English | Telugu
బోల్డ్ గా 'బబుల్ గమ్' టీజర్.. మరో 'అర్జున్ రెడ్డి' వచ్చాడు!
Updated : Oct 10, 2023
నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమల తనయుడు రోషన్ 'బబుల్ గమ్' అనే సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. మహేశ్వరీ మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'క్షణం', 'కృష్ణ అండ్ హిజ్ లీలా' చిత్రాలతో ఆకట్టుకున్న రవికాంత్ పేరేపు ఈ సినిమాకి దర్శకుడు. తాజాగా 'బబుల్ గమ్' టీజర్ విడుదలైంది. ఈ టీజర్ మరో 'అర్జున్ రెడ్డి'లా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
'బబుల్ గమ్' టీజర్ బోల్డ్ గా ఉంది. ప్రేమని బబుల్ గమ్ తో పోలుస్తూ టీజర్ ప్రారంభమైంది. ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన యువకుడు, ఒక రిచ్ అమ్మాయితో ప్రేమలో పడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే ఆసక్తికర సన్నివేశాలతో టీజర్ రూపొందింది. చివరిలో లిప్ లాక్, బీప్ డైలాగ్స్ తో టీజర్ బోల్డ్ గా ఉంది. అలాగే టీజర్ లో రోషన్ స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో రోషన్ మరో అర్జున్ రెడ్డి అనిపించుకుంటాడేమో చూడాలి.
శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.