English | Telugu
బోయపాటి చూపు.. సీక్వెల్స్ వైపు.. ఏయే సినిమాలో తెలుసా!
Updated : Sep 16, 2023
మాస్ ఎంటర్టైనర్స్ తెరకెక్కించడంలో దర్శకుడు బోయపాటి శ్రీను తీరే వేరు. మొదటి సినిమా 'భద్ర' నుంచి గత చిత్రం 'అఖండ' వరకు బోయపాటి ఈ తరహా కథాంశాలనే రూపొందించారు. వీటిలో సింహభాగం విజయం సాధించాయి. తనకంటూ ఓ భారీ అభిమానగణాన్ని అందించాయి. త్వరలో ఈ స్టార్ కెప్టెన్.. 'స్కంద'తో పలకరించబోతున్నారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 28న థియేటర్స్ లోకి రాబోతోంది. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో స్కంద ఎంటర్టైన్ చేయనుంది.
ఇదిలా ఉంటే, తన సినిమాల్లో భారీ విజయం సాధించిన కొన్ని చిత్రాలకు బోయపాటి సీక్వెల్స్ రూపొందించే ఆలోచనలో ఉన్నారట. ఇవన్నీ ఒకదాని తరువాత మరొకటి తెరపైకి వస్తాయని సమాచారం. వీటిలో ముందుగా 'అఖండ' సీక్వెల్ తయారయ్యే అవకాశముందని, ఆ తరువాత 'సరైనోడు' సీక్వెల్ వస్తుందని అంటున్నారు. అంతేకాదు.. 'స్కంద' కూడా రెండు భాగాల కథ అని.. ఫస్ట్ పార్ట్ కి వచ్చే రెస్పాన్స్ బట్టి సెకండ్ పార్ట్ కి స్కోప్ ఉందని బజ్. మొత్తమ్మీద.. బోయపాటి చూపు సీక్వెల్స్ వైపు ఉందన్నమాట. మరి.. వీటిలో ఏయే సినిమాలు చివరాఖరికి వెండితెరపై వెలుగులు పంచుతాయో చూడాలి.