English | Telugu
మళ్లీ హిస్టారికల్ ప్లానింగ్‌లో మణిరత్నం
Updated : Sep 16, 2023
ఇండియన్ ఏస్ మూవీ డైరెక్టర్స్‌లో ఒకరైన మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు. ఆయన నెక్ట్స్ ఏ సినిమా చేస్తారనే దానిపై పక్కా క్లారిటీ ఉంది. కమల్ హాసన్ హీరోగా ఆయన ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నాయకుడు సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రానే లేదు. చాలా ఏళ్లకు ఇద్దరూ కలిసి సినిమా చేస్తుండటం అభిమానులకే సినీ సర్కిల్స్‌కు సైతం ఆనందాన్నిచ్చే విషయమే. అయితే మణిరత్నం ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లకుండానే మరో సినిమాను కూడా ప్లాన్ చేసుకుంటున్నారనే టాక్ కోలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది.
పొన్నియిన్ సెల్వన్ సినిమాను వెండితెరపై ఆవిష్కరించాలని ఎందరో కోరుకున్నారు.. కానీ కుదరలేదు. అయితే మణిరత్నం దాన్ని సాకారం చేసి చూపించారు. ఇప్పుడు మరోసారి హిస్టారికల్ చిత్రాన్ని తెరకెక్కించటానికి ప్లానింగ్ చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే, పొన్నియిన్ సెల్వన్ మూవీలో జయం రవి టైటిల్ పాత్రధారి. అయితే కూడా విక్రమ్, కార్తిలకు ఎక్కువ స్పేస్ కనిపిస్తుంది. రాజరాజ చోళుడు సింహాసనం ఎక్కటానికి ముందు ఏం జరిగిందనే కథాంశంతోనే పొన్నియిన్ సెల్వన్ మూవీ ఉంటుంది.
అయితే పొన్నియిన్ సెల్వన్ కోణంలో చోళుల కథ ఎలా ఉంటుందనే కోణంలో సినిమాను తెరకెక్కించటానికి మణిరత్నం ప్లాన్ చేస్తున్నారట. ఇందులో రాజ రాజ చోళుడు పాత్రలో హీరో అజిత్ కుమార్ కనిపించే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే ఇవన్నీ ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. కమల్ హాసన్‌తో సినిమా పూర్తయితే కానీ మణిరత్నం నెక్ట్స్ సినిమా గురించి అనౌన్స్ చేయరు. మరి సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్నట్లు మరోసారి చోళుల కథతో హిస్టారికల్ మూవీ చేస్తారా? చేయరా అనే విషయాలపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.