English | Telugu

మెగా ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫలించాయి.. 'గేమ్ ఛేంజర్' నుంచి బిగ్ అప్డేట్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'గేమ్ ఛేంజర్'. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో 'గేమ్ ఛేంజర్'పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే 'ఇండియన్-2' కారణంగా 'గేమ్ ఛేంజర్' షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. రీసెంట్ గా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది. దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త ఆనందంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేసేలా క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది.