English | Telugu
పవన్ సినిమా ముచ్చట.. అక్కడ రాధిక.. ఇక్కడ గౌతమి..
Updated : Sep 16, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. సుజీత్ డైరెక్షన్ లో చేస్తున్న 'ఓజీ' శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుండగా.. హరీశ్ శంకర్ డైరెక్టోరియల్ 'ఉస్తాద్ భగత్ సింగ్', క్రిష్ సినిమా 'హరిహర వీరమల్లు' కూడా చిత్రీకరణ దశలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే, హరీశ్ శంకర్ రూపొందిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ గౌతమి ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నట్లు తాజాగా కథనాలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. తమిళ చిత్రం 'తెరి'కి రీమేక్ గా రూపొందుతున్న సినిమా ఇదని, ఒరిజినల్ వెర్షన్ లో విజయ్ కి తల్లిగా సీనియర్ నటి రాధిక నటించగా.. ఇప్పుడా పాత్రలోనే గౌతమి దర్శనమివ్వనుందట. మరి.. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, ఉస్తాద్ భగత్ సింగ్ కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కడుతుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.