‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ మూవీ రివ్యూ!
ఈ మధ్య కాలంలో క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలని ప్రేక్షకులు ఎక్కువగా ఆచరిస్తున్నారు. దానికి తోడు కాస్త సస్పెన్స్ ఉంటే ఆ సినిమా ఏ ఓటిటి మాధ్యమంలో ఉన్నా చూసేస్తున్నారు. మూఢనమ్మకాలను పాటిస్తూ, చనిపోయిన వారిని తిరిగి తీసుకురావాలని ఆ మధ్య కాలంలో.. ఒకే కుటుంబంలోని వారంతా మాస్ సూసైడ్ చేసుకోవడంతో, ఆ వార్త అప్పుట్లో సంచలనం సృష్టించింది. దాని ఇతివృత్తంగా తీసుకొని ఈ ' ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' సినిమాని తీసారు. హెబ్బా పటేల్, రామ్ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ కథేంటో ఒకసారి చూసేద్దాం.