English | Telugu

సుప్రీం కోర్ట్‌‌లో ప్రభాస్ టీమ్‌కు ఉపశమనం!

ప్రభాస్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపురుష్’ ఈ ఏడాదిలోనే విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. రామాయ‌ణ ఇతిహాసం ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాలో కృతి స‌న‌న్ సీత‌గా న‌టించింది. అయితే ఈ సినిమా రిలీజ్ స‌మ‌యంలో ప‌లు వివాదాల‌కు కేంద్ర బిందువుగానూ మారింది. హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ తీసేలా ఆదిపురుష్ సినిమాను తెర‌కెక్కించార‌ని, పాత్ర‌ల‌ను వ‌క్రీక‌రించార‌ని ప‌లువురు ఈ చిత్రంపై కేసులు పెట్టారు. అయితే ఈ కేసుల‌న్నింటినీ సుప్రీం కోర్టు కొట్టివేసింది. సెన్సార్ బోర్డు సినిమాను చూసి స‌ర్టిఫికేట్ ఇచ్చిన త‌ర్వాత ఇక కేసులు అన‌వ‌స‌రం అని సుప్రీం కోర్టు తేల్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఉన్న వివాదాల‌పై సుప్రీం కోర్టు జ‌స్టిస్ సంజ‌య్ కిష‌న్ కౌల్ స్పందిస్తూ అవ‌న్నీ ఇక అన‌వ‌స‌రం అని పేర్కొన్నారు.