English | Telugu

అట్లీతో మూవీ.. బన్నీ ట్వీట్‌కి అర్థమదేనా?

‘జవాన్’తో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సాధించారు కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ. ఆయన డైరెక్షన్‌లో కింగ్ ఖాన్ షారూఖ్ చేసిన ‘జవాన్’ మూవీ రూ.500 కోట్లకు పైగానే వసూళ్లను సాధించి బాక్సాఫీస్ పోరులో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో అట్లీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ఉంటుందనే వార్తలు గట్టిగానే వినిపించాయి. కానీ ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే ఇప్పుడు మాత్రం నెటిజన్స్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమా ఉంటుందని ఘంటాపథంగా చెబుతున్నారు. అందుకు కారణం బన్ని వేసిన ట్వీట్ అని రుజువుగా చూపెడుతున్నారు. అసలు అంతలా వార్తలు బయటకు రావటానికి బన్ని వేసిన ట్వీట్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే..