English | Telugu

ఇద్ద‌రు స్టార్స్‌తో రూ.1500 కోట్లు టార్గెట్ చేసిన అట్లీ

సౌత్ సినీ ఇండ‌స్ట్రీ నుంచి వ‌స్తోన్న డైరెక్ట‌ర్స్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో అద‌ర‌గొట్టే సినిమాల‌ను చేస్తున్నారు. ఆ కోవ‌లో స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ కూడా జాయిన్ అయ్యారు. ఆయ‌న తెర‌కెక్కించిన జ‌వాన్ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ మూవీ 11 రోజుల్లో రూ.858 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. త్వ‌ర‌లోనే వెయ్యి కోట్ల మార్కును సాధిస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్లు వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాల్లో హీరోగా న‌టించిన ఘ‌న‌త షారూఖ్ ఖాన్‌కే ద‌క్కుతుంద‌ని ఆయ‌న అభిమానులు సంబ‌ర‌ప‌డుతున్నారు. డైరెక్ట‌ర్ అట్లీపై అంద‌రూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.