English | Telugu
డబుల్ డిజిట్... నయనతారకి షాకిచ్చిన త్రిష!
Updated : Sep 16, 2023
నయనతార, త్రిష ఇద్దరూ దాదాపు అటు ఇటుగా కెరీర్ స్టార్ట్ చేసిన వారే. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. స్టార్ హీరోయిన్స్‌గా పీక్స్‌ను చూసినవారే. ఒకానొక సమయంలో త్రిష, నయన్ మధ్య నువ్వా నేనా? అనేంతగా పోటీ కూడా జరిగింది. అయితే క్రమంగా త్రిష కంటే నయన్‌తే పైచేయిగా కనిపిస్తూ వచ్చింది. నయనతార వరుస సినిమాలను అందిపుచ్చకుంటూ లేడీ సూపర్‌స్టార్ ఆప్ సౌత్‌గా ఎదిగింది. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ను వసూలు చేసింది. హీరోయిన్ సెంట్రిక్ సినిమాలకే కేరాఫ్‌గా మారింది. త్రిష కెరీర్ కూడా పీక్స్‌లోనే ఉన్నప్పటికీ నయన్ కంటే కాస్త వెనుకబడుతూనే వచ్చింది. అయితే ఇప్పుడు నయనతారకు త్రిష అనుకోని షాకిచ్చిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అది కూడా రెమ్యూనరేషన్ విషయంలో.
సాధారణంగా నయనతార ఇప్పటి వరకు ఎక్కువ పారితోషకం తీసుకునే హీరోయిన్‌గా సౌత్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. అన్ని కోట్లు తీసుకున్నా సరే ప్రమోషన్స్‌కు రాదు. ఆ విషయం తెలిసినా ఆమెకున్న క్రేజ్ కారణంగా సినిమాలు చేయటానికి మన మేకర్స్ క్యూ కడుతుంటారు. మరో వైపు త్రిష సైతం స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ తనదైన రేంజ్‌ను చూపిస్తూనే ఉంది. తాజాగా ఆమె కమల్ హాసన్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇందులో యాక్ట్ చేయటానికి త్రిష భారీ పారితోషకాన్ని డిమాండ్ చేసింది. ఇంతకీ ఆమె అడిగినదెంతో తెలుసా.. ఏకంగా రూ. 12 కోట్లు. ఇదే కనుక నిజమైతే హీరోయిన్స్‌లో డబుల్ డిజిట్ రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్ త్రిషనే అవుతుంది.
36 ఏళ్ల త్రిష..ఇంకా కుర్ర హీరోయిన్స్‌కు గ్లామర్ విషయంలో పోటీ ఇస్తూనే ఉంది. హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ చేస్తూనే స్టార్ హీరోలతో జోడీ కడుతుంది. అక్టోబర్ 19న రిలీజ్ కాబోయే లియో చిత్రంలో దళపతి విజయ్‌తో కలిసి ఆమె నటించింది. త్వరలోనే అజిత్ మూవీ విడా మూయర్చిలోనూ నటిస్తోంది. అలాగే కమల్ హాసన్ - మణిరత్నం సినిమాలోనూ యాక్ట్ చేస్తుంది మరి.