English | Telugu
షారుఖ్ పక్కన బిగ్ బాస్ బ్యూటీ సిరి...ఇక అవకాశాలే
Updated : Sep 16, 2023
రీసెంట్ గా రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన మూవీస్ లో మంచి కలెక్షన్స్ ని సంపాదిస్తోంది "జవాన్" మూవీ. షారుఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రానికి అట్లీ డైరెక్టర్ గా వ్యవహరించారు. నాలుగు రోజుల్లో 520 కోట్ల రూపాయిలు రాబట్టింది. ఐతే ఈ మూవీలో చాలామంది సౌత్ ఇండియన్ ఆర్టిస్టులు నటించారు. అందులో యూట్యూబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ సిరి హనుమంతు బంపర్ ఆఫర్ కొట్టేసింది. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే సిరి బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వెళ్లి వచ్చాక అదృష్టం వరించింది. నలుగురి కళ్ళల్లో పడి మంచి ఛాన్సెస్ సంపాదించుకుంది. ఇప్పుడు ఏకంగా షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇది సిరి కెరీర్ కి ప్లస్ గా మారిపోయింది. షారుఖ్ ని దగ్గరగా చూసే అదృష్టం కలిగితే చాలు అనుకునే సిరికి జవాన్ మూవీలో ఆయన పక్క నటించే ఛాన్స్ దక్కడం మామూలు విషయం కాదు. షారుక్ ఖాన్ సబార్డినేట్ పాత్రలో ఈ బిగ్ బాస్ బ్యూటీ మెరిసింది. ఇలాంటి ప్యాన్ ఇండియా మూవీలో చిన్న రోల్ చేసి పాపులరైన ఆర్టిస్టులెందరో ఉన్నారు. ఇప్పుడు సిరికి కూడా ఈ సినిమాతో ఆఫర్లు క్యూ కడతాయని అంటున్నారు.
అయితే ఈ సినిమాలో ఆమె నటించినందుకు గాను షారుఖ్ ఖాన్ ఆమెకి 20 లక్షల రూపాయిల చెక్ ని ఇచ్చారట ఐతే ఆమె నటించింది చిన్న పాత్రే ఐనా అంత మొత్తం ఇచ్చేసరికి షాకవుతున్నారు నెటిజన్స్. ఇక ఈ జవాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. పఠాన్ సినిమా రికార్డులను కొల్లగొట్టింది.