English | Telugu
‘సలార్’ హక్కులను చేజార్చుకున్న దిల్‌రాజు... కారణం ఎవరు?
Updated : Oct 10, 2023
డిస్ట్రిబ్యూటర్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఆ రంగంలో మంచి గ్రిప్ సంపాదించిన దిల్‌రాజు నిర్మాతగా ఎదిగి టాప్ పొజిషన్‌కి వచ్చాడు. ఓ పక్క సినిమాలు నిర్మిస్తూనే పెద్ద హీరోల సినిమాల నైజాం హక్కులను ఫ్యాన్సీ ఆఫర్‌తో కొనుగోలు చేసి రిలీజ్ చేస్తుంటాడు. కాంబినేషన్‌ని బట్టి సినిమాల రైట్స్ తీసుకునే దిల్‌రాజు కన్ను ప్రభాస్, ప్రశాంత్ నీల్‌ల ‘సలార్’పై పడిరది. ఈ సినిమాను నైజాం ఏరియాలో దిల్‌రాజు చేయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. హయ్యస్ట్ రేట్‌తో ఈ సినిమా హక్కులు తీసుకున్నాడని, ఈరోజో రేపో డీల్ ఓకే అయిపోతుందని అనుకున్నారు.
అయితే ఈసారి దిల్ రాజుకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ షాక్ ఇచ్చింది. ‘సలార్’ నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. అంతా ఓకే అనుకుంటున్న టైమ్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా మైత్రి సంస్థ రావడం, రైట్స్‌ను తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. నైజాంలో తిరుగులేని డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్న దిల్‌రాజుకు ఇది పెద్ద దెబ్బేనని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. గత సంవత్సరమే డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించింది మ్తైత్రి సంస్థ. తమ బేనర్లోనే నిర్మించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’లను ఆ సంస్థ నుంచే రిలీజ్ చేశారు. ‘సలార్’ విషయానికి వస్తే రైట్స్ కోసం దిల్‌రాజు రూ.65 కోట్లు కోట్ చేశాడని, మరి మైత్రి సంస్థ ఈ రైట్స్ ఎంతకి తీసుకుందో తెలియాల్సి వుందని సినీ వర్గాల సమాచారం.