English | Telugu
శెట్టి అండ్ శెట్టి.. 9 రోజుల్లో కొల్లగొట్టింది ఎంతో తెలుసా!
Updated : Sep 16, 2023
'భాగమతి' తరువాత లేడీ సూపర్ స్టార్ అనుష్కకి విజయాన్ని అందించిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. వినూత్న కథాంశంతో పి. మహేశ్ బాబు తెరకెక్కించిన ఈ సినిమాలో 'జాతిరత్నాలు' స్టార్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు. సెప్టెంబర్ 7న జనం ముందు నిలిచిన ఈ సినిమా.. శుక్రవారంతో 9 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకుంది. ఈ తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 35 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టిందీ చిత్రం. అలాగే, ఇప్పటివరకు రూ. 4. 66 కోట్ల లాభాలు చూసింది. సెకండ్ వీకెండ్ (శని, ఆదివారాల)తో పాటు సోమవారం వినాయకచవితి సెలవు కావడం.. శెట్టి అండ్ శెట్టికికలిసొచ్చే అంశమే. సో.. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా ఎంత వసూళ్ళు ఆర్జిస్తుందో చూడాలి.
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' 9 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ. 5.68 కోట్ల షేర్
సీడెడ్ : రూ. 93 లక్షల షేర్
ఆంధ్రా: రూ. 3.73 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ.10.34 కోట్ల షేర్
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ. 1.42 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.6.40 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల కలెక్షన్స్ : రూ.18.16 కోట్ల షేర్ (రూ. 35.10 కోట్ల గ్రాస్)