English | Telugu

రికార్డ్ ధ‌ర‌కు ‘గేమ్ చేంజ‌ర్‌’ ఓటీటీ రైట్స్‌

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. శంక‌ర్ మేకింగ్ అంటే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆల‌స్య‌మైనా ప‌ర్లేదు కానీ, త‌ను అనుకున్న‌ది తెర‌పై రావాల‌నుకునే ర‌కం శంక‌ర్‌ది. ఈ విష‌యం తెలిసి సినిమా స్టార్ట్ చేసిన నిర్మాత‌లు సైతం సైలెంట్‌గా చూస్తున్నారే త‌ప్ప మ‌రేం మాట్లాడ‌టం లేదు. మ‌రో వైపు మెగాభిమానులు మాత్రం ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.