English | Telugu

పండగ పూట 'స్కంద' ఐటమ్ పాట.. కరెక్ట్ టైమ్ లో "కల్ట్ మామ"ని దింపుతున్న బోయపాటి!!

మాస్ ఆడియన్స్ కి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో దర్శకుడు బోయపాటి శ్రీనుకి తెలిసినంతగా మరొకరికి తెలియదనడంలో అతిశయోక్తి లేదు. తాజా చిత్రం 'స్కంద' విషయంలోనూ ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారాయన. ఈమధ్య ప్రచార హడావిడి కాస్త తగ్గినట్లు అనిపిస్తున్న తరుణంలో.. సాలిడ్ ఐటమ్ నంబర్ తో మళ్ళీ బజ్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు బోయపాటి. అంతేకాదు.. "బాస్ పార్టీ"తో మంచి క్రేజ్ ని మూటగట్టుకున్న ఊర్వశి రౌటేలాని ఈ పాట కోసం సెలెక్ట్ చేసుకుని సగం సక్సెస్ అయిపోయారు.

"కల్ట్ మామ" అంటూ సాగే ఈ ప్రత్యేక గీతాన్నివినాయక చవితి రోజున అంటే సెప్టెంబర్ 18న యూట్యూబ్ ముంగిట నిలపనున్నారు బోయపాటి అండ్ టీమ్. అసలే ఐటమ్ నంబర్.. ఆపై తమన్ మ్యూజిక్.. దానికి ఎనర్జిటిక్ స్టార్ రామ్, ఊర్వశి చిందులు.. ఇకచెప్పేదేముంది. మరో చార్ట్ బస్టర్ లోడింగ్ అనుకోవడమే. మరి.. గణేశ్ చతుర్ధికి వస్తున్న ఈ "కల్ట్ మామ" ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

కాగా, స్కందలో రామ్ కి జోడీగా క్రేజీ బ్యూటీ శ్రీలీల నటించింది. మరో హీరోయిన్ గా సయీ మంజ్రేకర్ కనిపించనున్నఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. సెప్టెంబర్ 28న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది 'స్కంద'.