English | Telugu
లోకేష్ కనకరాజ్ మూవీ లైనప్ కన్పర్మ్
Updated : Oct 8, 2023
నాలుగు సినిమాలను డైరెక్ట్ చేయటంతో స్టార్ డైరెక్టర్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు లోకేష్ కనకరాజ్. ఇప్పుడు ఐదవ చిత్రంగా లియోను రిలీజ్ చేయటానికి సిద్ధమయ్యారు. దసరా సందర్భంగా అక్టోబర్ 19న ఈ చిత్రం రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎంటైర్ సినీ ఇండస్ట్రీ ఈ మూవీ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఈయన నెక్స్ చేయబోతున్న సినిమాల లిస్టు కూడా బడా స్టార్స్‌తోనే ఉన్నాయి. అయితే ఏ సినిమా ముందు వస్తుంది, తర్వాత దేన్ని ఆయన డైరెక్ట్ చేస్తారనే దానిపై మాత్రం క్లారిటీ లేకుండా ఉండింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ లోకేష్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు..
డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్‌తో తెరకెక్కించబోతున్నారు. తర్వాత కార్తి హీరోగా ఖైది 2 మూవీని డైరెక్ట్ చేస్తారు. ఆ తర్వాత కమల్ హాసన్‌తో విక్రమ్ 2ను ట్రాక్ ఎక్కిస్తారట. సూర్యతో రోలెక్స్ సినిమా ఉంటుందని ఇది వరకే చెప్పేశారు. పది సినిమాలు చేసిన తర్వాత ఇక డైరెక్షన్ చేయనని కూడా చెప్పేయటం కొస మెరుపు. లియో సినిమా రిలీజైన తర్వాత రజినీకాంత్ 171వ సినిమా స్క్రిప్ట్‌పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తానని కూడా చెప్పేశారు లోకేష్ కనకరాజ్. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని అన్నారు మన స్టార్ డైరెక్టర్.
సినిమాలను డైరెక్ట్ చేస్తూనే లోకేష్ కనకరాజ్ నిర్మాతగా మారారు. రాఘవ లారెన్స్ హీరోగా ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నారు. దీనికి రత్నరాజ్ దర్శకత్వం వహించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే రానుందని సినీ సర్కిల్స్ సమాచారం.