English | Telugu

మ‌ళ్లీ హిస్టారిక‌ల్ ప్లానింగ్‌లో మణిర‌త్నం

ఇండియ‌న్ ఏస్ మూవీ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రైన మ‌ణిర‌త్నం పొన్నియిన్ సెల్వ‌న్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. ఆయ‌న నెక్ట్స్ ఏ సినిమా చేస్తార‌నే దానిపై ప‌క్కా క్లారిటీ ఉంది. క‌మ‌ల్ హాస‌న్ హీరోగా ఆయ‌న ఓ సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. నాయ‌కుడు సినిమా త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా రానే లేదు. చాలా ఏళ్ల‌కు ఇద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తుండ‌టం అభిమానులకే సినీ స‌ర్కిల్స్‌కు సైతం ఆనందాన్నిచ్చే విష‌య‌మే. అయితే మ‌ణిర‌త్నం ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌కుండానే మ‌రో సినిమాను కూడా ప్లాన్ చేసుకుంటున్నారనే టాక్ కోలీవుడ్‌లో బ‌లంగా వినిపిస్తోంది.

ఆ విష‌యంలో అట్లీ మోసం చేశాడు: ప్రియ‌మ‌ణి

జాతీయ అవార్డ్ గ్ర‌హీత న‌టి ప్రియ‌మ‌ణి ఓ ద‌ర్శ‌కుడిపై కోపంగా ఉంది. ఇంత‌కీ ఆమెకు కోపం తెప్పించిన స‌ద‌రు ద‌ర్శ‌కుడు ఎవ‌రా అని అనుకుంటున్నారా?.. త‌నే డైరెక్ట‌ర్ అట్లీ. అదేంటి రీసెంట్‌గా రిలీజైన జ‌వాన్ సినిమాలో ప్రియమ‌ణి న‌టించిందిగా. మ‌ళ్లీ ఇప్పుడు త‌న‌పైనే ప్రియ‌మ‌ణి ఎందుకు కోపంగా ఉందనే సందేహం రావ‌చ్చు. వివ‌రాల్లోకి వెళితే, జ‌వాన్ సినిమాలో షారూఖ్ పాత్ర‌ను స‌పోర్ట్ చేసే లేడీ ఆర్మీలో కీల‌క‌మైన ల‌క్ష్మి అనే పాత్ర‌లో ప్రియ‌మ‌ణి న‌టించింది. యాక్ష‌న్ ఎలిమెంట్స్‌లో ఆమె చాలా క‌ష్ట‌ప‌డి న‌టించింది. ఆమె పాత్ర‌కు మంచి ఎమోష‌న‌ల్ ట‌చ్ కూడా ఉంటుంది. ఈ పాత్ర‌ను చేయాలంటూ ప్రియ‌మ‌ణి ద‌గ్గ‌ర‌కు అట్లీ వెళ్లి రిక్వెస్ట్ చేసిన‌ప్పుడు ఆమె ఓ కండీష‌న్ పెట్టింది.

డ‌బుల్ డిజిట్... న‌య‌న‌తార‌కి షాకిచ్చిన త్రిష‌!

న‌య‌న‌తార‌, త్రిష ఇద్ద‌రూ దాదాపు అటు ఇటుగా కెరీర్ స్టార్ట్ చేసిన వారే. ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్‌. స్టార్ హీరోయిన్స్‌గా పీక్స్‌ను చూసిన‌వారే. ఒకానొక స‌మ‌యంలో త్రిష‌, న‌య‌న్ మ‌ధ్య నువ్వా నేనా? అనేంతగా పోటీ కూడా జ‌రిగింది. అయితే క్ర‌మంగా త్రిష కంటే న‌య‌న్‌తే పైచేయిగా క‌నిపిస్తూ వ‌చ్చింది. న‌య‌న‌తార వ‌రుస సినిమాల‌ను అందిపుచ్చ‌కుంటూ లేడీ సూప‌ర్‌స్టార్ ఆప్ సౌత్‌గా ఎదిగింది. కోట్ల రూపాయ‌ల రెమ్యూన‌రేష‌న్‌ను వ‌సూలు చేసింది. హీరోయిన్ సెంట్రిక్ సినిమాల‌కే కేరాఫ్‌గా మారింది. త్రిష కెరీర్ కూడా పీక్స్‌లోనే ఉన్న‌ప్ప‌టికీ న‌య‌న్ కంటే కాస్త వెనుక‌బ‌డుతూనే వ‌చ్చింది. అయితే ఇప్పుడు న‌య‌న‌తార‌కు త్రిష అనుకోని షాకిచ్చింద‌ని సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అది కూడా రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో.

రామ్‌చ‌ర‌ణ్ ‘గేమ్ ఛేంజర్’కి షాకిచ్చిన లీకేజీ వీరులు

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల‌వుతుంద‌నే వార్త‌లు సినీ సర్కిల్స్‌లో బ‌లంగా వినిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ హీరోల‌కు పెద్ద పీట వేస్తూ వారితోనే సినిమాలు చేస్తూ వ‌చ్చిన శంక‌ర్ తొలిసారి తెలుగు హీరో, నిర్మాత‌ల‌తో క‌లిసి భారీ పాన్ ఇండియా సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఇదొక పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా అల‌రించ‌నుంది. శంకర్ సినిమా విష‌యంలో ఎంత కేర్ తీసుకుంటార‌నేది ప్ర‌త్యేకం

‘లియో’కు తమిళ ప్రభుత్వం జలక్

మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత దళపతి విజయ్, సక్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లియో’. భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీని తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటు విజ‌య్ అభిమానుల‌తో పాటు ఆడియెన్స్‌, ట్రేడ్ వ‌ర్గాలు సైతం ‘లియో’ రిలీజ్ కోసం చాలా ఎగ్జ‌యిటెడ్‌గా వెయిట్ చేస్తున్నాయి. అందుకు కార‌ణం.. రిలీజ్ త‌ర్వాత ఈ మూవీ క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఎలాంటి రికార్డుల‌ను క్రియేట్ చేయ‌నుందోన‌ని ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాకు త‌మిళ‌నాడులోని స్టాలిన్ ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది.