English | Telugu

'మామా మశ్చీంద్ర' మూవీ రివ్యూ .. అదో మాదిరి మావ 

కొన్ని కొన్ని సినిమాలకి ఆ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ ని మేకర్స్  భారీ స్థాయిలో  ఇవ్వకపోయినా ప్రేక్షకులు మాత్రం తాము అనుకున్న సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తుంటారు. అలా ప్రేక్షకులు ఎదురు చూసిన సినిమా మామా మశ్చీంద్ర. ప్రేక్షకులు అంతగా ఎదురు చూడటానికి ప్రధాన కారణం సుధీర్ బాబు మొదటి సారిగా త్రిపాత్రాభినయం చెయ్యడంతో పాటుగా గురు, మనం లాంటి సూపర్ హిట్ సినిమాలకి  డైలాగ్స్ ని అందించిన ప్రముఖ నటుడు హర్షవర్ధన్ తొలిసారిగా దర్శకత్వం వహిస్తుండటంతో సినిమా మీద ప్రేక్షకుల్లో క్రేజ్ ఏర్పడింది. మరి  మూవీ ఎలా ఉందో చూద్దామా..

'మ్యాడ్' మూవీ రివ్యూ.. నవ్వులే నవ్వులు

యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ కి ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పేరున్న బ్యానర్ తోడైతే అది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సితార నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్'. నవ్వించడమే టార్గెట్ గా చేసిన ఈ సినిమాతో ఎందరో నటీనటులు, దర్శకుడు పరిచయమయ్యారు. నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ కూడా ఉన్నారు. అలాగే ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకృష్ణ(చినబాబు) కుమార్తె హారిక కూడా ఈ సినిమాతో నిర్మాతగా పరిచయమవ్వడం విశేషం. మరి కొత్త వాళ్ళంతా కలిసి చేసిన ఈ ప్రయత్నం ఎలా ఉంది? నిజంగానే నవ్వులు పూయించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.