English | Telugu
‘డోంట్ కేర్’ అంటూ తమన్ పోస్ట్.. బోయపాటికేనా? అని ట్రోల్స్
Updated : Oct 8, 2023
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఆయనకు ఎంత మంచి పేరుందో అంతే రేంజ్‌లో ఆయన పాటలు రిలీజైనప్పుడు ట్రోల్స్ కూడా వస్తుంటాయి. తాజాగా మరోసారి తమన్ చేసిన ఓ పోస్ట్ ట్రోలింగ్ అవుతుంది. ఇంతకీ ఆయన ఏం పోస్ట్ చేశారో తెలుసా! ఐ డోంట్ కేర్ అంటూ. తమన్ ఇలా పోస్ట్ పెట్టటం వెనుక కారణం.. బోయపాటి శ్రీనునే అని కొందరు అంటున్నారు. ఎందుకంటే, రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీను మాట్లాడుతూ అఖండ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ప్రస్తావించారు. ఆ సినిమాలో ఆర్ ఆర్ లేకపోయినా చూసేంత కంటెంట్ ఉందని బోయపాటి అన్నారు. అలాగని ఆయన తమన్‌ని ఏమీ తక్కువ చేయలేదు. అయితే తన కంటెంట్ మాత్రం గొప్పదని చెప్పుకున్నారు. దీంతో బోయపాటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
సోషల్ మీడియాలో కొందరు ఈ వీడియో క్లిప్‌ను కట్ చేసి తమన్‌ను తక్కువ చేసి మాట్లాడారని కూడా అన్నారు. దీనిపైనే తమన్ రియాక్ట్ అయ్యారని, రీసెంట్‌గా బాలయ్య ఓ ఇంటర్వ్యూలో తారక్ గురించి మాట్లాడుతూ ఐ డోంట్ కేర్ అని స్పందిచారు. ఆ మాట చాలా పెద్ద వైరల్ అయ్యింది. అదే డైలాగ్‌ను తమన్ కూడా ఉపయోగించారని నెటిజన్స్ అంటున్నారు. కొందరేమో బోయపాటి శ్రీనుని ఉద్దేశించే తమన్ ఇలాంటి కామెంట్స్ పెట్టారని అంటుంటే, కొందరేమో ట్రోలర్స్‌కు సమాధానం చెప్పటానికే తమన్ అలాంటి కామెంట్ పెట్టారని అంటున్నారు.
రీసెంట్‌గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద సినిమాకు కూడా తమన్ సంగీతాన్ని సమకూర్చారు. ఆ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. మరోవైపు బాలకృష్ణ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భగవంత్ కేసరి సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.