English | Telugu
ప్రభాస్ కోసం అనుష్క.. ఇదేదో బాగుందే మరి
Updated : Sep 16, 2023
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన పలువురు కథానాయికలు సందడి చేశారు. అయితే, వారందరిలోనూ లేడీ సూపర్ స్టార్ అనుష్కది ప్రత్యేక స్థానం. ప్రభాస్ కటౌట్ కి స్వీటీ మ్యాచ్ అయినట్లుగా మరెవరూ కాలేదన్నది కాదనలేని మాట. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాల సంగతి సరేసరి.
బిల్లా (2009), మిర్చి (2013), బాహుబలి సిరీస్ (2015, 2017)తో వరుస విజయాలు చూసి.. సూపర్ కాంబో అనిపించుకున్నారు స్వీటీ, డార్లింగ్. బాహుబలి తరువాత ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రాలేదు. అదిగో ఇదిగో అంటూ కథనాలు వచ్చినా.. అవి వార్తలకే పరిమితం అయ్యాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. త్వరలో ప్రభాస్ సినిమాలో అనుష్క స్పెషల్ రోల్ లో సందడి చేయనుందట.
ఆ వివరాల్లోకి వెళితే.. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపించనున్నారట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే క్యారెక్టర్ కి జోడీగా అనుష్క కాసేపు తళుక్కున మెరవనుందట. అదే గనుక నిజమైతే.. ఇరువురి అభిమానులకు ఇది శుభవార్తే. చూద్దాం.. ఏం జరుగుతుందో?