English | Telugu
రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’కి షాకిచ్చిన లీకేజీ వీరులు
Updated : Sep 16, 2023
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదలవుతుందనే వార్తలు సినీ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తమిళ హీరోలకు పెద్ద పీట వేస్తూ వారితోనే సినిమాలు చేస్తూ వచ్చిన శంకర్ తొలిసారి తెలుగు హీరో, నిర్మాతలతో కలిసి భారీ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్‌గా అలరించనుంది. శంకర్ సినిమా విషయంలో ఎంత కేర్ తీసుకుంటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఓ సాంగ్ లీకైనట్లు న్యూస్ వినిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో నుంచి ఓ సాంగ్‌లో కొంత భాగం లీకైంది. అయితే ఇది రఫ్ వెర్షన్ మాత్రమే అని, ఫైనల్ సాంగ్ కాదని నెటిజన్స్ అంటున్నారు కూడా. ఏదైతేనేం శంకర్ సినిమా నుంచి ఫుటేజీ లీక్ కావటం అనేది ఇప్పుడొక హాట్ టాపిక్‌గా మారిందనే చెప్పాలి. ఇది దర్శకుడే కాదు ఎంటైర్ యూనిట్‌ను కంగారు పెడుతుంది. మరిప్పుడు శంకర్ మరింత జాగ్రత్తలను పాటిస్తారనటంలో సందేహం లేదు.
‘గేమ్ ఛేంజర్’ విషయానికి వస్తే ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఓ పాత్ర సీఎం కాగా.. మరో పాత్ర ఎన్నికల అధికారి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వాని హీరోయిన్. వినయ విధేయ రామ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తోన్న సినిమా ఇది. ఇందులో ఇంకా సునీల్, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.