English | Telugu
'భగవంత్ కేసరి'లో బిగ్ సర్ ప్రైజ్.. నందమూరి ఫ్యాన్స్ కి పూనకాలే!
Updated : Oct 10, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బిగ్ సర్ ప్రైజ్ ఉందట.
బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో 'మంగమ్మగారి మనవడు' ఒకటి. ఈ సినిమాలోని 'దంచవే మేనత్త కూతురా' పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కె.వి. మహదేవన్ స్వరపరిచిన ఈ పాటకు సి. నారాయణ రెడ్డి సాహిత్యం అందించగా, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల ఆలపించారు. అప్పట్లో ఈ పాట ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ ఈ పాటకి ఎందరో అభిమానులున్నారు. ఇప్పుడు ఈ సాంగ్ డీజే రీమిక్స్ వెర్షన్ ను 'భగవంత్ కేసరి'లో చూడబోతున్నామట. ఈ రీమిక్స్ లో బాలకృష్ణ, కాజల్, శ్రీలీల చిందేసినట్లు సమాచారం. ఈ పాటను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నారని న్యూస్ వినిపిస్తోంది.
కాగా గతంలో నాని 'రైడ్' సినిమాలో కూడా 'దంచవే మేనత్త కూతురా' పాటను రీమిక్స్ చేయడం విశేషం. ఇప్పుడు బాలయ్య సినిమాలో బాలయ్య పాటనే రీమిక్స్ చేస్తున్నారు. ఈ రీమిక్స్ నందమూరి ఫ్యాన్స్ కి కన్నుల పండుగలా ఉండనుందని అంటున్నారు.