English | Telugu
చంద్రబాబు విషయంలో నోరు విప్పని ఎన్టీఆర్... కారణం తెలుసా?
Updated : Sep 16, 2023
మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వివిధ నేరారోపణలపై అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడాయన రాజమండ్రి జైలులో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఆయనకు ఎంతో మంది సంఫీుభావం తెలుపుతూ ప్రకటనలు చేశారు. కొంతమంది ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనంగా ఉండిపోయారు. వారిలో ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఉండడంతో సోషల్ మీడియాలో ఈ విషయం గురించి తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆరే కాదు, నందమూరి కళ్యాణ్‌రామ్ కూడా దీని గురించి స్పందించలేదు. అయితే హరికృష్ణ కుమార్తె సుహాసిని మాత్రం స్పందించింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరఫున కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయింది సుహాసిని.
14వ తేదీ రాత్రి ఎన్టీఆర్ కుటుంబం దుబాయ్ ప్రయాణమైంది. ఎయిర్‌పోర్ట్‌లో కొడుకుతో ఉన్న ఎన్టీఆర్ ఫోటోలు వైరల్ అయ్యాయి. చంద్రబాబు జైలులో ఉంటే ఆయనకు సంఫీుభావం తెలపకుండా ఫ్యామిలీతో కలిసి షికారుకు వెళ్తున్నారని టిడిపి వర్గాలు విమర్శించాయి. సోషల్ మీడియాలో వివిధ వర్గాలకు చెందిన వారు కూడా ఈ విషయంపై రాద్ధాంతం చేశారు.
ఎన్టీఆర్ దుబాయ్ ప్రయాణం వెనుక కారణం వేరే వుందని వారికి తెలిసి వుండకపోవచ్చు. దుబాయ్‌లో జరుగుతున్న సైమా అవార్డు ఫంక్షన్‌లో పాల్గొనేందుకే ఎన్టీఆర్ వెళ్లారు. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ఈ అవార్డు ఫంక్షన్‌ను ఏర్పాటు చేశారు. 15వ తేదీ జరిగిన కార్యక్రమంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో నటనకుగాను ఎన్టీఆర్ ఉత్తమనటుడు అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘నా ఒడిదుడుకుల్లో, నేన కింద పడినప్పుడల్లా నన్ను పట్టుకొని పైకి లేపినందుకు, నా కళ్ళ వెంట వచ్చిన ప్రతి కన్నీటి చుక్కకి బాధ పడినందుకు నా అభిమానులందరికీ తలవంచి పాదాభివందనం చేస్తున్నాను’’ అన్నారు.
దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాతైనా చంద్రబాబుకి సంఫీుభావం తెలియజేస్తాడా? అనే డౌట్ అందరికీ వుంది. అప్పుడు కూడా ఎన్టీఆర్ మౌనంగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలు మనకు వద్దు అనుకొని ఉండొచ్చని ఆయన సన్నిహితులు అంటున్నారు.