English | Telugu
అప్పుడేమో ఏడుపు ఇప్పుడేమో నవ్వు...ఏంటి లారెన్స్ ఇది
Updated : Oct 10, 2023
రాఘవ లారెన్స్...గ్రూప్ డాన్సర్ లలో ఒకడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించి డాన్స్ మాస్టర్ గా ఎదిగి దాదాపుగా తెలుగు తమిళం లో ఉన్న అందరి బిగ్ హీరో ల చేత అదిరిపోయే స్టెప్ లు వేయించి ఆ తర్వాత దర్శకుడుగా మారి అద్భుతమైన సినిమాల్ని తెరకెక్కించడంతో పాటు నటుడిగా కూడా వీర విహారం చేస్తున్న రాఘవ లారెన్స్ తాజాగా చేసిన ఒక వ్యాఖ్య తెలుగు ,తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది.
సినిమా పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఙాశాలిలు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఒకరు లారెన్స్. కథకుడుగా,నటుడిగా ,నిర్మాతగా ,దర్శకుడిగా, నృత్య దర్శకుడుగా ఇలా అన్ని శాఖల్లోనూ లారెన్స్ తన ప్రతిభ పాటవాలని ప్రదర్శించి అశేష అభిమానులని సంపాదించుకున్నాడు. లేటెస్ట్ గా చంద్రముఖి 2 తో ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించిన ఆయన మరోసారి జిగర్తాండ డబుల్ ఎక్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు .ఈ సందర్భంగా ఆ సినిమా ని ఉద్దేశించి లారెన్స్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.
దీపావళి పండగ సందర్భంగా రాబోతున్న జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీ.. 2014 లో వచ్చి రికార్డు కలెక్షన్స్ సృష్టించిన జిగర్తాండ మూవీకి సీక్వెల్ గా తయారు అయ్యింది. ఆ జిగర్తాండ మూవీ తెలుగులో గడ్డలకొండ గణేష్ అనే టైటిల్ తో రీమేక్ అయ్యి మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇంక అసలు విషయానికి వస్తే లారెన్స్ కి జిగర్తాండ మూవీ లో మొదట అవకాశం వచ్చింది .కానీ ఆ టైం లో లారెన్స్ ఒక తెలుగు సినిమా లో చేస్తుండటం తో కుదరలేదు. ఆ తర్వాత జిగర్తాండ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ సాధించింది .
ఆ తర్వాత లారెన్స్ జిగర్తాండ మూవీ చూసి అయ్యో ఈ సినిమాలో చెయ్యకపోయాను కదా అని బాధపడటమే కాకుండా ఒక రోజంతా నిద్ర కూడా పోలేదంట. ఇప్పుడు లారెన్స్ చెప్పిన ఈ మాటని సోషల్ మీడియాలో చూసిన వాళ్ళందరూ లారెన్స్ కి నటన పై ఎంతో మక్కువ ఉంది అని అనుకుంటున్నారు. అయితే జిగర్తాండ ని మిస్ చేసుకున్నందుకు ఇప్పుడు ఒక విషయంలో బాధ మొత్తం పోయి ఫుల్ హ్యాపీ గ ఉందని అంటున్నాడు. ఒక వేళ జిగర్తాండ లో నటించి ఉంటె ఇప్పుడు జిగర్తాండ డబుల్ ఎక్స్ లో నటించే అవకాశం వచ్చేది కాదేమో ఎందుకంటే జిగర్తాండ మూవీ 20 కోట్ల బడ్జెక్టు తో తెరకెక్కితే జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీ 100 కోట్ల బడ్జెక్టు తో రాబోతుంది. ఐ యాం సో హ్యాపీ అని అంటున్నాడు.ఈ న్యూస్ చూసిన వారందరు లారెన్స్ చెప్పించి నిజమే ఫస్ట్ పార్ట్ లో ఉండి ఉంటే ఇప్పుడు డబుల్ ఎక్స్ లో ఉండేవాడు కాదు అని అంటున్నారు.కొంత మంది అయితే అప్పుడేమో ఏడుపు ఇప్పుడేమో నవ్వు అని అనుకుంటున్నారు .జిగర్తాండ కి దర్శకత్వం వహించిన కార్తీక్ సుబ్బా రాజే ఇప్పుడు జిగర్తాండ డబుల్ ఎక్స్ కి దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రముఖ దర్శకుడు ఎస్.జె సూర్య ఇంకో పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిలిం నిర్మాణ సారథ్యం లో తెరకెక్కుతుంది