మంచు విష్ణు 'కన్నప్ప'లో సూపర్ స్టార్!
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ 'కన్నప్ప'పై రోజురోజుకి ఆసక్తి పెరుగుతోంది. రోజుకో బడా స్టార్ ఈ ప్రాజెక్ట్ లో చేరుతున్నారు. ఇప్పటికే ప్రభాస్, నయనతార, మోహన్ లాల్ వంటి బిగ్ స్టార్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగమైనట్లు దాదాపు క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి మరో అట్రాక్షన్ తోడైంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కన్నప్పలో ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.