English | Telugu

పిల్ల మొగ్గ.. బాలయ్య గట్టిగా దింపాడు!

నందమూరి  అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న భగవంత్ కేసరి మూవీ ట్రైలర్ వచ్చేసింది. రావటమే కాదు  ట్రైలర్ ఒక లెవెల్లో ఉండి  అక్టోబర్ 19 ముందు రోజు నుంచే  భగవంత్ కేసరి సినిమా టిక్కెట్ల కోసం థియేటర్ ముందు అభిమానులు,ప్రేక్షకులు  పడిగాపులు కాయటం ఖాయమనే సంకేతాలని  కూడా  ట్రైలర్ చాలా బలంగానే ఇచ్చింది. నిన్న హనుమకొండ లో రిలీజ్ అయిన  ట్రైలర్ ని చూసి నందమూరి అభిమానుల ఆనందానికయితే అవధులు లేవు. ట్రైలర్ లో బాలయ్య యాక్టింగ్ గాని ఆయన నోటి వెంట వచ్చిన డైలాగ్స్ గాని ఆయన అభిమానులకి పూనకం తెప్పించాయి. అలాగే మూవీ లవర్స్ కి కూడా ట్రైలర్ బాగా నచ్చడమే కాకుండా ఖచ్చితంగా  భగవంత్ కేసరి మంచి సినిమా అని  అనుకునేలా  చేసింది.

వినాయక్ అంటేనే సంచలనం.. థియేటర్ ఓనర్ కొడుకు నుంచి మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే దాకా!

ఆయన సినిమా థియేటర్ ఓనర్ కొడుకు.. చిన్నతనం నుంచే సినిమాలు చూస్తూ  పెరగడం వలన సినిమా మీద ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఏ తండ్రి అయినా తన కొడుకు చదువుకోకుండా సినిమాల్లోకి వెళ్తాను అంటే ఒప్పుకోడు. కానీ ఆయన తండ్రి మాత్రం అతన్ని సినిమాల్లోకి వెళ్ళమని ప్రోత్సహించాడు. అలా తండ్రి ప్రోద్బలంతో వెళ్లిన ఆయన కూడా అనుకోని ఉండడు థియేటర్ ఓనర్ కొడుకుగా పరోక్షంగా సినీ రంగంతో అనుబంధం ఉన్న నేను సౌత్ లోనే పెద్ద సినిమా డైరెక్టర్ అయ్యి సినిమా రంగాన్నే శాసించే స్థాయికి ఎదుగుతానని. ఆయన ఎవరో ఈ పాటికే మీకు అర్ధం అయ్యి ఉంటుంది. ఆయనే వివి వినాయక్. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఆయనకి తెలుగు వన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.

‘డోంట్ కేర్’ అంటూ తమన్ పోస్ట్.. బోయపాటికేనా? అని ట్రోల్స్‌

మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. అయితే ఆయ‌న‌కు ఎంత మంచి పేరుందో అంతే రేంజ్‌లో ఆయ‌న పాట‌లు రిలీజైన‌ప్పుడు ట్రోల్స్ కూడా వ‌స్తుంటాయి. తాజాగా మ‌రోసారి త‌మ‌న్ చేసిన ఓ పోస్ట్ ట్రోలింగ్ అవుతుంది. ఇంత‌కీ ఆయ‌న ఏం పోస్ట్ చేశారో తెలుసా! ఐ డోంట్ కేర్ అంటూ. త‌మ‌న్ ఇలా పోస్ట్ పెట్టటం వెనుక కార‌ణం.. బోయ‌పాటి శ్రీనునే అని కొంద‌రు అంటున్నారు. ఎందుకంటే, రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ అఖండ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ప్ర‌స్తావించారు.