English | Telugu
నన్ను ఫ్లర్ట్ చెయ్యాలని చూసారు..ఓ.జి నటి ఆరోపణ
Updated : Oct 10, 2023
బిగ్ బాస్ సీజన్ 7 పుణ్యమా అని శుభశ్రీ అనే ఒక అందమైన అమ్మాయి తెలుగు సినీ పరిశ్రమలో ఉందని కొన్ని సినిమాల్లో కూడా నటించిందనే విషయం ఇప్పుడు చాలా మందికి తెలిసింది. ఒరిస్సా కి చెందిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తెలుగులో మాట్లాడుతూ తెలుగు సినిమా ల గొప్పతనం గురించి కూడా చెప్పి అందరిని తన మాటలతో కట్టిపడేసింది. అలాగే పరిశ్రమలో తనకెదురైన ఒక సంఘటన గురించి దైర్యంగా చెప్పి ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.నందమూరి కళ్యాణ్ రామ్ తో అమిగోస్ తో పాటు రుద్రవీణ,కథ వెనుక కథ ఇలా పలు చిత్రాల్లో నటించిన శుభశ్రీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నయా మూవీ ఓ .జి లో నటించే ఛాన్స్ ని దక్కించుకొని ఒక్కసారిగా శుభశ్రీ అందరి దృష్టిలో పడింది. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన శుభశ్రీ తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.ఆ ఇంటర్వ్యూ లో నాకైతే ఇంతవరకు కాస్టింగ్ కౌచ్ ఎదురుకాలేదని కాకపోతే ఒక ఈవెంట్ లో ఫ్లర్ట్ చెయ్యబోయారని చెప్పింది. తనకు ఇంతవరకు బాయ్ ఫ్రెండ్స్ లేరని విజయ్ దేవరకొండతో కలిసి డిన్నర్ చెయ్యాలని ఉందని అలాగే పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. పక్కా ఒరిస్సా కి చెందిన శుభశ్రీ తండ్రి ఒక జడ్జి. అలాగే తనకి ఒక అక్క తమ్ముడు ఉన్నారు .ఎప్పటికైనా శుభశ్రీ మంచి నటి అనే పేరు సంపాదించాలనే లక్ష్యంతో ఆమె ముందుకు వెళ్తుంది.