English | Telugu
రికార్డ్ ధరకు ‘గేమ్ చేంజర్’ ఓటీటీ రైట్స్
Updated : Oct 10, 2023
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. శంకర్ మేకింగ్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆలస్యమైనా పర్లేదు కానీ, తను అనుకున్నది తెరపై రావాలనుకునే రకం శంకర్‌ది. ఈ విషయం తెలిసి సినిమా స్టార్ట్ చేసిన నిర్మాతలు సైతం సైలెంట్‌గా చూస్తున్నారే తప్ప మరేం మాట్లాడటం లేదు. మరో వైపు మెగాభిమానులు మాత్రం ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చరణ్, శంకర్ తొలిసారి చేస్తోన్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతుంది. ఇందులో మెగా హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి తగ్టట్లే రీసెంట్‌గా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమ్ముడైనట్లు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినీ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్న వార్తల మేరకు గేమ్ చేంజర్ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ సంస్థ జీ5 చేజిక్కించుకుంది. అన్ని భాషలకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ఈ సంస్థనే సొంతం చేసుకుందని సమాచారం. అది కూడా ఏకంగా రూ.250 కోట్లకు అని టాక్. ఇదే కనుక నిజమైతే ఈ రేంజ్‌లో ఏ మూవీ ఓటీటీ రైట్స్ అమ్ముడు కాలేదు. ఆ లెక్కలో చూస్తే రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ఓ సెన్సేషన్‌కు తెరతీసినట్లేనని అనుకోవచ్చు.
‘గేమ్ చేంజర్’లో చరణ్ ముఖ్యమంత్రిగా ఓ పాత్రలో, ఎన్నికలను నిర్వహించే అధికారిగా మరో పాత్రలో కనిపించబోతున్నారు. కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది.