English | Telugu
రష్మికా... ఆ ఫొటో షూట్ నీకంత అవసరమా?!
Updated : Sep 16, 2023
‘ఛలో’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ తన హవా కొనసాగిస్తోంది. హిందీలో యానిమల్ చిత్రంలో నటిస్తోంది. అలాగే ‘రెయిన్‌బో’ అనే లేడీ సెంట్రిక్ మూవీతోపాటు అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పుష్ప2’లో కూడా రష్మిక కనువిందు చేయనుంది. ఇవికాక ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో రూపొందుతున్న డి51 చిత్రం కూడా చేస్తోంది.
ఇదిలా ఉంటే ఇండియాలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న రష్మిక ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది. ఇలాంటి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కోసం హీరోయిన్లు హాట్ హాట్‌గా ఫోటోలకు ఫోజులివ్వడం మామూలే. సినిమాల్లో ఎక్కువగా ఎక్స్‌పోజింగ్ చేయని హీరోయిన్లు కూడా ఇలాంటి మ్యాగజైన్స్ కోసం తక్కువ దుస్తుల్లో ఫోజులిచేస్తుంటారు. కానీ, రష్మిక చేసిన ఈ ఫోటో షూట్ మాత్రం డిఫరెంట్‌గా అనిపించింది. మామూలుగా సినిమాల్లో ఆమె చేసే ఎక్స్‌పోజింగ్‌కి భిన్నంగా పూర్తిగా కప్పేసిన బట్టలతో ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు ఏమాత్రం టెంప్ట్ చేసేవిగా లేవని నిరాశ చెందుతున్నారు నెటిజన్లు. పైగా ఈ ఫోటోల కోసం స్పెషల్‌గా షూట్ అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు.