English | Telugu
పెద్దల ముందు ముద్దులు.. రెచ్చిపోయిన రష్మిక
Updated : Oct 11, 2023
మొదటి నుంచీ రష్మిక లిప్‌లాక్‌లకి ఎప్పుడూ నో చెప్పలేదు. సౌత్ ఇండస్ట్రీలోనే నో చెప్పిన అమ్మడు, నార్త్‌లో మాత్రం ఎందుకు ఊరుకుంటుంది. అక్కడ రెచ్చిపోయింది. అందులోనూ స్క్రీన్ మీద హీరో, హీరోయిన్ల రొమాన్స్ ని మరో రేంజ్లో చూపిస్తారని పేరున్న సందీప్ రెడ్డి వంగా, తన ట్రేడ్‌మార్క్ ఎలివేషన్‌ని ఎందుకు వదులుకుంటారు. లేటెస్ట్ సినిమా యానిమల్‌లోనూ తన మార్కు సన్నివేశాలను డిజైన్ చేసేశారు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మధ్య లిప్ లాక్ సన్నివేశాలను పెట్టేశారు. రీసెంట్‌గా సోషల్ మీడియాలో రష్మిక రిలీజ్ చేసిన పోస్టర్‌లోనే లిప్ లాక్ స్టిల్ యూత్‌ని అట్రాక్ట్ చేసింది. ఇది పాటలను ఫోజు అయి ఉంటుందని అప్పటికే సోషల్ మీడియాలో డిస్కషన్ షురూ అయింది. అందరూ అనుకున్నట్టుగానే ఇది పాటలోని స్టిల్ అని ప్రూవ్ అయింది. బుధవారం ఉదయం హువా మెయిన్ అనే పాటను విడుదల చేశారు యానిమల్ మూవీ మేకర్స్. ఈ పాటలోనే సినిమాకు సంబంధించిన చాలా విషయాల మీద హింట్స్ అందాయి.
యానిమల్‌లో రష్మిక తెలుగు ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిగా కనిపిస్తోంది. ఇరు వర్గాల పెద్దల ముందు రష్మిక, రణ్‌బీర్ లిప్‌లాక్ సీన్ పాటలో హైలైట్ అయింది.
అలాగే చాపర్‌లో వెళ్తున్నప్పుడు ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా నెవర్ బిఫోన్ సీన్ అన్నట్టు ఉన్నాయి. రణ్‌బీర్ కపూర్, రష్మిక ఇద్దరూ చాలా టెండర్‌గా కనిపిస్తున్నారు ఈ సాంగ్‌లో. యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు సందీప్ రెడ్డి వంగా. తన తండ్రితో టాక్సిక్ రిలేషన్‌షిప్ ఉన్న కొడుకుగా నటిస్తున్నారు రణ్‌బీర్ కపూర్. యానిమల్ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ లేట్ కావడంతో మేకర్స్ అప్పట్లో విడుదలను వాయిదా వేశారు. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా కూడా ఓ నిర్మాతగా వ్యహరిస్తున్నారు.