ప్రభాస్ 'సలార్'కి పోటీగా విశ్వక్ సేన్ మూవీ!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతోన్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'సలార్'. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడు విడుదలైనా సంచలనాలు సృష్టించడం ఖాయమని అందరూ బలంగా నమ్ముతున్నారు. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా, డిసెంబర్ 22 కి వాయిదా పడింది. దీంతో ఆ సమయంలో విడుదల ప్లాన్ చేసుకున్న 'హాయ్ నాన్న', 'సైంధవ్', 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మ్యాన్' సినిమాల విడుదల తేదీలు మారిపోయాయి.