మైకంలో ముంచుతున్న నవదీప్ 'లవ్ మౌళి' యాంథమ్!
టాలీవుడ్ హీరోలలో నవదీప్ ది విభిన్న శైలి. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు ఇతర హీరోల సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తుంటారు. అలాగే బుల్లితెరపై హోస్ట్ గా తన ప్రత్యేకతను చాటుకోవడమే కాకుండా, ఓటీటీలోనూ రాణిస్తున్నారు. ఇలా యాక్టర్ గా, హోస్ట్ గా ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్న నవదీప్, హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'లవ్ మౌళి'. నైరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.