నయనతార కొత్త వ్యాపారం!
దక్షిణాది లేడీ సూపర్‌స్టార్ నయనతార రీసెంట్‌గా విడుదలైన ‘జవాన్’ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఫుల్ స్వింగులో వచ్చిన ఈ స్టార్ బ్యూటీ ఇప్పుడు కొత్త వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. ఇంతకీ ఈ అమ్మడు మొదలు పెట్టనున్న వ్యాపారం ఏంటో తెలుసా!..స్కిన్ కేర్ ప్రొడక్ట్ బిజినెస్. ఈ విషయాన్ని నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ అధికారికంగా ప్రకటించారు. ‘‘ఈరోజు మా అధికారిక ఖాతా అయిన 9స్కిన్ అఫిషియల్‌ను గర్వంగానూ, సంతోషంగానూ ప్రకటిస్తున్నాను. సెల్ఫ్ ఎంతో ముఖ్యమని నేను నమ్మాను. ఆరేళ్ల కృషి, ప్రేమను మీతో పంచుకోవటానికి ఎంతో ఆనందిస్తున్నాను. ఈ సెప్టెంబర్ 29 నుంచి ప్రయాణం మొదలుకానుంది. ఆ రోజు నుంచి మా స్కిన్ కేర్ ప్రొడక్ట్‌ను మా అధికారిక సైట్‌లో కొనుగోలు చేయవచ్చు’’ అని తెలిపారు.