English | Telugu

ఎర్రగుడి కథ.. నెవర్ బిఫోర్ లుక్ లో మంచు లక్ష్మి

రావుల వెంకటేశ్వర్రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, అమెరికా ఇండియా (ఎ.ఐ) ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఆదిపర్వం'. సంజీవ్ మేగోటి దర్శకుడు. మంచు లక్ష్మి ముఖ్యపాత్ర పోషిస్తున్న 'ఆదిపర్వం' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 1974-1990 మధ్యకాలంలో జరిగిన యధార్థ సంఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహా ఈవిల్ పవర్ అండ్ డివోషనల్ పవర్ మధ్య జరిగే పవర్ ఫుల్ మూవీ ఈ మధ్యకాలంలో రాలేదని చెప్పాలి. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న ప్రేమకథ 'ఆదిపర్వం'. గ్రాఫిక్స్ ప్రధానమైన చిత్రంగా మలిచారు దర్శకుడు సంజీవ్ మేగోటి. అలాగే హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగానే కాకుండా ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మంచు లక్ష్మి పోషిస్తున్న పాత్ర ఆమె కెరీర్ లోనే చిర స్థాయిగా నిలిచిపోతుందని చిత్ర బృందం చెబుతోంది. మంచు లక్ష్మి పుట్టిన రోజుని(అక్టోబర్ 8) పురస్కరించుకుని ఈ చిత్రంలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శకనిర్మాతలు.

చిత్ర దర్శకుడు సంజీవ్ మెగోటి మాట్లాడుతూ... "మంచు లక్ష్మీప్రసన్న ఇదివరకు చెయ్యని పాత్రలో కొత్తగా కనిపిస్తారు. తను చేసిన రెండు ఫైట్స్ సినిమాకి హైలెట్స్ గా నిలుస్తాయి. అన్వికా ఆర్ట్స్ మరియు అమెరికా ఇండియా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థల సహకారంతో నేను అనుకున్న స్థాయిలో ఒక గొప్ప చిత్రాన్ని మలిచానన్న నమ్మకం నాకుంది. మంచులక్ష్మి గారి క్యారెక్టర్ ఆవిడ పెర్ఫామెన్స్ కూడా మెమొరబుల్ గా ఉంటాయి" అని అన్నారు.

ఈ చిత్రంలో ఆదిత్యఓం, ఎస్తేర్, సుహాసిని ,శ్రీజిత ఘోష్, శివ కంఠంనేని, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి , హ్యారీ జోష్, జబర్దస్త్ గడ్డం నవీన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.