నిన్న కృతి, నేడు శ్రీలీల.. మూన్నాళ్ళ ముచ్చటేనా!
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి దశ తిరుగుతుందో, ఎప్పుడు ఎవరి క్రేజ్ ఒక్కసారిగా పడిపోతుందో చెప్పడం కష్టం. కొందరికి ఎంట్రీతోనే ఊహించని క్రేజ్ రావడం, అవకాశాలు చుట్టముట్టడం జరుగుతుంటాయి. ఇక తిరుగులేని స్టార్డం వీరి సొంతం అనుకుంటున్న సమయంలో వరుస పరాజయాలతో ఒక్కసారిగా క్రేజ్ పోతుంది. 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టికి అలాంటి పరిస్థితే ఎదురైంది. 'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కృతిని వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ఇక ఆమెకి తిరుగులేదు, ఫ్యూచర్ లో స్టార్ హీరోయిన్ గా ఏలుతుంది అనుకున్నారంతా.