి  ట్రెండింగ్ దుస్తుల కోసం  ఖర్చు పెట్టడంలో  అతిగా ఉండకూడదు. కంఫర్ట్ ముఖ్యం.. ఏ దుస్తులు అయినా కంఫర్ట్ గా లేకపోతే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. దుస్తులలో అందమంతా కంఫర్ట్ గా ఉండటంలోనే సగానికి పైగా ఎస్సెట్ అవుతుంది. శరీర ఆకృతి, శరీరంలో భాగాలకు అనుగుణంగా తగిన దుస్తులు ఎంచుకోవడం వల్ల దుస్తులు, శరీరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపిస్తాయి. అందుకే శరీరాకృతికి తగిన దుస్తులు ఎంచుకుంటే అవి ఎప్పుడు ధరించాలన్నా ఇష్టంగా ఉంటుంది.                                                                      *నిశ్శబ్ద

ఈ స్టైలిష్ నెయిల్ ఆర్ట్ డిజైన్‌లు మీరూ ట్రై చేయండి

ఈ స్టైలిష్ నెయిల్ ఆర్ట్ డిజైన్‌లు మీరూ ట్రై చేయండి చాలా మంది మహిళలు తమ గోళ్లను అందంగా మార్చుకోవడానికి సెలూన్‌కి వెళ్లి మెనిక్యూర్ చేయించుకోవడానికి ఇష్టపడతారు. అయితే మీరు బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండానే ఇంట్లోనే  మీరు నెయిల్ ఆర్ట్‌తో మీ గోళ్లకు అందమైన డిజైన్‌ను కూడా ఇవ్వవచ్చు. నెయిల్ ఆర్ట్ క్లిష్టంగా కనిపించవచ్చు కానీ మీరు ఇంట్లోనే మీ గోళ్లకు సులభంగా అందమైన రూపాన్ని ఇవ్వవచ్చు. ఈ రోజుల్లో మహిళలు సరళమైన, హుందాగా ఉండే రంగు డిజైన్లలో ఫ్యాన్సీ నెయిల్ ఆర్ట్‌ను చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ నెయిల్ ఆర్ట్ చేయడానికి పదే పదే నెయిల్ ఆర్ట్ స్టూడియోకి వెళ్లడం వల్ల మీ నెయిల్స్ బలహీనంగా మారుతాయని మీకు తెలుసా?.. ఎలాంటి ప్రొఫెషనల్ సహాయం లేకుండానే మీరు చేయగలిగిన నెయిల్ ఆర్ట్‌లోని కొన్ని సరళమైన,  హుందాగా ఉండే డిజైన్‌లను చూద్దాం. ఇంట్లో మీరే చేయోచ్చు. 1. జిగ్‌జాగ్ డిజైన్: ఈ నెయిల్ ఆర్ట్ తయారు చేయడం చాలా సులభం. 2. హాఫ్ మూన్ స్టైల్: ఈ నెయిల్ ఆర్ట్ చాలా సింపుల్ గాచ చేయోచ్చు. 3. స్టోన్ వర్క్ నెయిల్ ఆర్ట్ డిజైన్: ఈ రకమైన నెయిల్ ఆర్ట్ చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది. 4. షిమ్మర్ డిజైన్ నెయిల్ ఆర్ట్:   సరళంగా, హుందాగా ఉంటుంది. 5. మోనోక్రోమ్ గ్రాఫిక్ నెయిల్ ఆర్ట్: ఇది సరికొత్త డిజైన్, చాలా మంది మహిళలకు ఈ నెయిల్ ఆర్ట్ గురించి తెలియదు. 6. స్ట్రిప్ డిజైన్ నెయిల్ ఆర్ట్ డిజైన్‌లో మీరు ఏ నిపుణుల సహాయం తీసుకోవలసిన అవసరం లేదు.   7. పోల్కా డాట్ నెయిల్ ఆర్ట్ అనేది బట్టలు లేదా పాదరక్షల ట్రెండ్‌లో మాత్రమే కాకుండా, నెయిల్ ఆర్ట్‌లో పోల్కా డాట్ లుక్‌ని కూడా అమ్మాయిలు ఇష్టపడుతున్నారు.

కాటుక వాడే అమ్మాయిలు ఈ నిజాలు తెలిస్తే షాకవుతారు!

కాటుక వాడే అమ్మాయిలు ఈ నిజాలు తెలిస్తే షాకవుతారు!   అదేంటో గానీ అబ్బాయిల ముఖంలోనూ, అమ్మాయిల ముఖంలోనూ అవయవాలన్నీ ఒకే విధంగా ఉన్నా అమ్మాలకు క్రెడిట్ ఎక్కువ. కళ్లు, ముక్కు, పెదవులు, నుదురు, బుగ్గలు ఇలా ప్రతిదీ అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా అమ్మాయిల కళ్లను చూసి ఫిదా అయ్యేవారు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు కళ్లకు కాటుక పెట్టి, నుదుటన బొట్టుతో అమ్మాయిలు కనిపిస్తే బాపు బొమ్మ అనే ట్యాగ్ ఇచ్చేవారు. అయితే కాలంతో పాటు ఫ్యాషన్ మారింది. ఫ్యాషన్ కు తగ్గట్టు పాత సౌందర్య ఉత్పత్తులు కొత్తగా పరిచయం అవుతున్నాయి. వాటిలో కాజల్ కూడా ఒకటి. కాటుకను ఫ్యాషన్ గా కాజల్ అని పిస్తుంటారు. వాటర్ ప్రూప్ అని చాలా రకాలుగా కాటుక అందుబాటులోకి వచ్చాక అమ్మాయిలు వివిధ రకాలుగా కాటుక అప్లై చేసి కళ్లను మెరిపిస్తారు. అయితే ఇప్పట్లో కాటుక వాడుతున్న అమ్మాయిలు కొన్ని నిజాలు తెలుసుకోవాలి. వాటిని తెలుసుకున్న తరువాత బహుశా ఖచ్చితంగా షాకవుతారు. కాటుక వెనుక నిజం.. ఇప్పట్లో కాటుకను కాజల్ అని, పెన్సిల్ తోనూ, కోన్ తోనూ, స్కెచ్ తోనూ పెట్టడం అలవాటైంది. ఎక్కువసేపు ఇది నిలిచి ఉండాలనే కారణంతో బ్యూటీ ఉత్పత్తులు కాజల్ తయారీలో రసాయనాలు ఉపయోగిస్తారు. ఒకప్పటిలా ఆవు నెయ్యి, బాదం, ఔషద మూలికలతో తయారైన కాటుక కాకపోవడం   వల్ల నేటి కాలం కాజల్ కళ్లకు నష్టం కలిగిస్తాయి. కాటుక పెడితే కళ్లు అందంగా కనిపిస్తాయేమో కానీ వాటిలో ఉన్న జింక్, ఐరన్, లెడ్ ఆక్సైడ్ వంటి పదార్ధాలు కళ్లకు ప్రమాదం కలిగిస్తాయి. ఇవి కళ్లకు అప్లై చేసిన తరువాత రాత్రికి అంతా క్లీన్ చేయాలి. లేకపోతే రసాయనాలు చర్మంలో ఇంకిపోయి డార్క్ సర్కిల్స్ రావడానికి కారణం అవుతుంది. అందుకే రాత్రి సమయంలో కళ్ల చుట్టూ ఉన్న కాటుక తొలగించాలి. అందుకోసం కింది పద్దతులు ఫాలో అవ్వాలి. కళ్ల చుట్టూ ఉన్న కాటుకను తొలగించడానికి వేజిలైన్ లేదా ప్రెట్రోలియం జెల్లీ వాడాలి. గోరుతో కొద్దిగా పెట్రోలియం జెల్లీ తీసుకుని దాన్ని కళ్లకు అప్లై చేసి మెల్లిగా మసాజ్ చేస్తూ కాటుక తొలగించుకోవాలి. తరవాత కాటన్ ప్యాడ్ తో తుడిచేసుకోవాలి. చాలామంది మేకప్ రిమూవ్ చేయడానికి క్లెన్సింగ్ మిల్క్ వాడతారు. ఇది కాటుక తొలగించడానికి కూడా సహాయపడుతుంది. కాటన్ ప్యాడ్ మీద క్లెన్సింగ్ మిల్క్ తీసుకుని దానితో కంటి చుట్టూ మెల్లిగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే కాటుక తొలగిపోతుంది. రోజ్ వాటర్ చాలామంది బ్యూటీ కేర్ లో ఉపయోగిస్తారు. కాటన్ ప్యాడ్ ను రోజ్ వాటర్ తో తడిపి దీంతో కళ్ల చుట్టూ ఉన్న కాటుక తొలగించవచ్చు. ఇవన్నీ చాలా తక్కువ ధరలో కాటుక తొలగించుకోవడానికి సురక్షితమైన పద్దతులు.                                             *నిశ్శబ్ద

ఏ డ్రస్సులో ఏ చెప్పులు వేసుకుంటే అట్రాక్షన్ గా ఉండచ్చో తెలుసా!

ఏ డ్రస్సులో ఏ చెప్పులు వేసుకుంటే అట్రాక్షన్ గా ఉండచ్చో తెలుసా! ఫ్యాషన్, స్ట్రైల్, ట్రెండింగ్ అనే పదాలు అమ్మాయిలను ఒక్కచోట కుదురుగా ఉండనివ్వవు. ఈ ఫ్యాషన్ ప్రపంచం చాలా పెద్దది. ఒకటి, రెండు కాదు అలంకరణలు, అందంగా తీర్చిదిద్దే అధ్బుతాలు. ఒకప్పటి పాత తరం అలంకరణ, వస్త్రాధరణ కూడా ఇప్పుడు మళ్లీ కొత్త సొబగులతో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. అయితే ఫ్యాషన్ లో ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకునేది మ్యాచింగ్. ఒక డ్రస్ వేసుకుంటే దానికి తగ్గట్టు గాజులు, నగలు, జడ పిన్నులు, బొట్టు బిళ్ల ఇలా అన్నీ ఫ్యాషన్ గా ఉండాలి. అయితే ఈ మ్యాచింగ్ పరంపరలో చెప్పులకు ప్రాధాన్యత ఇచ్చేవారు తక్కువగానే ఉంటారు. అలాగని మరీ దుస్తులు కొన్నట్టు  చెప్పులు కొనాలంటే అయ్యేపని కాదు. మరి ఏ తరహా దుస్తులకు ఎలాంటి చెప్పులు బాగుంటాయో తెలుసుకుంటే ఓ మూడు లేదా నాలుగు జతల చెప్పులతో అన్నింటికీ ఆకర్షణగా ఉండేలా సరిపెట్టవచ్చు. ఫ్లాట్ చెప్పులు.. ఫ్లాట్ చెప్పులు లెగ్గింగ్స్ లేదా ఫ్యాంటు  ధరించినప్పుడు వేసుకోవచ్చు. ఈ ఫ్లాట్ లలో చాలా విభిన్నమైన డిజైన్లు ఉన్నాయి. ఫ్యాంటు లేదా లెగ్గింగ్స్ పొట్టిగా ఉంటే స్ట్రాపీ చెప్పులు వేసుకోవచ్చు. అదే లెగ్గింగ్స్ పొట్టిగా లేకుండా నార్మల్ గా ఫ్లాట్ గా ఉన్న చెప్పులు వేసుకోవచ్చు.   స్టిలెట్టోస్.. కేవలం వెస్ట్రన్ దుస్తులకే కాకుండా అన్నిరకాల దుస్తులతోనూ ఈ స్టిలెట్టోస్ చక్కగా ఉంటాయి. వీటిని ఎత్నిక్ తో ధరించవచ్చు. కావాలనుకుంటే చీరతో కూడా వీటిని వేసుకోవచ్చు.  ఇవి వేసుకున్నప్పుడు చాలా అట్రాక్షన్ గా ఉంటుంది. వెడ్డెస్.. ఈ వెడ్డెస్ చెప్పులను ఏ సీజన్ లో అయినా సాదారణ దుస్తులతో అయినా కూడా వేసుకోవచ్చు. ప్యాంట్, సూట్,  ఇతర దుస్తులలో కూడా ఇవి చాలా అట్రాక్ట్ గా కనిపిస్తాయి. పైపెచ్చు ఇవి ఫ్యాషన్ కు మెరుగులు దిద్దుతాయి. షూస్.. పొడవాటి షర్ట్, లాంగ్ టాప్, టీ షర్ట్ టాప్ వంటి విదేశీ టాప్స్ దరించి వీటికి కిందుగా లెగ్గింగ్స్ ధరిస్తే మాత్రం షూస్ ఎంపిక అధిరిపోతుంది. షూస్ బోలెడు రంగులలో ఉంటాయి. ఈ షూస్ లోకూడా స్నీకర్లు అని పిలువబడేవి అమ్మాయిలకు అందం. కేవలం ఇలా డ్రస్సులలోకే కాదు. వ్యాయామం, రన్నింగ్, జాగింగ్ వంటి సందర్భాలలో స్నీకర్లు చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. వీటి వల్ల పాదాల నొప్పలు రావు. లోఫర్లు.. లోఫర్లు ధరించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అలాగే అన్ని రకాల దుస్తులలోకి ధరించవచ్చు. లెగ్గింగ్స్ నుండి విదేశీ దుస్తుల వరకు అన్ని రకాల దుస్తులతో ఈ లోఫర్లు ధరించవచ్చు. హై హీల్స్.. మహిళలు ఎన్ని రకాల చెప్పులు ధరించినా హై హీల్స్ దగ్గరకు తప్పకుండా తిరిగి వస్తారు. ఈ హై హీల్స్ వల్ల కాళ్ళ నొప్పులు వచ్చినా సరే ఎలాంటి సంకోచం లేకుండా వీటిని వేసుకోవడానకి ఇష్టపడతారు. స్కూల్, కాలేజీ వారి నుండి పెద్దల వరకు హీల్స్ కు ఓటు వేసేవారు ఎక్కువ. హై హీల్స్ ఓ జత మీతో ఉంటే ఈవెంట్ లో బాగా షో కొట్టచ్చు.                                      *నిశ్శబ్ద.

ఈ టిప్స్ తో పొట్టిగా ఉన్న వాళ్ళు పొడుగ్గా కనిపించవచ్చు!

ఈ టిప్స్ తో పొట్టిగా ఉన్న వాళ్ళు పొడుగ్గా కనిపించవచ్చు! ప్రస్తుత కాలంలో అమ్మాయిల డ్రెస్సింగ్ అంటే ఓ రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా డ్రెస్సు రంగు నుండి ప్రతిదీ మ్యాచింగ్ ఉండేలా చూసుకుంటారు అమ్మాయిలు. అయితే డ్రెస్సులు, జ్యువెలరీ, మేకప్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. చాలామంది అమ్మాయిలు కేవలం కాళ్ళకు వేసుకునే చెప్పుల విషయంలో చాలా కమిట్మెంట్ తో ఉంటారు. ఒక్కో రకమైన డ్రెస్సుకు ఒక్కో రకం పాదరక్షలు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి కూడా. . వీటిని ధరించి అందరూ స్టైలిష్‌గా కనిపిస్తారు. కానీ, ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలకు చెప్పలేనంత అసౌకర్యం ఉంటుంది. అందులోనూ పొట్టిగా ఉన్న  ఆడపిల్లలు తమ ఎత్తు ఎక్కువగా కనిపించేందుకు హై హీల్స్ వేసుకుంటారు. దీని వల్ల వారి శరీరంలో చాలా సమస్యలు మొదలవుతాయి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి సందర్భానికి హీల్స్ ధరించకూడదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. కానీ పొట్టిగా కనిపించడం ఎవరుకీ నచ్చదు. అందుకే పొట్టిగా ఉన్న అమ్మాయిలు పొడుగ్గా కనిపించడం కోసం కొన్ని చిట్కాలు. నిజానికి ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలు పొడవుగా కనిపించాలంటే హీల్స్ ధరించడం ఒక్కటే పరిష్కారం  కాదు. దీని కోసం, దుస్తులను ఎంచుకునే విధానాన్ని కూడా మార్చవచ్చు. కొన్ని దుస్తులను ధరించడం వల్ల పొట్టి అమ్మాయిల ఎత్తు పెరుగినట్టు కనిపిస్తుంది. . అందుకే అమ్మాయిలు ఎప్పుడూ ఎత్తుకు తగ్గట్టుగానే దుస్తులను ఎంచుకోవాలి.  హై వెయిస్ట్ జీన్స్ ధరించాలి... నేటి కాలంలో, హై వెయిస్ట్ జీన్స్ చాలా ట్రెండ్‌లో ఉంది. హీల్స్ ధరించకుండా పొడవుగా కనిపించాలనుకుంటే, హై వెయిస్ట్ జీన్స్‌ని ప్రయత్నించవచ్చు. క్రాప్ టాప్ దీనితో వేసుకుంటే బాగా కనిపిస్తుంది. కావాలంటే, దానితో పాటు ఓవర్ సైజ్ టీ-షర్టును కూడా వేసుకోవచ్చు. పొడవాటి కుర్తీని ధరించొచ్చు... ఎత్తు తక్కువగా ఉంటే, నేరుగా పొడవైన కుర్తా ధరించవచ్చు. దీనితో చుడీదార్ పైజామా లేదా స్కిన్ టైట్ జీన్స్ వేసుకుంటే బాగుంటుంది. అనార్కలి సూట్.. మీరు ఎత్నిక్ వేర్ ధరించాలనుకుంటే, అనార్కలి సూట్‌ను ప్రయత్నించవచ్చు. పొట్టిగా ఉన్నవారు ఈ డ్రెస్ వేసుకుంటే ఉన్న  హైట్ కంటే ఎక్కువగా  కనిపిస్తారు.. వి నెక్ బట్టలు మెరుగ్గా ఉంటాయి.... పొట్టిగా ఉండే అమ్మాయిలకు వి నెక్ బట్టలు బాగుంటాయి. ఇలాంటి నెక్ ఉన్న డ్రెస్సులలో అమ్మాయిల  ఎత్తు ఎత్తుగా కనిపిస్తుంది.. ముదురు రంగులకే ఓటెయ్యండి..  ఎత్తు తక్కువగా ఉంటే ముదురు రంగు దుస్తులు ధరించాలి.  ఇలా చేయడం వల్ల ఎత్తు ఎక్కువగా కనిపించడమే కాకుండా సన్నగా కనబడతారు. కాబట్టి పొట్టిగా ఉన్నామని ఫీలవ్వకుండా.. హై హీల్స్ వేసుకుంటేనే హైట్ కవర్ అవుతుందనే భ్రమలో ఉండకుండా.. పైన చెప్పిన చిట్కాలు పాటించేయండి.                                   ◆నిశ్శబ్ద.

కొత్తగా కొన్న షూ సరిపోవడం లేదా.. ఈ టిప్స్ ఫాలో అయితే!

కొత్తగా కొన్న షూ సరిపోవడం లేదా.. ఈ టిప్స్ ఫాలో అయితే.. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల షాపింగ్ విస్తారమైనది. అమ్మాయిలకు ఏదీ ఒక పట్టాన నచ్చదు. చాలామంది అమ్మాయిలు తమకు సెట్ అవుతుందా కాదా అనే విషయాన్ని పక్కన పెట్టి డ్రస్సు అయినా, చెప్పులు అయినా, షూస్ అయినా, గాజులు అయినా కంటికి నచ్చితే చాలు కొనేస్తారు. కానీ తీరా కొనేసి  ఇంటికి తెచ్చుకున్నాక అవిసరిపోవడం లేదని బాధపడతారు. ఇప్పటి అమ్మాయిలు బయటకు వెళ్లేటప్పుడు ఎక్కువగా షూ ధరించడానికే ఇష్టపడుతుంటారు. కాబట్టి షూ నచ్చిందని కొనేసి ఆ తరువాత సరిపోవడం లేదని ఇబ్బంది పడుతున్నా, కొత్తగా కొన్నవాటిని వేసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతున్నా ఈ కింది టిప్స్ ఫాలో అయితే చాలు.. సమస్య పరిష్కారం అవుతుంది. కొత్త షూస్ కొన్న తరువాత వాటిని వేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిని వేసుకోవాలన్నా, కొత్త షూ తో నడవాలన్నా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. బూట్లు వేసుకునేటప్పుడు చాలా మందికి ఎదురయ్యే సమస్య అవి వేసుకున్నప్పుడు కాలి చిటికెన వేలుమీద చాలా ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. దీని కారణంగా షూ వేసుకున్నంతసేపు ఇబ్బంది పడుతూనే ఉంటారు.  కొన్నిసార్లు ఇలా ఒత్తిడి కలగడం వల్ల వేలి కందిపోయి చర్మం తొలగిపోతుంది కూడా. ఇది చాలా నరకంగా ఉంటుంది. కానీ ఈ సమస్య పరిష్కారం కావాలంటే చిటికెన వేలిపై బ్యాండ్రాయిడ్ ను అప్లై చేయవచ్చు. చాలామంది షూస్ కొనేటప్పుడు కరెక్ట్ గా కాలుకు సరిపడేలా తీసుకుంటారు. అయితే కొన్ని రోజులుకాగానే అవి బాగా లూజుగా అయిపోతాయి. ఈ విషయం గమనించిన వారు షూస్ ను కొనుగోలు చేసేటప్పుడు కాస్త టైట్ గా ఉన్నవే కొనుగోలు చేస్తారు.  దీని వల్ల షూస్ మెల్లిగా అలవాటు పడ్డాక సెట్ అవుతాయని అనుకుంటారు. కానీ షూస్ కొన్న కొత్తలో వాటి కారణంగా నరకం కనబడుతుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి కొత్త షూ కొనుగోలు చేశాక న్యూస్ పేపర్ లేదా వేస్ట్ పేపర్స్ ను రోల్ చేసి షూస్ లో కొన్నిరోజుల పాటు ఉంచాలి. వీటి వల్ల షూస్ మెల్లిగా పాదానికి సెట్ అవుతాయి. షూస్ వేసుకున్నప్పుడు మడమ భాగం ఎత్తుగా ఉన్నట్టైతే అది ఇబ్బంది కలిగిస్తుంది. ఈ ఇబ్బంది అధిగమించడానికి  కాటన్ ప్యాడ్ లేదా శానిటరీ ప్యాడ్ ను షూ లోపల పాదాలకింద పెట్టుకోవచ్చు. దీనివల్ల మడమలకు సౌకర్యంగా ఉండటమే కాదు, చెమట, షూ నుండి వచ్చే దుర్వాసన మొదలైన వాటికి కూడా చెక్ పెట్టచ్చు. షూ వేసుకున్నప్పుడు కొన్నిసార్లు పాదాలు జారినట్టు అవుతుంటుంది. ఇలా పాదాలు జారినట్టు ఉన్నా లేదా షూ వదులుగా ఉన్నా వాటిని వేసుకునే ముందు షూ లోపల హెయిర్ స్ప్రే ను స్ప్రే చేయాలి.  ఇలా చేస్తే ఇబ్బంది తొలగిపోతుంది.                        *నిశ్శబ్ద.

హీరోయిన్స్ లా స్టైల్ గా మెడకు పెర్ఫ్యూమ్ కొట్టేవారికి షాకింగ్ న్యూస్..!

హీరోయిన్స్ లా స్టైల్ గా మెడకు పెర్ఫ్యూమ్ కొట్టేవారికి షాకింగ్ న్యూస్..!   ఫ్యాషన్ ప్రపంచం చాలా పెద్దది.  ముఖ్యంగా అమ్మాయిలు ఫ్యాషన్ లో మునిగి తేలుతుంటారు. దుస్తులు, మేకప్ నుండి అంతా తయారయ్యాక చివరగా పెర్ఫ్యూమ్ స్ప్రే చేయడం వరకు ఎక్కడా రాజీ పడరు. చాలామంది సెలబ్రిటీలను, హీరోయిన్స్ ను అనుసరిస్తారు. వారిలా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిలో పెర్ఫ్యూమ్ అప్లై చేయడం ఒకటి. టీవీ లో పెర్ఫ్యూమ్  యాడ్స్ గమనిస్తే గనుక హీరోయిన్స్ లేదా మోడల్స్  పెర్ఫ్యూమ్ ను చాలా స్టైల్ గా మెడ దగ్గర స్ప్రే చేస్తుంటారు. ఆ తరువాత చేతి మణికట్టు దగ్గర కూడా స్ప్రే చేస్తుంటారు. అయితే ఇలా స్ప్రే చేయడం ఎంత వరకు ఆరోగ్యకరం అనే విషయం మాత్రం ఆలోచించరు.  మెడ దగ్గర, మణికట్టు దగ్గర పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తే జరిగేదేంటో.. దీని గురించి చర్మ సంరక్షణ నిపుణులు ఏం చెప్పారో తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంది. పెర్ఫ్యూమ్ ను మెడ, మణికట్టు దగ్గర స్ప్రే చేయడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య  బాధితులుగా మారే అవకాశం ఉంటుందట. పెర్ఫ్యూమ్ సువాసన చాలా ఘాటుగా ఉంటుంది. ఇందులో చాలా రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీస్తాయి. వీటిని ఫోటోసెన్సిటైజింగ్ ఏజెంట్లు అని అంటారు. పెర్ఫ్యూమ్ స్ప్రే చేసిన చర్మం భాగంలో పదునైన సూర్య కిరణాలు తాకినప్పుడు చర్మం చికాకు పెట్టడం, వాపుకు గురి కావడం, హైపర్పిగ్మెంటేషన్ కు దారితీయడం జరుగుతుంది. చాలా పెర్ఫ్యూమ్ ల తయారీలో ఆల్కహాల్ వాడతారు. ఈ ఆల్కహాల్, సింథటిక్ వాసనలు చర్మాన్ని చికాకు పెడతాయి. అలెర్జీని కలిగిస్తాయి. పిగ్మెంటేషన్ కు కారణమయ్యే మెలనోసైట్ లను ప్రేరేపించి చర్మాన్ని  నల్లగా మార్చే మెలనిన్ ను ఉత్పత్తి చేసేలా చేస్తుంది. మచ్చలు ఏర్పడటానికి కూడా కారణం అవుతుంది. కొన్ని రకాల పెర్ఫ్యూమ్ లలో ఉండే రసాయనాల కారణంగా చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి. ఇది కూడా పిగ్మెంటేషన్ ను కలిగిస్తుంది.                                              *రూపశ్రీ.   

వేసవి చెమట కారణంగా జుట్టు జిగటగా అనిపిస్తోందా? ఈ చిట్కాలు ఫాలో అయి చూడండి!

  వేసవి చెమట కారణంగా జుట్టు జిగటగా అనిపిస్తోందా? ఈ చిట్కాలు ఫాలో అయి చూడండి!  సమ్మర్ సీజన్‌లో ఎన్ని అందమైన టాప్స్, కుర్తాలు, డ్రెస్సులు వేసుకున్నా జుట్టు తలకు అతుక్కుపోయి విపరీతంగా జిడ్డుగా ఉంటే లుక్ మొత్తం చెడిపోతుంది.  భరించలేని ఎండ, దాన్నుండి పుట్టే  చెమట  జుట్టు  మెరుపును చాలా వేగంగా తగ్గించేస్తాయి. ఈ సమస్య తగ్గించుకోవాలి అంటే జుట్టు సంరక్షణ చిట్కాలు తప్పకుండా పాటించాలి.  చెమట కారణంగా జుట్టు జిగటగా మారుతూ ఉంటే దాన్నుండి జుట్టును రక్షించుకోవడానికి ఈ కింది చిట్కాలు పాటించాలి.. హీటింగ్ టూల్స్ వద్దు.. హెయిర్ స్టైల్ చేయడానికి హీటింగ్ టూల్స్ ఉపయోగిస్తుంటారు.  కానీ సమ్మర్ సీజన్‌లో హీటింగ్ టూల్స్ వాడటం వల్ల హెయిర్ డ్యామేజ్ పెరిగి,  జుట్టు  ఫ్రీగా ఉండటానికి బదులుగా  తలపై అతుక్కున్నట్టు అనిపిస్తుంది.   తలలో పుట్టే చెమట దీనికి ప్రధాన కారణం అవుతుంది.  మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. జుట్టులో ఉండే తేమను హీటింగ్ టూల్స్ లాగేస్తాయి. ఈ కారణంగా జుట్టు నిర్జీవంగా మారి చాలా తొందరగా డ్యామేజ్ అవుతుంది. గుడ్డు వాడాలి..  వారానికి ఒకసారి జుట్టుకు  గుడ్డు హెయిర్ మాస్క్‌ని ఉపయోగించడం వల్ల జుట్టు  జిగట నుండి ఉపశమనం లభిస్తుంది. గుడ్డు జుట్టుకు హైడ్రేషన్ ఇస్తుంది. గుడ్డులో పెరుగు కలిపి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయవచ్చు. అంతే కాకుండా పెరుగు, తేనె కలిపి జుట్టుకు రాసుకోవచ్చు. నూనె రాయాలి.. పగటిపూట జుట్టుకు నూనె రాసినట్లయితే తల జిగటగా కనిపిస్తుంది. వేసవిలో  చెమట అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ చెమటతో పాటు నూనె  కూడా తల మీద నుండి ప్రవహిస్తుంది.  అందుకే ఉదయానికి బదులు  రాత్రి సమయంలో తలకు నూనె రాసుకోవాలి. నూనెను రాత్రిపూట తలకు పట్టించి మసాజ్ చేసి మరుసటి రోజు జుట్టును  శుభ్రం చేసుకోవాలి.  ఇలా చేస్తే జుట్టు మృదువుగా, ఫ్రీగా ఉంటుంది.  కండీషనర్‌.. చాలా మంది మహిళలకు   కండీషనర్‌ని  ఉపయోగించడం సరిగ్గా తెలియదు.  దీని కారణంగా కండీషనర్ రాసినా సరే.. జుట్టు జిగటగా కనిపిస్తుంది. షాంపూతో జుట్టును శుభ్రం చేసిన తర్వాత కండీషనర్ ఉపయోగించాలి. కండీషనర్ జుట్టు పొడవునా అప్లై చేయాలి. కానీ చాలామంది కేవలం  తలపై మాత్రమే రాస్తుంటారు. కండీషనర్‌ను తలపై లేదా స్కాల్ప్‌పై రాసుకుంటే జుట్టు జిడ్డుగా మారుతుంది,  బరువుగా కనిపిస్తుంది. అదనంగా ఇది తలపై జిడ్డు ఏర్పడటానికి కారణమవుతుంది.   డ్రై షాంపూ.. ఎంత వేడిగా ఉన్నా ప్రతి రోజూ తలస్నానం చెయ్యాలంటే ఇబ్బందే. హెయిర్ ఫాల్ పెరుగుతుందని చాలా భయం. అందుకే ప్రతిరోజు జుట్టును నీటితో కడగకుండా డ్రై షాంపూను జుట్టు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు.  జుట్టు జిగటగా కనిపించినప్పుడు డ్రై  షాంపూని అప్లై చేసిన తర్వాత జుట్టులో వెంటనే  బౌన్స్ కనిపిస్తుంది. జుట్టు పొడిగా, ఫ్రీగా ఉంటుంది.                                             *రూపశ్రీ.  

వాకింగ్ షూస్.. రన్నింగ్ షూస్.. ఈ రెండింటి మధ్య తేడాలేంటో తెలుసా?

   వాకింగ్ షూస్.. రన్నింగ్ షూస్.. ఈ రెండింటి మధ్య తేడాలేంటో తెలుసా? ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు  రోజువారీ జీవనశైలిలో నడక, రన్నింగ్, వ్యాయామాలు, జిమ్ వంటివి భాగం చేసుకుంటారు.  ఈ విషయాలను కూడా జాగ్రత్తగా పాటించేవారు ఉంటారు. వారు వాకింగ్ వెళ్లినప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు, జిమ్ చేసేటప్పుడు షూస్ వేసుకుంటారు. అయితే రన్నింగ్, వాకింగ్, జాకింగ్, జిమ్, స్పోర్ట్స్ సమయాల్లో వేసుకునే షూస్ కూడా వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా ఎక్కువమంది చేసే రన్నింగ్, వాకింగ్ కోసం వాడే షూస్ మధ్య తేడాలేంటి?  కొత్త షూస్ కొనేటప్పుడు తీసకోవలసిన జాగ్రత్తలు, గుర్తుంచుకోవలసిన విషయాలేంటో  తెలుసుకుంటే..  రన్నింగ్ షూస్ బరువు తక్కువగా ఉండాలి.  తేలికగా ఉన్న షూస్ వేసుకుంటే  సులభంగా పరిగెత్తవచ్చు.  తక్కువ బరువున్న బూట్లు ధరించి పరిగెత్తితే పాదాలపై తక్కువ ప్రభావం ఉంటుంది. దీని వల్ల రన్నింగ్ లో అలసిపోరు.  బూట్లు కొనడానికి వెళ్ళినప్పుడు రన్నింగ్ షూస్ కోసం హీల్స్ కొనకూడదని  గుర్తుంచుకోవాలి. మడమలున్న షూస్ వేసుకుంటే అవి  పాదాలపై ఒత్తిడి తెస్తాయి. దీనివల్ల త్వరగా అలసిపోతారు. రన్నింగ్ షూస్ ఎంత సౌకర్యవంతంగా ఉంటే పాదాలపై ఒత్తిడి అంత తక్కువ ఉంటుంది. రన్నింగ్ షూల మిడ్‌సోల్‌లో ఎక్కువ కుషన్ ఉంటుంది, ఇది  పాదాలపై ప్రభావం లేకుండా చేస్తుంది.  అలాగే  షాక్ లేదా గాయాన్ని తగ్గించడంలోనూ, గాయాలు కాకుండా ఉండటంలోనూ సహాయపడుతుంది. రన్నింగ్ షూల ముందు భాగంలో   ఫ్లెక్సిబిలిటీ మరింత ఎక్కువగా ఉంటుంది.  ఇది వేగంగా పరుగెత్తడానికి  సహాయపడుతుంది. ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉన్న బూట్లు  పడిపోకుండా కాపాడతాయి.  నడుస్తున్నప్పుడు సపోర్ట్ ఇస్తాయి. వాకింగ్ షూస్.. రన్నింగ్ షూస్ కంటే వాకింగ్ షూస్ కొంచెం బరువుగా ఉంటాయి. ఎక్కువ దూరం వాకింగ్ కు  వెళ్లాలనుకుంటే తేలికగా,  మంచి కుషనింగ్ ఉన్న షూలను కొనుగోలు చేయాలి. ఇది పాదాలలో మంట లేదా నొప్పిని తగ్గిస్తుంది. రన్నింగ్ షూస్ లాగా వాకింగ్ షూస్‌లో కూడా మంచి మిడ్‌సోల్ ఉండటం ముఖ్యం. వేగంగా నడిచినప్పుడు, ఈ సోల్  పాదాలను షాక్ నుండి కాపాడుతుంది,  బ్యాలెన్స్‌ను చక్కగా ఉంచుతుంది. వాకింగ్ షూస్ కు  కూడా హీల్స్ ఉండకూడదు. దీని కారణంగా  ఎక్కువసేపు నడవడానికి ఇబ్బంది పడవచ్చు. మడమలు లేని బూట్లు  మంచి  సపోర్ట్ ఇస్తాయి. నడక సమయంలో  సౌకర్యవంతంగా ఉంటారు.                                            *నిశ్శబ్ద. 

ఇంట్లోనే హెయిర్ స్పా క్రీమ్.. ఎలా తయారుచేసుకోవాలో తెలుసా?

ఇంట్లోనే హెయిర్ స్పా క్రీమ్.. ఎలా తయారుచేసుకోవాలో తెలుసా? ఇంట్లోనే హెయిర్ స్పా క్రీమ్.. ఎలా తయారుచేసుకోవాలో తెలుసా?జుట్టు అందంగా, మెరుస్తూ, నల్లగా, ఒత్తుగా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వారానికి రెండుసార్లు జుట్టుకు నూనె పెట్టాలి.   తదనంతరం తలస్నానం చెయ్యాలి. సాధారణ అమ్మాయిలకు ఇది మాత్రమే తెలుసు. అయితే జుట్టు సంరక్షణ గురించి అవగాహన, శ్రద్ద ఉన్నవారికి హెయిర్ స్పా గురించి కూడా తెలిసే ఉంటుంది.  నెలకొకసారి హెయిర్ స్పా చేస్తే జుట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. హెయిర్ స్పా కోసం చాలామంది బ్యూటీ పార్లర్ మీద ఆధారపడతారు. కానీ ఈ హెయిర్ స్పా క్రీమ్ ఇంట్లోనే సిద్దం చేసుకోవచ్చు. దీన్నెలా సిద్దం చేసుకోవాలో తెలుసుకుంటే.. హెయిర్ స్పా క్రీమ్ కు కావలసినవి.. పెరుగు తేనె పచ్చిపాలు తయారీవిధానం.. పెరుగు, తేనె, పచ్చిపాలు తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. మొదట జుట్టును షాంపూతో శుభ్రం చేసుకోవాలి.  జుట్టును ఆరబెట్టిన తరువాత తయారుచేసుకున్న పెరుగు మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి.  ఈ క్రీమ్ ను 30 నుండి 45 నిమిషాలు ఉంచాలి.  ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి.  దీన్ని వారానికి ఒకసారి కూడా అప్లై చేయవచ్చు. ఇది పొడి జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. పదార్థాల ఉపయోగాలు.. హెయిర్ స్పా క్రీమ్ లోకి ఉపయోగించిన పదార్థాలు జుట్టుకు ఎలా మేలు చేస్తాయి? వాటిలోని పోషకాలు ఏంటో తెలుసుకుంటే.. తేనె.. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలు, ఖనిజాలు తేనెలో ఉంటాయి.  ఇవి ఆరోగ్యానికి అలాగే జుట్టుకు చాలా మేలు చేస్తాయి. పెరుగు.. నిజానికి పెరుగులో ప్రోటీన్, కాల్షియం, రిబోప్లావిన్, విటమిన్-బి6, విటమిన్-బి12 వంటి పోషకాలు పెరుగులో ఉంటాయి. ఇవి జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పచ్చిపాలు.. పచ్చిపాలలో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్-బి, పొటాషియం, విటమిన్-డి పుష్కలంగా ఉంటాయి.  ఇందులో ప్రోటీన్లు కూడా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి.                  *నిశ్శబ్ద.

చీరలు తొందరగా పాతబడిపోతున్నాయా? ఇలా చేశారంటే కొత్త లుక్ మారవు..!

చీరలు తొందరగా పాతబడిపోతున్నాయా? ఇలా చేశారంటే కొత్త లుక్ మారవు..!   భారతదేశానికి, చీరలకు, మహిళలకు ఉన్న అవినాభావ సంబందం చాలా పెద్దది.  సగటు భారతీయ మహిళ వార్డ్ రోబ్ లో బోలెడు రకాల చీరలు తప్పనిసరిగా ఉంటాయి.  ప్రతి ఏడాది వివిధ సందర్భాల కోసం మహిళలు చీరలు కొంటూనే ఉంటారు. అయితే  కొత్తగా కొన్నప్పుడు చీరలకు ఉన్న లుక్ ఆ తరువాత కొన్ని రోజులకు ఉండదు. మరీ ముఖ్యంగా ఓ మూడు నాలుగు సార్లు కడితే చాలు అప్పుడే చీర పాతదానిలా కనిపిస్తూ ఉంటుంది.  కానీ చీరలు ఎన్నాళ్లు అయినా సరే కొత్త లుక్ మారకూడదంటే ఈ కింది టిప్స్ పాటిస్తే  సరి.. ఫోల్డింగ్ మిస్టేక్స్.. చీరలు ఉతకగానే వాటిని మడతపెట్టి, ఐరన్ చేయించి భద్రపరచడం అందరూ చేసే పని.  అయితే చీరలు ఇలా మడత పెట్టి ఎక్కువకాలం అలాగే ఉంచకూడదు.  దీనివల్ల చీరల రంగు చాలా తొందరగా డల్గా మారిపోతుంది. పైపెచ్చు చీరలు చాలా దట్టమైన ముడతలు పడతాయి. అందుకే చీరలు మడతపెట్టి బీరువా లేదా వార్డ్ రోబ్ లో ఉంచితే వాటిని అప్పుడప్పుడు తిరిగి మడతపెడుతూ ఉండాలి.  అదేవిదంగా చీరలను వెలుతురు పడని ప్రదేశాల్లో ఉంచాలి. వాషింగ్ మిస్టేక్స్.. చీరలు ఉతికే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అన్ని చీరలు ఒకే విధంగా ఉతకడం సరికాదు. కొన్ని చీరలు వాషింగ్ మెషీన్లో వేయవచ్చు, మరికొన్ని డ్రైక్లీనింగ్ ఇవ్వవచ్చు. మరికొన్ని చీరలు  చేతితో తేలికగా ఉతకడం మంచిది. చీరలు కొన్నప్పుుడే వాటిని ఎలా ఉతకాలో తెలుసుకోవాలి. ఐరన్ మిస్టేక్స్.. ఐరన్ చేయడం వల్ల చీరలు మాత్రమే కాదు ఏ దుస్తులు అయినా కొత్తగా, మరెంతో నీట్ గా కనిపిస్తాయి. అయితే దుస్తులను ఎప్పుడూ ఎక్కువ వేడి మీద ఐరన్ చేయకూడదు.  తక్కువ వేడి మీద అందులోనూ స్టీమ్డ్ ఐరన్ బాక్స్ లు మంచి నాణ్యత కలిగిన వాటితో మాత్రమే చేయడం మంచిది.  ఇక మరీ ముఖ్యంగా సిల్క్, పట్టు చీరలు, కాటన్.. వంటి ఫ్యాబ్రిక్స్ కు అనుగుణంగా టెంపరేచర్ ను సెట్ చేసుకోవాలి.  సిల్క్,  పట్టు చీరలు ఐరన్ చేసేటప్పుడు వాటి మీద కాటన్ క్లాత్ వేసి ఐరన్ చేయాలి. ఇలా చేస్తే ఫ్యాబ్రిక్ దెబ్బతినదు. రంగు కూడా మారదు. స్టైన్ మిస్టేక్స్.. దుస్తులన్నాక ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక సందర్భంలో   మరకలకు గురి కావడం కామన్ గా జరుగుతూ ఉంటుంది.  ఇలా మరకలు పడినప్పుడు కంగారులో ఎలా పడితే అలా వాటిని తొలగించకూడదు.  మొదట మరకను నీటితో క్లీన్ చేయాలి.  ఆ తరువాత వెనిగర్, నిమ్మరసం, సబ్బుతో క్లీన్ చేయాలి.   స్టోరేజ్ మిస్టేక్స్.. చీరలను స్టోర్ చేయడంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఇప్పట్లో చీరలు థ్రెడ్ వర్క్ లోనూ,  స్టోన్ వర్క్ లోనూ, మగ్గం వర్క్ లోనూ, మరికొన్ని బీడ్స్ వర్క్ లోనూ ఉంటాయి. వీటిని విడి విడిగా స్టోర్ చేయాలి. అన్ని కలగలిపి పెడితే రాళ్లు, పూసలు, దారాల మధ్య రాపిడి జరిగి  చీరల దారప్పోగులను, చీర ఫ్యాబ్రిక్ ను దెబ్బ తీస్తాయి.                     *నిశ్శబ్ద.

మీకు ముత్యాలంటే ఇష్టమా? అయితే ఇవి మీతో ఉండాల్సిందే..!

మీకు ముత్యాలంటే ఇష్టమా? అయితే ఇవి మీతో ఉండాల్సిందే..! ఆడవాళ్లు అందంగా కనబడటానికి బోలెడు అలంకారాలున్నాయి. దుస్తులు, ఆభరణాల దగ్గర నుండి చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ ఇలా చాలా ఆడవారి అందంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆభరణాలలో తప్పకుండా నవరత్నాలలో ఏదో ఒకటి పొదిగి ఉంటుంది. అయితే సముద్రపు అట్టడుగున ఏళ్ల తరబడి ఏర్పడే ముత్యాలకు మాత్రం ఎనలేని ప్రాధాన్యత ఉంది. చాలామంది ఆడవారికి ముత్యాలంటే చాలా ఇష్టం. సాధారణం బంగారు, ఇతర రాళ్లు పొదిగిన ఆభరణాలకు బదులు ముత్యాలతో చేసిన ఆభరణాలు వేసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అయితే ముత్యాలంటే ఇష్టపడే మగువలు ఈ కింది నాలుగు రకాల ముత్యాల ఆభరణాలు తప్పనిసరిగా తమ ఆభరణాల లిస్ట్ ఉంచుకోవాలని ఫ్యాషన్ నిపుణులు అంటున్నారు. ఈ నాలుగు ఉంటే చాలు.. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ ప్రత్యేకవేడుక అయినా సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు. అవేంటో ఓ లుక్కేస్తే.. ముత్యాల చెవి రింగులు.. అమ్మాయిలు చెవికి పెట్టుకునే రింగుల విషయంలో చాలా తర్జభర్జన పడతారు. ముత్యాలు పొదిగిన చెవి రింగులు ధరిస్తే చాలా అందంగా కనబడతారు. ఈ లిస్ట్ లో ముత్యాల డ్రాప్, స్టడ్ లు, హోప్స్ ఇలా.. చాలా రకాల మోడల్స్ మార్కెట్లో  విరివిగా దొరుకుతాయి. ఇవి ప్రత్యేక సందర్భాలలో అయినా, డైలీ ధరించడానికి అయినా ఏ విధంగా అయినా బాగుంటాయి. ఇక ఫ్యాషన్ దుస్తులు అయినా, సంప్రదాయ దుస్తులైన చీర, పట్టు పరికిణి వంటి వాటిలోకి అయినా చాలా బాగా నప్పుతాయి. ఉంగరం.. ముత్యాల మీద ఇష్టం ఉన్నవారు ముత్యం పొదిగిన ఉంగరం ధరిస్తే చాలా అందంగా ఉంటుంది. ముత్యాలు ధరిస్తే హుందాతనం ఉట్టిపడుతుంది.ఈ ముత్యాల ఉంగరాలు ఇప్పటి కాలం ఫ్యాషన్ దుస్తులకే కాకుండా అమ్మమ్మల కాలం నాటి దుస్తులు, అప్పటి సంప్రదాయ వస్త్రధారణకు కూడా బాగా సెట్ అవుతాయి. ఇక ఈ ముత్యపు ఉంగరాలు డార్క్ కలర్ ఉన్న దుస్తులతోనూ,  సింపుల్ గా ఉన్న బ్యాగ్ లు, వాలెట్లతోనూ చాలా అట్రాక్షన్ గా కనిపిస్తాయి. బ్రెస్లెట్.. సాధారణంగా బంగారు, వెండి బ్రెస్లెట్లు అబ్బాయిలకే ఎక్కువగా నప్పుతుంటాయి. అమ్మాయిలు సింవుల్ గా ఉంటూనే గ్రాండ్ లుక్ లో కనిపించాలంటే ముత్యాల బ్రెస్లెట్ చాలా బాగా సెట్ అవుతుంది. దీని వల్ల ధరించిన డ్రస్ మరింత ఆకర్షణగా మారుతుంది. సాంప్రదాయ దుస్తులలోనూ, ఆఫీసుకు వెళ్లే ఔట్ ఫిట్ లోనూ, సాధారణ దుస్తులలోనూ క్లాసీ లుక్ ఇస్తుంది ముత్యాల బ్రెస్లెట్. ముత్యాల లాకెట్.. ఇప్పట్లో చాలా రకాల నెక్ డాలర్స్ అందుబాటులో ఉన్నాయి. అమ్మాయిల సింపుల్ లుక్ తో అందరి మతి పోగాట్టాలంటే మాత్రం ముత్యాల లాకెట్ లు భలే సెట్ అవుతాయి. ఎంత బాగా తయారైనా సరే.. మేకప్, డ్రస్సింగ్ కు మరింత అదనపు లుక్ ఇవ్వడానికి ముత్యాల లాకెట్ హెల్ప్ చేస్తుంది. అయితే ముత్యాలు ధరించేటప్పుడు కెమికల్స్ లేని స్ప్రేలు, పౌడర్లు వాడటం మంచిది.                                                *నిశ్శబ్ద.               

ఎరుపురంగు లిప్స్టిక్  అంటే అస్సలు ఇష్టముండదా? ఒక్కసారి ఇలా ట్రై చేయండి!

ఎరుపురంగు లిప్స్టిక్  అంటే అస్సలు ఇష్టముండదా? ఒక్కసారి ఇలా ట్రై చేయండి! ఎరుపురంగు చాలా బోల్డ్ గా ఉంటుంది. చాలావరకు ఎరుపు రంగును సెలెక్ట్ చేసుకునేవారు తక్కువ. ఎరుపులో వివిధ రకాల షేడ్స్ అయినా ఎంపిక చేసుకుంటారేమో కానీ పూర్తీ స్పష్టమైన ఎరుపును ఎంపికచేసుకునేవారు అరుదే. ఇక లిప్ స్టిక్ విషయంలో అయితే మరీనూ. చాలామంది లైట్ కలర్స్ ఎంచుకుంటారు. మరికొందరు పెదాలు గులాబీ రేకుల్లా ఉండటానికి పింక్ రంగును ఎంచుకుంటారు. వీటిలో వివిధ షేడ్స్ ట్రై చేస్తారు. కానీ ఎరుపు రంగు లిప్ స్టిక్ వేసుకున్నా ఎబ్బెట్టుగా కనిపించకుండా అందరి కళ్ళకు వావ్ అనిపించేలా చేయాలంటే అసలు ఎరుపు రంగు లిప్ స్టిక్ ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలి.   ధైర్యంగా, ఆకర్షణీయంగా, ఆత్మవిశ్వాసంతో,  ఎలాంటి బెరుకు లేకుండా   ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ను అప్లై చేయడానికి కొన్ని టిప్స్ తెలుసుకోవాలి. అవేంటంటే.. లిప్ స్టిక్ ఎంచుకునే ముందు సౌకర్యాన్ని చూసుకోవాలి. మ్యాట్, గ్లోస్, షీర్, క్రీమ్,  లిక్విడ్  ఇలా చాలారకాల లిప్ స్టిక్స్ మార్కెట్లో లభ్యమవుతాయి. సౌకర్యాన్ని  ఎంచుకోవాలి. లిప్ స్టిక్ అప్లై చేయడానికి ముందు పెదవులు తేమగా ఉండటం అవసరం. అందుకని పెదవులకు మంచి లిప్ బామ్ లేదా ప్రైమర్ అప్లై చెయ్యాలి. ఆ తరువాత టిష్యూ పేపర్ తో సున్నితంగా అద్దుతూ తుడవాలి. అంతే తప్ప టిష్యూతో రుద్దకూడదు. ఆ తరువాత పెదవుల మీద తేలికపాటిగా పౌడర్ అద్దాలి. అలా చేస్తే లిప్స్టిక్ అప్లై చేసిన తరువాత ఒద్దికగా ఉంటుంది.  లిప్స్టిక్ అప్లై చేయవచ్చు.   ఇలా చేస్తే పెదవులకు లిప్ స్టిక్ వేస్తే అది ఆకర్షణ పెరుగుతుంది. లిప్ స్టిక్ అప్లై చేసేటప్పుడు చాలామంది పెదవుల మూలలు, షేప్ దగ్గర బోల్తా వడుతుంటారు. ఈ పొరపాటు జరగకుండా ఉండాలంటే మొదట లిప్ లైనర్ తో షేప్ గీసుకోవాలి. ఇందుకోసం లిప్ లైనర్ పెన్సిల్ ఉపయోగించాలి. లిప్టిక్ సెలక్షన్ లో అంతగా అనుభవం లేనివారు  అయోమయం  చెందుతుంటే కన్ఫ్యూజ్ కాకుండా  రష్యన్ రిడ్ వంటి షేడ్  బాగుంటుంది. ఇది ఎలాంటి స్కిన్ టోన్ కు అయినా బాగుంటుంది. పెదవుల మీద పౌడర్ కూడా అప్లై చేశాక లిప్స్టిక్ అప్లై చేయాలి. మొదట ఒక కోటింగ్ ఇచ్చాక టిష్యు పేపర్ ను పెదవుల  మధ్య ఉంచుకని పెదవులు రెండూ కలిపి ఒత్తితే పెదవుల మీద ఏవైనా అదనపు నూనెలు ఉంటే అవి తొలగిపోతాయి. ఆ తరువాత టిష్యూ తీసేసి  పెదవుల మీద మళ్లీ లైట్ గా ఇంకొక పొర లిప్స్టిక్ వేయాలి. పెదవుల మూలలు ఆకర్షణంగా కనిపించడానికి కొద్దగా కన్సీలర్ ఉన్న బ్రష్ తీసుకుని లిప్స్టిక్ ను మూలలకు అప్లై చెయ్యాలి. లిప్స్టిక్ అప్లై చేసిన తరువాత పెదవులు దట్టంగా కనిపించడం కోసం పెదవుల మీద తేలికగా సెట్టింగ్ పౌడర్ ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల పెదవుల మీది లిప్స్టిక్  వాటర్ ప్రూఫ్ గా ఉంటుంది.  ఎరుపురంగు చాలా తొందరగా అందరికీ కనిపిస్తుంది. కాబట్టి దీన్ని అప్లై చేసేటప్పుడు  పొరపాటున దంతాలకు లిప్స్టిక్ రంగు ఏమైనా అంటుకుని ుందా లేదా చెక్ చేసుకోవడం మాత్రం మరచిపోకూడదు.                                                                     *నిశ్శబ్ద.

వామ్మో ఈ బ్యాగు కొనే డబ్బుతో మాంచి బుల్లెట్ బైకు కొనేయచ్చు.. అసలు దీని ధరెంతంటే..!

   వామ్మో ఈ బ్యాగు కొనే డబ్బుతో మాంచి బుల్లెట్ బైకు కొనేయచ్చు.. అసలు దీని ధరెంతంటే..! ఫ్యాషన్ ప్రపంచంలో కొత్తగా, ప్రత్యేకంగా కనిపించాలనే ఆరాటం రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా అమ్మాయిలు, సెలబ్రిటీలు తాము ప్రత్యేకంగా కనిపించాలని కొత్తగా తయారవుతారు, కొత్త వస్తువుల మీద ఆసక్తి చూపిస్తారు. ఈ ఆసక్తి కొందరికి లాభంగా మారుతుంది. ప్రపంచంలోనే టాప్ బ్రాండ్ అయిన లూయిస్ విట్టన్ కూడా దీనికేం తీసిపోదు. ఎప్పటికప్పుడు కొత్త తరగా హ్యాండ్ బ్యాగులను ఫ్యాషన్ ప్రపంచంలోకి విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది. కాస్త డబ్బున్న కుటుంబాలకు చెందిన అమ్మాయిల నుండి సెలబ్రిటీల వరకు లూయిస్ విట్టన్  హ్యాండ్ బ్యాగులు భుజాన వేసుకుని తళుక్కున మెరుస్తుంటారు. ఇప్పుడు అందరిని ఆశ్చర్య పరుస్తూ మరో కొత్త రకం హ్యాండ్ బ్యాగ్ విడుదల చేసింది ఈ దిగ్గజ బ్రాండ్.. ఈ బ్యాగు కొనే డబ్బుతో మాంచి బుల్లెట్ బైకు కొనేయచ్చట. దీని గురించి ఓ లుక్కేస్తే.. సహజంగానే లూయిస్ విట్టన్ హ్యాండ్ బ్యాగులకు క్రేజ్ ఎక్కువ. దానికి తగ్గట్టే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూంటారు ఇందులోని డిజైనర్లు. తాజాగా శాండ్విచ్ బ్యాగ్ ను తయారుచేసి దాని ధర చెప్పి అందరికీ పెద్ద ఝులక్ ఇచ్చింది. తోలుతో తయారుచేసిన ఈ బ్యాగ్ ధర 3000వేల డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో అక్షరాలా 2లక్షలా 80వేలు. ఈ ఏడాది జనవరి 4న అమ్మకానికి ఈ బ్యాగ్ అందుబాటులోకి వచ్చింది.  ఈ బ్యాగ్ ను ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ చీప్ క్రియేటివ్ డైరెక్టర్ ఫారెల్ విలియమ్స్ డిజైన్ చేశారు. ఈ బ్యాగ్ చూడానికి కాగితంతో చేసిన శాండ్విచ్ బ్యాగ్ ను పోలి ఉంటుంది. సడన్ గా చూస్తే అందరూ అదే అనుకుంటారు కూడా. ఈ బ్యాగ్ పొడవు 30 సెం.మీ, ఎత్తు 27సెం.మీ, వెడల్పు 17సెం.మీ ఉంటుందట. ఈ బ్యాగ్ మీద లూయిస్ విట్టన్  అనే బ్రాండ్ నేమ్ మాత్రమే కాకుండా మాసన్ ఫోండి N 1854  అని కూడా రాసి  ఉంటుంది. మొత్తానికి చూడ్డానికి ఓ శాండ్విచ్ బ్యాగ్ లా ఉండే బ్యాగ్ తయారుచేసి అందరినీ అయోమయానికి గురిచేయడం లూయిస్ విట్టన్ కే చెల్లిందని ఫ్యాషన్ ప్రపంచంలో పలువురు గుసగుసలాడుతున్నారు.                                          *నిశ్శబ్ద. 

చలికాలంలో చేతులను వెచ్చగా ఉంచుకోవడం ఎలాగంటే..!

చలికాలంలో చేతులను వెచ్చగా ఉంచుకోవడం ఎలాగంటే..! చలికాలంలో వాతావరణం అందరికంటే ఎక్కువగా మహిళలనే ఇబ్బంది పెడుతుంది. దీనికి కారణం మహిళలు వంట, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం నుండి చాలా పనులు చేయడానికి నీళ్ళలో ఎక్కువగా చేతులు పెడుతుంటారు. ఇది మాత్రమే కాకుండా శరీరాన్ని మొత్తం దుస్తులతో కప్పి ఉంచినా చేతులు, పాదాలు మాత్రం వాతావరణానికి గురవుతాయి. ఈ కారణంగా మహిళలు చేతులు చల్లగా ఉన్నాయంటూ ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా మహిళల చేతులు ఈ చలికాలంలో వెచ్చగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుంటే.. చలికాలంలో కూడా ఉదయం సాయంత్రం సమయాల్లో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కుళాయి ఆన్ చేస్తే ఆ నీళ్లు కూడా ఐస్ లా చాలా చల్లగా అనిపిస్తాయి. అందుకే బట్టలు ఉతకడం, అంట్లు తోమడం వంటి పనులు ఉదయం, సాయంత్రం కాకుండా మధ్యాహ్నం సమయంలో చేసుకుంటే మంచిది.  ఉదయాన్నే ఇల్లు ఊడవడం వంటి పనులు చేసేటప్పుడు చేతులు వెచ్చగా ఉండటానికి గ్లౌజులు ఉపయోగించవచ్చు. ఇంట్లో అన్ని వసతులు ఉండి ఇబ్బంది లేదనుకుంటే ఎమర్జెన్సీ సామాన్లు కడగడానికి హీటర్ సహాయంతో నీటిని వేడి చేసి వెచ్చని నీళ్లతో పని ముగించేయవచ్చు.  నీళ్లలో చేతులు పెట్టి పనులు ముగించాక తప్పనిసరిగా చేతులను బాగా తుడిచేసుకోవాలి. నీరు చేతుల మీద ఎక్కువసేపు ఉంటే చేతులు చాలా చల్లగా మారిపోతాయి.   చేతులకు  వెచ్చదనం అందించడానికి గ్లౌజులు మంచి పరిష్కారం. సాధారణ సమయంలో రోజంతా గ్లౌజులు ధరిస్తే   బాగుంటుంది. ఈ గ్లౌజులను కూడా ధరించని సమయంలో ఎక్కడంటే అక్కడ పెట్టకుండా వెచ్చగా ఉండే అల్మారా లేదా బట్టల మధ్యలో పెడితే ఇవి కూడా వెచ్చగా  వేసుకోగానే చలి నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి. వ్యాయామాలు శరీరాన్ని వేడెక్కించినట్టే చేతి వ్యాయామాలు చేతులను వెచ్చగా ఉంచుతాయి. అరచెతులు రెండూ కలిపి చేసే బోలెడు వ్యాయామాలు ఉంటాయి. వాటిని చేస్తే శరీరంలో రక్తప్రసరణ బాగుంటుంది. చలి దరిచేరదు. చలికాలంలో వెచ్చని ఫీల్ ఇవ్వడానికి వేడి ఆహారాలు బాగా సహాయపడతాయి. అలాగే శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారాలు కూడా తీసుకోవాలి. హాట్ చాక్లెట్, కాఫీ, అల్లం పాలు, గ్రీన్ టీ, సూప్ వంటివి తీసుకుంటూ ఉంటే చేతులకు మాత్రమే కాకుండా శరీరానికి కూడా ఊరట లభిస్తుంది. చలిని ఎదుర్కోవడానికి మరొక మార్గం  దానికి దూరంగా ఉండటమే. అవసరమైన పనులకోసం మాత్రమే చలికాలంలో బయటకు వెళ్లడం మంచిది. చీటికి మాటికి బయటకు వెళ్ళి ఇబ్బంది పడకూడదు. వేసవిలో ఇల్లు చల్లగా ఉండటానికి కూలర్లు, ఏసీ లు ఎలాగైతే వాడతారో అలాగే చలికాలంలో కూడా ఇల్లు వెచ్చగా ఉండటానికి హీటర్లు వాడాలి. ఇది ఇంటిని వెచ్చగా ఉంచుతుంది. అలాగే ఇంట్లో సువాసనతో కూడిన క్యాండిల్స్, ఎసెంటియల్ ఆయిల్ సహయంతో  దీపాలు వెలిగిస్తే  ఇల్లంతా మంచి సునాసనతో ఉండటమే కాదు వెచ్చగా ఉంటుంది. చలిగా ఉంది కదా అని బాగా బిగుతుగా ఉన్న దుస్తులు ధరిస్తుంటారు చాలా మంది. అయితే బిగుతుగా ఉన్న దుస్తులు ధరించడం వల్ల శరీరంలో రక్తప్రసరణ దెబ్బ తిని శరీరం మరింత చల్లగా మారుతుంది. కాబట్టి మందంగా ఉన్న దుస్తులు ధరించాలి.                     *నిశ్శబ్ద.  

చలికాలంలో ఫ్యాషన్ గా కనిపించాలంటే ఇలా రెడీ అవ్వండి!!

చలికాలంలో ఫ్యాషన్ గా కనిపించాలంటే ఇలా రెడీ అవ్వండి!! అమ్మాయిలు సీజన్ తో సంబంధం లేకుండా ఫ్యాషన్ గా కనిపించాలని అనుకుంటారు. వేసవిలో మండిపోతున్న ఎండల్లోనూ తమ మేకప్ నుండి డ్రస్సింగ్ వరకు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వరు. ఇక చలికాలం కూడా  ఇంతే.. ఎంత చలి ఉన్నా చూపరుల మతి పోయేలా ఫ్యాషన్ తో తళుక్కుమంటారు. అయితే ఫ్యాషన్ గా రెడీ అవ్వడం వెనుక కాసింత అవహాన కూడా ఉండాలి. అలాగైతేనే ఈ చలికి చెక్ పెట్టి ఒకవైపు వెచ్చదనాన్ని, మరొకవైపు ఫ్యాషన్ తో వెలిగిపోతూ భళా అని అనిపించుకుంటారు. ఇంతకీ ఈ చలికాలంలో చలికే ఝులక్ ఇవ్వాలంటే  ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి తెలుసుకుంటే.. థర్మల్ టాప్ తో భలే వెచ్చదనం.. చలికాలంలో ప్రతి అమ్మాయి దగ్గరా ఉండాల్సిన టాప్ ఇది. థర్మల్ టాప్ వేసుకుంటే  స్టైలిష్ గానూ, వెచ్చగానూ ఉంటుంది. బోల్డ్ రంగులో పొడవాటి చేతులున్న థర్మల్ షర్టులు, లేదా ఉన్నితో కవర్ చేయబడిన థర్మల్ సెట్ ను ఉపయోగించుకోవాలి. ఇవి ఫ్యాషన్ గానూ, శరీరానికి వెచ్చదనాన్ని కూడా అందిస్తాయి. ఇవి ఏ దుస్తులకు అయినా బేసిక్ గా ఉంటాయి. లేయర్ మెథడ్.. చలిగా ఉన్నరోజులలో బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడే అమ్మాయిలు అటు ఫ్యాషన్ గానూ, ఇటు  వెచ్చదనాన్ని ఆస్వాదించడానికి లేయర్ మెథడ్ బాగా సహాయపడుతుంది. ఇందులో అందమైన దుస్తులను ఒక దాని మీద మరొకటి స్టైల్ గా కనిపించేలా వేసుకుంటారు. ఇది చూడటానికి అవుట్ స్టాండింగ్ లుక్ ను ఇస్తుంది. శరీర ఆకృతిని బట్టి పొట్టి, పొడవు దుస్తులను ఇందుకోసం వినియోగించవచ్చు. రన్ అవే లెదర్ బూట్స్ చూడగానే వావ్ అనిపించేలా ఉండే రన్ అవే లెదర్ బూట్స్ మోకాలి వరకు ఉంటాయి. చదునుగా, ముదురు రంగులో ఉన్న ఈ బూట్స్ ను ఏ దుస్తులతో అయినా వేసుకోవచ్చు. ఇది హైక్లాస్ లుక్ ను ఇస్తుంది. ఫుల్ గ్లోవ్స్ సాధారణంగా చేతులకు తొడుక్కునే గ్లౌజులు మణికట్టు వరకు ఉంటాయి. అయితే ఫుల్ గ్లౌజులు ప్రయత్నిస్తే కొత్త లుక్ వస్తుంది. స్లీవ్ టీ షర్ట్లు లేదా టాప్స్ కు ఈ ఫుల్ గ్లౌజులు వేసుకుంటే ట్రెండ్ కు కొత్తదనం అద్దినట్టు ఉంటుంది. ఈ గ్లౌజులు నలుపు రంగు లేదా వేసుకునే షూస్, బెల్ట్,జాకెట్ రంగులను బట్టి ఎంపిక చేసుకోవాలి.                                                    *నిశ్శబ్ద.  

లావుగా ఉన్నా సరే.. సన్నగా కనిపించాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే..!

లావుగా ఉన్నా సరే.. సన్నగా కనిపించాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే..! సన్నగా కనిపిస్తే ఆ కిక్కే వేరు. నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు, నచ్చినంత తినచ్చు, ఎవ్వరూ ఎలాంటి కామెంట్స్ చెయ్యరు. కానీ లావుగా ఉంటే మాత్రం బోలెడు సమస్యలు. ముఖ్యంగా నచ్చిన దుస్తులు వేసుకోలేరు. పైపెచ్చు అందరూ ఎగతాళి చేసి మాట్లాడుతుంటారు. చాలా చోట్ల బాడీ షేమింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది మహిళలకు ఇంట్లోనే ఈ సమస్య ఎదురవుతుంది. అయితే లావుగా ఉన్నా సరే.. సన్నగా కనిపించాలంటే తెలివిగా ఆలోచించాలి. లావుగా ఉన్నా సన్నగా కనిపించే దుస్తులు వేసుకోవాలి. ఇంతకీ అలాంటి దుస్తులు ఎలా ఎంచుకోవాలి?  ఫలానా దుస్తులు వేసుకుంటే సన్నగా కనబడతామని ఎలా తెలుస్తుంది? మహిళలు ఈ అమేజింగ్ చిట్కాలు తెలుసుకోవాల్సిందే.. ఎంపిక.. లావుగా ఉన్నవారు డ్రస్సులు ఎంపిక చేసుకునేటప్పుడు చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వాలి. డ్రస్సులు ఎప్పుడూ పిచ్చి పిచ్చి గీతలతోనూ, డిజైన్ల తోనూ ఉండకూడదు. అలాగే చిన్న పువ్వులు, లతలు కూడా ఉండకూడదు. డ్రస్సుల మీద నిలువు గీతలు ఉన్నవి ఫర్పెక్ట్ గా నప్పుతాయి. ఇలాంటివి వేసుకుంటే సన్నగా కనిపిస్తారు. వదులుగా అస్సలొద్దు.. లావుగా ఉన్నవాళ్లు టైట్ గా ఉన్న దుస్తులు వేసుకుంటే శరీరానికి అతుక్కుపోయి వికారంగా కనిపిస్తుందని అనుకుంటారు. ముఖ్యంగా పొట్ట, పిరుదులు, తొడ భాగాలు, వక్షోజాలు ఎబ్బెట్టుగా కనిపిస్తుంటే చాలా అసౌకర్యం ఫీలవుతారు. అయితే లూజ్ గా ఉన్న దుస్తులు వేసుకోవడం వేరు, కంఫర్ట్ ను చూసుకోవడం వేరు. లూజుగా ఉన్నవి కంఫర్ట్ అనే అపోహ నుండి బయటపడాలి. లావుగా ఉన్నా సరే శరీరానికి మరీ అంటీ అంటనట్టు ఉన్న దుస్తులు వేసుకుంటే చూడ్డానికి సన్నగా కనిపిస్తారు. ప్యాంట్ సెలక్షన్.. లావుగా ఉన్నాం కదా అని చాలా  లూజుగా ఉన్న ప్యాంట్లు ఎంపిక చేసుకుంటారు చాలామంది. కానీ ఈ ప్యాంట్లు వేసుకుంటే ఇంకా లావుగా కనిపిస్తారు. కాబట్టి ఎప్పుడూ ఫిట్టింగ్ జీన్స్ ప్యాంట్లు సెలెక్ట్ చేసుకోవాలి. షేప్.. డ్రస్సులలో బోలెడు షేప్ లు కూడా ఉన్నాయి. వీటిలో లావుగా ఉన్నవారికి A లైన్ డ్రస్సులు బాగా నప్పుతాయి. వీటిని వేసుకుంటే లావుగా ఉన్నా సరే స్లిమ్ గా కనిపిస్తారు. ఇవి వేసుకున్నప్పుడు పొడవుగా కనిపించడం వల్ల లావు బయటకు కనిపించదు. దుస్తుల మందం.. దుస్తులు ఎప్పుడూ మందం ఉండకూడదు. మందంగా ఉన్న దుస్తులు వేసుకుంటే సన్నగా ఉన్నవారు కూడా లావుగా కనిపిస్తారు. అందుకని లావుగా ఉన్నవారు మందం దుస్తులు అస్సలు టచ్ చేయకపోవడమే మంచిది. దుస్తులు ఎంత ఖరీదువైనా, ఎంత అందమైన డిజైన్లు అయినా, ఎంత నచ్చినా మందంగా ఉన్న దుస్తులను దూరంగా ఉంచాలి.                                     *నిశ్శబ్ద.  

లిక్విడ్ లిప్‌స్టిక్  ఇలా అప్లై చేస్తే అదుర్స్!

లిక్విడ్ లిప్‌స్టిక్  ఇలా అప్లై చేస్తే అదుర్స్!   పెదవుల అందాన్ని పెంచడానికి లిప్స్టిక్ వాడతారు. ఒకప్పుడు లిప్స్టిక్ కోన్ రూపంలో లభించేది. కానీ అన్నీ డవలప్ అయినట్టు ఫ్యాషన్ కూడా డవలప్ అయిపోయింది. లిప్స్టిక్ కాస్తా లిక్విడ్ రూపంలోకి మారింది. పైపెచ్చు లిక్విడ్ లిప్స్టిక్ కూడా వేసుకోవాల్సిన రీతిలో వేసుకుంటే చాలా కాలం పాటు పోకుండా పెదవులను మెరిపిస్తుంది. లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేసేటప్పుడు ఈ కింది టిప్స్ పాటిస్తే చాలు.. మేకప్ అంటే అంతగా ఇష్టం లేని మహిళలు కూడా లిప్స్టిక్, కాటుక పెట్టుకుంటారు. ముఖ్యంగా ఇప్పట్లో వచ్చిన లిక్విడ్ లిప్స్టిక్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లిప్స్టిక్ వేసుకోవడానికి ముందు పెదవులకు మాయిశ్చరైజర్ రాయడం తప్పనిసరి. మాయిశ్చరైజర్ రాయడం వల్ల పెదవులు తేమను కోల్పోకుండా మృదువుగా ఉంటాయి. పైగా లిప్స్టిక్ పెదవులు అంతా బాగా పరచుకుంటుంది. కానీ లిక్వి్డ్ లిప్స్టిక్ కు మాయిశ్చరైజర్ అవసరం లేదు. పెదవులు మరీ గరుకుగా ఉంటే తప్ప మాయిశ్చరైజర్ రాయాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా చాలా లైట్ గా మాయిశ్చరైజర్ రాస్తే సరిపోతుంది. పెదవులు పర్ఫెక్ట్ షేప్ కనిపించాలంటే మాత్రం లిప్ లైనర్ ఖచ్చితంగా అప్లై చేయాలి. ఏ రంగు లిప్స్టిక్ వాడతారో ఆ రంగు  లిప్ లైనర్ ను ఎంచుకోవాలి. ఇద కూడా చాలా సన్నగా ఉండాలి. అలా ఉంటే పెదవుల షేప్ బాగా సెట్ అవుతుంది. మరీ ముఖ్యంగా పెదవుల మూలలను సరిచేయడం మరవకూడదు. సాధారణ లిప్స్టిక్ కు,  లిక్విడ్ లిప్స్టిక్ కు తేడా ఉంటుంది.  లిక్విడ్ లిప్స్టిక్ క్రీమ్ లాగా ఉంటుంది. దీన్ని సాధారణ లిప్స్టిక్ మాదిరి రెండు మూడు లేయర్లు వెయ్యాల్సిన అవసరం లేదు. అలా వేస్తే పెదవులు చాలా థిక్ గా వికారంగా కనపిస్తాయి. అందుక లిక్విడ్ లిప్స్టిక్ ను కేవలం ఒక లేయర్ మాత్రమే అప్లై చేయాలి.  అది వేసాక కూడా కొద్దిసేపు దాన్ని అలాగే వదిలెయ్యాలి అలా చేస్తే లిప్స్టిక్  ఆరిపోతుంది. ఒకవేళ లిక్విడ్ లిప్స్టిక్ ఎక్కువగా అప్లై చేసి ఉంటే టిష్యూ పేపర్ సహాయంతో దాన్ని సెట్ చేసుకోవాలి. ఇందుకోసం టిష్యూ పేపర్ ను పెదవుల మధ్య పెట్టుకుని పెదవులను గట్టిగా ప్రెస్ చేయ్యాలి. ఇలా చేస్తే పెదవుల మీద అదనపు లిక్విడ్ ఈజీ గా తొలగిపోతుంది. లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేయడం గురించి తెలుసుకుని ఉంటారు కానీ కరెక్ట్ రంగు ఎంపిక చేసుకునేవారు చాలా అరుదు. అందుకే లిక్విడ్ లిప్స్టిక్ సరైన రంగు ఎంచుకోవడం ముఖ్యం. ఇలా పెదవుల అందం అదుర్స్.                                                *నిశ్శబ్ద