అమెరికాలో ఆర్ఆర్ఆర్ రచ్చబండ.. రెస్పాన్స్ అదరహో
posted on Jul 4, 2023 @ 10:44AM
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ వైఫల్యాలను, అరాచకాలను, అక్రమార్కులను రచ్చబండ కార్యక్రమం ద్వారా రోజూ ఉతికి ఆరేసే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ కూడా ఆయన రచ్చబండ నిర్వహించి ఏపీలో జగన్ అరాచకపాలనను కళ్లకు కడుతున్నారు. రఘురామకృష్ణం రాజు తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరు. మీడియా,సోషల్‌మీడియాలో నిత్యం వినిపించే పేరు రఘురామకృష్ణం రాజు.
జగనన్న సర్కారు తీసుకునే నిర్ణయాల వెనుక చీకటి కోణాన్ని అన్వేషించి, దానిపై నిరంతరం కేంద్రానికి ఫిర్యాదు చేయడం ఆయన నిత్యకృత్యం. ఇందు కోసం ఇక తనపై జగన్ సర్కార్ బనాయించిన కేసులపై ఢిల్లీ నుంచే న్యాయపోరాట చేస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులను పదేపదే కలుస్తున్నారు. జగన్ అరాచకత్వంపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగనన్న సర్కారును నిత్యం ఉతికి పారేస్తున్నారు. సొంత పార్టీ అధినేతపైనా, ప్రభుత్వంపైనా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు
రఘురామకృష్ణం రాజు. పేరుకే ఆర్ఆర్ఆర్ ది ఒంటరి పోరు. ఆయన పోరటానికి అభిమానులుగా మారిన వారు మాత్రం లక్షల్లోనే ఉంటారు. యూట్యూబ్‌లో.. ఆర్ఆర్ఆర్ కు వచ్చే లైక్స్, షేర్లు కామెంట్లు ఏ తెలుగు నాయకుడికీ ఉండవంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కు అమెరికా పర్యటనలో రెడ్ కార్పెట్ వెల్కమ్ లభిస్తోంది.
ప్రవాసాంధ్రులు నిర్వహించే కార్యక్రమాలకు, తెలుగు సంఘాలు-గోదావరి జిల్లా ఎన్నారైలు రఘురామరాజును ఆహానిస్తున్నారు. అక్కడ కూడా ఆయన రచ్చబండ ద్వారా జగన్ సర్కార్ ను ఉతికి ఆరేస్తున్నారు. జగన్ పై ఆయన విమర్శలు, వ్యంగ్యాస్త్రాలకు ఎన్ఆర్ఐల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది.