English | Telugu

‘చంద్రముఖి 2’ రన్ టైమ్ ఫిక్స్!

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్‌, యాక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్న రాఘ‌వ లారెన్స్ త్వ‌ర‌లోనే ‘చంద్రముఖి 2’ చిత్రంతో మ‌న‌ల్ని ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 28న తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. 17 ఏళ్ల క్రితం ర‌జినీకాంత్, జ్యోతిక‌, న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చంద్ర‌ముఖి సినిమాకు ఇది సీక్వెల్‌. అయితే ఈ సీక్వెల్‌లో ర‌జినీకాంత్ స్థానంలో రాఘ‌వ లారెన్స్ న‌టించారు. ఇక చంద్ర‌ముఖి పాత్ర‌లో కంగ‌నా అలరించ‌బోతున్నారు. ‘చంద్రముఖి 2’ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ర‌న్ టైమ్ ఫిక్స్ చేసుకుంది. 170 నిమిషాలుగా ఈ సినిమా ర‌న్ టైమ్‌ను లాక్ చేశారు. దాదాపు మూడు గంట‌ల వ్య‌వ‌ధి ఉండ‌టంపై అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. సినిమాను గ్రిప్పింగ్‌గా లేక‌పోతే సినిమా ర‌న్ టైమ్‌పై కూడా ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతార‌న‌టంలో సందేహం లేదు.